సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 71 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 8 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగుల తో శుభారంభాన్నివ్వడంతో ఆసీస్ తొలి రోజు భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది.
కెప్టెన్ స్మిత్ (53), షేన్ వాట్సన్ (31 ) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది.