Sunny Leone
-
2040లో ఏం జరుగుతుంది?
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యుఐ: ది మూవీ’. రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్యపాత్రలుపోషించారు. లహరి ఫిల్మ్స్, జి. మనోహరన్ – వీనస్ ఎంటర్టైనర్స్ కేపీ శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ‘‘ప్రపంచంలో 2040లో ఏం జరుగుతుంది? అనే నేపథ్యంలో ‘యుఐ: ది మూవీ’ కథ ఉంటుంది. చాలా విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఓటీటీలో 15 రోజుల్లోనే 'సన్నీ లియోన్' సినిమా
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం 'మందిర'. ఈ సినిమాకు ఆర్. యువన్ దర్శకత్వం వహించగా సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా ఉన్నారు. నవంబర్ 22న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.సన్నీలియోన్ ఈ చిత్రంలో ఉండటంతో సోషల్‌మీడియాలో ప్రాజెక్ట్ గురించి భారీగానే చర్చ జరిగినప్పటికీ థియేటర్స్‌లలో మాత్రం పెద్దగా మెప్పించలేదు. అయితే, డిసెంబర్ 5న ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సన్నీతో ఆటలు మీరు అనుకున్నంత ఫన్నీ కాదు.. కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో ఆహా తెలిపింది. మందిర సినిమాలో సన్నీ లియోన్, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సన్నీ లియోనీ యువరాణిగా నటించింది. సన్నీ దెయ్యం రోల్ కనిపించినప్పటికీ అక్కడక్కడా తన గ్లామర్‌తో కూడా కొన్ని సీన్స్‌లలో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
సన్నీలియోన్ షోకు పోలీసుల అనుమతి నిరాకరణ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.10లోని ఇల్లీయూజన్ పబ్‌లో శనివారం వీకెండ్ నైట్‌లైఫ్‌లో భాగంగా ప్రముఖ బాలివుడ్ నటీ సన్నీ లియోన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల వరకు ఆమె ఈ పబ్‌లో ఒప్పందం ప్రకారం డీజే ప్లే చేస్తూ కుర్రకారుకు హుషారు తెప్పించాలి. ఇందుకోసం నిర్వాహకులు జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతి కోరగా, ఇందుకు నిరాకరించారు. ఉదయం నుంచే సన్నీ లియోన్ రాకకోసం కుర్రకారు ఎదురు చూస్తుండగా, అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఫైల్ పక్కన పెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సన్నీ లియోన్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించుకున్న నిర్వాహకులు ఉన్నతాధికారులను కూడా కలిశారు. ఎలాగైనా ఆమెను పబ్‌కు తీసుకు రావాలని ప్రయత్నించారు. మరోవైపు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్‌లోకి రానివ్వొద్దంటూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పబ్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. టికెట్లు కొనుగోలు చేసిన యువతీ యువకులు రాత్రి 8 గంటల నుంచే పబ్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఒక వైపు పోలీసుల మోహరింపు..మరో వైపు అనుమతుల నిరాకరణ...ఇంకో వైపు హోటల్లో సన్నిలియోన్ ఎదురు చూపుల మధ్య హైడ్రామా రక్తి కట్టింది. ఈ క్రమంలో చివరకు నిర్వాహకులు సన్నీలియోన్ ఆరోగ్యం బాగాలేనందున ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్లు ఓ వీడియోను విడుదల చేశారు. రూ.లక్షలు పోసి టికెట్లు కొన్న యువతీ యువకులు నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అడ్డదారిలోనైనా ఆమెను తీసుకొస్తారేమోనని అనుమానించి పబ్ చుట్టూ 100 మంది పోలీసులను మోహరించారు. రాత్రి 1 గంటకు ఇక ఆమె రాదని నిర్ధారించుకున్న పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు డబ్బింగ్ సినిమా
కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా.. ఆ తర్వాత దర్శకుడిగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు నటుడిగా బిజీ అయిపోయాడు. ఇతడు హీరోగా నటించిన ఓ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ప్రభుదేవా, సన్నీ లియోన్, వేదిక హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'పెట్టా రాప్'. అక్టోబరులో తమిళంలో థియేటర్లలో రిలీజ్ కాగా.. డిజాస్టర్‌గా నిలిచింది. ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. ప్రభుదేవా, వేదిక యాక్టింగ్‌తో పాటు సన్నీలియోన్ రోల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.'పెట్టా రాప్' విషయానికొస్తే.. బాల (ప్రభుదేవా) సినిమా యాక్టర్ కావాలనే కలతో బతుకుతుంటాడు. వందకుపైగా ఆడిషన్స్ ఇచ్చిన ఒక్క అవకాశం రాదు. ఎప్పటికీ నటుడివి కాలేవని స్నేహితులు బాలను అవమానిస్తారు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. జానకి (వేదిక) అనే సింగర్ ద్వారా బాల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. బాల, జానకి మధ్య ఉన్న సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక) -
మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!
సన్నీ లియోన్.. ఒకప్పుడు శృంగార తార. ఇప్పుడు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చాన్నాళ్ల క్రితమే తన పాతవృత్తిని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత ఓవైపు నటిస్తూనే మరోవైపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సెటిలైపోయింది. ఆడపాదడపా ఏదో ఓ సినిమాలో కనిపిస్తున్న ఈమె.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే.భారత మూలాలున్న సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అలా కుటుంబంతో సన్నీ లియోన్ ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుండేది.(ఇదీ చదవండి: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఎవరెవరు?)పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఏదో సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తని మరోసారి పెళ్లాడింది. తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన సన్నీ-డేనియల్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హిందీలో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనూ సన్నీ లియోన్ పలు సినిమాలు చేసింది. వీటిలో కరెంటు తీగ, జిన్నా, గరుడవేగ చిత్రాలు ఉన్నాయి. అలానే తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ నటించింది. కొన్నిసార్లు ప్రత్యేక గీతాల్లోనే తనదైన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
ఎల్లె ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2024..సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
వీళ్లు.. ఈ కుర్రాడి తల్లిదండ్రులా?
సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంటుంది. కొన్నిసార్లు షాకింగ్ వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వీటిని చూసినప్పుడు ఎవరికీ ఏమాత్రం నమ్మాలని అనిపించదు.తాజాగా ఒక ఫొటో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారు తెగ ఆశ్యర్యపోవడానికి తోడు కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కుర్రాడికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫారం తెగ వైరల్ అవుతోంది. ఆ కుర్రాడు బీఏ ఆనర్స్ విద్యార్థి అని తెలుస్తోంది. అతనికి సంబంధించిన ఫారంలో తండ్రి పేరు ‘ఇమ్రాన్ హష్మీ’ అని, తల్లి పేరు ‘సన్నీ లియోన్’ అని రాసి ఉంది. వీరు బాలీవుడ్ ప్రముఖులనే విషయం తెలిసిందే.ఈ ఫోటో వైరల్ అవడానికి ఆ కుర్రాడి తల్లిదండ్రుల పేర్లే ప్రధాన కారణం. అయితే ఇది నిజమా లేక ఎవరైనా ఫోటోను ఎడిట్ చేశారా అనేది స్పష్టం కాలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఇండియన్ రేర్ ఇమేజస్ అనే పేజీ నుండి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయ్యింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ 2 లక్షల 28 వేల మందికి పైగా యూజర్లు వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన ఒక యూజర్ ఆ కుర్రాడి తాత పేరు మహేష్ భట్ అని రాయగా, మరొక యూజర్ దీనిని ఫేక్ అని పేర్కొన్నాడు.ఇది కూడా చదవండి: సహారాలో భారీ వర్షాలు.. ఆశ్చర్యపరుస్తున్న దృశ్యాలు -
సన్నీ లియోన్ షాకింగ్ లుక్.. 'క్యూజీ' ట్రైలర్ రిలీజ్
సన్నీ లియోన్, ప్రియమణి, జాకీష్రాఫ్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'క్యూజీ గ్యాంగ్ వార్'. ఈనెల 30న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకుడు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్ చేతుల మీదగా ఇది లాంచ్ అయింది.(ఇదీ చదవండి: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి)ట్రైలర్ చూస్తుంటే ప్రధాన పాత్రధారులు ఎవరినీ గుర్తుపట్టలేం అన్నంతగా డీ గ్లామర్ లుక్‌లో కనిపించారు. అలానే విజువల్స్ చూస్తుంటే గతంలో వచ్చిన 'దండుపాళ్యం' సినిమా గుర్తొచ్చింది. మరి ఈ సినిమా కూడా అంత సెన్సేషన్ సృష్టించి హిట్ అవ్వాలని ట్రైలర్ ఆవిష్కరణకు విచ్చేసిన నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) -
తెలుగులో సన్నీ లియోన్, ప్రియమణి ‘క్యూజీ’
జాకీ షరఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం క్యూజీ. వివేక్ కుమార్ కన్నన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రుషికేశ్వర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఎం. వేణుగోపాల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వేణు గోపాల్ మాట్లాడుతూ..క్యూజీ సినిమా తెలుగు రిలీజ్ రైట్స్ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. . ఈ సినిమా టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జాకీ షరాఫ్, ప్రియమణి, సన్నిలియోన్, సారా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. అతి త్వరలో సినిమాని మా మూడు సంస్థల ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మంచి విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. -
ఇప్పటికీ అలా పిలవడం బాధగా అనిపిస్తుంది: బాలీవుడ్ నటి ఆవేదన
బాలీవుడ్ నటి సన్ని లియోన్ బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకుంది. 2011లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హోస్లో అడుగుపెట్టిన ఆమె అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత జిస్మ్- 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ రియాలిటీ షోను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సన్నీ లియోన్ గతంలో తన కెరీర్ గురించి వస్తున్న కామెంట్స్‌పై స్పందించింది. అలాంటివీ విన్నప్పుడు తనకు బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.తాజా ఇంటర్వ్యూలో సన్నిలియోన్ మాట్లాడుతూ..' మొదట తాను ఇండియాకు వచ్చినప్పుడు నా గురించి పలు రకాలుగా మాట్లాడుకున్నారు. అడల్ట్ మూవీ స్టార్ అన్నారు. కానీ అప్పట్లో అది సాధారణ విషయమే. కానీ నేను వచ్చి ఇప్పటికీ 13 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు కూడా అలాంటి ట్యాగ్‌తోనే పిలుస్తుంటే బాధేస్తోంది. అలాంటి మాటలు విన్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటికీ కూడా మీరు వాటిని వదలకపోతే.. మేము జీవితంలో ముందుకెలా వెళ్తాం. అది నా జీవితంలో జరిగిందని మీకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన సొంత మార్గాల్లో ఎదుగుతున్నాం' అని అన్నారు.కాగా.. బాలీవుడ్లో జిస్మ్ 2తో ఎంట్రీ ఇచ్చిన సన్ని లియోన్.. ఆ తర్వాత జాక్‌పాట్, రాగిణి ఎంఎంఎస్ 2, హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా, కుచ్ కుచ్ లోచా హై, వన్ నైట్ స్టాండ్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ కెన్నెడీలో కనిపించనుంది. ఈ చిత్రం కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రీమియర్ ప్రదర్శించారు. అంతే కాకుండా జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్ నటించిన తమిళ చిత్రం కొటేషన్ గ్యాంగ్‌లో నటిస్తోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30, 2024న విడుదల కానుంది. -
జాన్వీ గ్లామర్ ఫ్యూజులు ఔట్.. సన్నీ లియోన్ సొగసులు!
జాన్వీ కపూర్ జిగేలు.. హాట్నెస్ మామూలుగా లేదుగాటైట్ డ్రస్సులో తమన్నా వయ్యారాలు.. చూస్తే మెంటలేహాట్ బ్యూటీ సన్నీ లియోన్ సొగసులు చూడతరమాసంప్రదాయ చీరకట్టులో రష్మిక.. ఇలా ఎప్పుడూ చూసుండరు'పొలిమేర' బ్యూటీ అందాల జాతర.. ఇలా ఉందేంట్రా బాబుపూనమ్ పరువాల విందు.. చీరలో బొద్దుగుమ్మలాపూల్లో గ్లామర్ చూపించి మరీ రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియానా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
ఐటం సాంగ్‌లో సన్నీలియోన్..
ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా ముద్ర వేసుకున్న నృత్యదర్శకుడు ప్రభుదేవా. ఈయన నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడిగా హిట్ చిత్రాలను చేసిన ఈయన ప్రస్తుతం నటనపైనే దృష్టి పెడుతున్నారు. అలా ప్రభుదేవా ఇటీవల నటించిన చిత్రం భగీర. ఇందులో రకరకాల గెటప్ల్లో విలన్‌గా అదరగొట్టారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వాటితో పాటు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న గోట్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు.ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో జాలియో జింఖానా ఒకటి. శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ మడోనా సెబాస్టియన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న మరో చిత్రం పేటరాప్. ఎస్జే.శీను దర్శకత్వం వహిస్తున్న ఇందులో వేదిక హీరోయిన్గా నటిస్తున్నా రు.బ్లూ హిల్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో బాలీవుడ్ సంచలన నటి సన్నీ లియోన్ ఒక ఐటమ్ సాంగ్‌లో నటిస్తున్నారు. ఇంతకు ముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈమె చిన్నగ్యాప్ తరువాత మళ్లీ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారన్నమాట. వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, రమేశ్ తిలక్, మైమ్‌గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. Get ready to dance to the tunes of 'Paatu Adi Aattam Repeat', music rights bagged by #TSeries.@PDdancing @vedhika4u@sunnyleone @sinu_sj@immancomposer @swetamohan@viveka_lyrics @nehabhasinteam@nikhitagandhi @deepthisings@thilak_ramesh @actorvivekpra@madhankarky… pic.twitter.com/6PGlZbVpzF— T-Series South (@tseriessouth) June 12, 2024 చదవండి: గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు -
సన్నీ లియోన్ బర్త్‌డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
సన్నీలియోన్ బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమెకు దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు ఉన్నారు. మే 13న తన 43వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. దీంతో ఆమె అభిమానులు సైతం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు కేక్ కట్ చేసి అన్నదానాలు చేశారు. అలా తమ అభిమాన నటి మీద ప్రేమను చాటుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కర్కల్లి గ్రామానికి చెందిన యువకులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సన్నీలియోన్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి అక్కడ వారందరూ కేక్ కట్ చేశారు. ఈ యువకుల బృందం తమను తాము కర్కల్లి బాయ్స్ అని పిలుస్తారు. సన్నీ పుట్టినరోజును ఎందుకు జరుపుకున్నారో కూడా వారు చెప్పుకొచ్చారు. సన్నీ చేస్తున్న సామాజిక సేవతో పాటు ఆమెలో ఉన్న దాతృత్వమే తమను అభిమానులుగా మార్చిందని వారు తెలిపారు. కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చిందని వారు గర్తుచేశారు. ఆమె నటించిన గత సినిమాలు ఎలా ఉన్నా సరే సన్నీలో సేవా గుణం ఉంది. భారత్‌పై గౌరవంతో ఇక్కడే ఉంటుంది. అందుకు తగ్గట్లు తన జీవితాన్ని మార్చుకుంది. ఇక్కడి ప్రజల్లో మమేకమైంది. ఇక్కడి ప్రజలకు ఆమె ఎంతో సాయం చేస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి..? అంటూ వారు సన్నీ లియోన్ గురించి చెబుతున్నారు. -
మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!
సన్నీ లియోన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. తర్వాత తర్వాత నటిగా మారిపోయింది. ప్రత్యేక గీతాలు, పలు పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె.. ఇప్పుడు తెలుగులో ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్‌నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతోన్న మూవీ 'మందిర'. సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాత. ఆర్.యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సన్నీ ఈ పోస్టర్లో భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగిలిన వివరాలు ప్రకటించనున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) -
పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు: సన్నీలియోన్
‘ఓ వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు’ అన్నారు బాలీవుడ్ నటి సన్నీలియోన్ . హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోని పలు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. ‘కరెంట్ తీగ’(2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ ‘పీఎస్వీ గరుడవేగ’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్ గ్యాంగ్’, ‘షీరో’, ‘కోకా కోలా’, ‘యుఐ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా ‘స్ల్పీట్స్విల్లా’ అనే ఓ రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు సన్ని. తాజాగా ఈ షోలో ఆమె మాట్లాడుతూ–‘‘కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తిని చాలా ప్రేమించాను. తన కూడా నన్ను ప్రేమించాడు. మా ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత ఏదో తప్పు జరుగుతోందని, అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని నా మనసుకు అనిపించింది. దీంతో ‘నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’ అని ప్రశ్నిస్తే లేదన్నాడు. మరో రెండు నెలల్లో మా పెళ్లిని ప్లాన్ చేసుకున్నాం. హవాయి దీవుల్లో గ్రాండ్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పైగా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో తను అలా చెప్పడంతో నా మనసు ముక్కలైంది.. ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత భగవంతుడు నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చాడు. డానియల్ వెబర్‌ను పరిచయం చేశాడు. నా తల్లితండ్రులు చనిపోయినప్పుడు తను ఎంతో అండగా నిలిచాడు. మా ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి (2011) చేసుకున్నాం. ఎప్పటికీ నా భర్త చేయి వదలను’’ అన్నారు. -
కొద్దిరోజుల్లో పెళ్లి పెట్టుకుని నన్ను మోసం చేశాడు: సన్నీలియోన్
బాలీవుడ్లో ఐటం సాంగ్స్‌తో అల్లాడించింది సన్నీలియోన్. హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మరాఠి, బెంగాలి, మలయాళ భాషల్లోనూ పలు పాటల్లో తళుక్కుమని మెరిసింది. ఈమె తెలుగులో చివరగా జిన్నా సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాలున్నాయి. ఇందులో ఒకటి స్పెషల్ సాంగ్ కాగా మిగతా వాటిలో కీలక పాత్రలు పోషిస్తోంది. అలాగే బుల్లితెరపై ప్రసారమయ్యే స్ప్లిట్స్‌విల్లా ఐదో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. నాకు డౌట్ వచ్చి.. తాజాగా ఆమె ఈ షోలో తన మనసు ముక్కలైన క్షణాలను గర్తు చేసుకుంది. 'ఇది నా పెళ్లికి ముందు జరిగిన సంఘటన. ఒక వ్యక్తిని ఎంతో ప్రేమించాను. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాం. కానీ అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనని మనసు కీడు శంకించింది. ఒకసారి తననే నేరుగా అడిగేశాను.. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని! దానికతడు లేదు, నీ మీద ప్రేమ ఎప్పుడో పోయిందని చెప్పాడు. కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అప్పటికే మా పెళ్లి షాపింగ్ కూడా అయిపోయింది. అన్నీ బుక్ చేసేశా హవాయి దీవుల్లో గ్రాండ్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా వివాహం జరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం అన్నీ బుక్ చేసుకుని డబ్బులు కూడా ఇచ్చేశాను. పెళ్లికి ఇంకా రెండు నెలల సమయం ఉందనగా నేనంటే ఇష్టం లేదని చెప్పి నా మనసు ముక్కలు చేశాడు. అప్పుడు నేనెంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలోనే దేవుడు నాకోసం వెబర్‌ను పంపాడు. అండగా నిలబడ్డాడు కష్టసమయాల్లో అండగా నిలబడ్డాడు. అమ్మానాన్న మరణించినప్పుడు నావెంటే ఉండి నాలో ధైర్యం నింపాడు. ఎప్పటికీ నా భర్త చేయి వదలను' అని చెప్పుకొచ్చింది. కాగా సన్నీ లియోన్ - డేనియల్ వెబర్ 2011లో పెళ్లి చేసుకున్నారు. 2017లో నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ మరుసటి ఏడాది సరోగసి ద్వారా నోవా, ఆషర్ అనే కుమారులకు తల్లిదండ్రులయ్యారు. చదవండి: ‘కాంట్రవర్సీ కింగ్’ ఆర్జీవీ గురించి ఈ విషయాలు తెలుసా? -
అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
సన్నీ లియోన్ కీలక పాత్రలో ‘డాక్టర్ యోగి డైరీస్’
డా.యోగేష్, ఆకృతి అగర్వాల్ జంటగా సన్నీ లియోన్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డాక్టర్ యోగి డైరీస్’. రాజేశ్ -ప్రసాద్‌ల దర్శకత్వంలో హర్షవర్ధన్, శ్రీదేవి మద్దాలి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తొలి సీన్‌కి దర్శకుడు వీరశంకర్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు వీఎన్ ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు మహేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ..‘రాజేష్ - ప్రసాద్ లు కథ చెప్పగానే లైవ్ లో ఇలా కూడా జరుగుతుందా అనే ఆశ్యర్యానికి లోనయ్యాను.. అంతలా కథతో ఇప్రేస్ చేశారు. ప్రతిదీ చాలా ప్లానింగ్ గా వర్క్ చేస్తున్నారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చెయ్యటానికి ప్లాన్ చేశాం’ అన్నారు. ‘ఈ ఏడాది ప్రేక్షకులు ఓ మంచి పారా నార్మల్ థ్రిల్లర్‌ను చూస్తారు’అని అన్నారు డా.యోగేష్ -
కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!
కలర్‌ఫుల్ డ్రస్‌లో మంచు అక్క గ్లామర్ ట్రీట్ ఫ్యామిలీతో కలిసి జపాన్‌లో సాయిపల్లవి ఎంజాయ్ అందంగా మెరిసిపోతున్న హీరోయిన్ తాన్య హోప్ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురిలా రెడీ అయిన సన్నీ లియోన్ బికినీతో కళ్లు చెదిరిపోయే ట్రీట్ ఇచ్చిన తెలుగమ్మాయి ఎక్సర్సైజ్ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ త్రిదా చౌదరి పెళ్లి హడావుడిలో ఫుల్ బిజీబిజీగా హీరోయిన్ రాశీఖన్నా వజ్రంలా ధగధగా మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ రెబా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) -
సన్నీలియోన్ కానిస్టేబుల్ పరీక్షకు అప్లై చేశారా?
సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు పలు ప్రభుత్వ పథకాల దరఖాస్తుల్లో కనిపిస్తూ అందరినీ అశ్చర్యపరుస్తాయి. ఎన్నికల ఐడీ, అధార్ కార్డుల్లో కూడా చాలా మంది సెలబ్రిటీల ఫొటో ప్రక్షత్యమైన సందర్భాలు కూడా చూశాం. అయితే ప్రముఖ బాలీవుడ్ నటీ సన్నీలియోన్‌కు సంబంధించిన ఫొటో సైతం ఓ పోటీపరీక్షల దరఖాస్తులో కనిపించటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్ ప్రరీక్ష దరఖాస్తులో ఓ అభ్యర్థి సన్నిలియోన్ ఫొటోతో అప్లై చేశారు. అయితే రిజిస్ట్రషన్ ప్రాసెస్‌లో సన్నీలియోన్ ఫొటోతో అప్లై చేసిన సదరు అప్లికేషన్‌కు అడ్మిట్ కార్డు కూడా జారీ అయింది. ప్రస్తుతం ఈ అడ్మిట్‌కార్డు నెట్టింట హల్చల్ చేస్తోంది. అడ్మిట్‌కార్డు వివరాల ప్రకారం.. న్నౌజ్ తిర్వాలోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ బాలికల కళాశాల సన్నీలియోన్‌కు పరీక్ష కేంద్రంగా కేటాయించబడట గమనార్హం. ఫిబ్రవరి 17, 18 రెండు రోజుల పాటు యూపీలో పోలీసు ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి. Sunny Leone applied for UP police constable examination....😅😅 pic.twitter.com/YuxYMzGjwt — Simple man (@ArbazAh87590755) February 17, 2024 మరోవైపు.. అభ్యర్థుల సమచారంలో అవకతకలు, అక్రమైన మార్గాల్లో పరీక్ష రాయాలని వేసుకున్న ప్రణాళికను భగ్నం చేస్తూ.. గత రెండు రోజుల్లో సుమారు 120 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసినట్టు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే నెట్టింట్లో వైరల్ అయిన సన్నీలియోన్ అడ్మిట్ కార్డుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘యూపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు సన్నీలియోన్ అప్లై చేశారా?’ అని ఓ ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ కామెంట్ చేసింది. దీనిపై స్పందించిన యూపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు స్పందిస్తూ... సన్నీలియోన్ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్‌కార్డు నకిలీది అని స్పష్టం చేసింది. -
సన్నీలియోన్ రెస్టారెంట్లో ప్రేమికులకు ప్రత్యేక ఏర్పాట్లు!
బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సన్నీలియోన్ ఇటీవలే ఓ రెస్టారెంట్ యజమానిగా మారారు. ఆమె ఈ మధ్యనే యూపీలోని నోయిడాలో తన మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సన్నీ రెస్టారెంట్ పేరు చికా లోకా. ఇది నోయిడాలోని గుల్షన్ మాల్లో ఉంది. ‘చికా లోకా’ ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రేమ జంటలకు చక్కని అలంకారంతో కూడిన టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రైవేట్ టేబుళ్లను కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లైవ్ బ్యాండ్ సంగీతంతో క్యాండిల్ డిన్నర్ చేయవచ్చని వివరించింది. రెస్టారెంట్‌కు వచ్చే ప్రేమ జంటల కోసం టెర్రస్‌ను అందంగా అలంకరించినట్లు మేనేజర్ భూపేష్ సింగ్ తెలిపారు. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ఈ వాలెంటైన్‌ను ప్రత్యేకంగా చేసుకోవచ్చన్నారు. గ్రౌండ్ ఫ్లోర్, టెర్రస్ ఏరియాలలో ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డ్యాన్స్, క్యాండిల్ డిన్నర్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ విత్ డీజే మొదలైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
భర్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సన్నీ లియోన్
-
నటి సన్నీ లియోన్ కొత్త వ్యాపారం.. వీడియో వైరల్
సన్నీ లియోన్ గురించి సినిమా ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పోర్న్‌స్టార్‌గా ఉన్న ఈమె.. ఆ తర్వాత నటిగా బాలీవుడ్‌లోకి ఎంటరైంది. స్పెషల్ సాంగ్స్‌తో పాటు పలు పాత్రల్లోనూ నటించి ఆకట్టుకుంది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు భర్తతో కలిసి కొత్తగా ఓ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) మారిపోయిన సన్నీ లియోనీ సన్నీ లియోన్ పేరు చెప్పగానే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు పోర్న్ చిత్రాల్లో నటించడమే దీనికి కారణం. ఆ ఇండస్ట్రీని వదిలి ఏళ్లకు ఏళ్లకు గడిచిపోయినా సరే ఇప్పటికీ చాలామంది.. ఈమెని ఆ ఉద్దేశంతోనే చూస్తుంటారు. కానీ సన్నీ లియోనీ.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వ్యాంప్ క్యారెక్టర్స్ చేసినా సరే.. బయట మాత్రం కొన్ని మంచి పనులు చేసింది. ఓ అనాథ బాలికని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఏంటా బిజినెస్? గత కొన్నేళ్ల నుంచి సినిమాల పరంగా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో రూట్ మార్చేసింది. భర్త డేనియల్ వెబర్‌తో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టింది. ఢిల్లీలోని నోయిడాలో 'చికలోక' పేరుతో ఓ రెస్టారెంట్ ఈ మధ్య ఓపెన్ చేసింది. ఇందులో కుక్ చేస్తున్న ఓ వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో వ్యాపారంలోకి సన్నీ లియోన్ అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసింది. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న మహేశ్ కూతురు సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) View this post on Instagram A post shared by Chica Loca Noida (@chicalocanoida) -
సన్ని లియోన్ మూవీ హీరోయిన్.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న భామ!
ఈ రోజుల్లో ఫేమస్ కావడం చాలా ఈజీ. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నటీమణులు సోషల్ మీడియాను ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. అవకాశాల కోసం, అభిమానులను అలరించడంకోసం, ఆదాయం కోసం కూడా లేటేస్ట్ పిక్స్‌తో హల్చల్ చేస్తుంటారు. ఇందుకు సీనియర్, జూనియర్ నటీమణులు అంటూ ఎవరూ అతీతులు కారు. వీరిలో యువ నటి దర్శా గుప్త వంటి వారికి ఈ సామాజిక మాధ్యమాలే అవకాశాల కోసం ముఖ్యమైన వేదికగా మారుతున్నాయి. బుల్లితెరపై విశేష ఆదరణను పొందిన దర్శా గుప్త రుద్ర తాండవం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రం సక్సెస్ అయినా ఈ అమ్మడికి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ప్రధాన పాత్ర పోషించిన ఓ మై ఘోస్ట్ చిత్రంలో యువ కథానాయకిగా నటించింది. అందులో తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అందాలను ఆరబోయడానికి వెనుకాడలేదు. ప్రస్తుతం మెడికల్ మిరాకిల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీంతో చేతిలో మరో అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఆ వేటలో పడింది. అందుకు ఈ బ్యూటీ ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా. అందులో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిన ఫొటోలను పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. అయితే దర్శాగుప్త ప్రయత్నం ఏ మాత్రం ఫలిస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Dharsha Gupta (@dharshagupta) View this post on Instagram A post shared by Dharsha Gupta (@dharshagupta) -
సన్నీ-ప్రియమణి యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఫిల్మిటీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గాయత్రి సురేష్, వివేకానందం కలిసి నిర్మించిన కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. వివేక్ కుమార్ కర్నూల్ దర్శకత్వం వహించగా... ప్రియమణి, సన్నీలియోన్, సారా అర్జున్, గాయత్రి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రమ్స్ శివమణి సంగీతమందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'కొటేషన్ గ్యాంగ్' అనే ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) చెన్నైలోని ఓ స్టూడియోలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఆసక్తికర విషయాల్ని బయటపెట్టారు. కేరళలో కొటేష న్ గ్యాంగ్ ఉన్నారనే వార్త పేపర్లో చదివానని, దాన్ని బేస్ చేసుకుని తయారు చేసుకున్న కథతో ఈ సినిమా తీశానని డైరెక్టర్ వివేక్ చెప్పుకొచ్చారు. చెన్నై, ముంబై, కశ్మీర్లో జరిగే మూడు కథలు ముంబైలో కలుస్తాయని, డబ్బు కోసం ఎలాంటి పనైనా ఆలోచించకుండా చేసే కూలీ ముఠా ఇతివృత్తమే కొటేషన్ గ్యాంగ్ చిత్రమని దర్శక నిర్మాతలు చెప్పారు. ప్రియమణి చేసే ఫైట్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్)