
షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ(321/2)
సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాడు షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 321 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ , మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది.