నటుడు యోగేష్ కల్లే పాన్ ఇండియా చిత్రం "త్రిముఖ" (Trimukha Movie)తో హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఇందులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్, CID ఫేమ్ ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రధాన షూటింగ్ పూర్తి చేసుకున్న "త్రిముఖ" ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది.
యోగేష్ కల్లే.. "త్రిముఖ"తో పాటు "చాణుక్యం", "బెజవాడ బాయ్స్" అనే మరో రెండు చిత్రాలకు సంతకం చేశారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న "చాణుక్యం" చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది, ఇందులో మోటా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, ధన్య బాలకృష్ణ, శ్రావణ్, నాగ మహేష్, ప్రభాకర్ వంటి వారు సహాయక పాత్రలు పోషిస్తున్నారు. "బెజవాడ బాయ్స్" చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.
త్రిముఖ విషయానికి వస్తే.. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హర్ష కల్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చదవండి: సంక్రాంతికి కొత్త కారు కొన్న బ్యూటీ.. భర్తతో జాలీగా..
Comments
Please login to add a commentAdd a comment