
మురళీ విజయ్ హాఫ్ సెంచరీ(134/2)
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిటెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు మురళీ విజయ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 135 బంతులను ఎదుర్కొన్న విజయ్ 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కేఎల్ రాహుల్(16) వికెట్ తో పాటు, రోహిత్ శర్మ(39) వికెట్ ను కూడా నష్టపో్యింది. అనంతరం మురళీ విజయ్ - విరాట్ కోహ్లీల జోడి కుదురుగా ఆడుతోంది.