సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆరంభమైన మూడో రోజు మ్యాచ్లో భారత్ ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ 96 పరుగుల వద్ద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ మూడో రోజు ఆటలో 43.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులతో కొనసాగుతోంది. భారత్ ఆటగాడు రోహిత్, రాహుల్ భాగస్వామ్యంతో నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్ శర్మ (132 బంతుల్లో 53 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేష్ రాహుల్ (128 బంతుల్లో 42 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
రెండోరోజు ఓపెనర్ ఆటగాడు మురళీ విజయ్ పరుగులేమి చేయకుండానే చేతులేత్తేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
96 పరుగుల వద్ద రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
Published Thu, Jan 8 2015 6:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement
Advertisement