అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసానికి ఐ‌ఎస్‌ఐ కుట్ర | Pakistani ISI Plotting With Khalistani Terror Group To Disrupt Amarnath Yatra, Says Officials | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసానికి ఐ‌ఎస్‌ఐ కుట్ర

Published Sat, Jul 27 2024 1:48 PM | Last Updated on Sat, Jul 27 2024 3:16 PM

Pakistani isi Plotting with Khalistani Terror Group

హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే అమర్‌నాథ్‌ యాత్రలో విధ్వంసానికి ఐ‌ఎస్‌ఐ తాజాగా ఖలీస్థానీ ఉగ్రవాద గ్రూపు బబ్బర్ ఖల్సాతో జతకట్టి కుట్ర పన్నినట్లు భారత రక్షణ విభాగం గుర్తించింది.

బీజేపీ, హిందూ నేతలే టార్గెట్‌గా ఈ విధ్వంసానికి ఐ‌ఎస్‌ఐ  వ్యూహం రచించినట్లు రక్షణశాఖ అధికారులు కనుగొన్నారు. పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లు.. ఉగ్రవాదులతో కలిసి ఈ కుట్రకు ప్లాన్‌ చేశారని అధికారులు భావిస్తున్నారు. కాగా గత నెలలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ పరిసరాల్లో ఉగ్రవాద కదలికలను ఇండియన్ ఆర్మీ గుర్తించింది.  

ఇదే సమయంలో జమ్ములో ఏడుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో భద్రతా బలగాలపై జరుగుతున్న దాడుల వెనుక పాక్ కుట్ర ఉందని భారత రక్షణ విభాగం భావిస్తోంది. తాజాగా నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలపై పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బీఏటీ) చేసిన దాడిని భారత ఆర్మీ దళాలు భగ్నం చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement