
సురేష్ రైనా డకౌట్ల పరంపర
సిడ్నీ: టీమిండియా స్టార్ ఆటగాడు సురేష్ రైనా టెస్టుల్లో డకౌట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి వైదొలగడంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు మ్యాచ్ లోకి వచ్చిన రైనా తన ఖాతాను ఇంకా ఆరంభించలేదు. తొలి ఇన్నింగ్స్ లో రెండు బంతులనే ఎదుర్కొన్న రైనా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే.
అయితే కీలకమైన రెండో ఇన్నింగ్స్ లో రైనా తన సత్తా చాటుతాడని అభిమానులు భావించారు. కాగా రైనా ఏమాత్రం తన శైలిని మార్చుకోకుండా మళ్లీ డకౌట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్ లో ఆరు బంతులను ఎదుర్కొన్న రైనా తన ఫుట్ వర్క్ లో ఘోరంగా విఫలమయ్యాడు.