సిడ్నీ:ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 238 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. కేఎల్ రాహుల్ (110) పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(79) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే క్రీజ్ లోకి వచ్చాడు.
టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడంతో రెండో టెస్టులోనే సెంచరీ చేసిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు. 262 బంతులను ఎదుర్కొన్నఈ కర్ణాటక ఓపెనర్ 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో శతకం మైలురాయిన అధిగమించాడు.