Jinnah
-
షూటింగ్లో గాయపడ్డ మంచు విష్ణు.. వైరల్ అవుతున్న ఫోటో
యంగ్ హీరో మంచు విష్ణు జయపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇషాన్ సూర్య దర్శకత్వంలో జిన్నా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న విష్ణు గాయాలపాలయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఓ సాంగ్ షూటింగ్లో భాగంగా గాయం అయ్యిందని, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ వల్ల అయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణు షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్నినిర్మిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే నెల అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. -
మంచు విష్ణు 'జిన్నా' టీజర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు.’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్.. స్టయిలిష్ లుక్‌లో సన్నీ లియోన్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణుక పాత్రలో సన్నీ కనిపిస్తారు. బుధవారం స్టయిలిష్‌గా ఉన్న రేణుక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేను రచయిత కోన వెంకట్ అందించారు. ‘‘కమర్షి యల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. తెలుగు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ‘జిన్నా’ విడుదల కానుంది. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి నృత్యాలు అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఉర్రూతలూగించే సంగీతం అందించగా, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. -
జిన్నాకి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సిన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 'జిన్నా' లోని ఓ పాటకు కొరియోగ్రఫీ అందించాడట. ఈ సినిమాలోని ఓ పాటకు ఇప్పటికే ఇండియన్ మైకెల్ జాక్సన్ ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించగా తాజాగా ఓ సాంగ్‌ను స్టార్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య స్టెప్స్ సమకూర్చాడు. హీరో విష్ణు, పాయల్, సన్నీలియోన్‌ల మధ్య సాగే ఓ పార్టీ సాంగ్‌కు ఆయన కొరియోగ్రఫి అందించినట్లు తెలుస్తుంది. ఎంగేజ్మెంట్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ పాట సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది. విష్ణు మంచుతో ఉన్న అనుబంధంతో గణేష్ ఆచార్య ఈ పాటలో కాలు కదపడం విశేషం. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండ ప్రభుదేవ, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లతో పాటలను రూపొందించి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవరామ్ భక్త మంచు సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై విష్ణు మంచు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేట్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తుండగా.. చోటా కే నాయుడా కెమెరా మ్యాన్‌గా పని చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
మత సామరస్యానికి ప్రతీక జిన్నా టవర్
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్) : మత సామరస్యానికి ప్రతీక గుంటూరులోని జిన్నాటవర్ అని, ఎందరో మహానుభావుల త్యాగం వల్లే నేడు అందరం స్వాతంత్య్ర ఫలాలు అనుభవిస్తున్నామని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరు నగరంలో జిన్నా టవర్ పేరుతో కొన్ని మతతత్వ శక్తులు కులమతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం సిగ్గుచేటన్నారు. జిన్నాటవర్ పేరు మార్చాలని, లేకుంటే కూల్చేస్తామంటూ కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న రాద్ధాంతాలకు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. గురువారం సర్వమత పెద్దల ప్రార్థనల అనంతరం అక్కడ జాతీయ జెండాను హోం మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ జిన్నా టవర్‌కు త్రివర్ణ పతాక రంగులు వేయడం చరిత్రాత్మకమన్నారు. దేశ పాలకులు కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం బాధాకరమన్నారు. జిన్నా దేశభక్తుడంటూ అద్వానీ కీర్తించలేదా? ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ గాంధీజీని హత్య చేసిన గాడ్సేను పూజించే బీజేపీ నేతలకు దేశభక్తి గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అద్వానీ పాకిస్తాన్ వెళ్లి జిన్నా దేశ భక్తుడంటూ కొనియాడిన సంగతి బీజేపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరిధర్‌లు మాట్లాడుతూ గుంటూరు నగరంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తుంటే.. ఓర్వలేక వారి మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని స్వార్థపూరిత శక్తులు విఫలయత్నాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు జియాఉద్దీ¯న్, వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు, డిప్యూటీ మేయర్లు బాలవజ్రబాబు, షేక్ సజీల, కమిషనర్ నిశాంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు నడిబొడ్డులో ఉన్న జిన్నాటవర్‌కు జాతీయ జెండా రంగులు అద్దారు. దీంతో గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు జిన్నాటవర్‌పై చేస్తోన్న మత రాజకీయాలకు తెరపడినట్టయింది. నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం ఉదయం నుంచి జిన్నాటవర్‌కు జాతీయ జెండాలోని రంగులను వేసి సాయంత్రానికి పూర్తి చేశారు. ఇప్పటికే జిన్నాటవర్ చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. జెండా ఎగురవేసేందుకు దిమ్మెలను తయారు చేస్తున్నారు. రూ.5 లక్షలతో జిన్నాటవర్ సెంటర్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జిన్నాటవర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసేందుకు పాలకవర్గంతో, అధికారులు సంసిద్ధమయ్యారు. -
తెలుసా..! స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరింది అతనేనట!
‘పాక్స్తాన్’ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్.. 3, హంబర్‌స్టోన్ ఇంటిలోని ఒకగది గోడమీద రాసున్నాయి ఆ అక్షరాలు (పాకిస్తాన్ కాదు). రాసినవాడు జిన్నా కాదు, చౌధురి రహమత్ అలీ. ఆ పద సృష్టికర్త అలీయే. భారత స్వాతంత్య్రోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం నడపాలని ఆశించినవాడు, స్వతంత్ర పాకిస్తాన్ కావాలని మొదట కోరినవాడు ఇతడే. ఎవరీ అలీ? తూర్పు పంజాబ్, హోషియార్‌పూర్‌లోని కామేలియా అతడి స్వస్థలం. 1897 నవంబర్ 16న బాలాచౌర్లో పుట్టాడు. 1930లో ఇంగ్లండ్ వెళ్లి 1931లో కేంబ్రిడ్జ్ పరిధిలోని ఇమ్మాన్యుయేల్ కళాశాలలో చేరాడు. అలీ మిత్రుడు అబ్దుల్ కరీం కథనం ప్రకారం తన మిత్రులు పీర్ అహసనుద్దీన్, ఖ్వాజా అబ్దుల్లతో కలసి థేమ్స్ ఒడ్డున నడుస్తుండగా అలీకి ఆ పేరు స్ఫురణకు వచ్చింది. అలీ కార్యదర్శి ఫ్రాస్ట్ మాటలలో అయితే, ఒక రోజున బస్సు టాప్ మీద ప్రయాణిస్తున్నప్పుడు ఆ పేరు స్ఫురించింది. ఆ హ్రస్వనామమే (పి.ఎ.కె. స్తాన్) తరువాత ‘ఐ’ చేరి పాకిస్తాన్ అయింది. పాకిస్తాన్ అంటే పర్షియన్లో పవిత్రభూమి. బహుశా భారత్, పాక్ చరిత్రలలో అలీ అంతటి వివాదాస్పద వ్యక్తి కనిపించడు. భారత్‌లో సరే, పాకిస్తాన్ చరిత్రలో కూడా ఇతడికి కొద్దిపాటి స్థానం కూడా కనిపించనిది అందుకే కాబోలు. కానీ పాక్స్తాన్ జాతీయోద్యమ నిర్మాతగా ఇతడు తనను తాను ప్రకటించుకున్నాడు. నిజానికి బొంబాయి కేంద్రంగా ‘పాకిస్తాన్’ పేరుతో పత్రికను ప్రచురించడానికి 1928లో ఒక పత్రికా రచయిత దరఖాస్తు చేశాడు. అతడు కశ్మీర్‌కు చెందిన గులాం హసన్ షా కాజ్మీ. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఫలితాలు రహమత్‌ను బాగా నిరాశపరచాయి. ఆ సమావేశాలకు వెళ్లిన భారతీయ బృందాన్ని క్షమించకూడదన్నాడు. ఆ సమావేశాలకు డాక్టర్ ఇక్బాల్ కూడా హాజరయ్యారు. అప్పుడే రహమత్ ఆయనను ఇంగ్లండ్‌లో కలుసుకున్నాడు. తరువాత 1932 నాటి అలహాబాద్ ముస్లింలీగ్ సమావేశాలలో డాక్టర్ ఇక్బాల్ చేసిన ప్రతిపాదన కూడా అలీకి నిరాశ కలిగించింది. వాయవ్య ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉన్న ఐదు ప్రాంతాలను కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసి, బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగంగా ఉంచాలని ఇక్బాల్, లీగ్ కోరడం అలీకి నచ్చలేదు. దక్షిణాసియాలో ముస్లింలకో స్వతంత్ర దేశం అన్నది అతడి నినాదం. అసలు పరమతానికి చెందిన ఏ పేరూ ఆసియాలో మిగిలి ఉండకూడదని అతడి నిశ్చితాభిప్రాయం. రహమత్ అలీ ప్రతిపాదించిన పిఎకెలో, పి అంటే పంజాబ్, ఎ అంటే అఫ్గానిస్తాన్ (మొత్తం వాయవ్య సరిహద్దు), కె అంటే కశ్మీర్, ఎస్ అంటే సింధ్, స్తాన్ అంటే బలూచిస్తాన్‌కు సంకేతాక్షరాలు. బ్రిటిష్ ఇండియా పటంలోని బెంగాల్, అస్సాంలకు బంగిస్తాన్ అన్న పేరూ పెట్టాడు. ఉస్మాన్స్తాన్ (నిజాం రాజ్యం), ముస్లింలు అధికంగా ఉండే ఇంకొన్ని ప్రాంతాల మీద ఆకుపచ్చ రంగు పులిమి ఒక సరికొత్త భౌగోళిక పటాన్ని అతడు రచించాడు. ఆ పచ్చరంగు ప్రాంతాలే పాక్స్తాన్. ఈ ఊహనంతటినీ 1933 జనవరి 28న విడుదల చేసిన చరిత్ర ప్రసిద్ధ ‘నౌ ఆర్ నెవర్’ కరపత్రంలో అలీ వివరించాడు. దీనర్థం ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?’ అని. దీనికే ‘మనం బతికేందుకా! నశించిపోతూ ఉండడానికా?’ అన్న ఉపశీర్షిక కూడా ఉంది. మూడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన భారతీయ బృందాన్ని దృష్టిలో ఉంచుకునే అతడు ఈ కరపత్రం రాశాడని చెబుతారు. దీనికే ‘పాకిస్తాన్ ప్రకటన’ అంటూ పాకిస్తాన్ పత్రిక ‘డాన్’ పేరు పెట్టడం గమనార్హం. ఈ కరపత్రం బహిర్గతమైన సంవత్సరం తరువాత 1934 జనవరి 28న ఇంగ్లండ్‌లోనే ఉన్న జిన్నాను రహమత్ అలీ తన నివాసానికి పిలిచి వివరించాడని కోలిన్స్, లాపిరే (‘ఫ్రీడవ్‌ు ఎట్ మిడ్నైట్’), రషీదా మాలిక్ (‘ఇక్బాల్: స్పిరిచ్యువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్’) వంటి రచయితలు వేర్వేరు రీతులలో తెలియచేశారు. లండన్‌లోని వాల్డెర్ఫ్ హోటల్లో జిన్నా కోసం బ్లాక్‌టై పార్టీ ఏర్పాటు చేసి.. అలీ ఇవన్నీ చెప్పినట్టు కోలిన్స్, లాపిరే రాశారు. 3, హంబర్‌స్టోన్ ఇంటికే జిన్నా వచ్చారని ఎక్కువమంది రాశారు. చిత్రంగా ‘పాకిస్తాన్ ఆలోచనే అసాధ్యం’ అంటూ ఆ క్షణంలోనే జిన్నా చెప్పారని కోలిన్స్, లాపిరే చెబితే, ‘కాలం గడవనీ! వాళ్ల సంగతి వాళ్లే (భారతీయ ముస్లింలు) చూసుకుంటారు’ అని సర్ది చెప్పినట్టు ఇతర రచయితలు రాశారు. ఏమైనా 1934 వరకు కూడా పాకిస్తాన్ ఆలోచనకు ఎవరూ సానుకూలంగా లేరన్నది నిజం. ఇది కాలేజీ కుర్రాళ్ల రగడ అనే మూడో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లిన పెద్దలు భావించారు. రహమత్ అలీ మరికొన్ని కరపత్రాలు కూడా వెలువరించాడు. ‘పాక్స్తాన్: ది ఫాదర్ల్యాండ్ ఆఫ్ పాక్స్తానీ నేషన్’ అన్న పుస్తకం కూడా రాశాడు. ఇస్లాంను ఆవిష్కరించే క్రమంలో ప్రవక్త అరబ్ తెగలను ఏకం చేసిన క్రమమే దక్షిణాసియాలో ముస్లింలకో దేశం అన్న తన లక్ష్యానికి ప్రేరణ అని అలీ చెప్పుకున్నాడు. తమ పూర్వికులు ఆరంభించిన స్థలాలు, పట్టణాలు, కొండల పేర్ల మార్పు ఉద్యమం కొనసాగాలనీ ఆశించాడు. హిమాలయాలను ‘జబాలియా’ అని, బంగాళాఖాతాన్ని ‘బంగి ఇ ఇస్లాం’ అని, ఆసియా ఖండాన్ని ‘దినియా’అని పిలిస్తేనే సార్థకమని భావించాడు. బుందేల్‌ఖండ్ మాల్వాలను సిద్దిఖిస్తాన్ అని, బిహార్, ఒడిశాలను ఫారూకిస్తాన్ అని, రాజస్థాన్‌ను ముయిస్తాన్ అని, మొత్తం హిందూస్థాన్‌ను హైదర్స్తాన్ అని, దక్షిణ భారతదేశాన్ని మాప్లిస్తాన్ అని పిలవడం సరైనదని వాదించాడు. పశ్చిమ సింహళానికి షఫిస్తాన్ అని, తూర్పు సింహళానికి నాసరిస్తాన్ అని కూడా పేర్లు పెట్టాడు. వీటిలో మొదట సాధించవలసినది మాత్రం పాక్స్తాన్ అని అనుకున్నాడు. జాతీయోద్యమానికి సమాంతరంగా ముస్లిం జాతీయోద్యమం సాగించడానికి రహమత్ అలీ ప్రయత్నించాడు. 1940 నాటి లాహోర్ సమావేశంలో మొదటిసారిగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్ చేశాడు జిన్నా. ఆ సమావేశానికి రహమత్ కూడా హాజరయ్యాడు. దేశ విభజన తరువాత 1948 ఏప్రిల్ 6న అలీ లాహోర్ చేరుకున్నాడు. యమునా నదే హిందుస్థాన్‌కు, పాకిస్తాన్‌కు మధ్య సహజ సరిహద్దు అని, ఢిల్లీ, ఆగ్రాలు లేని పాకిస్తాన్‌ను ఎలా అంగీకరించారని ధ్వజమెత్తడం ఆరంభించాడు. తను పచ్చరంగు పూసి, సూచించిన ప్రాంతాలతో పాకిస్తాన్ ఎందుకు సాధించలేదన్నదే అతడి ప్రశ్న. జిన్నా ‘ఖాయిద్ ఏ ఆజమ్’ (మహా నాయకుడు జిన్నా బిరుదు) కాదు, ‘క్విస్లింగ్ ఏ ఆజమ్’(మహా ద్రోహి) అని విమర్శలు ఆరంభించాడు. దీనితో ప్రధాని లియాఖత్ అలీఖాన్ పాక్ నుంచి రహమత్‌ను బహిష్కరించాడు. అతడి ఆస్తులను జప్తు చేయించాడు. తిరిగి కేంబ్రిడ్జ్ చేరుకున్న అలీ 1951 ఫిబ్రవరి 3న దాదాపు అనాథగా చనిపోయాడు. కేంబ్రిడ్జ్‌లో అతడి ఆచార్యుడు ఎడ్వర్డ్ వెల్బోర్న్ డబ్బు ఇచ్చి అంత్యక్రియలు జరిపించాడు (ఈ ఖర్చులను తరువాత పాకిస్తాన్ హైకమిషన్ చెల్లించింది). మరణానంతరమైనా తన అవశేషాలు స్వస్థలం కామేలియాకు పంపించాలని తన న్యాయవాదిని అలీ కోరినట్టు చెబుతారు. కానీ 2006లో జరిగిన ఈ ప్రయత్నం కూడా చిత్తశుద్ధితో సాగలేదు. 1947లో మౌంట్‌బాటన్‌తో జిన్నా చెప్పిన ‘మాత్ ఈటెన్ పాకిస్తాన్’ (అసంపూర్ణ పాకిస్తాన్) అన్నమాటకీ, ‘కశ్మీర్ లేని పాకిస్తాన్ ఏమిటీ?’ అన్న రహమత్ వాదనకీ ఏమైనా వ్యత్యాసం ఉందా? - డా. గోపరాజు నారాయణరావు చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ క్రైం స్టోరీ: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
జిన్నాపై సిన్హా వ్యాఖ్యలకు ఎన్సీపీ సమర్ధన
ముంబై : మహ్మద్ అలీ జిన్నాపై పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ నేత మజీద్ మెమన్ సమర్ధించారు. స్వాతంత్ర పోరాటంలో జిన్నా విశేష సేవలందించారని, ఆయన ముస్లిం అయినందునే జిన్నాకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. ఇదే కారణంతో శత్రుఘ్న సిన్హాపై కాషాయ పార్టీ దేశ వ్యతిరేకి అనే ముద్ర వేసిందని దుయ్యబట్టారు. సిన్హా నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఉన్నందున ఆయన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అది కాషాయ పార్టీ బోధించినవేనని గుర్తురగాలని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఓ ప్రచార ర్యాలీని ఉద్దేశించి శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పాక్ వ్యవస్ధాపకుడు జిన్నా వంటి దిగ్గజ నేతలున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీని వీడి తాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరానో వివరిస్తూ గాంధీ, నెహ్రూ, జిన్నా, సుభాష్ చంద్ర బోస్, ఇందిరా, రాజీవ్‌గాంధీ వంటి నేతలు తీర్చిదిద్దిన పార్టీ ఇదని, దేశ అభివృద్ధికి, స్వాతంత్ర సముపార్జనకు కాంగ్రెస్ విశేష కృషిచేసిందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, సిన్హా వ్యాఖ్యలపై బీజేపీ మండిపడటంతో తాను పొరపాటున నోరుజారానని తాను మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్ పేరు చెప్పబోయి జిన్నా అని చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు. కాగా శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి తలపడనున్నారు. -
జిన్నా ఫొటో.. 94 ఏళ్ల పూర్వ విద్యార్థి స్పందన
అలీగఢ్ : మెహమ్మద్ అలీ జిన్నా ఫొటో వివాదంపై అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఒకరు స్పందించారు. 94 ఏళ్ల రియజ్-ఉర్-షర్వాణీ ఏఎంయూలోని జిన్నా వివాదంపై మాట్లాడుతూ.. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ హాల్లో ఉన్న ఫొటోలు విద్యార్థులకు సంబంధించిన విషయమని అందులో ఇతరులు తల దూర్చాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే జిన్నాను, ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో షర్వాణీ ముందు వరుసలో ఉంటారు. కానీ యూనివర్సిటీ జీవిత కాల సభ్యుడైన జిన్నా ఫొటోపై పూర్తి అధికారం విద్యార్థులదే అంటున్నారు. 1938లో జిన్నా యూనివర్సిటీ జీవిత కాల సభ్యత్వం పొందారు. జిన్నా ఫొటోను యూనివర్సిటీలోని విద్యార్ధి యూనియన్ హాల్లో పెట్టినప్పుడు దేశంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయని అన్నారు. యూనియన్ హాల్లో ఏం పెట్టాలనే విషయాన్ని బయటి వ్యక్తులు నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. అప్పటి ప్రో వైస్ ఛాన్స్లర్ ఏబీ హబిబ్ యూనివర్సిటీలో జిన్నా చిత్రపటాన్ని ఆవిష్కరించారని, ఆ మీటింగ్‌కు ఆయన హాజరైనట్టు తెలిపారు. ఇది విద్యార్థుల వ్యక్తిగత విషయం అని అభిప్రాయపడ్డారు. 1938లో యూనియన్ నియమ నిబంధనలు వేరేగా ఉండేవని, అప్పటి విద్యార్ధి యూనియన్‌కు అధ్యక్షుడిగా ప్రో వైస్ ఛాన్స్లర్ ఉండేవారని అన్నారు. ఉపాధ్యక్షుడ్ని విద్యార్థులు ఎన్నుకునేవారని తెలిపారు. అప్పుడు జరిగిన అన్ని విషయాలు తనకు గుర్తులేకున్నప్పుటికి కొన్ని మాత్రం బాగా గుర్తున్నాయని అన్నారు. జిన్నా ఎప్పుడు వర్సిటీకి వచ్చిన ఆయన ప్రసంగాలను వినేందుకు చాలా మంది ఆయన చుట్టు చేరేవారని, కానీ అందురూ ఆయన భావాలతో ఏకిభవించేవారు కాదని పేర్కొన్నారు. ఏఎంయూ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందిన షర్వాణీ, అదే వర్సిటీలో అరబిక్ ప్రొఫెసర్‌గా పని చేసి పదవి విరమణ పొందారు. ఈ వివాదంపై మరో పూర్వ విద్యార్థి 83 ఏళ్ల అమర్జిత్ సింగ్ బింద్రా స్పందిస్తూ.. జిన్నా చిత్రపటంపై కావలనే కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అప్పటి రోజులన్ని నాకు గుర్తున్నాయి. నిజం ఏంటంటే యూనియన్ హాలో చాలా మంది ఫొటోలు ఉన్నాయని అందులో జిన్నా ఫొటొ కూడా ఉందని అందులో తప్పేముందని అన్నారు. నేను దాన్ని చూస్తూ ఉండేవాడ్ని అన్ని అప్పటి రోజులను గుర్తుచేస్తుకున్నారు. -
జిన్నా ఫొటోను కాల్చినా, చించినా లక్ష నజరానా
అలీగఢ్ : మహమ్మద్ అలీ జిన్నా చిత్రపట వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న జిన్నా చిత్రపటాన్ని వెంటనే తొలగించాలని ఆల్ ఇండియా ముస్లిం మహాసంఘ్ అధ్యక్షుడు ఫర్హత్ అలీఖాన్ డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడైనా జిన్నా ఫొటోలను కాల్చినా, చించినా వారికి ఏకంగా రూ. లక్ష బహుమతిగా అందిస్తానని ప్రకటించారు. దేశాన్ని పాకిస్తాన్, హిందూస్తాన్‌గా విడగొట్టిన వ్యక్తి ఫొటోలను ఎందుకు ఉంచుకోవాలని అన్నారు. పాకిస్తాన్లో ఏ ప్రభుత్వ కార్యాలయంలోగాని, యూనివర్సిటీల్లోగాని అఖండ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మన నాయకులు గాంధీ, నెహ్రుల చిత్రపటాలను ఉంచారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మనం ఎందుకు జిన్నా చిత్రపటాన్ని ఉంచాలని అన్నారు. దేశంలోని అందరూ జిన్నా ఫొటోను కాల్చినా, చించినా వారికి రూ.లక్ష నగదు పురస్కారం అందిస్తామని వెల్లడించారు. అయితే ఈ వివాదాన్ని మొదట బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ లేవనెత్తిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలోని సూడెంట్స్ యూనియన్ హాల్లో జిన్నా ఫొటోను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో కొంతమంది బీజేపీ కార్యకర్తలు యూనివర్సిటీ ముందు ధర్నాలు కూడా నిర్వహించారు. దీనిపై యూనివర్సిటీ వీసీ వివరణ ఇస్తూ.. యూనివర్సిటీ స్థాపనకు నిధులు దానం చేసిన వారిలో జిన్నా ఒకరని, అందుకే ఆయన చిత్రపటాన్ని ఉంచామని, ఆయనతోపాటు గాంధీ, నెహ్రు లాంటి మహా నాయకుల చిత్రపటాలను కూడా ఉన్నాయని తెలిపారు. -
జిన్హ్నా ఫొటోను కాల్చినా, చించినా భారీ నజరానా
-
ఏఎంయూలో జిన్నా ఫోటోపై రగడ
సాక్షి, లక్నో : అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో మహ్మద్ జిన్నా చిత్రపటంపై వివాదం రాజుకుంది. విద్యార్థి సంఘ కార్యాలయంలో జిన్నా ఫోటో ఉండటంపై వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోటోను తొలగించేందుకు విద్యార్థి నేతలు అంగీకరించలేదు. తమపై పోలీసుల చర్యకు నిరసనగా తరగతులు బహిష్కరించాలని విద్యార్థులు పిలుపు ఇచ్చారు. విద్యార్ధుల ఆందోళన నేపథ్యంలో రెండు రోజుల పాటు వర్సిటీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని జిల్లా మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేశారు. చరిత్రలో భాగం అయినందునే జిన్నా చిత్రపటాన్ని తాము తొలగించబోమని విద్యార్ధులు స్పష్టం చేశారు. జిన్నా తమకు స్ఫూర్తిప్రదాత కాకున్నా భారత చరిత్రలో ఆయన ఒక భాగమని వారు చెబుతున్నారు. అన్సారీ పర్యటన నేపథ్యంలో వర్సిటీలో సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని వారు అసంతృప్తివవ్యక్తం చేశారు. కాగా జిన్నా చిత్రపటం వివాదంపై జరిగిన ఘర్షణల్లో 40 మంది విద్యార్థులతో పాటు పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు.ఏఎంయూలో జిన్నా చిత్రపటం ఉంచడాన్ని హిందూ యువ వాహిని కార్యకర్తలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. -
ఇంతకీ ఎవరీ దినా వాదియా?
సాక్షి, ముంబై : జాతీయ మీడియాలో ఇప్పుడు దినా వాదియా మరణం గురించి వార్తలు ప్రముఖంగా ప్రచురితం అవుతున్నాయి. న్యూయార్క్‌లో మరణించిన ఈ 98 ఏళ్ల ఈ వృద్ధురాలి గురించి ఓ ప్రత్యేకత ఉంది. పాకిస్థాన్ జాతి పిత, ముస్లిం లీగ్ నేత మహ్మద్ అలీ జిన్నా ఏకైక కూతురే ఆమె. గురువారం ఆమె అనారోగ్యంతో కన్నుమూశారు. జిన్నా-రత్నన్‌భాయ్ పేటిట్ దంపతులకు 1919 ఆగష్టు 15న దినా జన్మించింది. నిజానికి జిన్నా పూర్వీకులు గుజరాత్‌కు చెందిన వారే. అయినప్పటికీ 1870 లో ఆయన కుటుంబం వ్యాపారం కోసం కరాచీకి వెళ్లి స్థిరపడిపోయారు. అక్కడే జిన్నా జన్మించారు. జిన్నా భార్య రత్నన్ మాత్రం ముంబై పెటిట్-టాటా కుటుంబానికి చెందిన వారు. ఇక భారత్-పాక్ విభజన తర్వాత జిన్నా కుటుంబం పాకిస్థాన్‌కు తరలి వెళ్లిపోగా, ఆయన కూతురు దినా మాత్రం ప్రముఖ వ్యాపారవేత్త నివిల్లే వాదియా వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయింది. ధైర్యవంతమైన మహిళగా గుర్తింపు... దినా ముక్కు సూటి స్వభావం గల వ్యక్తి. చాలా ధైర్యస్తురాలని కీర్తించేవారు. తాను భారత గడ్డపై పుట్టిన బిడ్డనంటూ ఆమె పలుమార్లు ప్రకటించుకున్నారు. విభజన తర్వాత పాక్‌కు వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేసిన ఆమె.. ఆ తర్వాత ఆమె తన కుటుంబంతో అంతగా సంబంధాలు కొనసాగించలేదు. 1948లో తండ్రి(జిన్నా) అంత్యక్రియలకు మాత్రమే ఆమె వెళ్లి వచ్చింది. అయితే 2004లో ఇండియా-పాకిస్థాన్ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగిన సిరీస్ కోసం అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఆహ్వానం మేరకు వెళ్లారు. క్రికెట్ ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయన్న నమ్మకం ఆమె వ్యక్తం చేశారు. అయితే 2007లో ముంబైలోని తన తండ్రి ఇంటిని తనకు అప్పగించాలంటూ ఓ పిటిషన్ ఆమె దాఖలు చేశారు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. కొన్నాళ్లుగా ఆమె న్యూయార్క్‌లోని తనయుడు నుసిల్ వాదియా(వాదియా గ్రూప్ చైర్మన్) ఇంట్లో ఉంటుండగా.. మరణ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు. -
‘గీతోపదేశం’ ఎవరికోసం?
యజత్, ఉషా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గీతోపదేశం’. జిన్నా దర్శకత్వంలో జె.మధుబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత తండ్రి నాగేంద్రం కెమెరా స్విచాన్ చేయగా, టి.ప్రసన్నకుమార్ క్లాప్ ఇచ్చారు. వీఎన్ ఆదిత్య గౌరవ దర్శకత్వం వహించారు. పురాణాలను గుర్తు చేసే కథాంశమిదని, నాలుగున్నరేళ్లు కష్టపడి ఈ కథ తయారు చేశామని దర్శకుడు చెప్పారు. 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, జనవరి 3న పాటలను, అదే నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని, ఇందులో విలన్‌గా నటిస్తున్నానని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్-వెంగీ, కెమెరా: రాహుల్ మాచినేని, ఎడిటింగ్: డి.రాజా.