
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్దేశ పూర్వకంగానే భారతీయుడు కులభూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ కిడ్నాప్ చేసినట్లు మరోసారి స్పష్టమైంది. కోట్లు చెల్లించి ఆయనను పాక్ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. మామా ఖదీర్ అనే బలోచిస్తాన్‌కు చెందిన ఓ సామాజిక ఉద్యమకారుడు ఈ విషయం వెల్లడించారు.
'ఇరాన్ నుంచి ముల్లా ఓమర్ అనే ఉగ్రవాది కులభూషణ్ జాదవ్‌ను కిడ్నాప్ చేశాడు. పాకిస్థాన్ కోట్లలో డబ్బులు ఇవ్వడంతోపాటు ఆదేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఆదేశాల మేరకే ఈ పనిజరిగింది. ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసిన జాదవ్‌ను ఇస్లామాబాద్‌కు క్వెట్టా మీదుగా తీసుకెళ్లి తీవ్రంగా అతడిని హింసించారు. అలా ఆయనతో తమ దేశానికి అనుకూలమైన ప్రకటనలు చెప్పించడం పాక్ మొదలుపెట్టింది. బలోచిస్తాన్‌లో ఎవరు అదృశ్యం అయినా, హత్యకు గురైనా దాని వెనుక పాకిస్థాన్, దాని సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉంటుంది' అని ఆయన అన్నారు.