
అయోధ్య: యూపీలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని ఎస్‌జీపీజీటీలో చేర్చారు. ఆయన డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు. ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిశారు. దాస్ తన 20 వ ఏట ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కాయి. నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు. నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్ సమాచారం అందించేవారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చివేసింది. మసీదు కూల్చివేత అనంతరం కూడా దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.
ఇది కూడా చదవండి: మస్క్‌కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్
Comments
Please login to add a commentAdd a comment