
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీస్ బెర్త్‌లు అధికారికంగా ఖారారయ్యాయి. గ్రూపు-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ నాలుగు జట్లు సెమీస్‌కు చేరినప్పటికి వాటి స్థానాలు ఇంకా ఖారారు కాలేదు.
ఆదివారం న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగే ఆఖరి లీగ్ మ్యాచ తర్వాతే సెమీస్‌లో ఎవరి ప్రత్యర్ధి ఎవరన్నది తేలనుంది. కాగా మంగళవారం జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత ఆడటం ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే. కానీ ప్రత్యర్ధి సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా నా అన్నది నేడు ఖారారు కానుంది.
ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ‘బి’ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌కు పయనమయ్యాయి. రెండింటిలో ఒక జట్టు మైదానంలోకి దిగకుండానే మళ్లీ లాహోర్‌కు రావాల్సి ఉంటుంది. కివీస్‌తో చివరి పోరులో భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియాతో రోహిత్ సేన మంగళవారం తొలి సెమీఫైనల్ ఆడుతుంది.
ఇదే జరిగితే దక్షిణాఫ్రికా జట్టు తిరిగి పాకిస్తాన్ చేరుకుంటుంది. ఒకవేళ కివీస్ చేతిలో ఓడితే టీమిండియా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా కానుంది. కంగారూలు రెండో సెమీఫైనల్ కోసం పాకిస్తాన్‌కు తిరుగు పయనం కానున్నారు. కీలక సెమీఫైనల్‌కు ముందు దుబాయ్ మైదానంలో ప్రాక్టీస్ చేయడంతో పాటు అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా జట్లకు ఇది ఉపయోగపడనుంది.
ఇక కివీస్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఓమార్పుతో బరిలోకి దిగింది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), శుబ్‌మన్ గిల్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్ సింగ్.
న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ ), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డార్లీ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, జేమీసన్,హెన్రీ, రూర్కే.
చదవండి:SA vs Eng: ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. బాధతో బట్లర్ బైబై
Comments
Please login to add a commentAdd a comment