రేణుక ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌.. స్టయిలిష్‌ లుక్‌లో సన్నీ లియోన్‌ | Sunny Leone getting off the village light bus.. Ginna Movie First Look Poster Release | Sakshi
Sakshi News home page

రేణుక ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌.. స్టయిలిష్‌ లుక్‌లో సన్నీ లియోన్‌

Published Thu, Aug 11 2022 4:45 AM | Last Updated on Thu, Aug 11 2022 7:56 AM

Sunny Leone getting off the village light bus.. Ginna Movie First Look Poster Release - Sakshi

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్‌ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ  నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుక పాత్రలో సన్నీ కనిపిస్తారు. బుధవారం స్టయిలిష్‌గా ఉన్న రేణుక ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లేను రచయిత కోన వెంకట్‌ అందించారు. ‘‘కమర్షి యల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. తెలుగు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ‘జిన్నా’ విడుదల కానుంది. ‘నాటు నాటు’ ఫేమ్‌ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ ఈ చిత్రానికి నృత్యాలు అందిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ ఉర్రూతలూగించే సంగీతం అందించగా, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement