
ఓ స్కిట్ కారణంగా యాంకర్ రవి, సుడిగాలి సుధీర్ వివాదంలో చిక్కుకున్నారు. నందీశ్వరుడిని పెట్టి చేసిన ఓ సీన్ వల్ల హిందు సంఘాలు భగ్గుమన్నాయి. ఈ విషయమై ఇదివరకే క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి.. ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశాడు. మరింత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)
నేను చత్రపతి శివాజీని ఫాలో అయ్యే వ్యక్తిని.. హనుమాన్ చాలీసా చదివే వ్యక్తిని.. పొద్దున లేచినప్పటి నుంచి మనసులో శివుని మంత్రం జపించే వ్యక్తిని.. నేను హిందువునే. నా మతం అంటే నాకు ఇష్టం.. అందరిలా మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవ్యక్తిని. యూట్యూబ్‌లో మేం చేసిన స్కిట్ లేదు. చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం.
సోషల్ మీడియాలో నా ఫోన్ నంబర్ పెట్టి హిందూ మతాన్ని హర్ట్ చేశానని అంటున్నారు. దీంతో నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. అందులో ఓ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. షోలో స్టేజీపై నందీశ్వరుడిని పెట్టిన తర్వాత చెప్పులు విప్పి నిష్టతో చేసిన స్పూఫ్ అది. ఎవరినో హర్ట్ చేయాలని చేసిన స్కిట్ కాదు. సినిమాలో ఉన్నట్లే సీన్ రీ క్రియేట్ చేశాం. ఇలాంటివి భవిష్యత్తులో జరుగకుండా జాగ్రత్తగా ఉంటాం అని రవి చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బేబీ.. ఇలా అయితే కష్టమే!)