అయోధ్యలోని రామాలయంలో బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్య లక్షీకాంత్ దీక్షిత్ (90) వారణాసిలో కన్నుమూశారు. నేడు(శనివారం) మణికర్ణికా ఘాట్‌లో ఆచార్య లక్ష్మీకాంత్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆచార్య లక్ష్మీకాంత్ మృతి చెందారనే వార్త తెలియగానే కాశీ, అయోధ్యలలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఏడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో లక్ష్మీకాంత్ దీక్షిత్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో పూజాదికాలు జరిగాయి. ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలో ఉంటోంది.
లక్ష్మీకాంత్ వారణాసిలోని సంగ్వేద కళాశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఈ కళాశాలను కాశీ రాజు స్థాపించారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రముఖ యజుర్వేద పండితులలో ఒకనిగా పేరుగాంచారు. హిందువులు ఆచరించే పూజా విధానాలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. తన మేనమామ గణేష్ దీక్షిత్ దగ్గర లక్ష్మీకాంత్ వేదాలు అభ్యసించారు.
Comments
Please login to add a commentAdd a comment