ఆస్తి ఖాతా మార్చలేదని పిండ ప్రదానం | priest Innovative protest | Sakshi
Sakshi News home page

ఆస్తి ఖాతా మార్చలేదని పిండ ప్రదానం

Published Fri, Nov 25 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

ఆస్తి ఖాతా మార్చలేదని పిండ ప్రదానం

ఆస్తి ఖాతా మార్చలేదని పిండ ప్రదానం

చింతామణి (కర్ణాటక): ఆస్తి ఖాతా మార్పు చేయాలంటూ అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఓ అర్చకుడు నగర సభ కార్యాలయం ఎదుట గురువారం పిండ ప్రదానం చేశారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా చింతామణికి చెందిన అర్చకుడు ప్రకాశ్ తన ఆస్తికి సంబంధించి 4 నెలల క్రితం సరైన ఆధారాలతో ఈ- ఆస్తికి దరఖాస్తు చేశారు. అధికారులు లంచం అడగడంతో ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పారు. అయినా వారు స్పందించకపోవడం తో ఆఫీస్ ఎదుట పిండప్రదానం చేశారు. దీంతో నగర సభ అధ్యక్షురాలు సుజాత, కమిషనర్ మహేశ్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆస్తి ఖాతా మార్పు చేయాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement