
సిడ్నీ టెస్టు: లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 123/0
సిడ్ని టెస్టు: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్ తొలిరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 28 ఓవర్లలో 123 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. వార్నర్ 45 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా, రోజర్స్ 92 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం వార్నర్ (63) రోజర్స్ (52) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది.