
ముంబై వరదల వల్ల ఎంతగానో నష్టపోయానంటోంది హీరోయిన్ సన్నీలియోన్. తను ఇష్టపడి కొనుక్కున్న ఖరీదైన కార్లు వరదలో కొట్టుకుపోయాయని వాపోయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ముంబైలో ఉంటున్నాను. పని కోసం ముంబైకి వచ్చినప్పుడు నేను ఉండే ఇంటి పరిస్థితి చూసి ఆందోళన చెందేదాన్ని. గోడల నుంచి నీళ్లు కారేవి. అధిక తేమ వల్ల చాలా వస్తువులు తడిగా ఉన్నట్లు అనిపించేది. అయినా సరే అక్కడి వాతావరణం నాకెంతో నచ్చేది. చెప్పాలంటే వర్షాకాలం అంటే ఎంతో ఇష్టం.
ఆకాశం నుంచి చినుకులు నేలను తాకుతుంటే ముచ్చటగా అనిపించేది. కానీ ఆ వర్షపు నీళ్లు ఇంటి లోపలదాకా వస్తే మాత్రం నచ్చేది కాదు. ఓసారి తీవ్ర వర్షాలు పడటంతో నా మూడు కార్లు వరదలో కొట్టుకుపోయాయి. అందులో రెండైతే ఒక్కరోజులోనే మాయమైపోయాయి. మేఘాలు అంత వర్షాన్ని దాచుకున్నాయా? అనిపించింది. చాలా బాధపడ్డా.. ఒకరకంగా ఏడ్చేశాను కూడా! ఎందుకంటే ఇండియాలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ టాక్స్ కట్టాలి.
ఒక కారైతే ఎనిమిది మంది కూర్చునే మెర్సిడిస్ ట్రక్. వాటిని పోగొట్టుకున్నందుకు ఎంత ఫీలయ్యానో! అయితే ఇప్పుడు నేను ఇండియాలోనే తయారు చేసిన కార్లు వాడుతున్నాను. అవి నాకు చాలా నచ్చాయి' అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. కాగా సన్నీ లియోన్ ప్రస్తుతం కొటేషన్ గ్యాంగ్ అనే తమిళ చిత్రం చేస్తోంది. వివేక్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్, వి.జయప్రకాశ్, విష్ణు వారియర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: మరో రెండు,మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా: విజయ్ దేవరకొండ
Comments
Please login to add a commentAdd a comment