పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన.. | Innovative Protest By Farmers In Pithapuram | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..

Apr 17 2025 2:55 PM | Updated on Apr 17 2025 3:08 PM

Innovative Protest By Farmers In Pithapuram

సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కల్లాల్లో ధాన్యం రాశుల వద్ద ధర్నా నిర్వహించారు. రబీ పచ్చి ధాన్యానికి  మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలతో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. మిల్లర్లు సిండికేట్‌గా మారి 76 కేజీల బస్తాను రూ.1200లకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్తా మీద రూ.200-300ల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పచ్చి ధాన్యం బస్తా రూ.1,400-1,500ల వరకు అమ్ముకున్నామని అన్నదాతలు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేత్రస్థాయిలోకి వచ్చి రైతులతో సమీక్ష చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement