
సచిన్ ఆత్మకథ తెలుగులో...
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. సచిన్ జీవితంలో బాల్యం నుంచి ఆఖరి టెస్టు దాకా అనేక విశేషాలతో గత ఏడాది ఇంగ్లిష్‌లో విడుదలైన ఈ పుస్తకం పెను సంచలనం సృష్టించింది. బొరియా మజుందార్ రాసిన పుస్తకాన్ని తెలుగులో హేమలత అనువదించారు. 450 పేజీల ఈ పుస్తకం ధర రూ.495. అన్ని ప్రముఖ పుస్తక షాపులలో అందుబాటులో ఉంది.