నిజామాబాద్ కార్పొరేషన్/కామారెడ్డి, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో అనుమతులు లేకున్నా వాటర్ ప్లాంట్లు అనేకం వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ఈ వాటర్ ప్లాంట్లను సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. నిర్వాహకులు మినరల్ వాటర్ అంటూ ప్రజలను నిలువు దోపిడీకి గురి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నా వారికి పట్టడం లేదు. నిజామాబాద్ నగరంతోపాటు నగర శివారు ప్రాంతాలలో దాదాపు 40వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో అయిదింటికి మినహా మరే వాటర్ ప్లాంటుకూ ఐఎస్‌ఐ ముద్ర లేదు.
ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే ఖర్చు తడిసి మోపడవుతుందని భావించిన కొందరు వ్యాపారులు మామూలు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని మినరల్ వాటర్ అంటూ ప్రజలను మో సం చేస్తున్నారు. ఐఎస్‌ఐ ప్రమాణాల ప్రకారం నీటిలో ఫ్లోరైడ్ తొల గింపుతో పాటు కెమికల్ కలుపుతారు. మామూలు వాటర్ ప్లాంట్లు నిర్వాహకులు ఫ్లోరైడ్‌ను మాత్రమే తొలగిస్తూ, మినరల్ వాటర్‌గా ప్రచారం చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ఐఎస్‌ఐ అనుమతులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నా, కొద్ది సంవత్సరాల తర్వాత ఖర్చులకు వెనుకాడుతూ రెన్యూవల్ చేసుకోవటంలేదు. ఒక్కో బాటిల్‌ను రూ. 12 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
నీటిని తోడేస్తున్నారు ....
వాటర్ ప్లాంట్లకు కావల్సిన నీళ్లను భూమిలో నుంచి తోడేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధం గా నీటిని తోడుతుండటంతో చుట్టూ పక్కల భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. వీటిపై ప్ర జలు గగ్గోలు పెడుతున్నా చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు.
కామారెడ్డిలోనూ అదే పరిస్థితి
కామారెడ్డి పట్టణంలో 16 ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఉండగా, వాటిలో ఏ ఒక్కదానికీ అను మతులు లేవని తెలుస్తోంది. పరిశుభ్రత లో పించిన ప్లాంట్ల నుంచి వచ్చే నీరు ప్రజల ప్రా ణాల మీదకు తెస్తోంది. 20 లీటర్ల బౌల్ ఒ క్కంటికి రూ.15 చొప్పున సరఫరా చేస్తున్నా రు. కామారెడ్డి పట్టణంలో 20 వేల పైచిలుకు కుటుంబాలు ఉండగా, అందులో సగానికి పైగా కుటుంబాలు ప్యూరిఫైడ్ బాటిళ్లను వా డుతున్నారు. అంటే కనీసంగా రోజుకు పదివేలకు పైగా బాటిళ్లు అమ్ముడుపోతున్నాయి. ఆ నీటిని తాగిన ప్రజలు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో నల్లాల ద్వారా వచ్చిన నీటిని, ఇళ్లల్లో ఉండే బోర్ల ద్వారా వచ్చిన నీటిని తాగితే ఎలాంటి రోగాలు వచ్చేవి కావని, ఇప్పుడు ప్యూరిఫైడ్ పేరుతో సరఫరా చేస్తున్న నీటి వాడకంతో అనేక సమస్యలు వస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ కరువు
ప్యూరిఫైడ్ ప్లాంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడతో యజమాను ల ఇష్టారాజ్యంగా మారింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ పలు ప్లాంట్లపై దాడులు జరిపి సీజ్ చేసిన రెండు రోజులకే తిరిగి తెరుచుకున్నాయంటే ఏ స్థాయిలో మేనేజ్ చేసుకుంటున్నారో స్పష్టమవుతోంది. శానిటరీ ఇన్‌స్పెక్ట ర్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నీటి నాణ్యతను పరీక్షించాల్సి ఉ న్నా ఎక్కడా ఆ పని జరగడం లేదు. ఐఎస్‌ఐ అనుమతి తీసుకోవాల్సిన ప్లాంట్ల యజమాను లు అవేమి పట్టించుకోవడం లేదు. నీటిని సరఫరా చేసే క్యాన్లు, బాటిళ్లను సరిగ్గా శుభ్రపర్చ డం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.