సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 203 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. సురేష్ రైనా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39), మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. ఇంకా ఐదు వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 146 పరుగుల దూరంలో ఉంది.