ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు రవి చంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అశ్విన్ (50) పరుగుల వద్ద నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ, సాహాలు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది.
అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం టీమిండియా 456 పరుగులకు తొమ్మిది వికెట్లను కోల్పోయింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా(456/9)
Published Fri, Jan 9 2015 8:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM
Advertisement
Advertisement