భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 107.2 ఓవర్లలో 400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ 107.2 ఓవర్లలో 400 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ గా బరిలోకి దిగిన వాట్సన్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. తొలిరోజు నుంచి నిలకడగా ఆడుతూ స్మిత్ భాగస్వామ్యంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండో రోజూ కూడా వాట్సన్ అదే దూకుడును ప్రదర్శించాడు.
ఇంతలో మహ్మద్ షమీ బౌలింగ్ లో ఆశ్వీన్ కు క్యాచ్ ఇచ్చిన వాట్సన్ పెవిలియన్ బాటపట్టాడు. రెండు రోజులు కలిపి 183 బంతుల్లో 7 ఫోర్లు బాదిన వాట్సన్ 81 పరుగులకే వెనుతిరిగాడు. ఆస్ట్రేలియా 111.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 412 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం మార్ష్ (9), స్మిత్ 110 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, టీమిండియా బౌలర్లలో అశ్విన్ ఒక వికెట్ తీసుకోగా, మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.