ఐఎస్‌ఐ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌ | Asim Munir appointed head of Pakistan’s ISI | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌

Published Thu, Oct 11 2018 5:29 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

Asim Munir appointed head of Pakistan’s ISI - Sakshi

అసిమ్‌ మునీర్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) అధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఐఎస్‌ఐ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నవీద్‌ ముఖ్తార్‌ ఈ నెల 1న రిటైరైన నేపథ్యంలో కొత్త చీఫ్‌గా మునీర్‌ను నియమిస్తున్నట్లు పాక్‌ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 25న ఆయన పదవీ బాధ్యతలు చేపడతారని తెలిపింది. 2016 డిసెంబర్‌ నుంచి ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌(డీజీ)గా ఉన్న ఆయన గతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్‌ (ఎంఐ) అధిపతిగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement