సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్లో 97 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 43.4 ఓవర్లలో రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ (133 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో లయోన్ బౌలింగ్లో ఔటయ్యాడు. భారత్ మూడో రోజు ఆటలో 47.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులతో కొనసాగుతోంది. రోహిత్ తరువాత బరిలోకి దిగిన భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కోహ్లీ (12 బంతుల్లో 8 బ్యాటింగ్; 2 ఫోర్లు), రాహుల్ (142 బంతుల్లో 45 బ్యాటింగ్; 4 ఫోర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
సిడ్నీ టెస్టు: రెండో వికెట్ కోల్పోయిన భారత్
Published Thu, Jan 8 2015 6:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement
Advertisement