isi
-
హౌసింగ్ కుంభకోణం: పాక్ మాజీ ఐఎస్ఐ చీఫ్ అరెస్ట్
ఇస్లామాబాద్: మాజీ ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ఫైజ్ హమీద్‌ను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. హౌసింగ్ స్కీమ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు సోమవారం పాక్ ఆర్మీ వెల్లడించింది. టాప్ సిటీ కేసు (హైసింగ్ స్కీమ్)లో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిరూపితం అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయనపై విచారణను చెపట్టినట్లు పాక్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఫైజ్ హమీద్‌పై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆయనపై ఇచ్చిన అధికార దుర్వినియోగ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సైన్యం ఏప్రిల్‌లో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నవంబర్ 8,2023న టాప్ సిటీ హౌసింగ్ డెవలప్మెంట్ ఓనర్ మోయీజ్ అహ్మద్ ఖాన్ పాకిస్థాన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. హమీద్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అహ్మద్ ఖాన్ 2017లో ఆరోపణలు చేశారు. ఐఎస్ఐ అధికారులు హమీద్ ఇంటిపై దాడులు చేయగా.. బంగారం, వజ్రాలు, నగదుతో సహా విలువైన వస్తువులను బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ (కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్) చిఫ్గా పనిచేశారు. తర్వాత ఆయన జూన్ 2019 నుంచి 6 అక్టోబర్ 2021 వరకు ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ఫైజ్ హమీద్ ఐఎస్ఐ 24వ డైరెక్టర్ జనరల్‌గా సేవలు అందించారు. -
చైనా,ఐఎస్ఐ హస్తం?
బంగ్లాదేశ్ కల్లోలం వెనక విదేశీ హస్తముందా? చైనా, పాక్ ఐఎస్ఐ కలిసి పక్కా ప్రణాళికతోనే సంక్షోభాన్ని సృష్టించాయా? భారత్ పట్ల అనుకూలంగా ఉన్నందుకే షేక్ హసీనా పట్ల అక్కసు పెంచుకున్నాయా? తమ జేబు సంస్థల ద్వారా అరాచకం సృష్టించి ఆమెను గద్దె దించడంలో సఫలమయ్యాయా? రిజర్వేషన్ల ఆందోళన వాటికి అందివచ్చిన ఆయుధంగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యువత, విద్యార్థుల ఆందోళనలో ఐఎస్ఐ శక్తులు చేరి పరిస్థితి చేయి దాటేలా చూడటంలో సఫలీకృతమైనట్టు పలు దేశాల నిఘా వర్గాలు నిర్థారిస్తున్నాయి.వాటి కథనం ప్రకారం... బంగ్లాదేశ్‌లో ఎలాగైనా భారత వ్యతిరేక, చైనా–పాక్ అనుకూల సర్కారు కొలువుదీరేలా చూడటమే లక్ష్యంగా ఐఎస్ఐ పావులు కదిపింది. ఇందుకోసం బంగ్లాలోని ఐఎస్ఐ స్లీపర్‌సెల్స్ రాత్రింబవళ్లూ పని చేశాయి. ముఖ్యంగా ఢాకాలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడం వెనక ఐఎస్ఐ ముసుగు సంస్థ జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్, దాని విద్యార్థి విభాగం ఇస్లామీ ఛాత్ర శివిర్ (ఐసీఎస్) కీలక పాత్ర పోషించాయి. యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను వీలైనంతగా ఎగదోశాయి. ఇందుకోసం జమాత్, ఐసీఎస్ సభ్యులు విద్యార్థుల ముసుగులో పని చేశారు. జమాత్‌కు నిత్యం పాక్, ఐఎస్ఐ నుంచే నిధులందుతాయి. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలో ఢాకాలోని పాక్ హై కమిషన్ నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. ఆ మేరకు జమాత్ సభ్యులు సైలెంటుగా పని చక్కబెడతారని పాక్‌లోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరిస్తున్నాయి. లండన్‌లో వ్యూహరచన! హసీనాను వీలైనంత త్వరగా గద్దె దింపి భారత వ్యతిరేకి అయిన మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా సారథ్యంలోని విపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికారంలోకి వచ్చేలా చూడటమే టాస్‌్కగా ఐఎస్ఐ పావులు కదిపింది. తద్వారా నానాటికీ సుదృఢంగా మారుతున్న భారత్–బంగ్లా సంబంధాలకు బ్రేక్ వేయడంతో పాటు కశ్మీర్ నుంచే గాక బంగ్లా వైపు నుంచి కూడా భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించే వ్యూహం దీని వెనక దాగుంది. లండన్‌లో ఇందుకు పక్కగా స్కెచ్ తయారైనట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఇటీవల ఐఎస్ఐ వర్గాలతో సౌదీ అరేబియాలో భేటీ అయినట్టు సమాచారం.అనంతరం ప్రణాళికను పక్కాగా అమల్లో పెట్టారు. అందులో భాగంగా అల్లర్ల వ్యాప్తికి జూన్‌లోనే ఐసీఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. వీలైనంత అరాచకం సృష్టించడమే లక్ష్యంగా జమాతే, ఐసీఎస్‌లకు ఐఎస్ఐ భారీగా నిధులిచి్చనట్టు వెలుగులోకి వచి్చంది. వాటిలో అత్యధిక మొత్తాలను ఫండింగ్ చేసింది పాక్‌లోని చైనా సంస్థలేనని తేలింది. అంతిమంగా బంగ్లాలోనూ తాలిబన్ తరహా పాలన తేవాలన్నది వాటికి ఐఎస్ఐ, చైనా అప్పగించిన టాస్క్ అని నిఘా వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే ఐసీఎస్ రంగంలోకి దిగింది.ఢాకాతో పాటు పలు నగరాల్లో విద్యార్థులను నయానా భయానా భారీ సంఖ్యలో తమ సానుభూతిపరులుగా మార్చుకుంది. బంగ్లాదేశ్ అంతటా ఘర్షణలు తీవ్ర రూపు దాల్చేలా, పరిస్థితి చేయి దాటిపోయేలా చేయడం వెనక ఈ సంస్థే ప్రధాన పాత్ర పోషించిందని తేలింది. దానికి ఢాకాలోని పాక్ ఎంబసీ అన్నివిధాలా దన్నుగా నిలిచింది. ఈ క్రమంలో, అవసరమైతే తమ కార్యాలయంలో తలదాచుకోవాల్సిందిగా విద్యార్థులకు చెప్పేదాకా వెళ్లిందని దౌత్య వర్గాలంటున్నాయి!చైనా హస్తం సుస్పష్టంబంగ్లా కల్లోలం వెనక చైనా విదేశాంగ, భద్రతా వ్యవహారాల శాఖ హస్తం కూడా ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. తమకంటే భారత్‌కు హసీనా ఎక్కువ ప్రాధాన్యమివ్వడం చైనాకు రుచించని అంశాల్లో ఒకటి. పాక్ అనుకూల సర్కారైతే తన చెప్పుచేతల్లో ఉంటుందన్నది చైనా వ్యూహం. హసీనాను గద్దె దింపడం వెనక కచ్చితంగా విదేశీ హస్తముందని ఆ దేశంలో భారత హైకమిషనర్‌గా చేసిన వీణా సిక్రీ అన్నారు. ‘‘ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా హసీనాను ఘోరంగా అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం. ఆమెకు కనీస ప్రొటోకాల్ మర్యాద కూడా ఇవ్వలేదు. అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హసీనాతో వ్యక్తిగతంగా భేటీ కాలేదు. ఆమె సర్కారును కూలదోయడం వెనక పాక్–చైనా ఉమ్మడి వ్యూహం ఉందన్నది స్పష్టమే’’ అని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర
హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే అమర్నాథ్ యాత్రలో విధ్వంసానికి ఐఎస్ఐ తాజాగా ఖలీస్థానీ ఉగ్రవాద గ్రూపు బబ్బర్ ఖల్సాతో జతకట్టి కుట్ర పన్నినట్లు భారత రక్షణ విభాగం గుర్తించింది.బీజేపీ, హిందూ నేతలే టార్గెట్‌గా ఈ విధ్వంసానికి ఐఎస్ఐ వ్యూహం రచించినట్లు రక్షణశాఖ అధికారులు కనుగొన్నారు. పంజాబ్‌లోని గ్యాంగ్స్టర్లు.. ఉగ్రవాదులతో కలిసి ఈ కుట్రకు ప్లాన్ చేశారని అధికారులు భావిస్తున్నారు. కాగా గత నెలలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ పరిసరాల్లో ఉగ్రవాద కదలికలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ఇదే సమయంలో జమ్ములో ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాక్ కుట్ర ఉందని భారత రక్షణ విభాగం భావిస్తోంది. తాజాగా నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలపై పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) చేసిన దాడిని భారత ఆర్మీ దళాలు భగ్నం చేశాయి. -
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. -
Russia: మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ఏజెంట్‌ను అరెస్టు
లక్నో: రష్యా రాజధాని మాస్కో లోని భారత దౌత్య కార్యాలయంలో కీలక విధుల్లో ఉంటూ పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐకి కీలక సమాచారం చేరవేస్తున్న ఓ అధికారి ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఏటీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్ విదేశాంగ శాఖ ఉద్యోగి. ఇతడు మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఇండియా బేస్డ్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఐబీఎస్ఏ)గా పనిచేస్తూ 2021 నుంచి దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో టచ్‌లో ఉంటూ రక్షణ శాఖ కార్యకలాపాలు, విదేశాంగ శాఖ వ్యవహారా లు, భారత సైన్యం కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేస్తు న్నాడు. కీలక సమాచారం అందిస్తే భారీగా ప్రతిఫలం ముట్టజెపుతామంటూ పలువురు ఇతర అధికారులను సైతం తన వైపు తిప్పుకునేందుకు సతేంద్ర ప్రయత్నిస్తున్నట్లు యూపీ ఏటీఎస్‌కు ఉప్పందింది. దీంతో, ఏటీఎస్ బృందం ఇతడి కదలికలు, కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచింది. ఆ మేరకు నిబంధనల ప్రకారం ఇతడిని ఇటీవల మీరట్‌లోని ఫీల్డ్ యూనిట్‌కు రప్పించి అధికారులు విచారించారు. నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించడంతో సతేంద్ర సివాల్‌పై ఐపీసీ సెక్షన్ 121ఏతో పాటు అధికార రహస్యాల చట్టం–1923 కింద కేసులు నమోదు చేసినట్లు ఏటీఎస్ వివరించింది. ఇదీ చదవండి: రాష్ట్ర హోదా కోసం లఢక్‌లో భారీ నిరసనలు -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి?
వరల్డ్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది మసూద్ అజహార్(55) మృతి చెందాడా?. ఈ ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది ఇతని విడుదల కోసమే. భారత పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు కారణమైన జేషే మహమ్మద్ సంస్థను స్థాపించింది అజహారే. మహమద్ మసూద్ అజహార్ అల్వీ.. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ స్థాపకుడు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మసూద్ అజహార్ మృతిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పాక్‌లో గత కొంతకాలంగా ఉగ్రవాదులు.. ఉగ్ర సంస్థల నేతలు మిస్టరీ పరిస్థితుల్లో మృతి చెందుతున్న సంగతీ తెలిసిందే. BIG BREAKING NEWS - As per unconfirmed reports, Most wanted terrorist, Kandhar hijacker Masood Azhar, has been kiIIIed in a bomb expIosion by UNKNOWN MEN at 5 am 🔥🔥 He was going back from Bhawalpur mosque. UNKNOWN MEN working even on New Year day ⚡ He was the chief of Terror… pic.twitter.com/XG97TMmIE8 — Times Algebra (@TimesAlgebraIND) January 1, 2024 పాక్ పంజాబ్ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అజహార్.. కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు. బ్రిటన్‌కు జిహదీని పరిచయం చేసింది ఇతనే. భారత్ ఇతన్ని అరెస్ట్ చేస్తే.. ఇతని విడుదల డిమాండ్‌తో ఏకంగా విమానం హైజాక్ చేశారు. కాందహార్ హైజాక్ ఘటనగా భారత్‌కు ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందా ఘటన. జైల్లో ఉన్నప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు.. ఇంటర్‌పోల్ సైతం ఇతన్ని గతంలో ప్రశ్నించాయి. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇదీ చదవండి: కాందహార్ హైజాకర్.. ఫర్నీచర్ షాప్ ఓనర్ ముసుగులో ఇంతకాలం! భారత్ పట్టుకుంటే.. 1994లో అజహార్ ఫేక్ ఐడీ మీద శ్రీనగర్‌కు చేరుకున్నాడు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేయాలనుకున్నాడు. అయితే భారత భద్రత బలగాలు ఫిబ్రవరిలో అనంతనాగ్ జిల్లా ఖానాబల్ దగ్గర అజహార్‌ను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. చివరకు.. 1999 డిసెంబర్లో మసూద్ అజహార్ సానుభూతి పరులు ఇండియన్‌ఎయిర్‌లైన్స్ విమానం 814ను హైజాక్ చేసి కాందహార్‌కు తరలించారు. ఆ సమయంలో కాందహార్ పాక్ ఐఎస్ఐ మద్దతుతో తాలిబన్ల ఆధీనంలో ఉండేది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి అజహార్ సోదరుడు అబ్ధుల్ రౌఫ్ అజహార్ నేతృత్వం వహించాడు. విమాన ప్రయాణికుల విడుదల కోసం జరిపిన దౌత్య పరమైన చర్చలు విఫలం కావడంతో.. అప్పటి భారత ప్రభుత్వం అజహార్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. కోట్ భల్వాల్ జైలు నంచి అప్పటి పోలీస్ అధికారి శేష్ పాల్ వైద్ నేతృత్వంలో అజహార్ అప్పగింత జరిగింది. ఆ తర్వాత ఐఎస్ఐ సంరక్షణలోనే చాలా కాలం అజహార్ పాక్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాడు. అయితే పాక్ మాత్రం అజహార్ తమ దగ్గర లేడంటూ బుకాయిస్తూ వచ్చింది. హైజాక్ ఇలా.. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్‌కు చేర్చారు. అక్కడ ఆ విమానం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఈ హైజాక్ వ్యవహారంలో.. 25 ఏళ్ల భారత ప్రయాణికుడు రూపిన్ కట్యాల్‌ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాది అజహార్‌ను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. -
నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం..!
ఒట్టావా:కెనడా-భారత్ మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పాకిస్థాన్ ఉగ్రసంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన వివాదం పథకంలో భాగమనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇటీవల కెనడాలో పాగా వేయాలనే ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ దేశంలో కొంత మంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఒత్తిడి చేసిందట. ఆయన ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్థానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్‌ను హత్య చేశారనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమకు సహకరించడానికి ఐఎస్ఐ మరో వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖలిస్థానీ మద్దతుదారులకే మద్దతునిస్తున్నారని సమాచారం. ఇండియా-కెనడా వివాదం.. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా-కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు.. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయరాదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
పాకిస్తాన్ అండతో హాజీ సలీం భారీ దందా .. తాజాగా రూ.25 వేల కోట్ల డ్రగ్స్
అతనిది అత్యంత విలాసవంతమైన జీవన శైలి. అడుగు కదిలితే చుట్టూ అత్యాధునిక ఏకే ఆయుధాలతో అంగరక్షకుల భారీ భద్రత. ఎటు వెళ్లాలన్నా ముందే పలు అంచెల తనిఖీలు, దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు. ఇది ఏ దేశాధ్యక్షుని పరిచయమో కాదు. భారత్‌తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్న డ్రగ్ కింగ్ హాజీ సలీం జల్సా లైఫ్ స్టైల్! శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఓ నౌకను పక్కా సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడ్డగించి ముంచేయడం తెలిసిందే. అందులో ఏకంగా 2.5 టన్నుల మెథంఫెటామిన్ దొరకడం అధికారులనే విస్మయపరిచింది. ఇది ఎన్సీబీకి మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ స్మగ్లర్ అయిన హాజీదేనని దాడిలో పట్టుబడ్డ 29 ఏళ్ల పాక్ జాతీయుడు వెల్లడించాడు. భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాల్లో సరఫరా నిమిత్తం దీన్ని పాక్ దన్నుతో దొంగచాటుగా తరలిస్తున్నట్టు విచారణలో అంగీకరించాడు. మన దేశంలో ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి! అంతేగాక పలు దేశాల్లో సరఫరా నిమిత్తం అత్యంత భారీ మొత్తంలో డ్రగ్స్‌ను మోసుకెళ్తున్న మదర్ షిప్ ఎన్సీబీకి చిక్కడమూ ఇదే మొదటిసారి! దాని విలువను రూ.12 వేల కోట్లుగా అధికారులు తొలుత పేర్కొన్నారు. కానీ ఇప్పటిదాకా దొరికిన డ్రగ్స్లోకెల్లా ఇదే అత్యంత హెచ్చు నాణ్యతతో కూడినదని తాజాగా పరీక్షల్లో తేలింది. దాంతో దీని విలువను సవరించి ఏకంగా రూ.25,000 కోట్లుగా తేల్చారు! పాక్ నుంచి ఉగ్రవాదుల చొరబాటుకు హాజీ ముఠా అన్నిరకాలుగా సాయపడుతున్నట్టు కూడా తేలింది. పాక్ అడ్డాగా... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ లష్కరే తొయిబా అండదండలతో అరేబియా సముద్రంలో హాజీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. పాక్, ఇరాన్, అఫ్గానిస్తాన్ అతని అడ్డాలు! ఎక్కడా స్థిరంగా ఉండకుండా తరచూ స్థావరాలు మార్చడం హాజీ స్టైల్. అతని ప్రస్తుత అడ్డా పాకిస్తాన్. బలూచిస్తాన్‌లో మకాం వేసి కథ నడుపుతున్నాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ హాజీకి దగ్గరి లింకులున్నట్టు ఎన్సీబీ అనుమానం. గమ్మత్తైన సంకేతాలు.. తేలు, ఎగిరే గుర్రం, డ్రాగన్, కొమ్ముగుర్రం, 555, 777, 999. ఇవన్నీ డ్రగ్స్ సరఫరాలో హాజీ ముఠా వాడే సంకేతాల్లో కొన్ని. డ్రగ్స్ ప్యాకెట్లపై ఉండే ఈ ప్రత్యేకమైన గుర్తులు వాటిలోని డ్రగ్స్, దాని నాణ్యతకు సంకేతాలు. కొనుగోలుదారులు మాత్రమే వీటిని గుర్తిస్తారు. హాజీ మనుషులు డ్రగ్స్‌ను ఏడు పొరలతో పటిష్టంగా ప్యాక్ చేస్తారు. నీళ్లలో పడ్డా దెబ్బతినకుండా ఈ జాగ్రత్త. ఇలా డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతుంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్‌కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తారు. -
అతీక్‌కు ఐఎస్ఐ, లష్కరేతో లింకులు
ప్రయాగ్‌రాజ్: ఉమేశ్‌పాల్ హత్యకేసులో గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్‌కు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు. గురువారం యూపీ పోలీసులు అతీక్ అహ్మద్‌ను, అతడి సోదరుడు అష్రాఫ్‌ను భారీ బందోబస్తు నడుమ ప్రయాగ్‌రాజ్‌లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ‘నాకు ఆయుధాలు, డబ్బుకు కొదవలేదు. పాక్ నుంచి డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లో పంజాబ్‌కు ఆయుధాలు, డబ్బు చేరుతాయి. అక్కడ మా వాళ్లు వాటిని అందుకుంటారు. కశ్మీర్ ఉగ్రవాదులు కూడా తీసుకెళతారు. కావాలంటే మీరు నన్ను అక్కడికి తీసుకెళ్తే డబ్బు, ఆయుధాలు అందజేస్తా’అంటూ అతీక్ అహ్మద్ విచారణలో వెల్లడించిన విషయాలను యూపీ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించారు. రెండు గంటలపాటు సాగిన వాదోపవాదాల అనంతరం అతీక్, అష్రాఫ్లిద్దరికీ ఈనెల 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి, ఐదు రోజుల పోలీసు రిమాండ్‌కు అనుమతిస్తూ మేజిస్ట్రేట్ దినేశ్ గౌతమ్ ఆదేశాలిచ్చారని ఉమేశ్ పాల్ భార్య తరఫు లాయర్ చెప్పారు. ఇద్దరినీ రిమాండ్ పూర్తయ్యేదాకా ప్రస్తుతమున్న సబర్మతీ, బరేలీ జైళ్లలోనే ఉంచుతారన్నారు. -
అమృత్‌పాల్ @ ఆ ఏడుగురు...
దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేసే అమృత్‌పాల్ సింగ్ రాత్రికి రాత్రే సిక్కు మత ప్రబోధకుడిగా వేషం మార్చడం వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందన్న అనుమానాలున్నాయి. దేశంలో మత ఘర్షణలు రేపి, శాంతిభద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికే ఐఎస్ఐ అమృత్‌పాల్‌ను దుబాయ్ నుంచి పంజాబ్‌కు పంపిందని పోలీసులు చెబుతున్నారు. భారత్‌కు వచ్చిన ఆరు నెలల్లో ఖలిస్తానీ ఉద్యమం పేరుతో అమృత్‌పాల్ సింగ్ వార్తల్లో నిలిచాడు. యువతపై మతం మత్తుమందు జల్లి వారి అండదండలతో దేశంలో అశాంతి రేపడానికి పన్నాగాలు పన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అమృత్‌పాల్ భారత్‌కు రావడానికి ముందు జార్జియాలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. పపల్‌ప్రీత్ సింగ్ అమృత్‌పాల్‌ను వెనుక నుంచి నడిపించేది ఇతనే. ఐఎస్ఐ ఆదేశాల మేరకే పపల్‌ప్రీత్ సింగ్ అమృత్‌సింగ్‌ను వెనుకుండి నడిపిస్తాడన్న వాదనలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పోలీసుల నుంచి పరారీ అవడానికి పపల్‌ప్రీత్ సింగ్ పూర్తిగా సహకరించాడు. వాహనాలు, వేషాలు మార్చడంలో సాయపడ్డాడు. అమృత్‌పాల్ బైక్‌పై వెళుతుండగా దానిని నడుపుతున్న వ్యక్తిని పపల్‌ప్రీత్‌గా పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న పపల్‌ప్రీత్ సింగ్ పంజాబ్‌లో ఉద్రిక్తతల్ని సృష్టించడానికి పన్నా గాలు రచించాడు. ఖలిస్తాన్ డిమాండ్‌తో అల్లకల్లోలం సృష్టించాలని భావించాడు. పపల్‌ప్రీత్ సింగ్ సూచనల మేరకే అమృత్‌పాల్ సింగ్ తనని తాను సిక్కు మతప్రబోధకుడిగా, ఒక సామాన్యుడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. భగవంత్ సింగ్ అమృత్‌పాల్ సింగ్‌కు కుడిభుజం. పంజాబ్‌లో అజ్నాలా పోలీసు స్టేషన్లో హింసాకాండకు భగవంత్ సింగ్ బాధ్యు డు. అమృత్‌పాల్ సింగ్‌కు మీడియా, సోషల్ మీడియా సమన్వయకర్తగా ఉన్నాడు. అమృత్‌సింగ్ పరారయ్యాక భగవంత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను సోషల్ మీడియా లైవ్‌లో వచ్చి తమ అనుచరుల్ని రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. దీంతో పోలీసులు అతని ఛానెల్స్ అన్నీ బ్లాక్ చేసి అదుపులోనికి తీసుకున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద విచారిస్తున్నారు. ప్రస్తుతం అస్సాం దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. గుర్మీత్ సింగ్ అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్లో మొట్టమొదట పోలీసులకు చిక్కినవాడు గుర్మీత్ సింగ్ . పోలీసులు అమృత్‌సింగ్‌పై వేట తీవ్రతరం చేశారని తెలిసిన వెంటనే అమృత్సర్ నుంచి తప్పించుకోవడానికి స్థానికంగా గుర్మీత్ సింగ్ అన్ని ఏర్పాట్లు చేశాడు. అరెస్టయిన గుర్మీత్ కూడా దిబ్రూగఢ్ జైల్లోనే ఉన్నాడు దల్జీత్ సింగ్ కల్సి అమృత్‌సర్‌కు చెందిన దల్జీత్ సింగ్ కల్సి అమృత్‌పాల్‌కు ఫైనాన్షియర్. పాకిస్థాన్ నిఘా ఏజెన్సీ ఐఎస్ఐతో కల్సికి సంబంధాలున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకి అమృత్‌పాల్‌కి మధ్య సంధానకర్తగా పని చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లవ్‌ప్రీత్ తుఫాన్ సింగ్ వారిస్ పంజాబ్ దే సంస్థలో కీలక సభ్యుడు. అత్యంత చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. అమృత్‌పాల్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన నేరానికి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. లవ్ప్రీత్ను బయటకి తీసుకురావడం కోసమే అమృత్‌పాల్ ఫిబ్రవరి 24న అజ్నాలా పోలీసు స్టేషన్లో విధ్వంసం సృష్టించాడు. హర్జీత్ సింగ్ అమృత్‌పాల్ సింగ్‌కు మామ. ఖలిస్తానీ ఉద్యమానికి గట్టి మద్దతుదారుడు. పోలీసుల కన్నుగప్పి హర్జీత్ సింగ్ కారులోనే తొలుత పారిపోయాడు. ఆ తర్వాత హర్జీత్ పోలీసులకు లొంగిపోయారు. ఒకప్పుడు హర్జీత్ సింగ్ దుబాయ్‌లో రవాణా వ్యాపారంలో చేసేవాడు. అక్కడే అమృత్‌పాల్ కూడా మామతో కలిసి పనిచేశాడు. అక్కడ్నుంచి కెనడాకి మకాం మార్చాడు. గత నెలలోనే హర్జీత్ భారత్‌కు తిరిగి వచ్చాడు. అమృత్‌పాల్ దుబాయ్ నుంచి పంజాబ్‌కు వచ్చి ఖలీస్తానీ నాయకుడి అవతారం ఎత్తడం వెనుక హర్జీత్ ప్రభావం అధికంగా ఉంది. కిరణ్‌దీప్ కౌర్ అమృత్‌పాల్ సింగ్ భార్య. బ్రిటన్‌కు చెందిన ఎన్నారై. రివర్స్ మైగ్రేషన్ పేరు చెప్పి ఇతర దేశాల్లో ఉన్న ఖలిస్తాన్ సానుభూతిపరుల్ని తిరిగి పంజాబ్ తీసుకురావడానికే ఈమెను అమృత్‌పాల్ పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది.అమృత్‌పాల్‌కు వివిధ దేశాల నుంచి వచ్చే ఆర్థిక సాయానికి సంబంధించిన లెక్కలన్నీ ఆమెకే తెలుసు. ఎజెండా ఇదీ ... ► పంజాబ్ సమాజాన్ని మతం ఆధారంగా విడదీయడమే అమృత్‌పాల్ సింగ్ ప్రధాన ఎజెండా. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి రాష్ట్రానికి వచ్చే నిరుపేదలైన కూలీలపై స్థానికుల్లో వ్యతిరేకత పెంచి అగ్గిరాజేయాలని చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ► విదేశీ సంస్థల నుంచి అందిన నిధులతో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసి పంజాబ్ యువతలో గన్ కల్చర్ పెంచడానికి కూడా ప్రణాళికలు రూపొందించాడు. ► పంజాబ్‌లో అనిశ్చితి రేపడానికి ఆనందపూర్ ఖల్సా ఫౌజ్ (ఏకేఎఫ్) పేరుతో ఒక ప్రైవేటు ఆర్మీని రూపొందించాడు. అందులో ఎక్కువ మంది నేరచరితులే. ఐఎస్ఐ ఆర్థిక సాయంతో అందరికీ ఆయుధాలు, వాహనాలు కొనుగోలు చేశాడు. ► డ్రగ్స్‌కు బానిసలైన వారిని, మాజీ సైనికాధికారులపై వలవేసి వారితో ఒక ఉగ్రవాద సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించాడు. దుబాయ్ నుంచి వచ్చాక జల్లూపూర్ కెహ్రా గ్రామంలో డ్రగ్ డీ–ఎడిక్షన్ సెంటర్‌ని నెలకొల్పాడు. ► డ్రగ్ డీ ఎడిక్షన్ సెంటర్‌కి తీసుకువచ్చిన వారు ఆరోగ్యం బాగయ్యాక వారిస్ పంజాబ్ దే సంస్థలో చేరి ఎలాంటి విధ్వంసం రేపడానికైనా సిద్ధంగా ఉండాలి. అలా చేయలేనివారిని శారీరకంగా హింసించేవారని పోలీసుల విచారణలో తేలింది. అమృత్‌పాల్‌పైనున్న కేసులు వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మొత్తం ఆరు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నాడు. వాటిలో పోలీసు అధికారులపై హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. ఫిబ్రవరి 16 : అమృత్‌పాల్‌పై కిడ్నాప్, దాడి కేసు నమోదు ఫిబ్రవరి 22 : విద్వేషాలు రెచ్చగొడుతున్నాడంటూ కేసు ఫిబ్రవరి 22 – యువతలో అసహనం నింపుతున్నాడని కేసు ఫిబ్రవరి 23 – అమృత్‌పాల్, అతని సాయుధ అనుచరులు పోలీసు అధికారులపై దాడులు, హత్యాయత్నం కేసులు మార్చి 18 : ఆయుధాల చట్టం కింద కేసు నమోదు మార్చి 19 : ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు జలంధర్‌లో కేసు -
అమృత్‌పాల్‌కు ఐఎస్ఐ లింకులు!
చండీగఢ్: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అమృత్‌పాల్‌సింగ్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకునేందుకు అతడు విదేశాల నుంచి భారీగా నిధులు సేకరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇటీవల అరెస్టైన అతని ప్రధాన అనుచరుడు దల్జీత్ సింగ్ బ్యాంకు ఖాతాలకు గత రెండేళ్లలో విదేశాల నుంచి రూ.35 కోట్లు జమ అయినట్టు తేలింది. పలు మోసపూరిత ఆర్థిక వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు. అంతేగాక వారిస్ దే సంస్థకు అనుబంధంగా ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్ (ఏకేఎఫ్) ఏర్పాటుకు దల్జీత్ ప్రయత్నిస్తున్నట్లు తేలింది. మరోవైపు అమృత్‌పాల్ దుబాయ్‌లో ట్రక్ డ్రైవర్‌గా ఉండగా అతనికి ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని పోలీసులంటున్నారు. ‘‘భారత్‌లో విద్రోహ కార్యకలాపాలు చేపట్టేలా బ్రెయిన్ వాష్ చేసింది. అతనికి పలువురు డ్రగ్స్ పెడ్లర్ల మద్దతుంది. అమృత్‌పాల్ వాడే మెర్సిడెజ్ కారు రావెల్ సింగ్ అనే డ్రగ్ పెడ్లర్‌దే. రాష్ట్రవ్యాప్తంగా డీ అడిక్షన్ సెంటర్లు పెట్టి, అక్కడికొచ్చే వారిని తన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. ఆ సెంటర్లలో ఆయుధాలు నిల్వ చేస్తున్నాడు. ఐఎస్ఐ సాయంతో మతం ముసుగులో పంజాబ్‌ను ప్రత్యేక దేశం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’’ అని చెబుతున్నారు. ఈ కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అమృత్‌పాల్ కోసం వేట కొనసాగుతోంది. అతడు కెనడాకు పారిపోయే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అతని మామ హర్జిత్ సింగ్ సహా ఐదుగురు ఆదివారం అర్ధరాత్రి లొంగిపోయారు. వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు పెట్టారు. భారత కాన్సులేట్‌పై దాడి వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తానీ అనుకూలవాదులు ఆదివారం దాడికి తెగబడ్డారు. ఆవరణలో ఖలిస్తానీ జెండాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బ్రిటన్‌లో లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీవాదులు తొలగించిన ఘటనపై కేంద్రం తీవ్ర నిరసన తెలిపింది. -
హనీట్రాప్: భారత క్షిపణుల డేటా పాకిస్థాన్, చైనాలకు అందిందా?
సాక్షి, హైదరాబాద్: నటాషారావు అనే యువతి హనీట్రాప్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధీనంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కాంప్లెక్స్ (ఆర్సీఐ) ఇంజనీర్ డి.మల్లికార్జున్‌రెడ్డి అత్యంత కీలకమైన క్షిపణుల డేటాను దేశం దాటించినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవే అభియోగాలపై మల్లికార్జున్‌రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గత నెల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ నష్టనివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. జర్నలిస్టుగా పరిచయం చేసుకుని.. మల్లికార్జున్‌రెడ్డి ఆర్సీఐలోని అడ్వాన్స్డ్ నావెల్ సిస్టం ప్రోగ్రామ్‌లో 2018 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నాడు. ఇతడికి 2019లో ఫేస్బుక్ ద్వారా నటాషారావు అనే యువతితో పరిచయమైంది. హనీట్రాప్ కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ షేర్నీలో ఈమె పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ జర్నలిస్ట్‌గా మల్లికార్జున్‌తో పరిచయం పెంచుకున్న నటాషా తన పని ప్రారంభించింది. తాను రాస్తున్న ఆర్టికల్స్‌లో వినియోగించడానికంటూ ఇతడి నుంచి న్యూక్లియర్ డిటరెన్స్ ప్రోగ్రామ్ (అణ్వస్త్ర కార్యక్రమం)కు సంబంధించిన వివరాలను ముందు సేకరించింది. ఆపై ఇతడి బ్యాంకు ఖాతా నంబర్ తీసుకున్న నటాషా ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తానంటూ నమ్మబలికినట్లు నిఘా వర్గాల విచారణలో తేలినట్లు తెలిసింది. వలపు వలతో ముగ్గులోకి దింపి.. ఓ దశలో మల్లికార్జున్‌రెడ్డి దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తెచ్చి, వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసి పూర్తిగా ముగ్గులోకి దింపింది. అత్యంత కీలక సమాచారం సంగ్రహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణులతో పాటు దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం తయారవుతున్న కె–సిరీస్ క్షిపణులకు సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా ఇతడి నుంచి రాబట్టింది. నావికాదళం వినియోగించే అణు ఇంధన ఆధారిత జలాంతర్గామి అయిన అరిహంత్ కోసం డీఆర్డీఓ కె–సిరీస్ మిస్సైల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. కాగా తాను పని చేస్తున్న మాసపత్రికలో ఆర్టికల్స్ రాయాల్సి ఉందని, దానికి నిర్ణీత గడువు ఉందని చెప్తూ మల్లికార్జున్ నుంచి కీలక సమాచారం సేకరించింది. 2020–21 మధ్య డీఆర్డీఓ, ఆర్సీఐల్లో అభివృద్ధి చేసిన మిస్సైల్స్‌కు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. న్యూక్లియర్ క్యాపబుల్ సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌గా (ఎస్ఎల్బీఎం) పిలిచే 3,500 కి.మీల రేంజ్‌తో కూడిన కె–4, 6 వేల కి.మీల రేంజ్ కె–5, 1,500 కి.మీల రేంజ్ కె–15 సిరీస్‌లతో పాటు సాగరిక సిరీస్‌కు చెందిన బీ–05 సిరీస్ మిస్సైల్ డేటా సైతం నటాషాకు చేరింది. సిమ్రన్, ఓమీషా పేర్లతో.. ఈమె ఫేస్బుక్లో సిమ్రన్ చోప్రా, ఓమీషా హడ్డీ పేర్లతోనూ ప్రొఫైల్స్ నిర్వహించింది. మల్లికార్జున్‌రెడ్డితో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్, కాల్స్, వాయిస్ మెసేజ్‌లు చేసిన నటాషా ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయలేదు. ఇతడు కోరినప్పటికీ ఆమె దాటవేస్తూ వచ్చింది. అనేక అంశాలను పరిశీలించిన నిఘా వర్గాలు ఈ సమాచారం పాక్ నుంచి చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్డీవో, ఆర్సీఐలో భద్రతా లోపాలపై నిఘా వర్గాలు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
రైల్వే ట్రాక్‌లను పేల్చేసేందుకు ఐఎస్ఐ కుట్ర
న్యూఢిల్లీ: మనదేశంలో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ఐఎస్ఐ పెద్ద కుట్ర పన్నిందని తెలిపాయి. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరిక జారీ చేశాయి. గూడ్స్ రైళ్లే టార్గెట్ సరకు రవాణా రైళ్లను ధ్వంసం చేయడానికి పంజాబ్‌తోపాటు పరిసర రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్ఐ ప్లాన్ చేసిందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం భారతదేశంలోని తన కార్యకర్తలకు ఐఎస్ఐ పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని వెల్లడించాయి. భారత్‌లో ఉన్న పాక్ స్లీపర్ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తోందని వివరించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదుల ఎగదోత ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాహోర్‌లో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండాను ఇందుకోసం వాడుకుంటోందని వెల్లడైంది. పంజాబ్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు సేకరించిన ఆధారాలు రుజువు చేస్తున్నాయి. భద్రత కట్టుదిట్టం నిఘా వర్గాల సమాచారంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో నిఘా పెంచారు. (క్లిక్: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది) పంజాబ్‌పై గురి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్‌పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘జమ్మూకశ్మీర్‌లో ఐఎస్ఐ విజయం సాధించలేకపోవడంతో సరిహద్దు రాష్ట్రంలో మిలిటెన్సీని పునరుద్ధరించడానికి పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకోసం సిక్కు తీవ్రవాద సంస్థలైన సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) బబ్బర్ ఖల్సా కూడా పనిచేస్తున్నాయి. కుట్రలో భాగంగా పంజాబ్‌లోని యువతను పెడదోవ పట్టించి సాయుధ దాడులు చేసేలా ఉసిగొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయ’ని వివరించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు తమ నెట్‌వర్క్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెల్లడైందన్నారు. (క్లిక్: దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం) -
పాక్ నుంచి రిందా కుట్ర
సాక్షి, హైదరాబాద్: పంజాబ్‌తోపాటు ఢిల్లీ, చండీగఢ్, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాఫియా డాన్ హర్వీందర్ సింగ్ అలియాస్ రిందా పాకిస్తాన్ నుంచి భారత్‌లో పేలుళ్లకు కుట్ర పన్నాడు. పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత సంస్థ బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) ముసుగులో అటు ఐఎస్ఐ, ఇటు ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లకు సహకరిస్తున్నాడు. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న తన నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాడు. రిందా ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుంచి ఆదిలాబాద్‌కు మారణాయుధాలు, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్ రవాణా చేస్తున్న నలుగురు ఉగ్రవాదులను హరి యాణాలోని కర్నాల్ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. వీటి ట్రాన్సిట్ పాయింట్ ఆదిలాబాద్ అని, అక్కడకు వచ్చే నాందేడ్ ముఠా తీసుకుని వెళ్లేలా రిందా ప్లాన్ చేశాడని పోలీసులు గుర్తించారు. త్రుటిలో తప్పించుకుని పాక్‌కు.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రిందా కుటుంబం పంజాబ్‌లోని తరంతరాన్ జిల్లాకు వలసవెళ్లింది. 18 ఏళ్ల వయస్సులోనే సమీప బంధువును హత్య చేసిన రిందా.. తర్వాత నాందేడ్‌కు మకాం మార్చాడు. అక్కడా రెండు హత్యలతోసహా పలు నేరాలు చేసి పంజాబ్‌కు పారిపోయాడు. పంజాబ్ యూనివర్సిటీలో ఉన్న పరిచయస్తుల సాయంతో అందులోనే తలదాచుకున్నాడు. 2016లో అక్టోబర్‌లో ఆ వర్సిటీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న రిందా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఓఐ) నాయకులపై తుపాకులతో కాల్పులు జరిపాడు. మాఫియా సంబంధాలతో హత్యలు, బలవంతపు వసూళ్లు తదితర నేరాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. 2017లో తన భార్యతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. వీరి సమాచారంతో బెంగళూరు పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. త్రుటిలో తప్పించుకున్న రిందా పాకిస్తాన్ పారిపోయాడు. అక్కడ ఉంటూనే బీకేఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. బీకేఐ సంస్థ ఐఎస్ఐ, ఎల్ఈటీల కోసం పని చేస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో గతంలోనే గుర్తించింది. తాజాగా రిందాను వినియోగించుకుని ఈ రెండు సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నింది. దీనికోసం ఇతగాడు పంజాబ్‌లోని∙బీకేఐ స్లీపర్ సెల్స్‌తోపాటు నాందేడ్‌లో తన అనుచరులను వాడుకోవాలని పథకం వేశాడు. -
హిజాబ్ వివాదం.. కొత్త మలుపు! ఐబీ హెచ్చరికలు
హిజాబ్ వివాదం ఇప్పుడు మరో రూపం దాలుస్తోంది. హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ ఏర్పాటు కుట్ర జరుగుతోందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ విభాగంతో సంఘ విద్రోహ శక్తులు చేతులు కలపొచ్చని, ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు ప్రయత్నించొచ్చని పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్‌లో అశాంతి రాజేందుకు రంగంలోకి దిగినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక అంచనాకి వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న హిజాబ్ వివాదాన్ని ఖలీస్థానీ విభాగం ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ (ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్ను సాయంతో మరింత రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్) హెచ్చరించాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు నిఘా వర్గాలు శుక్రవారం ఒక నోట్ ద్వారా సూచించాయి. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్ణాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చదువుకునే చోటు వివాదాలకు, రాజకీయాలకు వేదిక కాకూడదనేది పలువురి అభిప్రాయం. అయితే భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని, హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో తాజాగా హెచ్చరించింది. రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని సైతం ప్రస్తావించింది. హిజాబ్ రిఫరెండం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్‌ఫారమ్ కొన్ని స్క్రీన్షాట్లు, చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రసంగం కూడా వైరల్ అవుతున్న విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నోట్ శుక్రవారం వివరించింది. -
పాక్‌లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్‌తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్‌తో పాటు పొరుగున్న పాక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్‌కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్‌తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్‌ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్‌లో అతివాద శక్తులు బలపడటం... భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్‌ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్‌పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్‌లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్‌లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్‌తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్‌లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్‌లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్‌ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్‌కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్‌లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
భారత్ ఆస్తులను ధ్వంసం చేయండి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో భారత్ నిర్మించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ధ్వంసం చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అఫ్గాన్‌లోని తమ వారిని, తాలిబన్లను ఆదేశించింది. పాకిస్తాన్ నుంచి అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తాలిబన్లకు మద్దతుగా చాలామంది అఫ్గాన్ వెళ్లారని, అక్కడి భారత ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలని వారిని ఆదేశించారని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ల ఆక్రమణలోకి వచ్చిన ప్రాంతాల్లో వారి తొలి లక్ష్యం భారత్‌కు సంబంధించిన ఆస్తులు, భవనాలేనని తెలిసిందని పేర్కొన్నాయి. ఇప్పటికే అఫ్గాన్‌లో ఉన్నవారు కాకుండా, ఇటీవలి కాలంలో కనీసం 10 వేల మంది పాకిస్తానీయులు తాలిబన్లకు మద్దతుగా వివిధ సరిహద్దు మార్గాల ద్వారా అఫ్గానిస్తాన్ వెళ్లారని సమాచారం. అఫ్గానిస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ సుమారు 300 కోట్ల డాలర్లను ఖర్చు చేసింది. భారత్ నిధుల ద్వారా నిర్మితమైన వాటిలో డేలారం– జారంజ్‌ల మధ్య నిర్మించిన 218 కిమీల రహదారి, సల్మా డ్యామ్, అఫ్గాన్ పార్లమెంట్ భవనం.. ఉన్నాయి. -
కోల్‌కతా, బెంగళూరులలో ప్రభుత్వ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్(ఐఎస్ఐ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 45 ► పోస్టుల వివరాలు: ఇంజనీర్(ఎలక్ట్రికల్)–02, ఇంజనీరింగ్ అసిస్టెంట్(సివిల్)–03, ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)–03, ఎలక్ట్రీషియన్–14, ఆపరేటర్ కమ్ మెకానిక్(లిఫ్ట్)–08, డ్రైవర్–01, కుక్–01, అసిస్టెంట్(లైబ్రరీ)–06, అసిస్టెంట్(ల్యాబొరేటరీ)–04, అసిస్టెంట్(రెప్రో–ఫోటో)–02, అసిస్టెంట్(ఫార్మ్)–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్లతోపాటు అనుభవం, డ్రైవర్ పోస్టులకు లైట్,హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ► వయసు: 35ఏళ్లకు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.07.2021 ► వెబ్సైట్: https://www.isical.ac.in ఐటీఐ లిమిటెడ్‌లో 40 హాస్పిటల్ స్టాఫ్ పోస్టులు బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌కు చెందిన ఆసుపత్రుల్లో నిర్ణీత కాల వ్యవధి ప్రాతిపదికన హాస్పిటల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 40 ► పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్, హెల్పర్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడో తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. అనుభవం ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 28ఏళ్లు, 30ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెల కు రూ. 24754 నుంచి రూ.27,757 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్/గ్రూప్ టాస్క్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏజీఎం–హెచ్ఆర్, ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు ప్లాంట్, దూరవాణి నగర్, బెంగళూరు 560016 చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.07.2021 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 24.07.2021 ► వెబ్సైట్: https://www.itiltd.in -
‘నగ్న ఫోటోలపై ఆసక్తే నాతో అలా చేయించింది’
జైపూర్: రాజస్తాన్ లథికి చెందిన సత్యనారాయణ పాలివాల్(42) అనే వ్యక్తిని గూఢచర్యం ఆరోపణలపై.. అధికారిక రహస్యాల చట్టం కింద ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ హనీట్రాప్ వలలో చిక్కిన సత్యనారాయణ.. దేశానికి, మిలటరీకి సంబంధించిన కీలక విషయాలను వారితో పంచుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఐఎస్ఐ.. నగ్న ఫోటోలు, సెక్స్ చాట్‌ని ఎరగా వేసి సత్యనారాయణ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిందని తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ‘సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ ద్వారా సత్యనారాయణకు ఐఎస్ఐకి చెందిన పలువురు మహిళలతో పరిచయం ఏర్పడింది. ఇక నగ్న ఫోటోలపై సత్యనారాయణకు ఉన్న ఆసక్తిని గమనించిన సదరు మహిళలు ఆ కోవకు చెందిన ఫోటోలను అతడికి పంపేవారు. అంతేకాక అతడితో సెక్స్ చాట్ కూడా చేసేవారు’ అని అధికారులు వెల్లడించారు. (హనీట్రాప్ కేసు : కీలక వ్యక్తి అరెస్ట్ ) ‘ఇక నగ్న ఫోటోల మీద ఉన్న ఆసక్తితో సత్యనారాయణ దేశానికి సంబంధించిన రహస్య సమాచారం, పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ కదలికలకు గూర్చిన సున్నితమైన సమాచారాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఐఎస్ఐ మహిళలకు అందజేశాడు. సత్యనారాయణ సోషల్ మీడియా ఖాతాల ద్వారా చాలాకాలంగా ఐఎస్ఐతో సంప్రదింపులు జరుపుతున్నాడు. క్లిష్టమైన సమాచారం కోసం అతడిని హానీట్రాప్ చేశారు’ అని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అంతేకాక నిందితుడిని కొంతకాలంగా గమనిస్తున్నామని, జైసల్మేర్‌లో అదుపులోకి తీసుకున్నప్పుడు అతని మొబైల్ ఫోన్లో అనేక ఆర్మీ పత్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. (చదవండి: ఆ యాప్ ద్వారా భారత్‌ను టార్గెట్ చేస్తున్న పాక్!) ఈ సందర్భంగా రాజస్తాన్ పోలీసులు మాట్లాడుతూ.. ‘జైసల్మేర్‌కు చెందిన సత్యనారాయణ పాలివాల్ని గూఢచర్యం ఆరోపణల కింద సీఐడీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అతడు పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉండటమే కాక మిలిటరీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వారికి చేరవేశాడు. ప్రస్తుతం అతడిని జైపూర్‌కు తరలించాము. రాజస్తాన్ ఇంటిలిజెన్స్ అధికారులు, మిలటరీ అతడిని ప్రశ్నిస్తుంది’ అని తెలిపారు. -
బలూచ్ కార్యకర్త మృతి.. పాక్‌పై అనుమానం
టొరంటో: ప్రఖ్యాత కార్యకర్త కరీమా బలూచ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరీమా బలూచ్ మృతదేహాన్ని టొరంటోలో కనుగొన్నారు. 2016లో పాకిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లిన కరీమా ప్రస్తుతం కెనడాలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు. కెనడా పోలీసులు లేక్‌షేర్ ప్రాంతంలో ఓ ద్వీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఇక కరీమా పాక్ సైన్యం, బలుచిస్తాన్ ప్రభుత్వం దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో టొరంటో సీనియర్ జర్నలిస్ట్ ఒకరు మాట్లాడుతూ.. ‘కరీమా మరణం వెనక పాక్ హస్తం ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టొరంటో పోలీసులు, కెనడా సెక్యూరిటీ ఏజెన్సీ సీఎస్ఐఎస్ ఈ కోణంలో దర్యాప్తు చేయాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల బారి నుంచి దేశాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. (చదవండి: ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ ) పాకిస్తాన్ ఆక్రమణ నుంచి బలుచిస్తాన్ వేరుపడి స్వేచ్ఛ పొందాలని కరీమా బలంగా కోరుకునేది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆర్మీ అధికారులు కెనడాలో స్థిరపడటాన్ని వ్యతిరేకించే కరీమా ఈ విషయంలో వారిపై పదునైన విమర్శలు చేసేంది. అంతేకాక కరీమా ఎంతో ధైర్య సాహసాలు గల మనిషి. కెనడాలో ఐఎస్ఐ ఆపరేషన్లకు ఆమె అడ్డంకిగా మారింది. ఇక కరీమా మృతికి సంతాపంగా బలోచ్ నేషనల్ మూవ్మెంట్ 40 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఎలాంటి కార్యకలపాలు నిర్వహించకూడాని నిర్ణయించింది. ఇక ‘కెనడాలో ప్రవాసంలో నివసిస్తున్న బీఎస్ఎం నాయకురాలు, బలూచ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (బీఎస్ఓ) మాజీ చైర్పర్సన్ కరీమా బలిదానం బలూచ్ దేశానికి, జాతీయ ఉద్యమానికి తీరని నష్టమని’ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ కార్యదర్శి తెలిపారు. "బానుక్ కరీమా మరణంతో, మేము ఒక దూరదృష్టిగల నాయకురాలిని, జాతీయ చిహ్నాన్ని కోల్పోయాము. శతాబ్దాల పాటు పూడ్చలేని నష్టం ఇది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఆ 63 మంది హాయిగా ఇంట్లో ఉండేవారు!) ఇక నాలుగేళ్ల క్రితం అంటే 2016లో కరీమా ప్రధాని నరేంద్ర మోదీకి రక్షాబంధన్ సందేశం పంపారు. అదే ఏడాది ఆమె పాక్‌లో తన ప్రాణానికి ప్రమాదం ఉండటంతో కొందరు స్నేహితులు, కార్యకర్తల సాయంతో దేశం విడిచి పారిపోయారు. ఇక అదే ఏడాది బీబీసీ వెలువరించిన 100మంది అత్యంత ప్రభావవంతైన మహిళల జాబితాలో కరీమా చోటు దక్కించుకున్నారు. -
సోషల్ మీడియాలో పరిచయం.. ఆపై
ముంబై: భారత యుద్ధ విమానాల రహస్యాలను పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్‌కు(ఐఎస్ఐ) చేరవేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఉద్యోగిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. దీపక్ శిర్సాత్(41)నాసిక్‌లోని హెచ్ఏఎల్లో అసిస్టెంట్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తూ, సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తానీ మహిళగా పరిచయం చేసుకున్న వ్యక్తుల ట్రాప్‌లో పడ్డాడు. (చదవండి: రిపబ్లిక్ టీవీ సీఎఫ్ఓకు సమన్లు) ఈ నేపథ్యంలో ఐఎస్ఐతో నిత్యం సంబంధాలు నెరపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో, మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నాసిక్ యూనిట్ అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. యుద్ధ విమానాల రహస్య సమాచారాలను పాకిస్తాన్‌కు దీపక్ పంపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అతడి దగ్గర 3 మొబైల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, రెండు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అతడికి పదిరోజుల ఏటీఎస్ కస్టడీకి అనుమతించింది. -
ఐఎస్ఐ ఆన్లైన్ 'గేమ్' ప్లాన్
సాక్షి, హైదరాబాద్: భారత్‌లోని మధ్య తరగతి యువతే టార్గె ట్‌గా, కలర్ ప్రిడిక్షన్ గేమ్ పేరుతో ఆన్లైన్ బెట్టింగ్‌కు తెరలేపిన చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలి జెన్స్ (ఐఎస్ఐ) మద్దతు ఉందా? ఔననే అంటు న్నాయి కేంద్ర నిఘా వర్గాలు. హైదరాబాద్ సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టుచేసిన చైనా జాతీ యుడు, బీజింగ్ టీ పవర్ కంపెనీ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్ యాన్ హూ పాస్‌పోర్టును అధ్యయనం చేసిన కేంద్ర నిఘా వర్గాలు ఈ అను మానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఐఎస్ఐ లింక్ బీజింగ్ టీ పవర్ సంస్థ.. ‘ఈ–కామర్స్’ ముసుగులో నమోదు చేయించిన 8 కంపెనీల్ని ఢిల్లీలో ఉంటూ యాన్ హూ పర్యవేక్షిస్తున్నాడు. దీనికి ముందే గతేడాది నవంబర్‌లో ఇతగాడు పాకిస్తాన్ వెళ్లినట్లు అతడి పాస్‌పోర్టు వివరాల్ని విశ్లేషించిన ఐబీ వర్గాలు చెబుతున్నాయి. 15 రోజులు అక్కడే ఉన్న హూ ఐఎస్ఐ బాధ్యుల్ని కలిసినట్లు అనుమానిస్తు న్నాయి. భారత్ కేంద్రంగా సాగించే ఆన్లైన్ బెట్టింగ్ దందా నిర్వహణపై వారు చర్చించి ఉంటారని, ఐఎస్ఐ సంపూర్ణ మద్దతు తోనే గేమ్ మొదలై ఉం టుందని అంచనా వేస్తు న్నాయి. ఈ కోణంలో మరిన్ని ఆధారాల సేకర ణపై దృష్టి పెట్టాయి. దీనిపై సైబర్ క్రైమ్ పోలీ సులు లేదా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధి కారులు యాన్ హూను కస్టడీలోకి తీసుకున్నప్పుడు విచారించాలని నిర్ణయించారు. కొరియాలో సాఫ్ట్వేర్ అభివృద్ధి? కలర్ ప్రిడిక్షన్ గేమ్‌లో భాగంగా.. 3 నిమిషాలుండే ఒక్కో బెట్టింగ్లోనూ ఆఖరి 30 సెకండ్లు ఫలితాలను నిర్ధారిస్తున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఏ రంగుపై ఎక్కువ మంది/ ఎక్కువ మొత్తం బెట్టింగ్ కాస్తున్నారో వారు ఓడిపోయేలా ఈ ప్రోగ్రా మింగ్‌ను డిజైన్ చేశారు. ఈ మొత్తం సాఫ్ట్‌వేర్‌ను యాన్ హూ కొరియాలోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ వద్ద అభివృద్ధి చేయించినట్లు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. ఇతడు భారత్‌కు వచ్చే ముందు కొరియాకు వెళ్లివచ్చినట్లు ఇమ్మిగ్రేషన్ నుంచి సమాచారం అందుకున్న ఐబీ ఈ అంచనాకు వచ్చింది. యాన్ హూ ఇంకా ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, యూఏఈ, జపాన్ కూడా వెళ్లొచ్చాడని ఐబీ వర్గాలు చెబుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చిన సొమ్మును హాంకాంగ్ నుంచి ఆయా దేశాలకూ మళ్లించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర? ఢిల్లీకి చెందిన హేమంత్ సాయంతో తమ కంపెనీల్లో డమ్మీ డైరెక్టర్లను పెట్టి దందా నడిపిన యాన్ హూ, తన పేరు బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే కొన్ని బ్యాంకు ఖాతాల నిర్వహణకు ఆథరైజేషన్ తీసుకోవడం ద్వారా ఆయా కంపెనీలతో సంబంధాలున్నట్లు పరోక్ష ఆధారాలు అందించాడు. ఇప్పుడిదే దర్యాప్తులో కీలకం కానుంది. కలర్ ప్రిడిక్షన్ గేమ్‌లో రూ.1.5 లక్షలు పోగొట్టుకున్న ఎస్సార్‌నగర్‌కు చెందిన యువకుడి ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. ఈ తాజా కేసులో పీటీ వారెంట్‌పై నిందితుల్ని అరెస్టు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘బీజింగ్ టీ పవర్ కంపెనీకి ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నాం. ఇందులో మోసంతో పాటు ఇతర కోణాలున్నాయా అనేది పరిశీలిస్తున్నాం. భారత్‌పై పాక్ చేస్తున్న కుట్రలకు చైనా మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్థికంగా దెబ్బతీసే ఈ దందాకు ఐఎస్ఐ మద్దతునిచ్చిందనే భావిస్తున్నాం. ప్రాథమిక సమాచారాన్ని రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా), కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలకు చేరవేశాం’ అని వివరించారు. -
అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్ పన్నాగం!
న్యూఢిల్లీ: అయోధ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసే ప్రణాళికలు రచిస్తున్నట్టు భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చిన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో ఉగ్రదాడులు చేసి అంతర్గతంగా కల్లోలం సృష్టించాలని ఐఎస్ఐ కుట్రలు పన్నుతోందని పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (రా) అధికారులు వెల్లడించారు. మూడు నుంచి ఐదు టెర్రరిస్టు గ్రూపులు మన దేశంలోకి చొరబడేందుకు చూస్తున్నాయని, పాక్ ఐఎస్ఐ వారికి సాయం చేస్తోందని తెలిపారు. 20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయోధ్యతోపాటు కశ్మీర్‌లోనూ దాడులు చేసేందుకు పాకిస్తాన్‌లోని జలాల్‌బాద్‌లో ఐఎస్ఐ వారికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా అధికారులు సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న వేళ ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 5 న ప్రధాని మోదీ భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు అదే రోజు ఏడాది పూర్తవుతుండటం విశేషం. -
భారత్‌పై విద్వేషం: ట్విటర్ ఖాతా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాల్లో భారత్‌పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ గూడఛర్య సంస్థ ఐఎస్ఐ వాడుతున్న నకిలీ ఖాతాను ట్విటర్ తొలగించింది. సౌదీ యువరాణి నౌరా బింట్ ఫైసల్ పేరును అనుకరించేలా నౌరాఅల్‌సాద్ ఐడీ పేరుతో ఇదనియాలుసాఫ్ అనే ఖాతాను ట్విటర్ నిలిపివేసింది. పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నఈ ట్విటర్ ఖాతా ద్వారా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్టు గుర్తించారు. ఇతరులను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నందున ఇవి తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ సదరు ఖాతాను ట్విటర్ తొలగించింది. సోషల్ మీడియా వేదికల్లో పలు నకిలీ ఖాతాలను ఉపయోగిస్తూ భారత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై గల్ఫ్ దేశాల్లో ఐఎస్ఐ విషం చిమ్ముతోందని భారత భద్రతా దళాలు ఎప్పటి నుంచో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. నకిలీ ఖాతాలతో సోషల్ మీడియాలో భారత వ్యతిరేక సందేశాలను పాకిస్తాన్ చేరవేస్తోందని ఆధాలతో సహా భారత నిఘా వర్గాలు నివేదికను రూపొందించాయి. భారత్‌పై విద్వేష విషం చిమ్మేందుకు గల్ప్ దేశాల రాచరిక కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. చదవండి : ఆయన ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారు -
క్వెట్టాలో కరెన్సీ ప్రెస్!
సాక్షి, సిటీబ్యూరో: నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అక్కడి బలూచిస్థాన్ ప్రాంతంలో ఉన్న క్వెట్టాలో ప్రత్యేకంగా ఓ పవర్ ప్రెస్ ఏర్పాటు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రింట్ అవుతున్న నకిలీ నోట్లు అసలు వాటిని తలదన్నేలా ఉంటున్నాయి. బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వస్తున్న ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో చలామణి చేయించడంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమీన్ ఉల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది ఇతడి అనుచరుడిని పట్టుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాదాపు 11 నెలల గాలించి ఈ కీలక నిందితుడిని పట్టుకోగలిగారు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయని, 2013 నుంచి రిజిస్టర్ అవుతున్న ఈ కేసుల్లో బబ్లూ వాంటెడ్‌గా ఉన్నాడని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. రూట్ మార్చి.. క్వెట్టాలో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ తొలుత ఆ దేశ రాజధాని కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్‌కు పంపిస్తోంది. ఒకప్పుడు పాకిస్థాన్ నుంచి విమానాల ద్వారా దుబాయ్/సౌదీ అరేబియాలను తరలించేవారు. అక్కడున్న ఏజెంట్ల సహకారంతో జల మార్గంలో ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్రల్లోని వివిధ ఓడ రేవులకు చేర్చేవారు. చిత్తుకాగితాలు, ముడిసరుకులు ఇలా అనేక పేర్లతో ఈ కన్సైన్మెంట్స్ వచ్చేవి. గడిచిన కొన్నేళ్లుగా ఈ మార్గంలో తీసుకురావడం కష్టంగా మారడంతో ఐఎస్ఐ తన రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చలామణి చేయిస్తోంది. వివిధ దశల్లో ఏజెంట్లు.. నకిలీ కరెన్సీ డంప్ చేసి చలామణి చేయించడం ద్వారా పాకిస్థాన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. కరాచీ నుంచి మల్దా వరకు వివిధ దశల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్న ఐఎస్ఐ వారికి కమీషన్లు చెల్లిస్తోంది. సాధారణంగా హైదరాబాద్‌కు చేరే నకిలీ కరెన్సీ మార్పిడిన రేటు 1:3గా ఉండేది. అంటే రూ.30 వేలు అసలు నోట్లు ఇస్తే ఏజెంట్లు రూ.లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చే వారు. ఏళ్లుగా ఇదే రేటు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కమీషన్ పెరిగింది. కరెన్సీ నోట్లను పక్కాగా ముద్రిస్తున్న నేపథ్యంలోనే ఈ కమీషన్ కూడా పెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లా మాల్దాకు చెందిన బబ్లూ ఈ కరెన్సీని దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక మంది ఏజెంట్లకు సరఫరా చేస్తుంటాడు. ఇలా వెలుగులోకి.. చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి. 1991లో పోలీసులకు బాంబులతో పట్టుబడటంతో బాంబ్ గౌస్‌గా మారాడు. ఇతడిపై పోలీసులు ఉగ్రవాద చర్యల వ్యతిరేక చట్టం (టాడా) కూడా ప్రయోగించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2011 నుంచి నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనేక మంది ఏజెంట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఇతగాడు అక్కడ నుంచి నకిలీ కరెన్సీని వివిధ మార్గాల్లో నగరానికి రప్పించి చెలామణి చేస్తున్నాడు. ఇతగాడికి 2013లో మాల్దా జిల్లాలో కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన బబ్లూతో పరిచయం ఏర్పడింది. అతడికి రూ.40 వేల నుంచి రూ.50 వేల చొప్పున అసలు కరెన్సీ చెల్లిస్తూ రూ.లక్ష నకిలీ కరెన్సీ తెప్పించి చలామణి చేసేశాడు. బబ్లూ గౌస్‌తో పాటు అనేక మందికి సరఫరా చేస్తున్నాడు. ఈ కరెన్సీని నగరంలో సర్క్యులేట్ చేస్తున్న గౌస్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు 11 నెలల క్రితం పట్టుకున్నారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే బబ్లూ పేరు వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్‌గా మారిన అతడి కోసం అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, వి.నరేందర్‌లతో కూడిన బృందం మాల్దా వెళ్లి ఇతడి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు పట్టుకుని నగరానికి తీసుకువచ్చింది. తదుపరి చర్యల నిమిత్తం చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించింది. ఇతడి అరెస్టుకు సంబంధించి ఇతర జిల్లాలు, రాష్ట్రాల అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు.