ఓటీటీలో 15 రోజుల్లోనే 'సన్నీ లియోన్‌' సినిమా | Sunny Leone Mandira 2024 Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Mandira OTT Release Date: ఓటీటీలో 15 రోజుల్లోనే 'సన్నీ లియోన్‌' సినిమా

Published Tue, Dec 3 2024 8:26 AM | Last Updated on Tue, Dec 3 2024 10:16 AM

Sunny Leone Movie OTT Streaming Date Locked

సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై తెరకెక్కిన చిత్రం 'మందిర'. ఈ సినిమాకు ఆర్‌. యువన్‌ దర్శకత్వం వహించగా  సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా ఉన్నారు. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.

సన్నీలియోన్‌ ఈ చిత్రంలో ఉండటంతో సోషల్‌మీడియాలో ప్రాజెక్ట్‌ గురించి భారీగానే చర్చ జరిగినప్పటికీ థియేటర్స్‌లలో మాత్రం పెద్దగా మెప్పించలేదు. అయితే, డిసెంబర్‌ 5న ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. సన్నీతో ఆటలు మీరు అనుకున్నంత ఫన్నీ కాదు.. కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్‌ మీడియాలో ఆహా తెలిపింది.  

మందిర సినిమాలో సన్నీ లియోన్‌, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.  ఈ సినిమాలో సన్నీ లియోనీ యువరాణిగా నటించింది. సన్నీ దెయ్యం రోల్ కనిపించినప్పటికీ అక్కడక్కడా తన గ్లామర్‌తో కూడా కొన్ని సీన్స్‌లలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement