
గాంధీనగర్: అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్(Pakistan) ఐఎస్‌ఐ ఉగ్రదాడిని భారత్ భగ్నం చేసింది. గుజరాత్, హర్యానా యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా హర్యానాలో ఉగ్రవాది రెహ్మాన్‌ను అరెస్ట్ చేసింది.
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ(ISI)తో సంబంధాలున్న ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో పట్టుబడ్డాడు. భద్రతా సంస్థల సమాచారం మేరకు.. ఐఎస్‌ఐ సంస్థ అబ్దుల్ రెహ్మాన్ ద్వారా అయోధ్య రామ్ మందిరంపై దాడి చేయించేందుకు ప్లాన్ చేసింది.
ఉగ్రదాడిలో భాగంగా అబ్దుల్ రెహ్మాన్ రామమందిరంపై రెక్కీ నిర్వహించాడు. సమాచారాన్ని సేకరించి ఐఎస్‌ఐకి చేరవేర్చాడు. అనంతరం, అబ్దుల్ రెహ్మాన్ ఫైజాబాద్ నుంచి ట్రైన్‌లో మొదట ఫరీదాబాద్ చేరుకున్నాడు. ఫరీబాదాబాద్‌లో హ్యాండ్ గ్రనేడ్‌లను సేకరించాడు. వాటిని తీసుకుని ట్రైన్ ద్వారా అయోధ్య వెళ్లాల్సి ఉంది. అనంతరం ఆ హ్యాండ్ గ్రనేడ్‌తో రామమందిరంపై దాడి చేసేలా ప్లాన్ వేశాడు.
అంతకంటే ముందే దేశ భద్రతా సంస్థలు అందించిన సమాచారంతో గుజరాత్ ఏటీఎస్, ఫరీదాబాద్ ఏటీఎస్ స్క్వాడ్ అబ్దుల్ రెహ్మాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అయోధ్యరామ మందిరంపై ఉగ్రదాడిని భగ్నం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment