జోరు ఎవరిదో! | australia south africa last test today | Sakshi
Sakshi News home page

జోరు ఎవరిదో!

Published Fri, Mar 30 2018 4:40 AM | Last Updated on Fri, Mar 30 2018 4:40 AM

australia south africa last test today - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: గత వారం రోజులుగా బాల్‌ ట్యాంప రింగ్‌ వివాదంతో వార్తల్లో నిలిచిన ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. వాండరర్స్‌ మైదానంలో శుక్రవారం మొదలయ్యే నాలుగో టెస్టు ‘డ్రా’ చేసుకుంటే దక్షిణాఫ్రికా సొంతగడ్డపై 1970 తర్వాత ఆస్ట్రేలియాపై సిరీస్‌ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆతిథ్య జట్టు 2–1తో ముందంజలో ఉంది.

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు దూరమై ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అభిమానుల మనసులు గెలవాలని భావిస్తోంది. మరోవైపు మూడో టెస్టులో విజయం సాధించిన సఫారీలు అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఈ మ్యాచ్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం కానున్న మోర్నీ మోర్కెల్‌పై అందరి దృష్టి నిలవనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement