ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా 292 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా 292 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు అజ్యింకా రహానే(13) పరుగుల వద్ద నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 15 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు.
దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ మరో ఘనతను సాధించాడు.అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ.