మంచు విష్ణు 'జిన్నా' టీజర్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే | Manchu Vishnu Jinnah Movie Teaser To Launch This Date | Sakshi
Sakshi News home page

Manchu Vishnu : మంచు విష్ణు 'జిన్నా' టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్

Published Fri, Aug 19 2022 10:50 AM | Last Updated on Fri, Aug 19 2022 10:53 AM

Manchu Vishnu Jinnah Movie Teaser To Launch This Date - Sakshi

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్లు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘‘కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్‌ అందించారు.’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: ఛోటా కె. నాయుడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement