
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 104 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 104 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ (39) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ ను కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ లో ఆరువికెట్ల నష్టానికి 251 పరుగులు చేసిన అనంతరం డిక్లేర్ చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ ను గెలవాలిని భావిస్తోంది.