సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ చివరి టెస్ట్ మ్యాచ్ ఆఖరి రోజులో టీమిండియా టీ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 160 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేఎల్ రాహుల్(16), రోహిత్ శర్మ(39) వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం మురళీ విజయ్- విరాట్ కోహ్లీల జోడీ టీమిండియాకు మరమ్మత్తులు చేపట్టారు.
ఈ ఇరువురి ఆటగాళ్లు ఆచితూచి ఆడుతూ ముందుకు సాగుతున్నారు. మురళీ విజయ్ (71), విరాట్ కోహ్లీ(26) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.