
Priest Protest Against On Sunny Leone Dance In Madhuban Song: సినిమాలు, సినిమాల్లోని కొన్ని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకుల మనసులకు హత్తుకుపోతాయి. అలాంటి చిత్రాలను ఎంతగానో ఆదరించి సూపర్ హిట్ చేస్తారు ఆడియెన్స్. ఇలా హిట్టు ఇవ్వడమే కాకుండా వారి మనోభావాలను కించపరిస్తే అదే రేంజ్‌లో ఫట్‌మనిపిస్తారు కూడా. ఇలా కాంట్రవర్సీల మధ్య చిక్కుకుని ఫట్టయిన సాంగ్స్, సీన్స్, మూవీస్ ఎన్నో ఉన్నాయి. తమ సంస్కృతి మనోభావాలు, ప్రతిష్ట దెబ్బతీసేలా అసభ్యంగా ఉన్నాయని విరుచుకుపడిన వారూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఇటీవల సన్నీ లియోన్ నటించిన 'మధుబన్ మే రాధిక నాచే' వీడియో ఆల్బమ్ విడుదలైంది. ఇందులో సన్నీ హాట్ హాట్‌గా పర్ఫామెన్స్ ఇచ్చింది.
ఇప్పుడు ఆ పర్ఫామెన్సే ఆమెపై వ్యతిరేకత తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన 'మధుర'కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ‍్యక్తం చేశారు. ఈ వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని మండిపడుతున్నారు. ఈ పాటలో సన్నీ లియోన్ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్‌ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజు. అలా డ్యాన్స్ చేసినందుకు సన్నీ లియోన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుంటే భారత దేశంలో ఉండనివ్వకూడదన‍్నారు.
అలాగే అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా 'మధుబన్ మే' సాంగ్‌లో సన్నీ డ్యాన్స్‌ను తప్పుబట్టారు. అలా అవమానకర రీతిలో నృత్యం చేయడం ద్వారా 'బ్రిజ్‌భూమి' ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన ఈ పార్టీ నంబర్‌ను సరేగమ మ్యూజిక్ 'మధుబన్' పేరుతో బుధవారం (డిసెంబర్ 22) విడుదల చేసింది. ఈ పాటలో కృష్ణుడు, రాధల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసేలా ఉండగా.. సన్నీ లియోన్ బాడీ మూమెంట్స్ హిందూ మనోభావాలను కించపరిచేలా ఉందని నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. 1960లో కోహినూర్ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ పాటను రీమేక్ చేశారు.
ఇదీ చదవండి: సన్నీ లియోన్ లుంగీ డ్యాన్స్ చూశారా?.. స్టెప్పులు అదిరాయిగా!
Comments
Please login to add a commentAdd a comment