సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా నాల్గో వికెట్ ను కోల్పోయింది. విరాట్ కోహ్లీ (46) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. టీమిండియా స్కోరు 201 పరుగుల వద్ద ఉండగా కోహ్లీ అనవసరపు షాట్ కోసం యత్నించి వెనుదిరిగాడు .ప్రస్తుతం అజ్యింకా రహానే(10) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
ఇంకా ఆరు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా విజయానికి 148 పరుగుల దూరంలో ఉంది.