బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు టాలీవుడ్‌లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆమె తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించబోతోంది. ఆమె జీ తెలుగు కోసం 'తెలుగు మీడియం స్కూల్' అనే కొత్త రియాల్టీ షోకి గెస్టుగా వచ్చింది. దీంతో ఈ షో పై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను ఛానెల్ విడుదల చేసింది. జీ తెలుగు మునుపెన్నడూ చూడని రియాల్టీ షోగా 'తెలుగు మీడియం స్కూల్'ని పరిచయం చేసింది. ఈ ప్రోమోలో సన్నీ లియోన్‌తో పాటు ప్రముఖ గాయకుడు మనో, యాంకర్ రవి కూడా ఉన్నారు.
(ఇదీ చదవండి: దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ)
ఇందులో టీవీ, టాలీవుడ్ హాస్యనటులు కూడా ఉన్నారు. ఈ ప్రోమో విడుదల అయిన వెంటనే సూపర్, అద్భుతం అంటూ సన్నీ లియోన్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో కనకాల సుమ,రష్మి,అనసూయ,శ్రీముఖి వంటి వారు యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేశారు. మరీ గెస్టుగా వచ్చిన ఈ బ్యూటీ వీరిలో ఎవరినైనా మెప్పించేలా యాంకరింగ్ చేస్తుందా అనేది చూడాలి?
ఈ షో కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంకా నిర్వహకాలు వెల్లడించలేదు. ఈ ప్రోమోలో సన్నీ తెలుగులో మాట్లాడుతూ తనకు ప్రాణం పోసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడింది. అలాగే, ప్రోమో చాక్‌బోర్డ్‌పై షో టైటిల్ కనిపించడంతో ముగుస్తుంది, ఆ తర్వాత చీరలో సన్నీ లియోన్ ఉల్లాసమైన చిరునవ్వుతో ఉంటుంది. సన్నీలియోన్ 11 ఏళ్ల కిందటే 'జిస్మ్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆమె 'కరెంట్ తేగ, గరుడ వేగ,జిన్నా' వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
Comments
Please login to add a commentAdd a comment