భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేశాడు.
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ నమోదు చేశాడు. రెండో రోజు ఆట ఆరంభించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిరోజులా అదే దూకుడును ప్రదర్శించాడు. స్మిత్ ఆడిన వరుసగా నాలుగు టెస్టు సిరీస్ లలో నాలుగు సెంచరీలు నమోదు చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం 175 బంతుల్లో 15 ఫోర్లు బాదిన స్మిత్ 107 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి జతగా వాట్సన్ 166 బంతుల్లో 7 ఫోర్లు, 78 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఆసీస్ స్కోరు 102.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 393 పరుగులతో కొనసాగుతోంది. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది.