సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 200 పరుగుల వద్ద తన తొలి వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ చేసిన అనంతరం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. మరో ఓపెనర్ రోజర్స్(91) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా బౌలర్ అశ్విన్ కు తొలి వికెట్ దక్కింది.