innovative protest
-
కోనసీమ జిల్లా: ప్రేమ పేరుతో ప్రియుడి మోసం.. యువతి విన్నూత నిరసన
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రియుడితో పెళ్లి జరిపించాలని కోరుతూ యువతి వినూత్నంగా నిరసన తెలిపింది. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన సరెళ్ల తేజస్వినిని వివాహం చేసుకుంటానని అదే గ్రామానికీ చెందిన కుక్కల స్టాలిన్ అనే యువకుడు నమ్మించి మోసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.తక్షణమే న్యాయం జరగాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తన గోడును అంబేద్కర్ విగ్రహానికి మొరపెట్టుకున్న బాధితురాలు తేజస్విని.. తనను మోసం చేసిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని.. లేదంటే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. -
అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం.. వినూత్న నిరసన
సాక్షి, తిరుపతి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్సీపీ నేత కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. నలుగురు ఎమ్మెల్యేల కటౌట్లకు నల్ల జెండాలు కట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. వెంకటగిరిలోని కైవల్యా నదిలో నిమజ్జనం చేశాయి. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్యేలకు పుట్టగతులు ఉండవని రాంప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. చదవండి: ‘నెల్లూరులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరు’ -
అమిత్ షా వచ్చే రూట్లో వినూత్న నిరసనకు ప్లాన్
-
ఫిరాయింపు కౌన్సిలర్ వినూత్న నిరసన
-
కర్నూలులో రైతుసంఘాల వినూత్న నిరసన
-
నూతన భవనం కోసం ఉస్మానియాలో వినూత్న నిరసన
-
ఏపీ బంద్‌కు మద్ధతుగా విశాఖలో మహిళల వినూత్న నిరసన
-
కూకట్‌పల్లిలో ప్రజలు వినూత్న నిరసన
-
మాకు రోడ్లు కావాలి ...వినూత్న నిరసన
-
ఎమ్మెల్యే ఆర్కే వినూత్న నిరసన
గుంటూరు: రాజధాని గ్రామాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో శుక్రవారం ఉదయం దొండతోటలో కాయలు తెంపి ఎమ్మెల్యే నిరసన తెలిపారు. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం రైతులకు కాకుండా చేస్తోందని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. -
ప్రత్యేక హోదా కోరుతూ వినూత్న నిరసన
-
కిరోసిన్ డబ్బాతో బ్యాంక్‌లో ఆత్మహత్యయత్నం
-
ఉద్యోగ భద్రత కోసం వినూత్న నిరసన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగ భద్రత కోసం కాంట్రాక్ట్ అధ్యాపకులు, పార్ట్‌టైం పీఈటీలు బుధవారం వినూత్న నిరసన తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు నోటికి నల్లగుడ్డను ధరించి కలెక్టరేట్ వరకు మౌన ర్యాలీని నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని జేఏసీ నాయకులు ఎంఏ నవీన్‌కుమార్, చాంద్‌బాషా, రఫీవుద్దీన్, మల్లికార్జున, సోమేష్ కోరారు. రిలే నిరాహార దీక్షలో మత్తయ్య, వెంకటశివుడు, మోహన్, బాయ్యరెడ్డి, నరసింహులు కూర్చున్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం కాంట్రాక్ట్ అధ్యాపకులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాల నుంచి రాజ్‌విహార్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సీఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మిల, జిల్లా కార్యదర్శి అలివేలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, రాజ్‌కుమార్ మాట్లాడారు. మోకాళ్లపై నిలబడి.. తమను రెన్యువల్ చేయాలని పార్ట్‌టైం పీఈటీలు బుధవారం..వినూత్నంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వీరికి సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రాధాకృష్ణ, ఆనంద్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రంగమునినాయుడు, నక్కలమిట్ట శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. దీక్షల్లో పార్ట్‌టైం పీఈటీలు ఏ.షాఫైజల్, టి.వేణుగోపాల్‌రెడ్డి, వి.శివరామ్, ఎన్వీఆరుణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఆస్తి ఖాతా మార్చలేదని పిండ ప్రదానం
చింతామణి (కర్ణాటక): ఆస్తి ఖాతా మార్పు చేయాలంటూ అనేకసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఓ అర్చకుడు నగర సభ కార్యాలయం ఎదుట గురువారం పిండ ప్రదానం చేశారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా చింతామణికి చెందిన అర్చకుడు ప్రకాశ్ తన ఆస్తికి సంబంధించి 4 నెలల క్రితం సరైన ఆధారాలతో ఈ- ఆస్తికి దరఖాస్తు చేశారు. అధికారులు లంచం అడగడంతో ఇచ్చేది లేదంటూ తేల్చిచెప్పారు. అయినా వారు స్పందించకపోవడం తో ఆఫీస్ ఎదుట పిండప్రదానం చేశారు. దీంతో నగర సభ అధ్యక్షురాలు సుజాత, కమిషనర్ మహేశ్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆస్తి ఖాతా మార్పు చేయాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. -
హోదా కోసం SVU విద్యార్ధుల నిరసన
-
జిల్లా కేంద్ర సాధనకోసం వినూత్న నిరసన
మేకులపై పడుకొని దీక్ష చేపట్టిన గోవింద్రాజ్ మెదక్‌టౌన్: మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధి గోవింద్రాజ్ ఆరుగంటలపాటు మేకులతో కూడిన చెక్కపై పడుకొని వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలో జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు బుధవారం 77వ రోజుకు చేరాయి. బుధవారం దీక్షల సందర్భంగా జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధి గోవిందరాజ్ సుమారు ఆరుగంటలపాటు మేకులపై పడుకొని తన ఆకాంక్షను చాటాడు. రిలేదీక్షలకు టీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించి, గోవిందరాజ్ చేపట్టిన నిరసనను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్ర ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన స్పష్టంగా లేదన్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణను గురువారం మెదక్ ఖిల్లాపై సమావేశం నిర్వహించి ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు, జిల్లా కేంద్ర సాధన సమితి ప్రతినిధులు మల్కాజి సత్యనారాయణ, దమ్ము యాదగిరి, మామిళ్ల ఆంజనేయులు, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యంలో వినూత్నం
-
ఏలూరులో బుద్ద విగ్రహం వద్ద వినూత్న నిరసన