
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా(217/7)
సిడ్నీ: ఆస్ట్రేలియా తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 217 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.22 బంతులను ఎదుర్కొన్న రవి చంద్రన్ అశ్విన్ ఒక పరుగు మాత్రమే చేసి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు సాహా, సురేష్ రైనాలు డకౌట్లుగా పెవిలియన్ కు చేరారు. ఈ ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (80), విరాట్ కోహ్లీ(46), రోహిత్ శర్మ(39) పరుగుల మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.