Priest
-
రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత
అయోధ్య: యూపీలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని ఎస్‌జీపీజీటీలో చేర్చారు. ఆయన డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు. ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిశారు. దాస్ తన 20 వ ఏట ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కాయి. నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు. నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్ సమాచారం అందించేవారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చివేసింది. మసీదు కూల్చివేత అనంతరం కూడా దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.ఇది కూడా చదవండి: మస్క్‌కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్ -
పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన
ఉదయపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి భీభత్సం కొనసాగుతోంది. తాజాగా గోగుండాలో ఒక పూజారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పూజారి మృతిచెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ చిరుతపులి ఆలయంలోని పూజారిని నోట కరుచుకుని లాక్కుపోయింది.కొద్దిసేపటికి ఆలయానికి కొంత దూరంలో పూజారి మృతదేహం స్థానికులకు కనిపించింది. నిత్యం చిరుతపులి దాడులతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు. గడచిన 10 రోజుల్లో చిరుత ఆరుగురిపై దాడి చేసింది. ఇదేవిధంగా గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిరుతపులి దాడిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు బాయి(65) ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. స్థానికులు అడవిలో గట్టు బాయి మృతదేహం కనిపించింది.మరోవైపు గోగుండ అడవుల్లో ఒక చిరుతపులి అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి దాడుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇటీవల ఐదేళ్ల బాలిక చిరుతపులి దాడిలో మృతి చెందింది. సూరజ్ (5) అనే బాలికను చిరుత నోట కరచుకుని, పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గ్రామస్తులు ఆ బాలిక కోసం వెతకగా, ఆ చిన్నారి మృతదేహం వారికి లభ్యమైంది.ఇది కూడా చదవండి: AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి -
అయోధ్య పూజారులకు, సిబ్బందికి జీతాలు పెంపు
ఈ ఏడాది జనవరిలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువయ్యాడు. అదిమొదలు అయోధ్యకు భక్తుల తాకిడి అధికమయ్యింది. తాజాగా అయోధ్య రామాలయంలోని ప్రధాన అర్చకునితో పాటు శ్రీరాముని సేవలో నిమగ్నమైన సహాయ అర్చకులు, సేవాదార్లకు జీతాలను పెంచారు.రామాలయంలోని ప్రధాన అర్చకుడి జీతం రూ.3500 పెంచగా, సహాయ అర్చకులు, సేవాదార్ల వేతనాలు కూడా పెంచినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు 20 మంది పూజారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అర్చకులను నియమించాల్సిన ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.దీంతో వారికి రామమందిర్ ట్రస్ట్ 15 రోజల పాటు సెలవు ఇచ్చింది. కాగా జీతాల పెంపు నేపధ్యంలో పూజారులంతా రామమందిర ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రామమందిరం ట్రస్ట్ ప్రధాన అర్చకుడి వేతనాన్ని రూ.3500 పెంచగా, సహాయ పూజారి వేతనాన్ని రూ.2500 పెంచారు. అదేవిధంగా కొఠారీ, భండారీల జీతాలను కూడా పెంచారు. -
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్షీకాంత్ కన్నుమూత
అయోధ్యలోని రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్య లక్షీకాంత్ దీక్షిత్ (90) వారణాసిలో కన్నుమూశారు. నేడు(శనివారం) మణికర్ణికా ఘాట్‌లో ఆచార్య లక్ష్మీకాంత్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆచార్య లక్ష్మీకాంత్ మృతి చెందారనే వార్త తెలియగానే కాశీ, అయోధ్యలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో లక్ష్మీకాంత్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలో ఉంటోంది.లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు. -
రామ్ లల్లాకు ఒక గంట విశ్రాంతి!
జనవరి 23న అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహోత్సవాన్ని తిలికించేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు వచ్చిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. అలాగే బాల రాముని దర్శనం కోసం బారుల తీరే భక్తుల సంఖ్య కూడా ఎక్కువ కావడంతో నిర్విరామంగా దర్శనాలకు అవకాశం ఇచ్చారు. అలాగే రోజు చేసే కైంకర్యాలు, వీటికి తోడు భక్తుల దర్శనలతో బాల రామునికి క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. దీన్ని గుర్తించిన ఆలయ ట్రస్ట్ బాలరామునికి ఒక గంట విశ్రాంతి ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. రాముడు ఇక్కడ ఐదేళ్ల పిల్లవాడని అందువల్ల ఆయన అధిక ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదని ఆలయ పూజారులు అన్నారు. అందువల్ల రామ్ లల్లాకు ఒక గంట బ్రేక్ ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు. ఈమేరకు ఈ కొత్త షెడ్యూల్ శుక్రవారం నుంచి అమలవుతుందని ప్రకటించింది ఆలయ ట్రస్ట్. అలాగే ఆలయ రోజువారీ కైంకర్యాల కోసం రాముల వారిని ఉదయం నాలుగు గంటలకే లేపడం నుంచి మొదలై రాత్రి 10 గంటలతో దర్శనాలు ముగుస్తాయి. అలాగే సాయంత్రం రాముల వారికి చేసే ఆచారాల కోసం మరో రెండు గంటలు సమయం కేటాయించారు. ఇలా రాముడు 18 గంటల పాటు ఒత్తడికి గురిచేస్తే తట్టుకోలేరని అన్నారు ఆలయ ట్రస్ట సభ్యులు సత్యేంద్ర దాస్ అన్నారు. ఆయన బాల రాముని సౌకర్యార్థం మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు విరామం ఇస్తే ఆయన విశ్రాంతి తీసుకుంటారని అన్నారు సత్యేంద్ర దాస్. (చదవండి: ఇవాళ నుంచే తాజ్ మహోత్సవ్ ప్రారంభం! ఎన్ని రోజులు జరుగుతుందంటే..) -
మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం
పాట్నా: బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్‌కి పూజ కోసం వెళ్లిన మనోజ్ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్‌ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు. ఈ వార్త తెలవడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్‌ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
పోలీస్ స్టేషన్ లో పూజారి ఫన్నీ పూజ
-
వినాయకుని పూజ చేసి ఇంటికి వెళ్తూ..
కరీంనగర్‌రూరల్: ఎనిమిది రోజులపాటు వినాయకుడికి నిష్టతో రెండుపూటల పూజలు చేసిన ఓ పూజారి నిమజ్జనోత్సవం బుధవారం రాత్రి చివరిపూజచేసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన తిరువరంగం పాపయ్యశాస్త్రి(45) పూజారిగా పనిచేస్తున్నాడు. గణపతి నవరాత్రుల్లో భాగంగా చెర్లభూత్కూర్‌లోని వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహిస్తున్నాడు. చివరిరోజు బుధవారం రాత్రి వినాయకుడి పూజలు పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై ఇరుకుల్లకు బయల్దేరాడు. చెర్లభూత్కూర్ నుంచి మొగ్ధుంపూర్ రోడ్డుపైకి వచ్చిన ఆయన వెహికిల్‌ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య వనజ, కుమారుడు భరద్వాజ్, కూతురు హోత్రి ఉన్నారు. -
పెళ్లి పీటలపై పంతులుకి షాకిచ్చిన పెళ్లి జంట..
-
‘ధూపదీప నైవేద్యం’ రూ.10 వేలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు. అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు. -
పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్ రేసర్!
ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉన్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి. వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్ పగలు ఆలయంలో పూజరిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌పల్స్ 200 మోటార్ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్, బూట్లు, హెల్మెట్ ధరించి ఓ రైసర్లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావంతుడు. Temple priest at dawn, dirtbike racer by dusk.Meet Unnikrishnan (34), melshanti of Pudhukkulamgara Devi temple in Kottayam, Kerala, an avid motorcross rider who recently raced in INRC 2023 in Coimbatore. A former IT engineer, this priest-racer is training for a race in Bengaluru pic.twitter.com/9c3TJ2WtKl— Petlee Peter (@petleepeter) August 14, 2023 2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023లో మోటార్ సైక్లింగ్‌లో లైసెన్స్ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రేసర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్ చూస్తే..అభిరుచికి లిమిట్స్ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ. (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
కర్ణాటకలో ఘాతుకం.. మైనర్ బాలికపై..
బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గలో ఒక చర్చి ప్రతినిధి తన కళాశాలలో విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి రాగా గురువారానికి ఫెర్నాండెస్ ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. శివమొగ్గలోని ఓ చర్చిలో పనిచేస్తోన్న ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ చర్చి అనుబంధ కాలేజీలో చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతొ వేధింపులకు గురిచేస్తున్నట్లు స్థానిక కోటె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాలిక తలిదండ్రులు. పోలీసులు ఫ్రాన్సిస్ ఫెర్నాండెస్ పై పోక్సో చట్టం తోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచి రిమాండుకు తరలించారు. విషయం తెలుసుకున్న మైనర్ బాలిక బంధువులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు తరలి వచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశాడు. ఇది కూడా చదవండి: డేరా బాబా జైల్లో తక్కువ.. బయట ఎక్కువ.. -
నదిలో కొట్టుకుపోయిన పూజారి
కర్ణాటక: నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి అర్చకుడు మృతి చెందిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా కమలశీలలో జరిగింది. శేషాద్రి ఐతాళ్ (75) బుధవారం ఉదయం కమలశీల గుడికి వెళ్లాడు. పక్కనే ఉన్న కుబ్బా నదిలో నీరు తేవడానికి వెళ్లి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. నూరు మీటర్ల దూరంలో శవం బయట పడింది. వర్షంలోనే లైన్‌మ్యాన్ మరమ్మతులు దక్షిణ కన్నడ జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వానలు పడుతున్నాయి. పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మంగళూరు సమీపంలోని దేరళకట్టలో కరెంట్ వైర్లు తెగిపోయి 40 శాతం ఇళ్లకు కరెంట్ కట్ అయ్యింది. వర్షంలోనే లైన్‌మ్యాన్ మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
అర్చకులకు రూ.10 వేల గౌరవ వేతనం
వర్ధన్నపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని మన్నా ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహర్దశ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లి విరుస్తోందన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మునిసిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణ, వార్డు కౌన్సిలర్లు తుమ్మల రవీందర్,తోటకూరి రాజమణి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంద గ్రామంలోని శ్రీరామలింగేశ్వర, లక్ష్మి నర్సింహస్వామి ఆలయాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్, పిట్టల జ్యోతి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఆశీ ర్వదించి స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు. -
HYD: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ఓ పూజారి హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పూజారి సాయికృష్ణ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇది వరకే అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు కాగా, అప్సర అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సరూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చిన సాయికృష్ణ.. శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోదీ హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి మ్యాన్ హోల్లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జీఐ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు పోలీసులు బయటపెట్టారు. నిందుతుడికి ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉందని, ఈనెల 3 తేదీన హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: హైదరాబాద్ యువతి హత్య కేసు.. అపార్ట్మెంట్లో ఆ రోజు ఏం జరిగింది? -
పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..
పూరి జగన్నాథుడి ఆలయంలో ఎలుకల సమస్య అర్చకులను, ఆలయ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ఎలుకల నివారణ కోసం అధికారులు యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే దీనిని పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కారణం రాత్రిపూట ఆలయంలోని దేవుళ్ల నిద్రకు భంగం ఏర్పడుతుందని వ్యతిరేకిస్తున్నారు పూజార్లు. ఆ యంత్రాలు చేసే హమ్మింగ్ వల్ల దేవుడి నిద్రకు భంగం అని జగన్నాథుడి అర్చకులు చెబుతున్నారు. ఎప్పటి నుంచే ఆలయంలో ఎలుకల సమస్య ఎక్కువగా ఉందని అర్చుకులు మొరపెట్టడంతో.. ఓ భక్తుడు ఈ ఎలుకల నివారణ యంత్రాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. కానీ దీన్ని అర్చకులు వ్యతిరేకించడంతో ఆ యంత్రాలను తీసేశారు. పైగా ఏళ్ల నుంచి అనుసరించే విధానంలోనే ఎలుక బోనులను ఏర్పాటు చేసి..వాటిని సజీవంగా పట్టుకుని బయట వదిలేస్తామని అంటున్నారు అర్చకులు. ఆలయంలో ఎలుకల మందు ఉపయోగించే అనుమతి లేదని ఆలయ నిర్వాహకుడు జితేంద్ర సాహు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ఎలుకలు చెక్కతో ఉండే పూరిజగన్నాథుడి దేవత విగ్రహాలను పాడు చేశాయని అర్చకులు తెలిపారు. ఆలయ రాతి అంతస్థల్లోని ఖాళీల్లో ఆవాసం ఏర్పరుచుకోవడంతో గర్భగుడి నిర్మాణం దెబ్బతింటుందని ఆలయ నిర్వాహకులు భయపడుతున్నారు. ఈ ఎలుకలు గర్భగుడిని మలమూత్రాలతో పాడు చేయడంతో ప్రతిరోజు పూజాదికాలు నిర్వహించేటప్పడుడూ.. చాలా ఇబ్బందిగా ఉంటోందని అర్చకులు ఆవేదనగా చెబుతున్నారు. (చదవండి: ఏనుగుకి రూ. 5 కోట్ల ఆస్తి.. అదే ఆయన ఉసురు తీసింది) -
శివయ్యా.. నా వల్ల కాదయ్యా!
సాక్షి, ఖమ్మం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల నుంచి ఆలయ నిర్వహణ నిధులు రాకపోవడంతో శివరాత్రి వేడుకలు నిర్వహించలేనంటూ నేలకొండపల్లిలోని శ్రీ ఉత్తరేశ్వరస్వామి దేవాలయం అర్చకుడు కొడవటిగంటి నరసింహారావు అధికారులకు మొర పెట్టుకుంటున్నాడు. ఆలయం పేరిట 1996వ సంవత్సరం వరకు 23 ఎకరాల భూమి ఉండగా, స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నిధులు సమకూర్చలేదు. ఆతర్వాత ఆదాయం పడిపోయి అర్చకుల వేతనాలు నిలిపేయడంతో 2018లో నరసింహారావు హైకోర్టును ఆశ్రయించగా, భూమి విలువతో పాటు వడ్డీ కలిపి రూ.51 లక్షలను బ్యాంక్‌లో ఫిక్స్డ్ చేశారు. అయినప్పటికీ నాలుగేళ్ల నుంచి అర్చకుడికి వేతనం రాకపోగా, దీప, ధూప నైవైద్యం నిధులు కూడా ఇవ్వడంలేదు. దీంతో కుటంబ పోషణే కష్టంగా మారిన నేపథ్యాన శివరాత్రి వేడుకలు చేయడం సాధ్యం కాదంటూ నరసింహారావు బుధవారం తన గోడు వెళ్లబోసుకున్నాడు. -
స‘లక్ష’ణంగా త్రివర్ణ శోభితం!
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి(రామం). గతంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు తెలిపాడు. -
అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: అర్చకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అర్చక సంక్షేమంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు తిరిగి చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా అధికారులను మంత్రి ఆదేశించారు. అర్చకుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అర్చకులకు వంద శాతం వైద్య ఖర్చులు చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. దీని ద్వారా అర్చకులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. చదవండి: కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్ -
పూజారిపై ఉమ్మిన మహిళ.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన సిబ్బంది
సాక్షి, బెంగళూరు: మహిళపై ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. బెంగళూరు గుడిలో నుంచి ఓ మహిళను బలవంతంగా బయటకు గెంటేశారు ఆలయ సిబ్బంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటనలో బాధితురాలు అమృతహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో మహిళను కొట్టి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో తాజాగా వైరల్‌గా మారింది. ఇందులో ఆలయం లోపల ఉన్న ఓ మహిళను ఆలయ సిబ్బంది బయటకు నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రతిఘటించడంతో చెంపదెబ్బ కొట్టాడు. అయినా బయటకు వచ్చేందుకు నిరాకరించగా.. మహిళ మెడ పట్టుకొని లాక్కొచ్చాడు. జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. అప్పటికీ మహిళ మొండిగా ప్రవర్తించడంతో ఆమెను కొట్టేందుకు ఐరాన్ రాడ్‌ను కూడా తీసుకొచ్చాడు. అయితే పూజారి అడ్డుకోవడంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కాగా మహిళ ఆలయ సిబ్బంది అంత దారుణంగా ప్రవర్తించడం వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు గుడికి వెళ్లి వెంకటేశ్వరుని భార్యనని చెప్పుకుంటూ.. స్వామివారి విగ్రహం పక్కనే కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు పూజారి అనుమతించలేదు. దీంతో మహిళ పూజారిపై ఉమ్మింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మహిళను జుట్టు పట్టుకొని గుడి నుంచి బయటకు తోసేశారు. అయితే సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఆలయ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. చదవండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజారమ్మ.. అమ్మవారే స్వయంగా!
సరస్వతీ పరమేశ్వర్ బాగావలే... అతి సాధారణ మహిళ. సమాజం స్త్రీ కోసమే నిర్మించిన ఆంక్షల వలయాన్ని ఛేదించింది. ఇందుకోసం ఆమె పోరాటం చేయలేదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని స్వీకరించింది. చేపట్టిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తోంది. అంబా ఆరోగ్యభవాని ఆలయంలో పూజాదికాలు నిర్వర్తిస్తోంది. అమ్మ పిలిపించుకుంది సరస్వతి పరమేశ్వర్ వయసు 36. ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి ఆలయం ప్రాంగణంలోనే జీవిస్తోంది. రోజూ ఉదయాన్నే ఆలయం ఆవరణ శుభ్రం చేయడం, స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆరోగ్యభవాని విగ్రహంతో సహా ఆలయం లోపల శుభ్రం చేయడం, విగ్రహాలను అలంకరించడం, ఆ తర్వాత వంట చేసుకుని వచ్చి ఆరగింపు సేవ చేయడంతో శుభోదయ సేవలు పూర్తవుతాయి. సాయంత్రం ఐదు గంటలకు మరోసారి పూజ చేసి, చపాతీలు చేసుకుని వచ్చి పటిక బెల్లంతో నివేదన చేస్తానని చెప్పింది. ‘‘నాలుగేళ్ల కిందట కొందరు ఊరి పెద్దలు వచ్చి ఆలయంలో పూజాదికాలు ఎవరు చేస్తారని అడిగారు. అప్పటివరకు పూజలు చేస్తున్న పూజారి బాగా వృద్ధులయ్యారు. వాళ్ల పిల్లలు వచ్చి తాము నివసించే పట్టణానికి తీసుకెళ్లిపోయారు. ఇక ఆయన కుటుంబం నుంచి పూజ చేయడానికి ఎవరూ లేరు. దాంతో మరొకరిని నియమించడానికి అందరినీ అడిగారు. అప్పుడు నేను ఆడవాళ్లు కూడా రావచ్చా అని అడిగాను. ఆ తర్వాత వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని ‘అమ్మవారే స్వయంగా నిన్ను పిలిపించుకుంటుందేమో...’ అని నన్ను పూజారిగా నియమించారు. భూగర్భంలో మరో ఆలయం మరాఠీ యూ ట్యూబర్లు వచ్చి ఈ ఆలయాన్ని వీడియోలు తీసుకుంటున్నారు. ఈ ఆలయంలో ఈ మాత కింద భూగర్భంలో మరో గుడి ఉంది. ఇక్కడ ఉన్న జాలీ తొలగించి మెట్ల నుంచి కిందకు వెళ్తే కనిపిస్తుంది. భూగర్భంలో ఉన్న ప్రతిమలు ఇక్కడ కనిపిస్తాయి చూడండి’’ అంటూ సీసీ టీవీ చూపించింది. ‘భక్తులు కిందకు వెళ్లి చూడవచ్చు’ అని మెష్ అమర్చిన ఉడెన్ ఫ్రేమ్‌ను తొలగించింది. కిందకు దిగితే అక్కడ మరో చిన్న ఆలయమే ఉంది. అందులో పూజాదికాలు కూడా సరస్వతి చేతుల మీదుగానే జరుగుతాయి. తనకు సాధ్యం కాని రోజుల్లో తన కూతురు పూజ చేస్తున్నట్లు చెప్పిందామె. ఇక్కడ ఏ ఉద్యమమూ జరగలేదు, కానీ ఒక అవసరం సమాజపు ఆధిపత్య గిరిగీతను తుడిచివేసింది. సరస్వతి పూజ చేస్తున్న ఆలయం మహారాష్ట్ర, బీడ్ జిల్లాలో ఉంది. మనకు సులభంగా తెలియాలంటే... ద్వాదశ జ్యోతిర్లింగం పర్లి వైద్యనాథ్ ఆలయం ఆధారంగా చెప్పుకోవాలి. వైద్యనాథ ఆలయం ఉన్న పర్లి పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చాందాపూర్ గ్రామంలో ఉంది సరస్వతి చేతుల మీదుగా పూజలందుకుంటున్న ఆరోగ్యభవాని ఆలయం. – వాకా మంజులారెడ్డి చదవండి: యాకమ్మ.. ఒక గొప్ప వెలుగు -
చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే..
సాక్షి, జగిత్యాల: నవరాత్రులు అమ్మవారికి నిత్యపూజలు చేశాడు.. ఆమె ధ్యాసలోనే గడిపాడు.. కాలువలో జారిపడినా.. ఆ దేవతా విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.. చివరిశ్వాస వరకూ అమ్మవారినే నమ్ముకుని తన ప్రాణాలు అర్పించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో బుధవారం గల్లంతైన పూజారి సుమారు పది కిలోమీటర్ల మేర అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టక కొట్టుకుపోయాడు.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన పూజారి బింగి ప్రసాద్(46) ఈనెల 5న దుర్గాదేవి నిమజ్జనం కోసం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లాడు. తొలుత ఇటీవల ఓ భక్తుడు సమర్పించిన వెండి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు కాలువలోకి దిగాడు. విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన యువకులు కాలువలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. తర్వాత పూజారి కోసం శుక్రవారం వరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. ఈక్రమంలో చొప్పదండి మండలం రేవల్లెలో ఎస్సారెస్పీ కాలువ గేట్ల వద్ద పూజారి శవమై కనిపించాడు. పది కి.మీ. అమ్మవారి విగ్రహంతోనే.. ప్రసాద్ రెండు దశాబ్దాలుగా పౌరోహిత్యం చేస్తున్నారు. జాతకాలు చూస్తున్నారు. వాస్తుదోషంలోనూ ఆరితేరాడు. కరీంనగర్, వరంగల్, ధర్మపురి వంటి దూరప్రాంతాల ప్రజలకూ సుపరిచితులు. తాటిపల్లి మార్కండేయ ఆలయంలో దశాబ్దకాలంగా అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేస్తున్నాడు. నిత్యం అమ్మవారి ధ్యానంలోనే ఉంటున్నాడు. ఉపవాస దీక్ష చేపడుతూ ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నాడు. ఈక్రమంలో ఎస్సారెస్పీ కాలువలో జారిపడి సుమారు 10కి.మీ. మేర కొట్టుకుపోయినా చివరిశ్వాస వరకూ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టలేదు. పాక్షికంగా ఈత వచ్చినా, అమ్మవారి ఒడిలో చివరిశ్వాస విడిచాడు. స్థానికులు రేవల్లె వద్ద మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ప్రసాద్‌కు నడుముకు అమ్మవారి విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహానికి రేవల్లె వద్ద పోస్టుమార్టం నిర్వహించి, తాటిపల్లికి తరలించి, దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య మంజుల, కూతురు, కుమారుడు ఉన్నారు. -
యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం
ఇంకా కొన్నిచోట్ల అమాయక భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు వారిచే అమానుష పనులు చేయిస్తున్నారు. మనల్ని మనం ఆత్మర్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని, లేదా శరీరా భాగాలను దేవుడికి సమర్పిస్తే కనిపిస్తాడంటూ కొందరు స్వామీజీలు, బాబాలు తమ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు ఒక పూజారి మాయ మాటలు నమ్మి...ఒక పిచ్చిపని చేయబోయాడు. కానీ పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు మాయమాటలు నమ్మి ఒక యువకుడు దారుణమైన పనికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉన్నావ్‌లోని తాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభమ్ గోస్వామీ అనే యువడకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని ఆ సమాధి నుంచి బయటకు తీసి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్ గోస్వామీ మరొకందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు. ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్ దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు. (చదవండి: అది రిసార్టు కాదు ..వ్యభిచార కూపం) -
పాము కాటుకు పురోహితుడు బలి.. రెండుసార్లు కాటువేసినా చంపకుండా..
కృత్తివెను (కృష్ణా జిల్లా): పాము కాటుకు పురోహితుడు బలైన ఘటన కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు (48) పౌరోహిత్యం, వాస్తుశాస్త్రం చెబుతూ జీవనం సాగిస్తారు. శనివారం మధ్యాహ్నం పీతలావ గ్రామంలోని ఓ రొయ్యల మేత షెడ్డులో పాము ఉందన్న స్థానికుల సమాచారంతో నాగబాబు వెళ్లాడు. తాచుపామును పట్టుకున్న వెంటనే ఆయన చేతిపై రెండుమార్లు కాటు వేసింది. అయినప్పటికీ పామును విడిచిపెట్టకుండా సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు. తరువాత తనకు తెలిసిన సొంత వైద్యం చేసుకుని వెంటనే మచిలీపట్నంలోని హాస్పిటల్‌కు వెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఆయన మృతదేహాన్ని వేలాది మంది సందర్శించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాము కాటు వేసినా కానీ దానికి ఎటువంటి హాని చేయకుండా సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టడం ఆయనకు మూగజీవాలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని ప్రజలు చర్చించుకున్నారు. నాగబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగబాబు తండ్రి కొండూరి గోపాలకృష్ణ శాస్త్రి ఎన్నో ఏళ్లుగా పౌరోహిత్యం చేసుకుంటూ, పాము, తేలు కాటుకు నాటు వైద్యం చేసేవారు. ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వీరు పాముకాటుకు విరుగుడు వేస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. శాస్త్రి మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు నాగబాబు పాముకాటుకు మంత్రం వేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన పాముకాటుకు గురై మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. చదవండి: (మంత్రి విశ్వరూప్‌కు సీఎం జగన్ పరామర్శ) -
కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. 47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. అయితేఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డానేది ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి -
వివాదంలో జొమాటో యాడ్.. హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
Hrithik Roshan Zomato Ad Get Angers Mahakaleshwar Temple Priests: బాలీవుడ్ హీరోలను చూస్తుంటే జాలి వేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్లు ఏం ముట్టుకున్న, పట్టుకున్న పెద్ద వివాదమై కూర్చొంటుంది. ఇప్పటికే హిందీ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, దేవుళ్లపై నమ్మకం లేదు, బాయ్‌కాట్ బాలీవుడ్ అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ ట్రెండ్‌తో అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా', అక్షయ్ కుమార్ 'రక్షా బంధన్', తాప్సీ 'దొబారా' కలెక్షన్లు రాక విలవిల్లాడాయి. విడుదలైన వాటిని పక్కన పెడితే రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలు, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న చిత్రాలను సైతం బాయ్‌కాట్ అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. ఈ చిత్రాల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ చిత్రం 'విక్రమ్-వేద' కూడా ఉంది. అయితే ఇప్పుడు హృతిక్ రోషన్ చేసిన పనితో ఈ బాయ్‌కాట్ ట్రెండ్ ఇంకా ఎక్కువ ప్రభావం చూపేలా ఉంది. ఇంతకీ హృతిక్ రోషన్ చేసిన పని ఏంటంటే? ప్రముఖ ఫుడ్ డెలీవరి యాప్ జొమాటో యాడ్‌లో నటించడమే. ఇటీవల జొమాటో ఫుడ్ డెలీవరి యాప్ హృతిక్ రోషన్‌తో ఒక యాడ్ షూట్ చేసి బయటకు వదిలింది. ఈ యాడ్‌లో హృతిక్ చెప్పిన డైలాగ్‌లు, చూపించిన పేర్లు వారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని సదరు మతస్థులు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా? ఈ యాడ్‌లో కమాండో అయిన ఆకలి వేసి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాడు. మిగతా కమాండోలు 'ఈ ఆర్డర్ ఎవరిచ్చారు?' అని అడగ్గా.. 'నేనే. నాకు ఆకలి వేసింది. మనం ఉజ్జయినిలో ఉన్నాం. అందేకే మహాకాల్ నుంచి తాలీ ఆర్డర్ చేశా' అని హృతిక్ రోషన్ అందరికీ చెబుతున్నట్లు ఉంటుంది. ఈ సంభాషణపై ఉజ్జయిని మహాకాళేశ్వరం ఆలయానికి చెందిన పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆలయం నుంచి భక్తులకు, యాత్రికులకు తాలీ అనే పేరుతో ప్రసాదాన్ని అందిస్తారు. అయితే అందులో మహాకాళేశ్వరం ఆలయాన్ని కాకుండా మహాకాల్ రెస్టారెంట్‌ను చూపించలేదు. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం మహాకాల్ అనేది పరమ శివునికి మరో పేరు. హిందువులు పూజించే పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వరం ఆలయం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. అలా ఎంతో పవిత్రంగా భావించే తాలీ ప్రసాదాన్ని ఫుడ్‌గా, అలాగే మహాకాళేశ్వరం ఆలయాన్ని రెస్టారెంట్‌గా పేర్కొని పంపిణీ చేసినట్లుగా చిత్రీకరించడం పట్ల ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 'హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పాలి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు 'బాయ్‌కాట్ జొమాటో' అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పలువురు నెటిజన్లు సైతం ఈ యాడ్‌పై అసహనం వ్యక్తం చేశారు. వారికి (బాలీవుడ్ వాళ్లకు) సనాతన ధర్మాలపై గౌరవం లేదంటూ ఒకరు అంటే, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా చిత్రీకరించిన ఆ ప్రకటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు డిమాండ్ చేశారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు ఈ గొడవపై జొమాటో తాజాగా స్పందించింది. 'ఇదంతా లోకల్ రెస్టారెంట్లను ప్రమోట్ చేసే పాన్ ఇండియా క్యాంపెయిన్‌లో భాగం. ఉజ్జయినిలో జొమాటోకు మహాకాల్ రెస్టారెంట్ నుంచి తరచూ అత్యధిక ఆర్డర్లు వస్తాయి. అలాగే అక్కడి మెనూలో తాలీ పేరుతో ఫుడ్ ఐటమ్ కూడా ఉంది. ఆ ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటారు' అని ట్విటర్ హ్యాండిల్లో పేర్కొంది జొమాటో. ఇదంతా చూస్తుంటే పాపం హృతిక్ రోషన్ అనిపిస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సినిమాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. చదవండి: నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ Logically looking at the biased history of @deepigoyal's @zomato, none can negate that @iHrithik's ad trivializing Bhagwan #Mahakal was a deliberate attempt to demean Hindu Dharma thereby hurting Hindus' sentiments. O Hindus, its high time to resort to financially #BoycottZomato pic.twitter.com/BgbATbiKcZ — Sanatan Prabhat (@SanatanPrabhat) August 21, 2022 -
అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల
సాక్షి, అనంతపురం (డి.హీరేహాళ్, రాయదుర్గం): జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేన రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. స్వయాన ఆయన భార్య స్రవంతి మంగళవారం మీడియాకు ఆధారాలు అందజేశారు. ఆమె తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన స్రవంతికి డి.హీరేహాళ్ మండలంలోని మురడి అంజన్న ఆలయ అర్చకుడు అనంతసేనతో 2008 సంవత్సరంలో వివాహమైంది. ఇద్దరు పిల్లలు జన్మించే వరకు వారి సంసారం సాఫీగా సాగింది. తర్వాత అనంతసేన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆలయానికి వచ్చే మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల వేసేవాడు. ఈ క్రమంలో కొందరిని లొంగదీసుకుని రాసలీలలు సాగించాడు. మరోవైపు భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి గెంటేసేందుకు ప్రయత్నించాడు. ఆలయానికి వచ్చే మహిళలు ఎంతో అందంగా ఉంటారని, నీవు మాత్రం వారిలా లేవంటూ తరచూ మనోవేదనకు గురిచేసేవాడు. అతని వేధింపులు ఎక్కువ కావడంతో స్రవంతి ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ పెద్దలు సర్దిచెప్పి కాపురానికి పంపారు. తర్వాత అతని సెల్ఫోన్లో వీడియోలు, ఫొటోలు చూసి ఆమె విస్తుపోయింది. పరాయి మహిళలతో రాసలీలల వ్యవహారంపై భర్తను నిలదీసింది. అయినా అతను పద్ధతులు మార్చుకోలేదు. పైగా భార్యను అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. ఈ విషయం తెలిసి ఆమె పిల్లల సహా రాత్రికి రాత్రే పుట్టింటికి వెళ్లిపోయారు. తర్వాత అతను స్రవంతికి మతిస్థిమితం లేదంటూ విడాకుల నోటీసు పంపించాడు. పెద్దమనుషుల సమక్షంలో ఘర్షణ విడాకుల నోటీసు విషయంపై మాట్లాడేందుకు స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం మురడికి వచ్చారు. ఈ సందర్భంగా అర్చకుడు అనంతసేనను నిలదీశారు. అలాగే అతను ఇతర అమ్మాయిలను ముద్దు పెడుతూ అభ్యంతరకరంగా దిగిన ఫొటోలను పెద్ద మనుషుల సమక్షంలో చూపడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. పోలీసులు, పెద్దలే తనకు న్యాయం చేయాలని స్రవంతి వేడుకున్నారు. అనంతరం ఆమె రాయదుర్గం రూరల్ సీఐకు ఫిర్యాదు చేశారు. -
వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ..
స్మార్ట్ ఫోన్లు వచ్చేశాక ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఇలాంటి ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా చాలామంది మూడనమ్మకాలను విశ్వసిస్తున్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఈ మూఢనమ్మకాల పేరిట చేస్తున్న హింసాత్మక ఆచారాలను కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికి పాటిస్తున్నారు. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే చదువుకున్న కొంతమంది కూడా వాటిని నమ్ముతుండటం కాస్త విస్మయానికి గురి చేస్తుంది. అచ్చం అలానే ఇక్కడొకప్రాంతంలో ఆచారం పేరిట మహిళలను కొరడాతో హింసిస్తుంటారు. వివరాల్లోకెళ్తే...తమిళనాడులోని నమక్కల్ జిల్లాలోని ఒక పూజారి ‘కాటేరి’(చెడును దూరంగా ఉంచమని ప్రార్థించే దేవత)లా నల్లని దుస్తులను ధరించి మహిళలపై కొరడాతో కొడుతుంటాడు. ఆ పూజారి దృష్టిలో వాళ్లంతా చేతబడికి గురయ్యారని అర్థం. ఇతను అలా కొరడాతో కొడుతుంటే చుట్టు ఉన్న చుట్టు ఉన్న ప్రజలు ఈలలు వేస్తూ, అరుస్తే ఉత్సాహపరుస్తుంటారు. సదరు మహిళ ఆ పూజారికి చేతులెత్తి నమస్కరిస్తుంటే పూజారి దుష్టగాలి సోకకుండా ఉండేదు కోసం వారిని కొరడాతో కొడుతుంటాడు. తాజా ఘటన నమక్కల్ జిల్లా వర్దరాజపెరుమాళ్ చెల్లియమ్మన్ మారియమ్మన్ ఆలయంలో చోటుచేసుకోవడంతో..అది వైరల్ అయ్యింది. ఐతే పూజారి ఇలా చేస్తే తమకెంతో మేలు జరుగుతుందని ప్రజలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి రెండు వర్గాల మధ్య గొడవ కారణంగా గత 20 ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరగలేదు. మళ్లీ ఇప్పుడే ఈ ఆలయంలో తొలిసారిగా ఈ వింత ఆచారానికి సంబంధించిన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నెల రోజులు పాటు నిర్వహిస్తారు. (చదవండి: పెళ్లైన కాసేపటికే వరుడికి షాకిచ్చి వధువు.. ఇజ్జత్ మొత్తం పోయింది) -
పోక్సో చట్టం కింద పూజారికి పదేళ్ల జైలు
విశాఖ లీగల్: బాలికను మోసగించి మాయమాటలతో వివాహం చేసుకుని లైంగికదాడికి పాల్పడిన యువకుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నగరంలోని పొక్సో నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. జైలుశిక్షతోపాటు రూ.20వేల జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అదనంగా ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆ తీర్పులో స్పష్టం చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పుల్లకందం సతీష్‌కుమార్ విజయనగరం జిల్లా జియ్యమ్మవలసకు చెందినవాడు. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో పూజారి. బాధిత బాలిక విశాఖలోని గాజువాక నియోజకవర్గ పరిధి పెదగంట్యాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివేది. ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్ 30న బాలిక తమ బంధువుల ఇంట్లో వివాహానికి విజయనగరం వెళ్లింది. పెళ్లిలో సతీష్‌కుమార్ బాలికను చూశాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. బాలిక విజయనగరంలోని సతీష్ ఇంటికి వెళ్లగా ఇద్దరూ గుడిలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం అన్నవరంలో కొన్ని రోజులు గడిపారు. ఈ క్రమంలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తగిన సమాచారంతో సతీష్‌ని, బాధితురాలిని పట్టుకున్నారు. అనంతరం వివాహానికి సహకరించిన సతీష్ తల్లి పుల్లకందం గిరిజ, సోదరుడు పుల్లకందం సంతోష్‌కుమార్‌పై కూడా కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో లైంగికదాడికి సహకరించిన వారిద్దరికీ ఐపీసీ సెక్షన్ 366 కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేలు చొప్పున జరిమానా విధించారు. సతీష్, అతని సోదరుడు, తల్లిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. (చదవండి: భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం) -
మల్కాజ్గిరి మహిళ హత్య కేసులో ట్విస్ట్.. గర్భగుడిలోనే చంపేశాడు
సాక్షి, మల్కాజిగిరి:అదృశ్యమై..ఆపై శవంగా మారిన ఉమాదేవి హత్య కేసులో ఆలయ పూజారితో పాటు, నగల దుకాణం యజమానిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుడి దర్శనానికి వచ్చిన ఆమెను గుడి పూజారి గర్భగుడిలో రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్‌డ్రమ్ములో కుక్కేశాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు.. విష్ణుపురి ఎక్స్టెన్షన్ ప్రాంతానికి చెందిన ఉమాదేవి (56) ఈ నెల 18న ఇంటి సమీపంలోని స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయానికి రోజూలాగానే వెళ్లింది. అయితే తిరిగి రాలేదు. అదే రోజు ఆమె భర్త మూర్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల తర్వాత అదే ఆలయం వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో ఉమాదేవి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికంగా ఉన్న కాలనీవాసులు, కుటుంబసభ్యుల నుంచి సేకరించిన సమాచారంతో ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న అనుముల మురళీకృష్ణ (42) పై దృష్టి సారించారు. సాంకేతిక ఆధారాలతో ఈ నెల 22న మురళీకృష్ణతో పాటు విష్ణుపురికాలనీలో మా భవానీ జువెలర్స్ దుకాణం యజమాని జోషి నంద కిషోర్(45)ను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఉమాదేవి హత్య బయటపడింది. మురళీకృష్ణ నుంచి రెండు బంగారు గాజులు, లక్ష నగదు, నగల దుకాణ యజమాని ఇచ్చిన కెడ్రిట్ కార్డ్స్, జోషి నం చదవండి: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే... పూజారిగా పనిచేస్తున్న మురళీకష్ణ కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల తరచూ నగలు ధరించి వస్తున్న ఉమాదేవిని మురళీకృష్ణ గమనించాడు. ఈ నెల 18న గర్భగుడిలోనే ఆమె తలమీద రాడ్‌తో బలంగా కొట్టి హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా నీళ్ల డ్రమ్ములో శవాన్ని దాచి ఉంచాడని పోలీసులు తెలిపారు. మరుసటి రోజు సంకటహరచతుర్థ్ది ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా హోమం నిర్వహించాడని నిఘా ఉండడంతో రెండు రోజుల తర్వాత 21 వ తేదీ మృతదేహాన్ని ఆలయం వెనుక పడేశాడని పోలీసులు తెలిపారు. -
ఇది నా ఆజ్ఞా యుద్ధం ఆపండి! వైరల్ వీడియో
Russia ruk jaaye, Ukraine jhuk jaaye: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్ అత్యంత దారుణంగా అతలాకుతలమైపోయింది. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిని ప్రపంచ దేశాలు తప్పుపట్టడమే కాక హెచ్చరికలు జారీ చేశాయి. అంతేగాదు ఆర్థిక ఆంక్షలను కూడా విధించాయి. అయినా రష్యా వాటిని లక్ష్యపెట్టక ఉక్రెయిన్ పై బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది. దీంతో చాలామంది అగ్రనేతలు పలు రకాలుగా రష్యా అధ్యుక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కి నచ్చచెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు కూడా. ఈ నేపథ్యంలో ఒక భారతీయ పూజారి యుద్ధం ఆపమంటూ పుతిన్‌కి వింతైన రీతిలో సందేశం ఇచ్చాడు. అంతేకాదు రష్యా రుక్ జాయే, ఉక్రెయిన్ ఝుక్ జాయే(రష్యా యుద్ధం ఆపాలి, ఉక్రెయిన్ తప్పు చేసింది కాబట్టి క్షమించాలి) అంటూ తనదైన రీతిలో పిలుపు నిచ్చాడు. రష్యా గొప్పది కాబట్టి యుద్ధం ఆపాలి అని చెబుతూ అందర్నీ ఆకర్షించాడు. అంతేకాదు భారత్ హింసకు స్వస్తి చెప్తి శత్రత్వానికి ముగింపు పలుకుతుంది అని భారతదేశం గొప్పతనాన్ని కూడా వివరించాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. पुतिन,जेलेन्सकी सुन लें- अयोध्या से ऑर्डर हो गया है !! pic.twitter.com/bho9EFR8Og — Gaurav Singh Sengar (@sengarlive) March 3, 2022 (చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!) -
సన్నీపై పూజారుల ఆగ్రహం.. మధు'బ్యాన్' చేయాలని డిమాండ్
Priest Protest Against On Sunny Leone Dance In Madhuban Song: సినిమాలు, సినిమాల్లోని కొన్ని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకుల మనసులకు హత్తుకుపోతాయి. అలాంటి చిత్రాలను ఎంతగానో ఆదరించి సూపర్ హిట్ చేస్తారు ఆడియెన్స్. ఇలా హిట్టు ఇవ్వడమే కాకుండా వారి మనోభావాలను కించపరిస్తే అదే రేంజ్లో ఫట్మనిపిస్తారు కూడా. ఇలా కాంట్రవర్సీల మధ్య చిక్కుకుని ఫట్టయిన సాంగ్స్, సీన్స్, మూవీస్ ఎన్నో ఉన్నాయి. తమ సంస్కృతి మనోభావాలు, ప్రతిష్ట దెబ్బతీసేలా అసభ్యంగా ఉన్నాయని విరుచుకుపడిన వారూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ సన్నీ లియోన్ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఇటీవల సన్నీ లియోన్ నటించిన 'మధుబన్ మే రాధిక నాచే' వీడియో ఆల్బమ్ విడుదలైంది. ఇందులో సన్నీ హాట్ హాట్‌గా పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ పర్ఫామెన్సే ఆమెపై వ్యతిరేకత తీసుకొచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రవిత్ర స్థలాల్లో ఒకటైన 'మధుర'కు చెందిన పూజారులు ఆ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఆల్బమ్‌ను నిషేధించాలని మండిపడుతున్నారు. ఈ పాటలో సన్నీ లియోన్ చేసిన అశ్లీల నృత్యం తమ మతపరమైన మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. సన్నీపై ప్రభుత్వం చర్యలు తీసుకుని, ఆల్బమ్‌ను నిషేధించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజు. అలా డ్యాన్స్ చేసినందుకు సన్నీ లియోన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అలా చేయకుంటే భారత దేశంలో ఉండనివ్వకూడదన్నారు. అలాగే అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ కూడా 'మధుబన్ మే' సాంగ్‌లో సన్నీ డ్యాన్స్‌ను తప్పుబట్టారు. అలా అవమానకర రీతిలో నృత్యం చేయడం ద్వారా 'బ్రిజ్‌భూమి' ప్రతిష్టను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన ఈ పార్టీ నంబర్‌ను సరేగమ మ్యూజిక్ 'మధుబన్' పేరుతో బుధవారం (డిసెంబర్ 22) విడుదల చేసింది. ఈ పాటలో కృష్ణుడు, రాధల మధ్య ఉన్న ప్రేమను తెలియజేసేలా ఉండగా.. సన్నీ లియోన్ బాడీ మూమెంట్స్ హిందూ మనోభావాలను కించపరిచేలా ఉందని నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు. 1960లో కోహినూర్ సినిమాలో మహమ్మద్ రఫీ ఆలపించిన ఈ పాటను రీమేక్ చేశారు. ఇదీ చదవండి: సన్నీ లియోన్ లుంగీ డ్యాన్స్ చూశారా?.. స్టెప్పులు అదిరాయిగా! -
పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!
Man poses as priest to run drug trade near temples: ఇటీవలకాలంలో ఆ మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూశాం. పైగా సెలబ్రేటిలు దగ్గర నుంచి దిగజ కంపెనీలు సైతం ఈ డ్రగ్స్ నీలి నీడ ఛాయలు మాటున దాగి ఉంటున్నాయి. నార్కొటిక్క్ బృందం చేధించేంత వరకు ఎవరు ఏంటో ప్రజలకు అర్థంకానీ గందగోళ పరిస్థితిని చవి చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి కాదేమో!. అచ్చం అలానే చెన్నైలో పవిత్రమైన దేవలయ ప్రాంగణంలో పూజారి ముసుగులో ఒక వ్యక్తి గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. (చదవండి: ఐస్ క్రీం విక్రయించనందుకు మొత్తం స్టాక్‌నే పాడు చేశాడు!!) అసలు విషయంలోకెళ్లితే....చెన్నైలోని దామో అనే 50 ఏళ్ల వ్యక్తి పూజారిలా జనాలకు ఫోజులిస్తూ దేవాలయం వెలుపల గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అయితే చెన్నైలోని పోలీసులు దేవలయ ప్రాంగణాల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారంటూ సమాచారం రావడంతో చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్యల్లో భాగంగానే పోలీసులు కస్టమర్లల వేషంలో దేవాలయం ప్రాంగణాల్లో తనిఖీలు చేయడం ప్రారంభించారు. అయితే దామో కాషాయా వస్త్రాలు ధరించి వివిధ ఆలయాల వద్ద కనిపించడంతో అనుమానించి పోలీసులు కస్టమర్ల వేషంలో అతని వద్దకు వెళ్లి విచారించారు. ఈ క్రమంలో పోలీసులు దామోని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు తమిళనాడులో విక్రయించే నిమిత్తం అతని వద్ద గంజాయిని కొనుగోలు చేసే ఇద్దరు సహాయకులను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!) -
పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..
తిరువొత్తియూరు( చెన్నై): నీలగిరిలో ఏడేళ్ల బాలుడిని అమ్మవారి ఆలయంలో పూజారిగా నియమించడంపై దేవదాయశాఖను హైకోర్టు వివరణ కోరింది. నెడుకాడు గ్రామంలో గేల్తై అమ్మన్ ఆలయం ఉంది. అమ్మవారు ఓ సామాజిక వర్గానికి కులదేవత. 1994 మే 25న ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. వంశపార్యంపర్యంలో భాగంగా గోపాలకృష్ణ కుమారుడు రాణేష్ (7)ను పూజారిగా నియమించారు. ఇక్కడ పూజారిగా ఉండే వారు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీనిపై నీలగిరి జిల్లా కొత్తగిరి గ్రామానికి చెందిన టి.శివన్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాథ్ బండారి, ఆదికేశవులు బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పూజారిగా నియమించడం వల్ల బాలుడి చదువు ఆగిపోయిందని..అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు దేవాదాయశాఖను ఆదేశించారు. చదవండి: MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!
ఒక్కోసారి కొంత మంది భక్తిలో పరవశించుపోతూ చేసే కొన్ని పనులు మనకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి ఆ స్థాయి మరి ఎక్కువగా చేరితే ఇక వారి వింత ప్రవర్తనతో జనాలను విసిగిస్తుంటారు. అయితే అచ్చం అలానే ఇక్కడొక పూజారి చేశాడు. అసలు విషయంలోకెళ్లితే..ఒక పూజారి ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచిత్రంగా అభ్యర్థించాడు. ఈ మేరకు అతను తన కృష్ణుడి చిన్ననాటి విగ్రహమైన లడ్డూ గోపాల్ విగ్రహానికి స్నానం చేయిస్తున్నప్పుడు చేయి విరిగిపోయిందని అందువల్ల చికిత్స చేయాలంటూ ఏడుస్తూ అభ్యర్థిస్తాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. అయితే మొదటగా ఎవరు అతని అభ్యర్థనను పట్టించుకోరు. కానీ కాసేపటికి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించి పేషంట్ పేరు కృష్ణుడిగా రిజిస్టర్లో నమోదు చేసుకుని. పూజారి సంతృప్తి నిమిత్తం విగ్రహానికి కట్టుకట్టామని తెలిపారు. అయితే పూజారి లేఖ్ సింగ్ అర్జున్ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
Supreme Court of India: ఆలయ భూహక్కులు దేవుడివే
న్యూఢిల్లీ: దేవాలయ భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని, పూజారి ఎప్పటికీ భూస్వామి కాలేడని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దేవాలయ ఆస్తులుగా ఉన్న భూముల నిర్వహణ మాత్రమే పూజారిదని, భూములన్నీ ఆలయంలోని దేవుడికే చెందుతాయని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. భూమి హక్కులకు సంబంధించిన పత్రాలలో యజమాని అన్న కాలమ్‌లో ఆ ఆలయంలో కొలువు తీరిన దేవుడి పేరు రాయాలని, చట్టపరంగా దేవుడికే ఆ భూమిపై హక్కులుంటాయని న్యాయమూర్తులు చెప్పారు. పూజారులు, దేవస్థానంలో ఇతర సిబ్బంది ఆ దేవతామూర్తి తరఫునే పనులు నిర్వహిస్తారని, పూజారి ఎన్నటికీ కౌలుదారుడు కాలేడని భూ చట్టాలలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో దేవాలయ భూముల్ని పూజారులు అక్రమంగా అమ్ముకోవడాన్ని నిరోధిస్తూ రెవెన్యూ రికార్డుల నుంచి పూజారి పేరుని తొలగిస్తూ అక్కడి ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్లను హైకోర్టు కొట్టివేయడంతో దానిని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కెక్కింది. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ దేవాలయ భూముల నిర్వహణ, పరిరక్షణ మాత్రమే పూజారి విధి అని ఒకవేళ తన విధుల్ని నిర్వర్తించడంలో విఫలమైతే మరొకరికి అప్పగించే అవకాశాలు ఉండడం వల్ల ఆయనను భూస్వామిగా చెప్పలేమంది. రెవెన్యూ రికార్డుల్లో పూజారి, మేనేజర్ల పేర్లు ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. -
తొమ్మిది పీజీలు చేసిన పూజారి
-
వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...
సాక్షి, అనంతపురం: జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన గంపమల్లయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా పాపయ్య ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దాదాపు వంద అడుగుల పైనుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చదవండి: పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
మైనర్లను రేప్ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 7, 9 వయసులు ఉన్న ఇద్దరు మైనర్లపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 76 ఏళ్ల పూజారికి ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మెజిస్ట్రేట్ విజేత సింగ్ రావత్ మాట్లాడుతూ.. పవిత్రమైన గుడి ఆవరణలోనే పూజారి విశ్వ బంధు మైనర్లపై అత్యాచార పర్వం కొనసాగించాడని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా బాధితులైన మైనర్లు భవిష్యత్తుపై భయం పెట్టుకున్నారని తీర్పులో తెలిపారు. ఇలాంటి మృగాన్ని బయటకు వదిలేస్తే కోర్టు కూడా తన బాధ్యతలో విఫలమైనట్లే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వబంధుకు యావజ్జీవ ఖైదుతో పాటు రూ. 60 వేల జరిమానా విధించారు. బాధితులకు రూ. 7.5 లక్షల చొప్పున సాయం అందించాలని ఆదేశించారు. -
మైనర్ బాలికపై అత్యాచారం, హత్య..! పెల్లుబికిన నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 9 ఏళ్ల మైనర్ బాలికపై స్థానిక పూజారి (55) మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అంతేకాదు బాలిక తల్లిదండ్రుల అనుమతి లేకుండానే రాత్రికి రాత్రే అంత్యక్రియలు పూర్తి చేసిన వైనం ప్రకంపనలు పుట్టిస్తోంది ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన దాదాపు 200 మంది స్థానికులు భారీ నిరసనకు దిగారు. సీసీటీవీ పుటేజీని పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పూజరితోపాటు, శ్మశాన వాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు డీసీపీ ఇంగిత్ ప్రతాప్‌సింగ్ ప్రకటించారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబ్ అధికారులు క్రైమ్ బృందం దర్యాప్తు కోసం నమూనాలను సేకరించారని దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని ఢిల్లీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ హామీ ఇచ్చారు. పోలీసులు న్యాయమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. లేదంటే ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్వీట్లో తెలిపింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసులు అందించిన సమాచారం ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని శ్మశానవాటికు సమీపంలో మోహన్ లాల్, సునీతా దేవి దంపతులు ఇంట్లో నివసిస్తున్నారు. వీరి కుమార్తె బాలిక శ్మశాన ప్రాంగణంలోకి వెడుతూ వుంటుంది. అలాగే ఫ్రిజ్‌లో నీళ్లు తాగేందుకు ఆదివారం సాయంత్రం కూడా వెళ్లింది. ఆ తరువాతనుంచి కనిపించకుండా పోయింది. కుమార్తెకోసం వెదుకుతున్న తల్లి అక్కడికెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. దీంతో ఫ్రిజ్ వాటర్ తాగుతున్న సమయంలో బాలిక విద్యుత్ షాక్‌కి గురై చనిపోయిందని ఆ పూజారి, అక్కడే పనిచేసే మరో ముగ్గురు సిబ్బంది నమ్మ బలికారు. అంతేకాదు పోస్టుమార్టం పేరుతో భయపెట్టి, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారు. పోలీసులు అమ్మాయి అవయవాలను అమ్ముకుంటారంటూ కల్లబొల్లి మాటలతో మభ్య పెట్టారు. కుటుంబ సభ్యులంతా ఈ అమోమయంలో ఉండగానే హడావిడిగా బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలను గమనించిన తల్లిదండ్రులకు తమ అనుమానం మరింత బలపడింది. చివరకు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుమార్తెను అత్యాచారం చేసి చంపేసారంటూ పూజారి సహా నలుగురిపై ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు పూజారి రాధేశ్యామ్, సలీమ్, లక్ష్మీ నారాయణ్, కుల్దీప్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. -
వైరల్: ఇంట్లోకి దూరిన ‘దెయ్యం నీడ’.. సీసీటీవీలో రికార్డు
ఎడిన్బర్గ్: దెయ్యాలు ఉన్నాయా అంటే.. చాలా మంది అవుననే అంటారు. కొద్ది మాత్రం వాటిని కొట్టి పారేస్తారు. ఇక ఇంటర్నెట్లో దెయ్యాల గురించి శోధిస్తే.. లెక్కకు మిక్కిలి వీడియోలు కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు టెక్నాలజీ సాయంతో తయారు చేసిన వీడియోలే అని మనం ఈజీగా గుర్తింవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో సీసీటీవీ కెమరాలో వింత వింత ఆకారాలు, సంఘటనలు రికార్డయ్యి మనుషులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎక్కడో రోడ్డు మీదనో.. నివాసా ప్రాంతాల్లో రికార్డయ్యే ఈ సంఘటనలు చూస్తే.. అబద్దం అని కొట్టి పారేయలేం.. అలా అని అవి ఏంటో కూడా కరెక్ట్‌గా చెప్పలేం. తాజాగా ఇలాంటి భయానక సంఘటన ఒకటి వెలుగు చూసింది. నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంటి సమీపంలో అకస్మాత్తుగా పెద్ద నీడ కనిపించింది. అది కాస్తా ఇంట్లోకి దూరింది. సీసీకెమారెలో రిక్డారయిన ఈ దృశ్యాలు చూసి ఆ ఇంటి యజమానులు తీవ్రంగా భయపడ్డారు. వెంటనే మతాధికారిని పిలిపించుకుని సమస్యకు పరిష్కారం సూచించాల్సిందిగా కోరారు. స్కాట్‌ల్యాండ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. గ్లాస్గో సమీపంలోని బారోఫీల్డ్‌లో నివసిస్తున్న మాక్సిన్ హ్యూస్ అనే మహిళ తన ఇంట్లోని సీసీటీవీ కెమెరా వీడియోలు చూసి షాకైంది. తన గార్డెన్లో పార్క్ చేసిన కారవాన్ వద్ద ఓ వింత ఆకారం చక్కర్లు కొడుతూ కనిపించింది. నల్లని నీడలా ఉన్న ఆకారం గాల్లో ఎగురుతూ.. ఇంట్లోకి దూరినట్లు రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన షాకైన మాక్సిన్.. మతాధికారిని ఆశ్రయించింది. తన ఇంటి చుట్టూ వింత ఆకారాలను చూడటం ఇదే తొలిసారి కాదు. ఇదివరకు కూడా అలాంటి నీడలను చూశానని మాక్సిన్ తెలిపింది. తన పిల్లలు గార్డెన్లో ఆడుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఆ నీడ తిరిగేదని పేర్కొంది. ఓ రాత్రి తన పార్టనర్ కూడా ఆ వింత ఆకారాన్ని చూశాడని, వారాంతం మొత్తం అది ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించిందని మాక్సిన్ వివరించింది. ఇంటిపై ప్రతికూల శక్తుల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో తాము మతాధికారిని ఆశ్రయించామని తెలిపింది. ‘‘నా చెల్లికి దెయ్యాలంటే ఆసక్తి. అందుకే ఆమెకు ఆ వీడియో పంపించి.. అదేమిటో చెప్పమని అడిగాను’’అని మాక్సిన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. మాక్సిన్ సోదరి నిక్కి ముల్హెరాన్ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియోను చూసి నెటిజనులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ వారసత్వ అర్చకుల నియామకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల శాశ్వత నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో వంశపారంపర్యంగా వచ్చే అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీని నియమించింది. వారసత్వ అర్చకుల వ్యవస్థ బలోపేతం, క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ టీటీడీలో వారసత్వ అర్చక విధానాన్ని మరింత బలంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది. ఇందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి. శివ శంకర్రావుని కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అధ్యయనం చేసి 3 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏక సభ్య కమిటీని కోరింది ఏపీ ప్రభుత్వం. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ తరహా వారసత్వ అర్చకుల శాశ్వత నియామకం ఉందని పేర్కొన్న ప్రభుత్వం.. టీటీడీ అర్చకులు, భక్తుల నుంచి వచ్చిన వేర్వేరు విజ్ఞప్తుల మేరకు ఏక సభ్య కమిటీ నియమించినట్టు స్పష్టం చేసింది. -
షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్
బెంగళూరు: నమ్మకం మనల్ని బతికిస్తుంది. అదే నమ్మకం అతి అయితే ప్రమాదం కూడా. మూడ నమ్మకాలకు పల్లెలని, పట్టణాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కొంచెం ఎక్కువ. దేన్నైనా నమ్మడం మన లక్షణం. అన్నింటికీ ఆధారాలు ఉండవు. దేవుడు, దెయ్యం, మంత్రాలు, ప్రకృతి శక్తులు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గడంలేదు. అయితే తాజాగా కర్ణాటకలోని నెలమంగళ సమీపంలో ఉన్న గాంధీ అనే గ్రామంలో దుష్టశక్తులకు బలివ్వడానికి ఓ పదేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ పదేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా.. సావిత్రమ్మ, సౌమ్య అనే వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేశారు. అయితే పాప కనిపించకపోవడంతో ఆ బాలిక బామ్మ చుట్టు పక్కల వెతికింది. కాగా, సమీపంలో దుష్టశక్తుల నుంచి రక్షణకు పూజలు చేస్తున్న చోటు నుంచి కేకలు వినిపించడంతో.. బామ్మ సమీపంలోని పొలంలో వెళ్లింది. అక్కడ బాలిక మెడలో దండలు వేసి పూజలు చేస్తున్నట్లు గ్రహించి తమ వారితో వెళ్లి పాపను రక్షించిందని పోలీసులు తెలిపారు. తర్వాత ఆ బాలిక తల్లిదండ్రులు పూజారితో సహా ఓ నలుగురు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితులు బెదిరిస్తున్నట్లు శనివారం బాధితుడి కుటుంబం మరో మారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వైరల్: బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు -
దేవాలయాల్లో మహిళలూ అర్చకులే.. ఆ 5 రోజులు సెలవు
ఆగమశాస్త్రంలో శిక్షితులైన మహిళలను ఆలయాల్లో అర్చకులుగా నియమించనున్నామని వారికి ప్రతి నెలా ఐదు రోజుల బహిష్టు సెలవు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై సామాజికంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోర్టు అనుమతి ఇచ్చినా గత పదేళ్లుగా అర్చకత్వం చేయడానికి పెనుగులాడుతున్న మదురై మహిళా అర్చకురాలు పిన్నియక్కల్ ఇప్పుడు వార్తల్లో ఉంది. ‘ఆలయంలో అమ్మవారు స్త్రీ రూపం. కాని ఆమెను అర్చించడానికి స్త్రీలను వద్దనడం విడ్డూరం’ అని మదురై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. సామాజిక న్యాయం, లైంగిక సమానత్వం అనే మాటలు ప్రతిపాదించినప్పుడు ఆదర్శనీయంగా ఉంటాయి కాని వాటిని అమలు చేయాల్సివచ్చినప్పుడు సంఘపరంగా పాతుకుపోయిన అభిప్రాయాల వల్ల, సెంటిమెంట్ల వల్ల సమస్యలు వస్తుంటాయి. చర్చ కూడా జరుగుతుంది. తమిళనాడు లో ఇప్పుడు అర్చకులుగా మహిళలను నియమించే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ‘మాకు మహిళల నుంచి అర్చకుల ఉద్యోగాల కోసం వినతులు వస్తున్నాయి. మేము వాటిని పరిశీలిస్తున్నాం’ అని ఆ రాష్ట్ర హైందవ ఆలయాల నిర్వహణ ఇన్చార్జ్ మంత్రి శేఖర్‌బాబు అన్నారు. మాతృస్వామ్యం నుంచి పురుషస్వామ్వానికి ‘మాతృస్వామ్యంలో ఆలయాల్లో అర్చకులు మహిళలే ఉండేవారు. ఆ తర్వాత ఆర్యుల రాకతో వీరి స్థానంలో పురుషులు వచ్చారు.’ అంటారు తమిళనాడుకు చెందిన సత్యభామా అమ్మయార్. ఆమె తన సాయిబాబా ట్రస్ట్ తరపున మహిళలకు అర్చకత్వంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నిజానికి దక్షణాది రాష్ట్రాలలోని కొన్ని గ్రామీణ అమ్మతల్లుల గుడులలో, గిరిజన గద్దెలలో మహిళలు అర్చకులు గా పని చేసే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. అలాంటి వాళ్లు ఉన్నారు. అయితే శాస్త్ర ప్రకారం పూజాదికాలు జరిగే ఆలయాలలో స్త్రీలు అర్చకులు గా ఉండటం సరికాదన్న అభిప్రాయం కొందరి నుంచి వినిపిస్తోంది. ‘ఇలాంటి లైంగిక మూసను మనం బద్దలు కొట్టాలి. స్త్రీ అర్చకుల విషయంలో ఎవరి నుంచైనా అభ్యంతరాలు వస్తే అవి ఎలాంటివో వాటిని ఏ విధంగా పరిగణించాలో కూడా చూస్తాం. కొన్నాళ్ల క్రితం కోర్టు ద్వారా మంగుళూరులో ఒక మహిళ అర్చకురాలిగా నియమితురాలైంది’ అని తమిళనాడు మంత్రి అన్నారు. ‘స్త్రీలకు ప్రతి నెల బహిష్టు సమయంలో అర్చనకు దూరంగా ఉండేలా ఐదు రోజుల సెలవు ఇస్తాం’ అని ఆయన అన్నారు. తమిళనాడులో అన్ని వర్గాల పురుషులు అర్చకత్వానికి యోగ్యులేనని పూర్వం కరుణానిధి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆరు ఆలయాల్లో అర్చక పాఠశాలలు తెరిచింది. వాటిలో ఒక సంవత్సరం కోర్సు చేసిన వారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్టాలిన్ ప్రభుత్వం ఆలయాల్లో బ్రాహ్మణేతరులను సామాజిక సమానత్వంలో భాగంగా అర్చకులుగా నియమించనుంది. అలాగే లైంగిక సమానత్వంలో భాగంగా స్త్రీలను నియమించనుంది. అంతేకాదు తమిళంలో అర్చకత్వం చేసేవారిని ప్రోత్సహిస్తోంది. కొనసాగుతున్న పోరాటం ఈ సందర్భంలోనే పిన్నియక్కల్ అనే మహిళా అర్చకురాలి పోరాటం కూడా చర్చకు వస్తోంది. మదురై సమీపంలో ఉన్న ఉసిలంపట్టి అనే గ్రామంలో పిన్నియక్కల్ కుటుంబం వంశ పారంపర్యంగా అక్కడి దుర్గ ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తోంది. 2004లో పిన్నియక్కల్ తండ్రి పిన్నయ్తేవర్ జబ్బుపడ్డాడు. దాంతో అతని కుమార్తె పిన్నియక్కల్ రెండేళ్లపాటు అర్చకత్వం చేసింది. అప్పుడు గ్రామస్తులు అభ్యంతరం చెప్పలేదు. కాని 2006లో పిన్నయ్తేవర్ మరణించాక పిన్నియక్కల్ను ఆలయంలో రావడానికి వీల్లేదని గ్రామపెద్దలు అన్నారు. దాంతో పిన్నియక్కల్ హైకోర్టు (మదురై బెంచ్)కు వెళ్లింది. కేసును విచారించిన జస్టిస్ చంద్రు పిన్నియక్కల్ పక్షాన తీర్పు ఇచ్చారు. ‘ఆలయాల్లో కేవలం పురుషులే అర్చకత్వం నిర్వహించాలనేదానికి ఏ ప్రమాణం లేదు. స్త్రీలు కూడా ఇందుకు యోగ్యులే’ అని తీర్పు ఇచ్చారు. ‘అమ్మవారిని స్త్రీలు అర్చించేందుకు అడ్డంకులా’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఆ తీర్పు చాలా ప్రశంసకు పాత్రమైంది. అయితే తీర్పుల అమలు కూడా ఒక్కోసారి అంత సులువు కాదు. ఆ దుర్గ ఆలయాన్ని ఆరాధించే చుట్టుపక్కల 16 గ్రామాల ప్రజలు నేటికీ పిన్నియక్కల్ను అర్చకురాలిగా సంపూర్ణంగా స్వీకరించలేదు. ‘అమ్మవారి ముందుకు డబ్బున్నవాళ్లు, పేదలు, పై వర్గం వారు కింది వర్గం వారు అందరూ వస్తారు. అమ్మవారు ఎవరినీ వేరు గా చూడదు. మరి అర్చకురాలిగా నన్ను ఎందుకు వేరుగా చూడటం. నేను ఇంకా నా అర్చకత్వం కోసం ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కోర్టుల చుట్టూ తిరగాలో’ అని 59 సంవత్సరాల పిన్నియక్కల్ అంది. ప్రార్థనా స్థలాల నిర్వహణ, ఉపాధి, ఆధిపత్యం ఎన్నో ఏళ్లుగా పురుషుల చేతిలో ఉంది. ఇప్పుడు స్త్రీలు తమ న్యాయమైన వాటా కోసం గొంతెత్తుతున్నారు. మున్ముందు ఈ గొంతు ఇంకా గట్టిగా వినిపించవచ్చు.– సాక్షి ఫ్యామిలీ చదవండి: భూ వివాదం : పూజారి సజీవ దహనం -
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంపుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో అర్చకులు, పాస్టర్లు, మౌజన్లు, ఇమామ్‌లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారని ఆయన తెలిపారు. ‘‘పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ప్రణాళిక ప్రకారం పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మారిని నిరోధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని’’ మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోదని వివరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో ఏపీ పురోగతి -
వారికి గౌరవ వేతనం పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు, ఇమామ్, మౌజం, పాస్టర్ల గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేటగిరి-1 అర్చకులకు రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచగా, కేటగిరి-2 అర్చకులకు రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచారు. ఇమామ్‌లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 10 వేలకు, మౌజంలకు గౌరవ వేతనం రూ.3 వేల నుంచి 5 వేలకు పెంచారు. పాస్టర్లకు రూ.5 వేలు నెలవారీ గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ( చదవండి: ఏపీ: ఆక్సిజన్ సేకరణ, పంపిణీలో గణనీయ పురోగతి ) -
నారాయణ దీక్షితులు మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి పైడిపల్లి వంశీయు లు అర్చక మిరాశీ కుటుంబానికి చెందిన శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు (75) కరోనా బారిన పడి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన కుమారుడు కృష్ణశేషాచల దీక్షితులు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. సీఎం జగన్ సంతాపం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం శ్రీనివాసనారాయణ దీక్షితులు మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రధానార్చకుడి మృతిపై టీటీడీ ఉన్నతాధికారులు, అర్చక కుటుంబసభ్యులు సంతాపం తెలిపారు. -
పూజారికి కరోనా.. మానవత్వం చాటుకున్న అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, చార్మినార్: లాల్‌దర్వాజ సింహవాహిని దేవాలయం పూజారి నర్సింహ పంతులు కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు. నాలుగు రోజులుగా కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న ఆయన గురువారం వరకు హోం క్వారంటైన్లో వైద్య సేవలు పొందుతున్న ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ తక్కువ కావడంతో గురువారం ప్రైవేట్ ఆసపత్రులను ఆశ్రయించారు. ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవని చెప్పడంతో మొఘల్‌పురాలోని ఆస్రా ఆస్పత్రికి తరలించారు. నర్సింహ పంతులును చేర్చుకోవడానికి వైద్యుల నిరాకరించడంతో ఆయన పెద్ద కుమారుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఫోన్లో సంప్రదించారు. వెంటనే స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ అస్రా ఆస్పత్రి వైద్యులకు ఫోన్ చేసి చెప్పడంతో నర్సింహ పంతులను అడ్మిట్ చేసుకుని వైద్య సేవలందిస్తున్నారు. ఈ విషయం గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే. చదవండి: కరోనా పాజిటివ్ వచ్చినా బయట తిరిగేస్తున్నారు ఈ కాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్ ఆగ్రహం -
సనాతన ధర్మాన్ని కాపాడిన సీఎం జగన్
తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణజన్ముడిలా ధర్మసంస్థాపన కోసం సనాతన ధర్మాన్ని కాపాడారని తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు ఏవీ రమణదీక్షితులు చెప్పారు. ధర్మాన్ని భగవంతుడు రక్షించినట్లుగా అర్చకుల వంశపారంపర్యాన్ని ముఖ్యమంత్రి పునరుద్ధరించారన్నారు. వైఎస్ జగన్ హిందూ దేవాలయాలు, ప్రాచీన దేవాలయాల ప్రతిష్ట కాపాడతారని, ఆలయాలకు పునర్వైభవం కల్పిస్తారని నమ్మకం కలిగిందని చెప్పారు. విశ్రాంత అర్చకులను పునర్నియమించడంపై తిరుమలలోని అర్చక భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశపారంపర్య అర్చకుల కోసం దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టితో చేసిన చట్టసవరణను తిరిగి ఆయన తనయుడు అమలు చేయడం, మళ్లీ స్వామి సేవ చేసుకునే మహద్భాగ్యం కల్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 2018లో చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం మిరాశి అర్చకులను వయోపరిమితి పేరుతో పదవీవిరమణ చేసి బాధపెట్టిందన్నారు. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వ హక్కులను గత ప్రభుత్వం కాలరాయడంతో అర్చకులు చాలా నష్టపోయారని తెలిపారు. దీనిద్వారా చాలా ఆలయాలు మూతపడ్డాయని, దేవుళ్లకు ఆరాధనలు కరువయ్యాయని చెప్పారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. హైకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ రామచంద్రరావు తీర్పు మేరకు విధుల్లోకి తీసుకోవాలని సూచించారని తెలిపారు. అప్పటి ప్రభుత్వంలో పాలకమండలి తీసుకున్న 50వ తీర్మానాన్ని కోర్టు రద్దుచేసిందని తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల అర్చకులకు వయోపరిమితి నిబంధనల సడలింపు ఆలస్యమైందన్నారు. శ్రీవారిని, దేవాలయాలను, అర్చకుల కుటుంబాలను ఈ మధ్య రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు. రాజకీయాలకు, తమకు సంబంధం లేదని, అలా వాడుకునేవారు ఉంటే తమ విజ్ఞప్తిని స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకుల పునర్నియామకానికి కృషిచేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు కుటుంబాలకు చెందిన అర్చకులు నరసింహదీక్షితులు, వెంకటదీక్షితులు, శ్రీనివాసదీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు. మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు మొన్న సన్నిధి గొల్ల.. నేడు విశ్రాంత అర్చకులు.. వారికి జీవితాంతం శ్రీవారికి సేవచేసే భాగ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తుండటంతో ఆయా వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని మొదటగా దర్శనం చేసుకునే యాదవులకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వంశపారంపర్య హక్కు కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొలగించిన అర్చకులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి తీసుకుంటూ.. వారికి వారసత్వ హక్కు కల్పించారు. అర్చకులకు వయోపరిమితి నిబంధనను ఎత్తేశారు. వైఎస్ మరణానంతరం రద్దు శ్రీవారి ఆలయానికి సంబంధించి 1987లో మిరాశీ వ్యవస్థను రద్దుచేశారు. అప్పటి నుంచి వంశపారంపర్య హక్కుల కోసం అర్చకులు పోరాడుతున్నారు. 1996లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరిని తిరిగి ఆలయ అర్చకులుగా నియమించినా.. వారికి పూర్తిస్థాయిలో హక్కులు కల్పించలేదు. అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించాలంటూ మహానేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలలోని అర్చకులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారందరికి వంశపారంపర్య హక్కులు కల్పిస్తూ 2007లో జీవో నంబరు 34 జారీచేశారు. మహానేత మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో అర్చకులకు వయోపరిమితి విధించింది. శ్రీవారి ఆలయంలో 65 సంవత్సరాలు పైబడిన అర్చకులకు ఈ నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. అర్చకుల అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని రద్దు చేసినప్పటికీ 2018 మే 16న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి వయోపరిమితి నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆలయంలోని ప్రధాన అర్చకులు నలుగురితోపాటు మరో ఐదుగురు అర్చకులు, గోవిందరాజస్వామి ఆలయం అర్చకుడు, తిరుచానూరు ఆలయానికి చెందిన ఇద్దరు అర్చకులను వయోపరిమితి నిబంధనతో తొలగించింది. నాడు మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు గత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఇద్దరు అర్చకులు కోర్టును ఆశ్రయించారు. 2018 డిసెంబర్లో అర్చకులకు అనుకూలంగా వచ్చిన తీర్పును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ విషయాన్ని రమణదీక్షితులు, ఇతర అర్చకులు నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. తమ ప్రభుతం వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్చకులకు వయసుతో సంబంధం లేకుండా శ్రీవారికి సేవచేసే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2019 డిసెంబర్లో రమణదీక్షితుల్ని శ్రీవారి ఆలయ ఆగమ సలహాదారుడిగా, గౌరవ ప్రధాన అర్చకులుగా సీఎం వైఎస్ జగన్ నియమించారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎంను కలుసుకున్న రమణదీక్షితులు అర్చకుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్.. రమణదీక్షితులు సహా రిటైర్ అయిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీటీడీని ఆదేశించారు. సీఎంకు రుణపడి ఉన్నాం మా తాతలు, మా తండ్రి చేసిన వంశపారంపర్య అర్చకత్వాన్ని తిరిగి మాకు కల్పించినందుకు సీఎంకు రుణపడి ఉన్నాం. స్వామికి సేవ చేయడమే మా భావన. రాజులను, చక్రవర్తులను మా వంశీకులందరూ చూశారు. మా కుటుంబం కూడా అదే తరహాలో ముందుకు వెళ్లాలని మా తపన. తిరిగి మా హక్కులను మాకు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – నరసింహదీక్షితులు, మాజీ ప్రధాన అర్చకులు (తిరిగి విధుల్లోకి చేరబోయే అర్చకులు) -
దేవుడికే పంగనామాలు!
మంగళగిరి (గుంటూరు): ఓ అర్చకుడు రూ.4 కోట్ల విలువైన ఆలయ భూమికి తన పేరుతో పాస్‌పుస్తకం పుట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబర్ 14లో 13.20 ఎకరాల భూమి ఉంది. అందులో 3.40 ఎకరాలను సాగు చేసుకునే హక్కును అర్చకుడికి దేవదాయ శాఖ కల్పించింది. అయితే ఆలయ అర్చకుడు నిడమానూరు కృష్ణమూర్తి 1998లో తన పేరున పాస్‌పుస్తకానికి దరఖాస్తు చేసుకున్నారు. 1.71 ఎకరాలకు అప్పటి రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకం మంజూరు చేశారు. ఆ భూమి విలువ సుమారు రూ.4 కోట్లు. దేవాలయం పేరిట ఉన్న భూమిని రెగ్యులర్ ఖాతాలో ఆన్లైన్ చేయాలని ఇటీవల ఆలయ ఈఓ దరఖాస్తు చేశారు. అర్చకుడు కృష్ణమూర్తి కూడా పాస్‌పుస్తకం ఇచ్చి తన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను కోరాడు. తహసీల్దార్ జి.వి.రామ్‌ప్రసాద్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అర్చకుడికి అనుభవించే హక్కు మాత్రమే ఉందని తేలింది. అయితే అతని పేరుతో 1998లో పట్టాదారు పాసుపుస్తకం మంజూరైందని వెల్లడైంది. అర్చకుడి పేరుతో ఇచ్చిన పాసుపుస్తకాన్ని రద్దుచేసి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. కాజ గ్రామంలో 11 ఎకరాల పీర్ల మాన్యం, నూతక్కిలో 80 సెంట్ల దేవదాయ శాఖ భూమి ఆక్రమణకు గురైనట్టు గుర్తించి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. మండలంలోని ఆక్రమణలకు గురైన భూములన్నింటినీ గుర్తించేందుకు రీసర్వే ఉపయోగపడుతుందని, రికార్డులను పరిశీలించి ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా స్వాదీనం చేసుకుంటామని తెలిపారు. చదవండి: ఇవేం పాడు పనులు.. కానిస్టేబుల్‌కు దేహశుద్ధి ప్రముఖ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య -
రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి
సాధారణంగా, ఆలయాల్లో పూజలు, వివాహం, వ్రతం, యాగాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే పూజారి తప్పనిసరి. ఒకప్పుడు ఈ కార్యక్రమాలను కేవలం బ్రాహ్మణులు మాత్రమే నిర్వహించే వారు. కానీ ప్రస్తుతం అక్కడక్కడ కొందరు ఇతర సామాజిక వర్గాల వారు కూడా పౌరోహిత్యం చేస్తున్నారు. అయితే ఎక్కడైనా ఈ విధులు నిర్వహించే వారే పురుషులే. పౌరోహిత్యం చేసే స్త్రీలు చాలా అరుదు. ఈ క్రమంలో రెండో వివాహం చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా నయా ట్రెండ్ సెట్ చేశారు. పురోహితురాలి చేతుల మీదుగా తన వివాహ వేడుక జరుపుకున్నారు. మీరు చదివింది నిజమే.. పురోహితుడు కాదు.. పురోహితురాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. దియా ఇది వరకే నిర్మాత సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ఇక భర్తతో విడాకుల అనంతరం దియా, వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీని ఈ నెల 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహ వేడుక ‘పురోహితురాలి’ చేతుల మీదుగా జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోని ట్విట్టర్లో షేర్ చేశారు దియా మీర్జా. Thank you Sheela Atta for conducting our wedding ceremony. So proud that together we can #RiseUp #GenerationEquality https://t.co/aMZdyEZRdF pic.twitter.com/BeyFWCSGLw — Dia Mirza (@deespeak) February 17, 2021 ‘‘మా వివాహం జరిపించినందుకు ధన్యవాదాలు షీలా అట్టా.. ‘అందరం కలిసి ఎదుగుదాం’’.. ‘‘జనరేషన్ ఈక్వాలిటీ’’’’ అనే హాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దియా మీర్జా ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. ‘‘పితృస్వామ్య వ్యవస్థని నాశనం చేయండి’’.. ‘‘ఈ మహిళ ఎంతో దీక్షగా, శ్రద్ధగా వివాహ తంతు జరిపించి ఉంటుందని నేను నమ్ముతున్నాను’’.. ‘‘వారిని ఎదగనివ్వండి’’.. ‘‘మహిళాసాధికరతకు నిదర్శనం’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ఈ పని మగవాళ్లే ఎందుకు చేయాలి? ప్రధానమంత్రి పెళ్లి మూడోసారి వాయిదా -
పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం
బెంగళూరు: మతాధికారులు, పూజారులు, గురువులు, బాబాలకు మన సమాజంలో ఎంతో ఉన్నత స్థానం ఉంటుంది. ప్రజలు వీరిని దైవానికి ప్రతి రూపంగా భావిస్తారు. ఎంతో గౌరవమర్యాదలు ఇస్తారు. కానీ వారిలో కొందరు గురవింద గింజలు ఉంటారు. వెలుగులో ఎన్నో నీతులు బోధిస్తూ.. చీకట్లో దారుణాలకు పాల్పడతారు. వీరిలో కొందరు తమని నమ్మి.. శరణు కోరి వచ్చే ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడే మృగాళ్లు కూడా ఉంటారు. దైవం పేరు చెప్పి దారుణాలకు పాల్పడే ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష విధించినా పాపం లేదు. తాజాగా ఈ మృగాళ్ల జాబితాలోకి ఓ బెంగళూరు పూజారి చేరాడు. దేవాలయం ప్రాంగణంలో ఉంటూ.. ఆలయ బాగోగులు పర్యవేక్షిస్తున్న పూజారి.. పదేళ్ల బాలికపై రాక్షసకాండ కొనసాగించాడు. స్వీట్స్ ఇస్తానంటూ చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాలు.. చిక్‌బళ్లాపుర్‌కి చెందిన వెంకటరమణప్ప(68) పూజారిగా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం కుమార్తె ఇంటికి వచ్చాడు. అల్లుడు పనిమీద వేరే ఊరికి వెళ్లడంతో అతడికి బదులుగా ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సమయంలో ఆలయం బయట ఆడుకుంటున్న పదేళ్ల చిన్నారి వెంకటరమణప్ప కంట పడింది. బాలికను చూడగానే అతడి మనసులోకి ఓ దుష్ట ఆలోచన వచ్చింది. దాంతో చిన్నారి దగ్గరకు వెళ్లి తనతో పాటు వస్తే స్వీట్లు ఇస్తానంటూ ఆశపెట్టి ఆలయ ప్రాంగణంలో ఉన్న తన కూతురింటికి తీసుకెళ్లి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పాప ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు. పాప గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆలయం బయట పూలు అమ్ముకునే వ్యక్తి బాలిక, పూజారితో పాటు వారింటికి వెళ్లడం చూశానని తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా భయంతో గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డ వారికి కనిపించింది. (చదవండి: కామాంధులపై పాక్ సర్కారు ఉక్కుపాదం!) ఏం జరిగిందని తల్లి అడగ్గా చిన్నారి దారుణాన్ని వివరించింది. వెంటనే వారు పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సీ కే బాబా మాట్లాడుతూ.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా ఆలయం చుట్టు పక్కల ఉన్న సీసీటీవీ కెమరాలను పరిశీలించాము. బాలిక పూజారితో పాటు వెళ్లిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అలానే పూలకొట్టు అతడి స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడు వెంకటరమణప్పపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. కాగా, చిన్నారిపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
భూ వివాదం : పూజారి సజీవ దహనం
జైపూర్ : రాజస్ధాన్‌లోని కరౌలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో ఆలయ పూజారిని కొందరు సజీవ దహనం చేసిన ఘటన వెలుగుచూసింది. కరౌలి జిల్లాలోని గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో పూజాధికాలు నిర్వహించేందుకు పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు. అయితే ఈ భూమి కరౌలీలో వివాదానికి దారితీసింది. గ్రామ పూజారి బాబాలాల్ వైష్ణవ్ తన భూమిని ఆనుకుని ఉన్న ఈ ప్లాట్‌లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు స్థలం చదును చేసే పనులు చేపట్టారు. ఈ భూమి తమదని ఇందులో నిర్మాణాలు చేపట్టరాదని అంటూ మీనా వర్గీయులు అడ్డుకున్నారు. వివాదం గ్రామ పెద్దల వద్దకు చేరడంతో వారు పూజారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ భూమి తనదే అంటూ పూజారి ఆ స్థలంలో తన పంట దిగుబడిని ఉంచాడు. పూజారి చదును చేసిన స్ధలంలో గుడిసె నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగడంతో స్ధలంలో ఉన్న తన పంటను ఆరుగురు వ్యక్తులు తగులబెట్టడంతో పాటు తనపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారని స్టేట్మెంట్లో పూజారి పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. పూజారి కాలిన గాయాలతో జైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడు కైలాష్ మీనాను అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి హజ్రి లాల్ యాదవ్ తెలిపారు. చదవండి : ముగ్గురు విద్యార్ధినుల సజీవ దహనం -
అన్నవరం దేవస్థానంలో కరోనా కలకలం..
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి చెందిన 39 మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. నిన్నటి వరకు పది మంది అర్చకులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. ఇవాళ 300 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా, మరో 29 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ నెల 14 వరకు దర్శనాలు, వ్రతాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు ప్రకటించారు. స్వామివారికి ఏకాంతంగా నిత్యసేవలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరించడంతో అర్చకులు,సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. -
కరోనాతో టీటీడీ అర్చకుడు మృతి
సాక్షి,తిరుపతి: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి బారినపడి మరో అర్చకుడు మృతి చెందారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు (45) కరోనాతో కన్నుమూశారు. గోవిందరాజు స్వామి ఆలయం నుంచి శ్రీనివాసాచార్యులు డిప్యూటేషన్‌పై తిరుమలకు వచ్చారు. వారం క్రితం ఆయనకు కరోనా వైరస్ రావడంతో తిరుపతి స్విమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా దాదాపు 20 ఏళ్లకు పైగా కొనసాగారు. -
భవ్య రామాలయం: పూజారికి బెదిరింపులు
అయోధ్య : భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన 75 ఏళ్ల పూజారి ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ఆగస్టు 5న జరుగనున్న రామ మందిర నిర్మాణం భూమిపూజకు ముహార్తాన్ని నిర్ణయించారు. బెళగావిలో ఉండే విజయేంద్ర శర్మ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు స్వామి గోవింద్ దేవ్ గిరిజకి సన్నిహతులు. విజయేంద్రకు గత మూడు, నాలుగు రోజులుగా తనకు దాదాపు 60 బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తనకు కాల్స్ వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (150 నదుల జలాలతో అయోధ్యకు..) దీంతో విజయేంద్ర శర్మ ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను మోహరించారు. గతంలో మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు, పీవీ నరసింహరావులకు శర్మ సలహాదారునిగా వ్యవహరించారు. అంతేకాకుండా వాజ్‌పేయి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంలోనూ శర్మనే ముహూర్తం పెట్టారు. ఇక బుధవారం నాడు జరగనున్న భూమి పూజ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా, ఏప్రిల్‌లోనే రామాలయ నిర్మాణ వేడుకలు జరగాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. (అయోధ్య భూమి పూజకు మోదీ, షెడ్యూల్ ఇదే!) -
ఫాదర్ పాలు దొంగిలించిన పిల్లి
పిల్లి పాలు తాగడం చాలా సాధారణమైన అంశం. కానీ ప్రస్తుతం ఓ పిల్లి పాలు తాగుతున్న వీడియో మాత్రం ప్రపంచం అంతా చక్కర్లు కొడతూ తెగ వైరలవ్వడమే కాక పిల్లిని.. దాని యజమానిని ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసింది. కాంటర్బరీ కేథడ్రాల్ ఉదయం ప్రార్థనల లైవ్ స్ట్రీమ్ సెషన్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. డీన్ లైవ్‌లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.. ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్ ఎలాంటి జంకు లేకుండా అక్కడకు వచ్చి డీన్ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది. అంతటితో ఊరుకోక ఆ పక్కనే టేబుల్ మీద డీన్ కోసం ఉంచిన పాల వాసనను పసిగడుతుంది. వెంటనే దాని మీదకు దూకి పాలు తాగడం ప్రారంభించింది. ఇది అంతా వీడియోలో రికార్డయ్యింది. టైగర్‌ను గమనించిన డీన్.. ‘క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. WATCH: Thirteen-year-old Tiger the cat joins the livestream of Canterbury Cathedral's morning prayers and drinks milk that was meant for the Dean pic.twitter.com/wZRDO5Uph6 — Reuters India (@ReutersIndia) July 10, 2020 -
సిరిమాను అధిరోహించిన పూజారి ఇకలేరు..
సాక్షి, విజయనగరం: ఎనిమిది సార్లు పైడితల్లి అమ్మవారి సిరిమానును అధిష్టించిన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సిరిమాను అధిరోహించిన పూజారిగా ఆయన గుర్తింపు పొందారు. భాస్కరరావు మృతితో విజయనగరంలో విషాదం అలుముకుంది. 2009- 2016 మధ్య కాలంలో శ్రీపైడితల్లమ్మ సిరిమానును భాస్కరరావు అధిరోహించారు. సిరిమానుపై అధిరోహించిన పూజారిని భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం తెలిపారు. (సిరులిచ్చే తల్లి.. శ్రీపైడితల్లి) -
కొత్త వాదన: ఇక్కడ శానిటైజర్లకు నో!
భోపాల్: దేవాలయాల్లో ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లను అనుమతించేది లేదని మధ్యప్రదేశ్‌లోని ఓ పూజారి కొత్త వాదన లేవనెత్తారు. తమ ఆలయంలోకి ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ మెషీన్లు తీసుకురావొద్దని శనివారం స్పష్టం చేశారు. భోపాల్‌లోని మా వైష్ణవధమ్ నవ్ దుర్గా ఆలయ పూజారి చంద్రశేఖర్ తివారీ ఈ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాగా, అన్‌లాక్-1లో భాగంగా జూన్ 8 (సోమవారం) నుంచి దేవాలయాలు పునఃప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ‘దేవాలయాల్లోకి శానిటైజర్లు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా నేను ఒప్పుకోను. దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. మద్యం తాగి గుళ్లోకి ఎవరైనా వెళ్తారా. ఇదీ అంతే. కావాలంటే చేతులు శుభ్రంగా కడుక్కునేందుకు గుడి బయట సదుపాయాలు కల్పిస్తాం. భక్తులెవరైనా స్నానమాచరించాక నేరుగా దైవదర్శనానికి రావాలి’అని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కరోనా విజృంభణ నేపథ్యంలో మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసి కేంద్రం.. ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లనే వాడాలని చెప్పిన విషయం విదితమే. దాంతోపాటు ఆరు ఫీట్ల భౌతిక దూరం పాటించాలని.. 40 నుంచి 60 సెకండ్లపాటు హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కోవాలని కేంద్రం చెప్పింది. ఇక దైవ దర్శనాలకు వెళ్ల భక్తులు వాహనాల్లోనే చెప్పులు విడిచి వెళ్లాలని, దేవుడి ప్రతిమలు, అక్కడున్న పురాతన వస్తువులను తాకొద్దని మార్గదర్శకాల్లో తెలిపింది. (చదవండి: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై..) -
ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి
పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సాధువులపై దాడి చేసిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని బలివాలి వద్ద ఉన్న జఘ్రుత్ మహాదేవ్ మందిర్ ఆశ్రమంలోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయం పూజారులపై దాడి చేసి రూ. 6800 విలువైన వస్తువులతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురూ జాగ్రీత్ మహాదేవ్ ఆలయంలో పూజారులుగా ఉన్న శంకరానంద్ దయానంద్ సరస్వతి (54), శ్యామ్సింగ్ సోమ్సింగ్ ఠాకూర్ (60) పై దాడి చేశారు. కాగా ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 వేలు రికవరీ చేశారు.మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా ముగ్గురు నిందితులపై ఐపీసీ 394 సెక్షన్‌తో పాటు పలు కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సురేష్ వరడే తెలిపారు. అంతకుముందు ఏప్రిల్ 16న చెందిన కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు సాధువులు ముంబై నుంచి సూరత్ వైపు వెళుతుండగా పాల్ఘర్ జిల్లాలో ఒక గుంపు వీరిని అడ్డగించింది. దొంగలేమోనన్న అనుమానంతో వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది మైనర్లతో కనీసం 133 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రాణత్యాగం చేస్తే కరోనా పోతుందని..
కటక్ : కాలం ఎంత అభివృద్ది చెందుతున్న కొంతమంది మనుషులు మాత్రం ఇంకా మూడ నమ్మకాలనే బలంగా నమ్ముతున్నారనడానికి ఈ వార్త ఉదాహరణగా చెప్పవచ్చు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఈ యుగంలో ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో ప్రాణత్యాగం చేస్తే కరోనా పారిపోతుందంటూ ఒక పూజారి నిండు మనిషి ప్రాణం తీసేశాడు. ఈ దారుణ ఘటన బుధవారం రాత్రి ఒడిశాలోని కటక్‌లో చోటుచేసుకుంది.(నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు) వివరాలు.. కటక్ జిల్లా బందాహుదా గ్రామానికి చెందిన సన్సారి ఓజా( 72) బందా మా బుద్ద బ్రాహ్మణి దేయి గుడిలో పూజారీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరోజ్ కుమార్ ప్రధాన్(52) పూజ చేసేందుకు ఆలయంలోకి వచ్చాడు. పూజ నిర్వహించిన అనంతరం ప్రధాన్ ఓజాను పలకరించాడు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి ప్రాణత్యాగం చేస్తే దేవుడు కరుణించి కరోనాను మాయం చేస్తానని దేవుడే స్వయంగా కలలో వచ్చి తనకు చెప్పాడంటూ సన్సాన్ ఓజా ప్రధాన్‌తో పేర్కొన్నాడు. టెక్నాలజీ ఇంత పెరుగుతున్న సమయంలో ఇంకా ఇలాంటి మూడ నమ్మకాలెందుకంటూ ప్రధాన్ తెలిపాడు. దీంతో ఇరువరి మధ్య మాటమాట పెరిగింది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఓజా తనకే దేవుడే స్వయంగా వచ్చి చెప్పాడంటూ అప్పటికే సిద్ధం చేసుకున్న గొడ్డలితో ప్రధాన్ తలపై బలంగా బాధడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పోలీసులు ఓజారు అదుపులోకి తీసుకొని ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రధాన్‌ను హత్య చేసేందుకు వాడిన గొడ్డలిని ఫోరెన్సిక్ రిపోర్టుకోసం సీజ్ చేసి ఓజాపై కేసు నమోదు చేశారు.(అద్దె చెల్లించలేదని దంపతుల్ని కాల్చిచంపాడు) ఇదే విషయమై సెంట్రల్ రేంజ్ డీఐజీ ఆశిష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ' ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తోన్న సన్సారి ఓజా మూడ నమ్మకాలను బలంగా నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే దేవుడే తనకు స్వయంగా చెప్పాడంటూ ప్రధాన్‌ను హత్య చేశాడు. అయితే హత్య చేపే సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం మృతదేహాన్ని మామిడిచెట్టు పైకి ఎక్కించి రాత్రంతా పక్కనే కూర్చున్నాడు. కొంతకాలంగా ఓజా మనసిక పరిస్థితి సరిగా లేదని, ఇంతకుముందు కూడా తనకు దేవుడు కనిపించేవాడంటూ చెప్పేవాడని స్థానికులు పేర్కొన్నారు. కాగా గురువారం ఉదయం మత్తు దిగాక ఓజా చెట్టు మీద నుంచి దిగి తానే ఈ హత్య చేసినట్లు ఓజా పోలీసులకు లొంగిపోయాడు. మనిషి ప్రాణం త్యాగం చేస్తే కరోనా పారిపోతుందనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ను హత్య చేశాడంటూ' తెలిపారు. -
ఆలయంలోకి పాము.. ఆడేసుకున్న పూజారి
సాక్షి, సింహాచలం(పెందుర్తి): సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం పాము కలకలం సృష్టించింది. సింహగిరి వంటశాల నుంచి ఆలయ ప్రాంగణం వైపు వస్తున్న పామును కొందరు సిబ్బంది చూసి ఆందోళన చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆలయ ఉప ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు ఆ పామును పట్టుకుని దూరంగా తోటల్లో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. -
సీఎం జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాలు
-
అర్థరాత్రి అతి రహస్యంగా ఆలయంలో తవ్వకాలు!
అతని పేరు.. సత్యం శివం సుందరం. ఈ పేరు చూసే పెద్ద స్వామీజీ వచ్చారు అనుకొని ఆలయంలో పూజారి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ గుడినే దిగమింగేందుకు వచ్చిన కాలాంతకుడు అని అప్పుడు గ్రహించలేకపోయారు. ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయనీ, వాటి కోసమే అతడు స్వామీజీ వేషం కట్టాడన్న విషయం నాలుగేళ్ల తర్వాతగానీ గుర్తించలేకపోయారు. చివరికి అతను ఓ స్మగ్లర్, మనీల్యాండరర్.. పక్కా 420 అని తెలుసుకొని పోలీసులకు పట్టిచ్చారు. ఇదిగో ఆలయంలో వీళ్లు ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడ కూర్చున్న ఆలయ పూజారి తాను పూజలు చేసే గుడిలో ఏం చేయిస్తున్నాడో తెలుసా? వీళ్లు తవ్వుతున్నది ఆలయంలో కొత్త నిర్మాణ పనుల కోసం కాదు.. అర్థరాత్రి వేళ అతి రహస్యంగా ఓ ముఠా వచ్చి ఆలయ గర్భగడి ముందు సాగిస్తున్న గుప్త నిధుల వేట ఇది. ఈ ముఠా నాయకుడు ఇక్కడ కూర్చొని తవ్వకాలు చేయిస్తున్న ఆలయ పూజారే. ఆలయ పూజారేంటి? గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయించడం ఏంటి అన్న డౌట్ వస్తుందా? నిజానికి ఇతను పూజారి కాదు. గుప్తనిధుల వేట కోసం వేసుకున్న వేషమే ఈ స్వామీజీ వేషం. ఇతగాడి పేరు.. సత్యం శివం సుందరం. పేరు ఎంత సినిమాటిగ్గా ఉందో.. తీరు అంతకు మించిన డ్రమటిగ్గా ఉంటుంది. ఆ డ్రామాను రక్తి కట్టించే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామం సమీపంలోని జన్నాయిగుట్టపైకి చేరాడు. అక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇతగాడు ఐదేళ్ల క్రితమే టార్గెట్ చేశాడు. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చత్రపతి శివాజీ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆలయంలోనే బస చేశారని స్థలపురాణం చెబుతోంది. శివాజీనే అప్పట్లో ఆలయ అభివృద్ధికీ విశేషంగా కృషి చేశారట. అందుకే ఈ ఆలయ ఆవరణలో గుప్త నిధులు ఉంటాయని కన్నేశాడు ఈ 420. అసలు పేరు తెలియదు.. కానీ ఇక్కడున్న వారికి తానొక స్వామీజీని అంటూ పరిచయం చేసుకున్నాడు. పరపతి కోసం చిన్నజీయర్ స్వామి పేరునూ అడ్డంగా వాడేసుకున్నాడు. ఐదేళ్ల క్రితం స్థానికుల్ని నమ్మించి ఆలయంలో పూజారిగా చేరాడు. వాళ్లు కూడా ఆలయంలో ఎప్పుడూ ఒకరు ఉండటం మంచిదేనని భావించి అతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆదరించారు. ఆలయం ఉన్న జన్నాయిగుట్టకూ రావిరాల గ్రామానికీ చాలా దూరం ఉండటం.. ఉదయం సాయంత్రం మాత్రమే భక్తులు రావడం వల్ల మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఈ దొంగ బాబా తవ్వకాలు సాగించేవాడు. ఆధునిక యంత్రాలను, స్కానర్లను ఉపయోగించి ఆలయంలో నిధుల కోసం అన్వేషించాడు. వాటి ప్రకారం పలుచోట్ల తవ్వకాలు జరిపాడు. ఇలా రాత్రి మొత్తం తవ్వకాలు జరిపే ఈ ముఠా.. మూడోకంటికి తెలియకుండా ఆ గోతులు పూడ్చివేసేది. ఈ దొంగ బాబా ముఠాలో ఉండే ఓ వ్యక్తి ఇతగాడితో విభేదించి.. తాను రహస్యంగా తీసిన వీడియోను గ్రామస్తులకు షేర్ చేశాడు. దాన్ని చూసి షాక్ తిన్న గ్రామస్తులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నెల 15న ఈ అసత్యబాబాను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతడి గత చరిత్రను తవ్వే పనిలో ఉన్నారు. ఈ దొంగ బాబా పూజారి ముసుగులో వేసుకున్న స్మగ్లర్, మనీ ల్యాండరర్, పక్కా 420 అని కూడా బయటపడుతోంది. గతంలో మహిళలతో ఆలయంలో అసభ్యంగా ప్రవర్తించాడనీ, స్థానికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడనీ ఇప్పుడిప్పుడే బయటికొస్తోంది. అంతేకాదు తరచూ మహారాష్ట్ర వెళ్లి వచ్చేవాడనీ, అంతర్ రాష్ట్ర గుప్తనిధుల ముఠాలతో ఇతనికి సంబంధాలున్నాయని రావిరాల గ్రామస్తులు చెబుతున్నారు. మొత్తం విచారణ పూర్తైతేగానీ ఈ సత్యం శివం సుందరం చేసిన అకృత్యాలన్నీ బయటపడవని అంటున్నారు. -
గుడిలో తవ్వకాలు జరిపిన పూజారి
తుక్కుగూడ: గుప్త నిధులు కోసం ఓ పూజారి తాను పూజలు చేసే ఆలయాన్నే తవ్వేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని జిన్నాయి గూడెం శ్రీలక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో సత్యంశివంసుందరం దాస్ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల నుంచి ఆలయ పూజారిగా పనిచేస్తున్నాడు. ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనంది కావడంతో ఇక్కడ గుప్త నిధులతో పాటు స్వామి వారి బంగారు విగ్రహం ఉంటుందని భావించాడు. వాటిని పొందాలని కొంత మందితో కలిసి దాదాపు ఎనిమిది నెలల క్రితం గర్భగుడి ఎదుట సుమారు 12 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టాడు. ఇలా ప్రయత్నించిన అతనికి ఏమీ లభించలేదు. అయితే, ఆ ప్రదేశంలో గుప్త నిధులు ఏమీ లేకపోవడంతో గొయ్యిని మట్టి వేసి చదును చేశాడు. ఇలా వెలుగులోకి.. ఈ ఆలయ పూజారి వద్ద ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఖాన్పూర్కు చెందిన సోను అనే వ్యక్తి శిష్యుడిగా పనిచేశాడు. పూజారితో సోనుకు భేదాభిప్రాయాలు రావడంతో సోను నుంచి ఈనెల 11న ఖాన్పూర్కు వెళ్లిపోయాడు. ఆలయ పూజారి గుప్త నిధులు కోసం తవ్వకాలు చేసిన సమయంలో సోను తన సెల్ఫోన్లో తీసిన వీడియోను సోను గురువారం జిన్నాయిగూడెం, రావిర్యాల వాసులకు పోస్టు చేశాడు. ఈ గ్రామాల నుంచి స్థానికులు ఆలయానికి వస్తుండడంతో వారి ఫోన్ నంబర్లు సోను వద్ద ఉన్నాయి. సోను పంపిన వీడియో క్లిప్పింగ్‌లను చూసిన స్థానికులు శుక్రవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పూజారి సత్యంశివంసుందరందాస్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
మత ప్రచారకుడికి వల
మొయినాబాద్ (చేవెళ్ల): హోటల్ వ్యాపారంలో నష్టపోయిన దంపతులు డబ్బుకోసం ఓ మత ప్రచారకుడికి వలవేశారు. అతడిని నమ్మించి డబ్బులు తీసుకున్నారు. భోజనం కోసం అంటూ పిలిచి జూస్‌లో మత్తుమందు కలిపారు. అనంతరం అసభ్యకరంగా ఉన్న ఫొటోలు తీసి రూ.కోటి ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌లోని ఓ మత ప్రచారకుడి వద్దకు గత ఆగస్టు 11న ఓ మహిళ(23) వచ్చింది. తన ఆరోగ్యం బాగలేదని తనకోసం ప్రార్థనలు చేయాలని అతడిని కోరింది. అలా పరిచయం ఏర్పరచుకుని తాను ఓ అనాథాశ్రమం నడుపుతున్నట్లు చెప్పింది. ఆయన ఫోన్‌నంబర్ తీసుకుని వాట్సప్ చాటింగ్ చేసేది. కొన్నాళ్ల తర్వాత శంషాబాద్‌లో ఓ రెస్టారెంట్‌కు, మరోసారి వండర్లాకు పిలిచి అతనితో సెల్ఫీలు దిగింది. తన భర్త విజయవాడలో ఓ హోటల్ ఏర్పాటు చేస్తున్నారని, పెట్టుబడిగా సాయం కావాలని రూ.10 లక్షలు తీసుకుంది. వ్యాపారం పేరుతో బాధితుడిని పిలిచి తమ పథకం అమలుచేసి అతడిని బ్లాక్మెయిల్ చేసి రూ.కోటికి ఒప్పందం రాయించుకొని రూ.10 లక్షలు గుంజారు. వేధింపులు పెరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిందని, ఆమె భర్త హైదరాబాద్‌లో హోటల్ వ్యాపారం నడిపి నష్టపోయారని పోలీసులు గుర్తించారు. వారిని సోమవారం రిమాండ్‌కు తరలించనున్నారు. -
వేధింపులు బరించలేక పూజారి ఆత్మహత్య
-
ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పూరి : ఒడిశాలో కొందరు భక్తులు ఆచరిస్తున్న మూఢ నమ్మకం చూసిన వారికి ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే ఎవరైనా అర్చకులు, వేద పండితులు తమ చేతులతో భక్తులను ఆశీర్వదిస్తారు. కానీ ఒడిశాలోని ఖోర్దా జిల్లా భాన్పూర్ ప్రాంతంలో మాత్రం పూజరి తన కాళ్లతో భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఆ అర్చకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు కూడా భారీగా అక్కడికి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు వరుసలో కూర్చోని ఉంటే.. ఆ అర్చకుడు ప్రతి ఒక్కరి తలపై తన కాలును ఉంచి ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత వెన్నుపై కూడా కాలుతో తొక్కుతాడు. ఆ భక్తుల్లో కొందరు చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన విజయదశమి వేడుకల సందర్భంగా వాహన పూజ చేయించుకున్న పలువురు భక్తులు అర్చకుని కాలును తమ నెత్తిపై పెట్టించుకుని ఆశీస్సులు పొందారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి మూఢ నమ్మకాలు వల్ల ప్రపంచంలో భారత్‌కు చెడ్డపేరు వస్తోందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆచారాలను పాటిస్తున్న ప్రజలు వాటి నుంచి బయటకు రావాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. -
‘4 రోజుల్లో 8 హత్యలు.. వీటిపై స్పందిచరేం’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వస్తున్న వరుస హత్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆరెస్సెస్ కార్యకర్త అయిన గోపాల్, ఎనిమిది నెలల గర్భవతి అయిన అతని భార్య, ఆరేళ్ల కుమారుడు అత్యంత దారుణంగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను మర్చిపోకముందే.. మరో హత్య వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ పూజారి గురువారం నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇతను కూడా బీజేపీ కార్యకర్త కావడం గమనార్హం. (చదవండి: తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య) వివరాలు.. నాదియా జిల్లాకు చెందిన సుప్రియో బెనర్జీ(42) అనే పూజారి ఈ సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈలోపు గురువారం ఓ నది ఒడ్డున బెనర్జీ మృతదేహం కనిపించింది. అయితే డబ్బు కోసమే బెనర్జీని హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంటి నుంచి వెళ్లినప్పుడు బెనర్జీ కొంత డబ్బు తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. అయితే బెనర్జీ హత్యపై రాజకీయ దుమారం రేగుతుంది. బీజేపీ కార్యకర్త కావడం మూలానే బెనర్జీని చంపేశారని ఆ పార్టీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మరో బీజేపీ నాయకుడు బాబుల్ సుప్రియో.. ‘సుప్రియో బెనర్జీ బీజేపీ కార్యకర్త కావడం వల్లే అతడిని దారుణంగా చంపేశారు. గడిచిన నాలుగు రోజుల్లో 8 మందిని హత్య చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఓ జోక్‌గా మారింది. బెంగాల్ ప్రజలు వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే వారు ప్రతీకారం తీర్చుకుంటారు. లిబరల్స్‌గా చెప్పుకునే మేథావులు ఈ హత్యలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు. స్పందించడం లేదేందుకు’ అంటూ ట్వీట్ చేశారు. -
ఈ ఆశ్వీరాదం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
-
వైరల్ : కాలు కదిపిన ఫాదర్..!
న్యూఢిల్లీ : ఉత్సాహం ఉప్పొంగితే ఏ వయసువారైనా.. ఏ హోదాలో కొనసాగుతున్నా దాన్ని వ్యక్తం చేస్తారు. లోన దాగున్న పసిహృదయానికి స్వేచ్ఛనిస్తారు. ఢిల్లీలో తాజాగా అలాంటి విశేషమే ఒకటి వెలుగుచూసింది. ఓ చర్చి ఫాదర్ మలయాళ హిట్ సినిమా ‘లవ్ యాక్షన్ డ్రామా’లోని అద్భుతమైన పాట ‘కుడుక్కు పొట్టియా కుప్పాయాం’కు కాలు కదిపాడు. అద్భుతమైన స్టెప్పులతో అక్కడున్న వారిని అలరించాడు. ఫాదర్ నుంచి ఊహించని ప్రదర్శన రావడంతో చర్చి ప్రాంగణంలో ఉన్నవారందరూ ఈల వేసి గోల చేశారు. ఆయనకు మద్దతు పలికారు. ఈ వీడియోను ‘లవ్ యాక్షన్ డ్రామా’ హీరో నివిన్ పౌళీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘మా సినిమాలోని కుడుక్కు పొట్టియా కుప్పాయాం పాటకు ఫాదర్ మాథ్యూస్ కిజాచెచిరా డ్యాన్స్ చేశారు. తన టీమ్‌తో పాటు స్టెప్పులు వేసి అలరించారు. థాంక్యూ.. ఫాదర్’అని పేర్కొన్నాడు. అయితే, తనతో పాటు చర్చి పనుల్లో భాగమయ్యే కొందరు యువకుల పిలుపుమేరకే సరదాగా డ్యాన్స్ చేశానని ఫాదర్ మాథ్యూస్ చెప్పారు. ఇక 2018లో వచ్చిన లవ్ యాక్షన్ డ్రామా సినిమాలోని ‘కుడుక్కు పొట్టియా కుప్పాయాం’పాట బాగా ఫేమస్ అయింది. ఇటీవల జరిగిన ఓనమ్ పండుగలో ఈ పాటకు భారీ ప్రాచుర్యం లభించింది. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ కుడుక్కు పొట్టియా కుప్పాయాం అంటూ తమదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఇక ఫాదర్ డ్యాన్స్ వీడియో గత మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు కాగా.. నాలుగు రోజుల్లోనే పాపులర్ అయింది. యూట్యూబ్‌లో దాదాపు 3 మిలియన్ వ్యూస్ సాధించింది. -
అర్చకుడే దొంగగా మారాడు
రాంగోపాల్‌పేట్: దేవాలయంలో పనిచేసే అర్చకుడే దొంగగా మారి అమ్మవారి చీరలను చోరీ చేశాడు. భక్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ప్రధాన అర్చకుడితో పాటు అతని సహాయకుడు కటకటాలపాలయ్యారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రెజిమెంటల్‌బజార్‌లోని సంతోషీమాత దేవాలయంలో భాస్కరబట్ల రామశర్మ ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సహాయకుడిగా బాబురావు పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి అమ్మవారికి వచ్చే చీరలు, బియ్యం కొన్ని వస్తువులు దేవాలయంలో అప్పగించకుండా ప్రధాన అర్చకులు తీసుకుని వెళుతుండటం భక్తులు, మాజీ ధర్మకర్తలు గమనించారు. ఇదే విధంగా శ్రావణ మాసంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన 42 చీరలు దేవాలయంలో ఉండగా వాటిని తన ఇంటికి తీసుకుని భాస్కరబట్ల రామశర్మ బాబూరావుకు సూచించాడు. శుక్రవారం రాత్రి 8గంటల సమయంలో బాబూరావు ఈ చీరలను తీసుకుని రామశర్మ ఇంటికి యలుదేరాడు. గమంచిన మాజీ చైర్మన్ రాయి వెంకటేష్, ధర్మకర్త రామ్మోహన్‌లు అతని వాహనాన్ని ఆపి తనికీ చేయగా చీరెలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈఓ విఠలయ్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదుచేసి శనివారం ఇద్దరినీ అరెస్టుచేశారు. -
తండ్రీకొడుకుపై దాడి
సాక్షి, పెండ్లిమర్రి, కడప: మొయిళ్లకాల్వ గ్రామం మసీదు మత గురువు మహమ్మద్ హనీఫ్, ఆయన కుమారుడు యూసఫ్‌పై అదే గ్రామానికి చెందిన మహబూబ్ బాషా కత్తితో దాడి చేశాడు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మహమ్మద్ హనీఫ్‌కి, మహబుబ్ బాషాకు గతంలో గొడవ అయ్యింది. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని గురువారం తెల్లవారుజామను తండ్రీకొడుకుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. గాయపడిన ఇద్దరినీ కడప రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాకూ వీక్లీ ఆఫ్ కావాలి
కర్ణాటక ,యశవంతపుర : ఐటీ, బీటీ, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీక్లీ ఆఫ్ ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. మాకు ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పూజలు, హోమాల పేరుతో రోజు దేవస్థానాలలో అర్చకులకు బీజీగా ఉంటున్నారు. కనీసం వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
పూజారి వికృత చేష్టలకు దంపతులు ఆత్మహత్య
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పక్కింట్లో నివసిస్తున్న పూజారి కామ దాహానికి నిండు నూరేళ్లు జంటగా బతకాల్సిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకాలో చోటుచేసుకుంది. తాలూకా సాదరహళ్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దారుణ ఉదంతం జరిగింది. లోకేశ్ (30), కౌసల్య (22) ఆత్మహత్య చేసుకున్న దంపతులు. వీరింటి పక్కనే నివసిస్తున్న మారమ్మ దేవాలయం పూజారి త్యాగరాజ్... కౌసల్యను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులపాటు బెంగళూరు తీసికెళ్లి సహజీవనం చేశాడు. తరువాత కౌసల్య పశ్చాత్తాపం చెంది భర్త ఇంటికి తిరిగి వచ్చేసింది. భారీగా మోహరించిన పోలీసులు, ప్రజలు , కాలిపోతున్న పూజారి ఇల్లు ఫేస్బుక్లో అసభ్య చిత్రాలు కౌసల్య దూరమవడంతో ఆగ్రహించిన పూజారి త్యాగరాజ్ ఆమెతో గతంలో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో అసలే గుసగుసలాడుకుంటున్న గ్రామస్తులు ఈ సంఘటనతో మరింతగా చిన్నచూపు చూడసాగారు. ఈ అవమానం భరించలేని లోకేశ్, కౌసల్య ఇక చావే శరణ్యమనుకున్నారు. ఇద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి, వాహనాలకు నిప్పు విషయం తెలుసుకున్న పూజారి తనకు బడితపూజ తప్పదని గ్రామం నుంచి పరారయ్యాడు. దంపతుల మృతితో అగ్రహోదగ్రులైన గ్రామస్తులు పూజారి ఇంటికి నిప్పంటించారు. అతడి కారుని కూడా కాల్చేశారు. ఈ మంటలకు దేవాలయం వద్ద నిలిపి ఉన్న ఒక భక్తునికి చెందిన స్విఫ్ట్‌కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటో, నాలుగు సైకిళ్లు కాలిపోయాయి. గ్రామంలో ఉద్విగ్న పరిస్థితి నెలకొనడంతో పోలీసు బలగాలను మోహరించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య దంపతుల మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘అది చదివితే ఆమె మనసు మారుతుంది’
లక్నో : వారణాసి ఆలయ పూజారి ఒకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పవిత్ర రామ్‌చరిత మానస్ గ్రంధాన్ని పంపించారు. దీన్ని పారాయణం చేస్తే మమత మనసు బాగుపడుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం నాటి నుంచి మమతా బెనర్జీ ‘జై శ్రీ రాం’ నినాదాలు వింటే చాలు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. అలాంటి నినాదాలు చేసే వారిని నేరస్థులుగా.. పరాయి దేశం వారిగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు పూజారి మాట్లాడుతూ.. ‘జై శ్రీ రాం నినాదాలు వినిపిస్తే చాలు ఆమె ఆగ్రహంతో ఊగి పోతున్నారు. రాముడి పట్ల ఆమె చూపించే ద్వేషమే ఏదో ఓ రోజు ఆమె పతనానికి కూడా కారణమవుతుంది. అందుకే ఆమె మనసు మారాలనే ఉద్దేశంతో రామాయణ గ్రంధాన్ని ఆమెకు పంపించాను. దాన్ని చదివితే ఆమెకు మంచి బుద్ధితో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది’ అన్నారు. ‘రామాయణాన్ని చదివి అర్థం చేసుకోవడానికి నేను ఆమెకు సాయం చేయాలనుకుంటున్నాను. అందుకే పుస్తకంతో పాటు నా ఫోన్ నంబర్‌ను కూడా పంపించాను’ అని పేర్కొన్నారు. -
శని వదిలిస్తానని నమ్మించి..!
మహబూబ్‌నగర్ క్రైం: ‘మిమ్మల్ని.. మీ ఇంటిని శని ఆవహించింది.. ప్రత్యేక పూజలు చేస్తే తప్పా ఆ శని పోదు’ అంటూ నమ్మించాదు.. ఇంట్లో ఉన్న బంగారం తెచ్చి ఈ రాగి చెంబులో ఉంచాలని.. పూజల అనంతరం సాయంత్రం తెరిచి చూడాలని చెప్పి చెంబులో ఉన్న బంగారంతో దొంగస్వామి ఉడాయించిన సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ రూరల్ ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డకు చెందిన నవనీత, ఆమె పిల్లలు, అత్తతో కలిసి ఇంట్లో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్వామిజీ వేశంలో వచ్చాడు. మీ ఇంటికి శని పట్టుకుంది, మీకు అంత మంచిగా చేస్తానని వారికి చెప్పి.. ఓ రాగి చెంబులో నీరు, స్టిల్ టిఫెన్ బాక్స్, అగరబత్తులు, బియ్యం, ఇంట్లో ఉన్న బంగారం తీసుకురావాలని చెప్పాడు. దీంతో అతను చెప్పిన విధంగా అన్ని రకాల సామగ్రితో పాటు మూడు తులాల బంగారం ఇచ్చారు. ఆ తర్వాత అతను పలు రకాల పూజలు చేసి టిఫిన్ బాక్స్‌లో బియ్యంతో పాటు బంగారం పెట్టి..మీ ఇంటి దేవుడిని తలుచుకోవాలని చెప్పాడు. అప్పటికే బంగారం కాజేసిన అతను టిఫిన్ బాక్స్ సాయంత్రం తెరిచి చూడాలని చెప్పి అక్కడి నుంచి ఉడాయించాడు. వారు సాయంత్రం చూడగా దాంట్లో బంగారం మాయమైంది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లి చేసిన పూజారితోనే వధువు జంప్
భోపాల్ (సిరోంజ్) : వధు, వరులను వేద మంత్రాలతో ఒక్కటి చేసిన పూజారే వంకర బుద్ధి చూపించాడు. నవవధువుతో పూజారి పారిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌లో చోటుచేసుకుంది. వినోద్ మహరాజ్ అనే పూజారి మే 7న ఓ నూతన జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి అమ్మగారిఇంటికి వచ్చింది. అనంతరం ఇంట్లోని 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని వధువు వెళ్లిపోయింది. దీంతో యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మే23న మరో వివాహం చేపించాల్సి ఉండగా, పురోహితుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపగా, పురోహితుడు వినోద్ మహరాజ్ ముగ్గురు పిల్లలకు తండ్రి అని తేలింది. పురోహితుడు, సదరు యువతికి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పురోహితుడి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండాపోయారు. ఇప్పుడు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పురహితురాలు
ఈమె పేరు చిత్ర చంద్రచూడ్. వయసు 72 ఏళ్లు. స్వస్థలం పుణె. ఇరవై ఏళ్ల నుంచీ పౌరోహిత్యం చేస్తున్నారు. వ్రతాలు, నోముల దగ్గర్నుంచి పెళ్లిళ్లు, కర్మకాండల వరకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆచార వ్యవహారాలను జరిపించవలసిందిగా కోరుతూ దేశం నలుమూల నుంచీ ఆమెకు పిలుపు వస్తూంటుంది. చిత్ర పౌరోహిత్యంలోకి ప్రవేశించిన కొత్తలో.. ఆడవాళ్లు పూజాపునస్కారాలు చేయించడమేంటని పెదవి విరిచినవారు, భృకుటి ముడివేసిన వారూ లెక్కలేనంతమంది. నిజానికి అంతకుముందు ఆమెకే ఈ అనుమానం ఉండేది. పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించే కంటే ముందు అంటే 1997లో ఆమె ‘గార్గి అజున్ జీవంత్ అహే (గార్గి ఇంకా బతికే ఉంది)’ అనే మరాఠీ పుస్తకాన్ని చదివారు. ఇందులో కథానాయిక వారణాసిలో కర్మకాండలను నిర్వహిస్తూంటుంది. ఆ పుస్తకం చిత్రకున్న భ్రమలను తొలగించింది. ఆమె దృక్పథాన్ని మార్చేసింది. తానూ పౌరోహిత్యం చేయాలనే సంకల్పాన్నిచ్చింది. ఆమె ఒక్కరే.. పుణె కేంద్రంగా.. విద్య, పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి, స్త్రీ సాధికారత కోసం పనిచేసే సంస్థ. ఇందులో చేరి పూజా, పెళ్లి, కర్మకాండలను (హిందూమతాచారాలకు సంబంధించి) జరిపించే విధానాలను నేర్చుకోవాలనుకున్నారు. అప్పటికి ఆమెకు యాభై రెండేళ్లు. ఇంట్లో ఇంకా బాధ్యతలున్నాయి. తను తీసుకున్న నిర్ణయం గురించి ఇంట్లో వాళ్లకు చెప్పారు చిత్ర. ‘‘ఇంటి పనుల్లో సహాయపడ్తాను.. వెళ్లి నేర్చుకో’’ అని భర్త ప్రోత్సహించాడు. జ్ఞానబోధినిలో చేరారు ఆమె. పూజావిధానాలను నేర్చుకోవడానికి చేరిన వాళ్లలో చిత్ర మినహా మిగిలిన వాళ్లంతా పురుషులే. నిర్దేశించినదాని కంటే తక్కువ సమయంలో అన్నీ నేర్చుకున్నారు ఆమె. చిత్రంగా... మొదట్లో జ్ఞానబోధిని తరపునే పూజాకార్యక్రమాలు చేయించడానికి వెళ్లేవారు చిత్ర. ఆవిడను చూడగానే ‘‘గురువుగారికి ఆలస్యమవుతుందని మిమ్మల్ని పంపించారా?’’ అని అడిగేవారట యజమానులు. ‘‘లేదండి.. నేనే చేయిస్తాను’’ అని సమాధానమిచ్చేవారట చిత్ర. సందేహంతోనే పూజలో కూర్చునేవారట. అయిపోయాక.. ఆనందంగా సంభావన ఇచ్చుకునేవారట ‘‘మీలాగ ఇంత వివరంగా.. ఇంత బాగా ఏ పురోహితుడూ చేయించలేదండీ’’ అంటూ! ఇప్పుడైతే చిత్రే రావాలనే డిమాండ్..అంత ప్రాచుర్యం పొందారు ఆమె. ‘‘సాం కేతికంగా.. ఇంత అభివృద్ధి చెందిన కాలంలో ఉన్నా.. ఆచారాల పరంగా చాలా వెనకబడే ఉన్నాం. ఎంతలా అంటే.. జన్మనిచ్చిన వాళ్లు పోయినా వాళ్లకు తల కొరివి కొడుకే పెట్టాలి కాని ఆడపిల్ల పెట్టకూడదు. అలాంటి నమ్మకాల కోసం కడుపులో ఉన్న ఆడశిశువులు కన్ను తెరవకుండా చేసుకుంటున్నాం. ఇలాంటి సంప్రదాయాలను నేను పాటించను. అందుకే నేను కర్మకాండలు చేయించడానికి వెళ్లినప్పుడు.. ఆ ఇంటి ఆడపిల్లలనూ అందులో పాల్గొనేలా చేస్తా.. ఇంకో మాట.. సాధారణంగా నోములు, వ్రతాలు, పెళ్లిళ్లు చేయించే పురోహితులు కర్మకాండలు చేయించరు. అలాగే కర్మకాండలు చేయించే పురోహితులు పెళ్లిళ్లూ చేయించరు. కాని నేను అన్నీ చేయిస్తాను. అంతేకాదు.. మన దగ్గర శుభకార్యాలకు సంబంధించిన పూజాకార్యక్రమాల్లో భర్త పోయిన స్త్రీ పార్టిసిపేట్ చేయదు. కాని భార్య పోయిన పురుషుడు ఆ పూజలు చేయొచ్చు. అలాంటి సంప్రదాయానికీ చెక్ పెట్టాను. ఒకసారి ఓ పెళ్లి జరిపించడానికి వెళ్లాను. వధూ వరులిద్దరికీ తండ్రి లేకపోవడంతో ఆ ఇద్దరు మహిళలు ఆ శుభకార్యానికి దూరంగా ఉండి అన్ని వ్యవహారాలను ఎవరి చేతనో చేయిస్తున్నారు. అప్పుడు నేను వాళ్లను పిలిచి.. పీటల మీద వాళ్లనే కూర్చోబెట్టి.. నిర్విఘ్నంగా ఆ పెళ్లి జరిపించా. మొదట కొంత జంకినా, తర్వాత వాళ్లు తమ పిల్లల పెళ్లికి తాము నిమిత్తమాత్రులు కాకుండా తామే కర్తలుగా పీటల మీద కూర్చుని పెళ్లి చేయించగలిగినందుకు ఎంతో సంతోషించారు. ఇప్పటికీ ఆ జంట చక్కగా ఉంది’’ అని గుర్తు చేసుకున్నారు చిత్ర చంద్రచూడ్. చిత్ర స్ఫూర్తితో ఆమె కోడలూ పౌరోహిత్యంలోకి అడుగుపెట్టారు. -
కిరీటాలు మాయంలో పురోగతి