Manchu Vishnu Ginna Movie Teaser Out Now - Sakshi
Sakshi News home page

Ginna Movie Teaser: మంచు విష్ణు 'జిన్నా' టీజర్‌ వచ్చేసింది

Published Fri, Sep 9 2022 4:42 PM | Last Updated on Fri, Sep 9 2022 5:59 PM

Manchu Vishnu Ginna Movie Teaser Out Now - Sakshi

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్‌ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో టెంట్ హౌస్ నిర్వహించే యువకుడి పాత్రలో మంచు విష్ణు కనిపించనున్నట్లు తెలుస్తుంది. 'వీడేందిరా మనల్ని దొబ్బుతున్నాడు..'అంటూ విష్ణు చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement