book shop
-
సచిన్ ఆత్మకథ తెలుగులో...
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. సచిన్ జీవితంలో బాల్యం నుంచి ఆఖరి టెస్టు దాకా అనేక విశేషాలతో గత ఏడాది ఇంగ్లిష్లో విడుదలైన ఈ పుస్తకం పెను సంచలనం సృష్టించింది. బొరియా మజుందార్ రాసిన పుస్తకాన్ని తెలుగులో హేమలత అనువదించారు. 450 పేజీల ఈ పుస్తకం ధర రూ.495. అన్ని ప్రముఖ పుస్తక షాపులలో అందుబాటులో ఉంది. -
హన్మకొండలో భారీ అగ్నిప్రమాదం
వరంగల్: వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలోని జుబేర్ పుస్తకాల షాపులో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.... దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో ఆ షాపు పక్కనే ఉన్న మరో ఎనిమిది షాపులు దగ్ధమైనాయి. రెండు కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.