హన్మకొండలో భారీ అగ్నిప్రమాదం | Major fire accident in Hanamkonda | Sakshi
Sakshi News home page

హన్మకొండలో భారీ అగ్నిప్రమాదం

Published Sun, Oct 19 2014 8:27 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Major fire accident in Hanamkonda

వరంగల్: వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలోని జుబేర్ పుస్తకాల షాపులో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.... దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ అగ్నిప్రమాదంలో ఆ షాపు పక్కనే ఉన్న మరో ఎనిమిది షాపులు దగ్ధమైనాయి.  రెండు కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement