water plant
-
వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేతకు కుట్ర
గోపాలపురం: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు. పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు. టీడీపీ నాయకులు స్టే ఆర్డర్‌ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్‌తో ఫోన్లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.వాటర్ ప్లాంట్‌ను కూల్చిన టీడీపీ శ్రేణులుగుడివాడ టౌన్: కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డు వలివర్తిపాడు క్రాస్‌లోని వాటర్ ప్లాంట్‌ను టీడీపీ కార్యకర్తలు, వారి అనుచరులు గురువారం రాత్రి దౌర్జన్యంగా కూల్చివేశారు. గుంపుగా వచ్చి షట్టర్లు పగులగొట్టి ప్లాంట్ నడుపుతున్న వ్యక్తిపై దాడి చేయడంతో అతడి చెయ్యి విరిగింది. అతని భార్యను బయటకు నెట్టేసి భయానక వాతావరణం సృష్టించారు. వాటర్ ప్లాంట్‌లోని పరికరాలు, మోటార్, పైపులను ధ్వంసం చేశారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇప్పటికైనా స్పందించి గొడవలు ఆపాలని స్థానికులు కోరుతున్నారు. -
Delhi: బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్‌తో పాటు ఆ శాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాధిత చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి , చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. #WATCH | Delhi: A child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. The NDRF team has reached the site along with Inspector-in-charge Veer Pratap Singh from NDRF. It will soon start rescue operations by digging a new borewell parallel… pic.twitter.com/CbD4GAKzR3 — ANI (@ANI) March 10, 2024 -
త్వరలో ఆర్టీసీ నీళ్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో టీఎస్ఆర్టీసీ మంచినీళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రత్యేకంగా ఆర్టీసీ బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ తాగునీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. రైల్ నీర్ పేరుతో రైల్వే సొంత బ్రాండ్‌తో నీటిని స్టేషన్లలో విక్రయిస్తున్న తరహాలోనే ఆర్టీసీ కూడా సొంత బ్రాండ్‌తో బస్సులు, బస్టాండ్లలో విక్రయించనుంది. ఈమేరకు నగర శివారులోని ఓ ప్యాకేజ్డ్ వాటర్ ప్లాంట్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నీటి విక్రయం లాభసాటిగా ఉంటే, సొంత తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. టికెట్ రూపంలో వచ్చే ఆదాయంతో ఆర్టీసీ మనుగడ దాదాపు ప్రశ్నార్థకం కావటంతో ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత బ్రాండ్ ప్యాకేజ్డ్ నీటిని విక్రయించాలని నిర్ణయించింది. డివిజినల్ మేనేజర్ స్థాయి అధికారికి బాధ్యత ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సగటున నిత్యం 33 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్‌కు ముందున్న స్థితికి చేరుకోవటంతో, ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికుల ద్వారా కేవలం టికెట్ డబ్బులు మాత్రమే కాకుండా.. నీటిని అమ్మడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే కొంత తక్కువ ధరను విక్రయించడం ద్వారా డిమాండ్‌ను సృష్టించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం బస్టాండ్లలో పేరున్న బ్రాండ్లతోపాటు స్థానికంగా తయారయ్యే ఎన్నో రకాల మంచినీటి సీసాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ వీటిలో చాలావరకు నాణ్యత ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో, సొంత బ్రాండ్ పేరుతో నాణ్యమైన నీటిని అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఇటీవల ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. ఆమేరకు ఓ డివిజినల్ మేనేజర్ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించారు. ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చిందని తెలిసింది. గతంలో బిస్లెరీతో ఒప్పందం గతంలో రమణారావు ఎండీగా ఉన్న సమయంలో బిస్లెరీ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ లోగోను కూడా ముద్రించిన సీసాలను బస్టాండ్లలో విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. తొలుత కేవలం ఆ సీసాలను మాత్రమే అమ్మాలని నిబంధన విధించినా.. న్యాయపరమైన చిక్కులు రావటంతో వెనకడుగు వేసింది. ప్రస్తుతం ఆర్టీసీ లోగో చిన్నగా ఉన్న సీసా నీటిని బిస్లెరీ అమ్ముతోంది. కానీ దీనివల్ల ఆర్టీసీ బ్రాండ్‌కు గుర్తింపు రాలేదని ఆర్టీసీ తేల్చింది. దీంతో సొంతంగా కేవలం ఆర్టీసీ పేరుతోనే నీటి సీసాలను తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు కాంప్లిమెంటరీగా 500 మి.లీ. బిస్లెరీ సీసాలను ఇస్తోంది. సొంత బ్రాండ్ అందుబాటులోకి వచ్చాక, ఆ కాంప్లిమెంటరీ సీసాలతోపాటు, అన్ని బస్సుల్లో సొంత నీటి సీసాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. డ్రైవర్/కండక్టర్ టికెట్లతోపాటు నీటి సీసాలనూ విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కుదిరితే, బస్టాండ్లలో కేవలం ఆర్టీసీ బ్రాండ్ సీసా నీళ్లు మాత్రమే విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పేరు, డిజైన్ చెప్పండి సొంతంగా ఆర్టీసీ బ్రాండ్‌తో తయారయ్యే నీటికి ఏ పేరు పెడితే బాగుంటుందో, సీసా ఆకృతి ఎలా ఉంటే బాగుంటుందో 9440970000 వాట్సాప్ నంబర్‌కు సూచనలను పంపాలని ఆర్టీసీ కోరింది. ఎంపిక చేసిన వాటికి రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. -
అడివి శేష్ పెద్ద మనసు.. వారికోసం ఏకంగా వాటర్ ప్లాంట్..
కొందరు సెలబ్రిటీలు సామాజిక ధృక్పథాన్ని కలిగి ఉంటారు. సమాజంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు తమ వంతుగా ఏదైనా చేయాలనుకుంటారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలువురు తారలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా అడివి శేష్ కూడా ప్రభుత్వాసుపత్రిలోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 300 మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఆ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు రోగులకు తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న శేష్ తాత్కాలికంగా వాటర్ బాటిల్స్‌ను అందించారు. అంతేకాదు.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకుని హాస్పిటల్ అవసరాలకు సరిపడా తాగునీటిని సరఫరా చేసేందుకు సొంత ఖర్చుతో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. ఇది గంటకు వెయ్యిలీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. తాగునీటి సమస్య తీర్చిన శేష్‌ని ఆస్పత్రిలోని కరోనా రోగులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు. చదవండి: (గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్) -
కొత్తూర్‌లో డా.వైఎస్సార్ ఫౌండేషన్ వాటర్ ప్లాంట్
లక్సెట్టిపేట్: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్, ఎన్ఆర్ఐ గుండ అమర్నాథ్, 'నాటా' అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి దాతృత్వంతో కొత్తూర్ గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఈ ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి సహకారం అందించారు. ఆర్వో ప్లాంట్‌ను తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. డా.వైఎస్సార్ ఫౌండేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వందకు పైగా వాటర్ ప్లాంట్స్ నిర్మించి లక్షలాది మందికి ప్రతి రోజూ మంచి నీరు అందిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో హెల్త్ క్యాంప్‌లు, బస్సు షెల్టర్లు, వీధి దీపాలు, అనాధాశ్రయాలకు, వృధాశ్రమాలకు సహాయం చేస్తూ గత పదేళ్లుగా ఎంతో మందికి చేయూత అందిస్తోంది. ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన డాక్టర్ గోసల రాఘవరెడ్డి, దాత గుండ అమర్నాథ్, డాక్టర్ ప్రేమ్ సాగర్‌రెడ్డికి ఆళ్ల రామిరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. చదవండి: హైదరాబాద్ రేసర్.. రికార్డులు తిరగరాశాడు! చదవండి: ఉద్యోగ సామర్థ్యాలున్న పట్టణాల్లో హైదరాబాద్ టాప్ -
పార్క్ హయత్‌లో ఐవోటీ ఆధారిత వాటర్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హాస్పిటాలిటీ కంపెనీ హయత్ హోటల్స్ కార్పొరేషన్ దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారిత వాటర్ ప్యూరిఫికేషన్, బాట్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ‘వాటర్‌హెల్త్ ఇండియా’తో ఒప్పందం చేసుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించడం, నీటిని ఆదా చేయడం ఈ యూనిట్ ప్రత్యేకతని పార్క్ హయత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ థామస్ అబ్రహం మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. ప్రస్తుతం హయత్‌కు దేశంలో 30 హోటల్స్ ఉన్నాయి. వాటర్‌హెల్త్ సీఓఓ వికాస్ షా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఏటా 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ విడుదలవుతోందని, ఇది భూమిలో లేదా సముద్రాల్లో కలిసిపోతోందని చెప్పారు. ‘‘2040 నాటికి దేశంలో నీటి సంక్షోభం ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచ జనాభాలో మన వాటా 17 శాతం. కానీ నీటి వనరుల్లో మన వాటా 4 శాతమే’’ అని వివరించారు. -
మాట తప్పని నాయకుడు జగనన్న
వడమాలపేట : మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు జగనన్న అని.. అందులో భాగంగా టీసీ అగ్రహారం వాసులకు ఇచ్చిన హామీ మేరకు వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయించారని నగరి ఎమ్మె ల్యే ఆర్కే రోజా అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జిల్లాలో వడమాలపేట మండలం టీసీ అగ్రహారం మీదుగా సాగింది. అప్పుడు తమ గ్రామానికి విచ్చేసిన జననేతకు టీసీ అగ్రహారం ప్రజలు తాము తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని విన్నవించారు. అందులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు దాదాపు రూ.2.5 లక్షలతో ఆర్ఓ వాటర్ ప్లాంటును గ్రామంలో ఏర్పాటు చేయించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఆ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారం కోçసం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఆ మహానేత వైఎస్ పాలనను మళ్లీ తెచ్చుకోగలమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సురేష్‌కుమార్, సర్పంచ్ శశికళ, మండల కన్వీనర్ సదాశివయ్య, నగరి నియోజకవర్గ బూత్ కమిటీల కన్వీనర్ చంద్రారెడ్డి, వడమాలపేట మండల బూత్ కన్వీనర్ల మేనేజర్ తులసీరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చింతలూరులో ఫిల్టర్‌బెడ్ కట్టిస్తాం
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరులో యుద్ధప్రాతి పదికన వాటర్ ప్లాంట్ కట్టిస్తామని స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి చెప్పారు. వాటర్ క్లోరినేషన్ శాతం తెలు సుకునేందుకు పరీక్షలునిర్వహించాలని ఆర్డబ్ల్యూఎస్ అధి కారులను ఆదేశించారు. ‘సాక్షి’ మెయిన్‌లో ‘మరో ఉద్దానం.. చింతలూరు’శీర్షికతో ప్రచురితమైన కథనానికి జీవన్‌రెడ్డి స్పందించారు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శిం చారు. కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించారు. నాణ్యమైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. కాలనీవాసులను నడిపిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపారు. టీడీపీ – టీఆర్ఎస్ మిలాఖత్! సాక్షి, జగిత్యాల: టీఆర్ఎస్.. టీడీపీపై సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు రైతు సమ స్యలపై ఆందోళన చేపడితే.. టీడీపీ, బీజేపీలు సభలోనే ఉం డిపోయాయని విమ ర్శించారు. శనివారం జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, టీఆర్ఎస్ మొదటి నుంచే మిలాఖత్ అయి ఉన్నాయనీ, చంద్రబాబు కనుసన్నల్లోనే తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్లో చేరారన్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించడమే దీనికి నిదర్శ నమన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. -
చింతలూరులో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు
రాయికల్ (జగిత్యాల): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ అనంతశర్మ చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’ మెయిన్‌లో ‘మరో ఉద్దానం.. చింతలూరు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఎస్పీ అనంతశర్మ స్పందించారు. జగిత్యాలలోని రోటరీ క్లబ్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 29న గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
నగరి కళాశాలకు ఎమ్యెల్యే వాటర్ ప్లాంట్
నగరి: పట్ణణ పరిధిలో నూతనంగా ప్రారంభించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లక్ష రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంటును ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆమె ఆ ప్లాంటును ప్రారంభించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన సమయంలో తాగునీటి వసతి కల్పిస్తానని హామీ ఇచ్చానని, ఆ మేరకు మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. వాటర్ ప్యూరిఫయర్, ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశామని తెలిపారు. అదనపు మరుగుదొడ్లు కూడా త్వరలో నిర్మిస్తామన్నారు. ప్రిన్సిపాల్ రఘుపతి, మునిసిపల్ చైర్పర్సన్ కే.శాంతి, మాజీ చైర్మన్ కేజే కుమార్ పాల్గొన్నారు. -
గిరిజనకాలనీలో మినరల్ వాటర్‌ప్లాంట్
బిట్రగుంట : బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ రామస్వామిపాళెం గిరిజనకాలనీలో దాతల సహకారంతో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు బిట్రగుంట ఎస్సై వెంకటరమణ అన్నారు. పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో కాలనీలో జరుగుతున్న ప్లాంట్ పనులను ఎస్సై గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ విశాల్‌గున్నీ ఆదేశాల మేరకు కాలనీని దత్తత తీసుకుని సమగ్రంగా అభివద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా కాలనీలో గ్రావెల్‌రోడ్లు, ప్రతీ కుటుంబానికి మరుగుదొడ్ల నిర్మాణం, మొక్కల పెంపకంతో పాటు గిరిజనులకు ఆరోగ్య స్పహ పెంచేలా శుద్ధ జలం అందించేందుకు కాలనీలోనే ఉచితంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కాలనీవాసులకు రోజూ ఉచితంగా, అపరిమితంగా మినరల్ వాటర్ అందించనున్నట్లు తెలిపారు. -
శుద్ధమోసం!
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటర్ ప్లాంట్లు అపరిశుభ్రనీటినే క్యాన్లలో నింపేస్తున్న వైనం వ్యాధులబారిన పడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు చిత్తూరు నగరంలోని రామ్‌నగర్ కాలనీలో జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం సమీపాన ఓ వాటర్ ప్లాంట్ ఉంది. ఇక్కడ బోరు నీటినే సక్రమంగా శుద్ధి చేయకుండా సురక్షిత జలమంటూ ప్రజలకు అంటగడుతున్నారు. కాజూరు, మురకంబట్టు, కొంగారెడ్డిపల్లెల్లోనూ ఇదే పరిస్థితి... ఇది ఒక్క చిత్తూరు నగరంలోనే కాదు.. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. అపరిశుభ్ర నీటినే క్యాన్లకు నింపి ప్లాంట్ల యజమానులు ‘శుద్ధ’ మోసం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చిత్తూరు (కార్పొరేషన్) : చట్టంలోని లొసుగులు అక్రమ నీటి వ్యాపారులకు చుట్టాలుగా మారుతున్నాయి. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్ర నీటినే క్యాన్లలో నింపి సురక్షిత జలమని అమ్మేస్తున్నారు. అనుమతులు లేకుండా ప్రమాణాలకు పాతరవేస్తున్న వాటర్‌ప్లాంట్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. నిబంధనలకు పాతర జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 30 వాటర్ ప్లాంట్లు, అనధికారికంగా 400 ప్లాంట్లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేని ప్లాంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. రంగు నీళ్లు, బోరు నీటినే క్యాన్లకు నింపి, నకిలీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ స్టిక్కర్లు అంటించి అమ్మేస్తున్నారు. కనీసం క్యాన్లు కూడా సక్రమంగా ుభ్రం చేయడంలేదు. 20 లీటర్ల క్యాన్ వాటర్‌ను డిమాండ్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.50 కోట్ల వరకు నీటి వ్యాపారం సాగుతోంది. నామమాత్రంగా దాడులు వాటర్ ప్లాంట్ల నిర్వహణపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు. ఒకటిన్నర సంవత్సరంగా కేవలం 4 ప్లాంట్లపై తనిఖీలు చేసి చేతులు దులుపుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాలకార్మికులే ఎక్కువ వాటర్ ప్లాంట్లలో బాలకార్మికులే అధికంగా పనిచేస్తున్నారు. తక్కువ కూలీకి వస్తారనే నెపంతో ప్లాంట్ల యజమానులు చిన్నపిల్లలనే ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల మంది బాలకార్మికులు పనిచేస్తున్నా కార్మిక శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. బీఐఎస్ ఉంటేనే బీఐఎస్ గుర్తింపు ఉన్న వాటర్ ప్లాంట్లు మాత్రమే మా పరిధిలోకి వస్తాయి. విడి నీళ్ల అమ్మకాలు మాకు సంబంధం లేదు. వాల్టా చట్టాన్ని అనుసరించే ప్లాంట్లకు అనుమతించాలి. కలుషిత నీటిని అమ్మితే చర్యలు తప్పవు. - శ్రీనివాసులు, జిల్లా ఆహార తనిఖీ అధికారి నిబంధనలు ఇలా.. వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలంటే ముందుగా నీటిని పరీక్షించాలి. బోరైతే వాల్టా చట్టం కింద తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి అనుమతి పొంది, ప్రతి ఆరు నెలలకోసారి నీటిని పరీక్షించాలి. ప్రతి కేంద్రంలో ప్రయోగశాల ఉండాలి. రంగు, వాసన, రుచి, డెర్జిడిటీ, టోటల్ డిజుల్యడ్ సాలీడ్స్, సల్ఫైడ్, మాంగనీస్, కాపర్ తదితర 51 పరీక్షలు నిర్వహించాలి. తర్వాతే ప్లాంట్లకు అనుమతించాలి. -
పాఠశాలకు ఎన్నారైల వితరణ
దండేపల్లి(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో దండేపల్లి మండలం రెబ్బనపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు రూ.3 లక్షల విలువైన సామగ్రిని వితరణ చేశారు. వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్, ఆసిని ఫౌండేషన్, ఎఫ్4 సంస్థలు ఈ పాఠశాలలను దత్తత తీసుకున్నాయి. సంస్థల నిర్వాహకులు శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో 300 మంది పిల్లలకు నోట్‌బుక్కులు అందజేశారు. అంతేకాదు, విద్యార్థులు కూర్చునేందుకు అవసరమైన బెంచీలు తయారు చేయించి ఇచ్చారు. పాఠశాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. -
హాలాహలం! ప్రాణాలను తోడేస్తున్న జలం
♦ నీటి శుద్ధిపేరుతో యథేచ్ఛగా దందా ♦ పుట్టగొడుగుల్లా వెలిసిన ప్లాంట్లు ♦ అనుమతులు లేకుండానే కొనసాగింపు ♦ చోద్యం చూస్తున్న అధికారులు నీటిశుద్ధి ప్లాంట్లు జిల్లాలో ఎడాపెడా వెలుస్తున్నాయి. శుద్ధికి తిలోదకాలిచ్చి డబ్బు సంపాదనే ధ్యేయంగా నిర్వాహకులు యథేచ్ఛగా నీటి దందా నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు ‘నీళ్లు’వదులుతున్నారు. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండానే తమ ప్లాంటుకు బ్యూరోఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఎస్ఐ) గుర్తింపు ఉందని లేబుళ్లు ముద్రించి క్యాన్లకు అతికించి వ్యాపారం చేస్తుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచిత్రం. సిద్దిపేట: తీవ్ర వర్షాభావం.. ప్రజల అవసరాలను గుర్తించిన కొందరు నీటిశుద్ధి ప్లాంటు నెలకొల్పుతున్నారు. సుమారు పది ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా.. అవేవి పట్టించుకోకుండానే ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ బోరు బావి ఉంటే అక్కడ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. జిల్లాలో ఉన్న వాటర్ ప్లాంట్లలో కనీసం పదిశాతం ప్లాంట్లకు కూడా బీఎస్ఐ గుర్తింపులేకపోవడం పరిస్థితి తీవ్రతను, అధికారుల నిర్లక్ష్యాన్ని తెలుపుతోంది. ప్రజల అవసరమే వ్యాపారం... తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు చేసైనా మంచినీరు సేవించాలని ప్రజలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వాటర్ప్లాంట్ల యజమానులు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. జిల్లాలో సుమారు 350 ప్లాంట్లు ఉండగా 20 ప్లాంట్లకు మాత్రం బీఎస్ఐ గుర్తింపు ఉన్నట్లు సమాచారం. బీఎస్ఐ గుర్తింపు పొంది నీటిని శుద్ధిచేయాలంటే ప్రతిరోజూ 20 పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాని అందంత తమకెందుకని భావిస్తున్న వ్యాపారులు బోరుబావి నీటిని నామమాత్రంగా శుద్ధి చేస్తూ, తమ ప్లాంటుకు బీఎస్ఐ గుర్తింపు ఉందని లేబుళ్లు ముద్రించి క్యాన్లకు అతికించి వ్యాపారం చేస్తున్నారు. అవే నీటిని ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా నామమాత్రంగా శుద్ధి చేసిన నీటిని సేవిస్తే కాళ్లు, చేతులు లాగడం లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బీఎస్ఐ గుర్తింపు ఉంటే ... వాటర్ ప్లాంటు ఏర్పాటుకు బీఎస్ఐ గుర్తింపు పొందాలంటే వాల్టా చట్టం కింద భూగర్భ జల శాఖ అనుమతి తీసుకోవాలి. స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్యుత్, వాణిజ్య పన్నుల శాఖల నుంచి అనుమతి పొందాలి. ఇలా అన్ని అనుమతులు ఉంటేనే వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలి. కనీసం 2వేల చదరపు అడుగులలో ఏర్పాటు చేయాలి. ప్లాంటు చుట్టూ మురుగు కాలువలు లేకుండా చూసుకోవాలి. ప్లాంటులో స్యాండ్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, రివర్స్ ఆస్మాసిస్ విధానంలో వడగట్టిన నీటిని చివరికి అల్ట్రా వాయిలెట్ కిరణాల ద్వారా శుద్ధి చేసి బ్యాక్టిరియా తొలగిస్తారు. ఇలా ప్రతిరోజూ నాలుగు గంటలకోసారి పరీక్షలు చేస్తారు. అందులోనే ప్రత్యేకంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ల్యాబ్ టెక్నీషియన్లను నియమించి రోజూ 30 రకాల పరీక్షలు చేసి, నీటి శుద్ధిపై నివేదికలు తయారు చేసి బీఎస్ఐకి పంపాలి. అన్ని రకాల నాణ్యతలు ఉంటేనే తదుపరి ప్లాంటు నడపడానికి అనుమతిస్తారు. చాలా మంది వ్యాపారులు బీఎస్ఐ గుర్తింపులేకుండానే తమకు తోచిన విధంగా శుద్ధి చేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బీఎస్ఐ గుర్తింపులేని ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండు చేస్తున్నారు. -
వాటర్‌ప్లాంట్‌పై పోలీసుల దాడి
రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్, కిస్మత్పూర్లో అక్రమంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్‌పై బుధవారం సాయంత్రం ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. సురేశ్, బాదం అనే వ్యక్తులు కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్వాపెన్, కిండ్లీ పేర్లతో వాటర్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి, వాటర్ క్యాన్లతోపాటు ఫిల్టర్లను సీజ్ చేసి నిర్వాహకులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. -
శుద్ధికి నీళ్లొదిలారు!
కుళాయి నీళ్లు గరళం.. ఈ-కొలి వంటి ప్రమాదకర బ్యాక్టీరియాతో ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయి! మరి ఫిల్టర్ నీళ్లు..?! రూ.20, రూ.30కే క్యాన్ నిండా ఫిల్టర్ నీళ్లంటూ భాగ్యనగరంలో గల్లీకొకటి చొప్పున పదివేలకు పైగా వెలసిన వాటర్ ప్లాంట్లు విక్రయిస్తున్న జలం సురక్షితమేనా? కానేకాదు.. అందులోనూ విష కారకాలున్నట్టు స్పష్టమైంది. ఎలాంటి గుర్తింపుల్లేకుండా ఈ ప్లాంట్లు విక్రయిస్తున్న నీటిలో మల, మూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. ఈ నీటిని తాగినవారు టైఫాయిడ్, కామెర్లు, అతిసార వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వాటర్‌ప్లాంట్ నీళ్లలో గాఢత కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో నీరు ఆమ్లత్వం సంతరించుకుంటోంది. ఫలితంగా ఈ నీటిని తీసుకునేవారు గొంతు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రేటర్లో ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటి నాణ్యతను ‘సాక్షి’.. ల్యాబ్‌లో పరీక్షించింది. కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బహదూర్‌పురా, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఫిల్టర్‌ప్లాంట్లు విక్రయిస్తున్న నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు ఇవ్వగా.. ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి. - హైదరాబాద్, సాక్షి * వాటర్ ప్లాంట్ల నీటిలోనూ కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా * జనం ప్రాణాలతో ప్లాంట్ల నిర్వాహకుల చెలగాటం కోట్లలో నీళ్ల వ్యాపారం గ్రేటర్లో జలమండలి సరఫరా చేస్తున్న నీటి నాణ్యతపై నమ్మకం లేక వినియోగదారులు ఫిల్టర్ ప్లాంట్ల నీటిని కొంటున్నారు. మహానగరంలో నెలకు వంద కోట్లకు పైగా మంచినీటి వ్యాపారం జరుగుతోందని అంచనా. నగరంలో బీఐఎస్ జారీ చేసిన ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణ సర్టిఫికెట్ ఉన్న ప్లాంట్లు 500 మాత్రమే ఉన్నాయి. అనధికారికంగా వెలిసినవి 10 వేలకు పైనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు సుమారు 20 లక్షలనీటి క్యాన్లు (20 లీటర్లవి) అమ్ముడవుతున్నాయి. వీటిలో 12 లక్షల క్యాన్లు అనధికారిక ప్లాంట్లవే కావడం గమనార్హం. ఇక ప్రముఖ బ్రాండ్లకు చెందినవి 5 లక్షలు, ఐఎస్ఐ గుర్తింపు పొందిన ప్లాంట్లలో తయారవుతున్నవి మరో 3 లక్షల క్యాన్లు ఉన్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్యాంటీన్లు, హోటళ్లలో విక్రయిస్తున్న మంచినీటి బాటిళ్ల సంఖ్య (లీటరువి) సుమారు 50 లక్షల వరకు ఉంటుంది. వీటిలోనూ సగం బాటిళ్లకే ఐఎస్ఐ గుర్తింపు ఉంది. నిద్రమత్తులో యంత్రాంగం.. బీఐఎస్ సూచించిన 60 రకాల నాణ్యతా ప్రమాణాలను వాటర్ ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు యథేచ్ఛగా తుంగలోకి తొక్కుతున్నారు. ప్రమాణాలు పాటించని ప్లాంట్లపై ఆహార కల్తీ నిరోధక చట్టం(ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్)-2006 కింద చర్యలు తీసుకోవాల్సిన జీహెచ్ఎంసీ.. ఆ బాధ్యతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం)కు కట్టబెట్టి తప్పించుకుంది. ఐపీఎం అయినా కొరడా ఝలిపిస్తోందా అంటే అదీ లేదు. కల్తీ నీళ్ల బాటిల్, లేబుల్, తయారీ సంస్థ పక్కా చిరునామా అందించి, స్వయంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని ఐపీఎం చెబుతోంది. ఇక బీఎస్ఐ.. ఐఎస్ఐ ధ్రువీకరణ ఉన్న ప్లాంట్లనే తనిఖీ చేస్తామని, మిగతా ప్లాంట్లతో తమకు సంబంధం లేదని గిరి గీసుకుని కూర్చుంది. ఈ నీళ్లు తాగడానికి పనికిరావు ప్రయోగశాలలో పరీక్షించిన ఫిల్టర్ ప్లాంట్ల నీళ్లు తాగడానికి పనికిరావు. భారతీయ ప్రమాణాల సంస్థ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు లేవు. ఫిల్టర్ నీళ్లలో గాఢత బాగా పడిపోయింది. - మాధవి, వాటర్ క్వాలిటీ మేనేజర్ రోగాలు తథ్యం తాగే నీటిలో కోలిఫాం, ఈ-కొలి తదితర బ్యాక్టీరియా ఆనవాళ్లుంటే వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధుల బారిన పడతారు. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి నీటి ద్వారానే ఎక్కువగా శరీరంలోకి చేరుతాయి. మనిషికి ప్రతిరోజూ 500 మిల్లి గ్రాముల మెగ్నీషియం అవసరం. గర్భిణులకైతే మరింత ఎక్కువ కావాలి. ఇది ఆహారం ద్వారా కంటే నీటి ద్వారా తీసుకోవడం చాలా అవసరం. శుద్ధి క్రమంలో ఆవశ్యక మూలకాలు తొలగిస్తున్న ఫిల్టర్ ప్లాంట్ల నిర్వాహకులు.. ఆ ప్రక్రియ అనంతరం ఫోర్టిఫైడ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మినరల్స్‌ను కలపాలి. - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు, సన్షైన్ఆస్పత్రి పరీక్షల్లో ఏం తేలిందంటే..? * ఫిల్టర్ నీళ్ల గాఢత అత్యంత తక్కువగా ఉంది. సాధారణంగా తాగునీటి గాఢత 6.50-8.50 పీహెచ్ మధ్య ఉండాలి. కానీ ఈ నీటి గాఢత 5.50 పీహెచ్ లోపే ఉంది. ఈ నీటిని తాగినవారు పొడి దగ్గు, గొంతునొప్పి సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. * ప్యాకేజీ వాటర్‌లో ప్రతి వంద మిల్లీలీటర్ల నీటిలో బ్యాక్టీరియా కౌంట్ 100 కాలనీ ఫామింగ్ యూనిట్స్(సీఎఫ్‌యూ) మించరాదు. కానీ పలుచోట్ల కోలిఫాం బ్యాక్టీరియా 200 సీఎఫ్‌యూ ఉంది. వీటిని తాగిన వారు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. * భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) లెక్కల ప్రకారం.. ఫిల్టర్ ప్లాంట్లలో శుద్ధిచేసిన నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు ప్రతి లీటరు నీటికి 100-150 మిల్లీ గ్రాములుండాలి. కానీ పలు నమూనాల్లో 50-76 మిల్లీ గ్రాములు మాత్రమే ఉంది. * ప్రతి లీటరు నీటిలో క్యాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములుండాలి. కానీ కొన్నిచోట్ల ఒక మిల్లీగ్రాము, మరికొన్ని చోట్ల అసలు క్యాల్షియం ఆనవాళ్లే లేవు. * ప్రతి లీటరు నీటిలో మెగ్నీషియం మోతాదు 30 మిల్లీ గ్రాములుండాలి. కానీ పలు నమూనాల్లో 0.96 మిల్లీగ్రాములు ఉంది. కొన్నిచోట్ల అదీ లేదు. * లీటరు నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 1 మిల్లీ గ్రాములు మించరాదు. చాలా చోట్ల 1.5 మిల్లీగ్రాములుంది. * లీటరు నీటిలో ఐరన్ మోతాదు 0.3 మిల్లీ గ్రాములుండాలి. చాలాచోట్ల 0.02 మిల్లీ గ్రాములుంది. కొన్నిచోట్ల అదీ లేదు. వాటర్ ప్లాంట్లలో ఏం జరుగుతోంది? * భూగర్భ జలాన్ని శుద్ధిచేసే సమయంలో ఫిల్ట్రేషన్, ఏరేషన్, కార్బన్ ఫిల్ట్రేషన్.. ఇలా 12 రకాల శుద్ధి ప్రక్రియలు జరగాలి. కానీ అవన్నీ తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. = శుద్ధి చేసిన 48 గంటల తర్వాతే బాటిళ్లలో మంచినీటిని నింపాలి. కానీ వెంటనే నింపేస్తున్నారు. దీంతో నీటి గాఢత పడిపోతుంది. * చాలా ప్లాంట్లు మురికివాడలు, పారిశ్రామిక వాడలు, ఇరుకు గదుల్లోనే వెలిశాయి. వాటి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. * అనధికారిక ప్లాంట్లలో ప్రతి 20 లీటర్ల నీటి శుద్ధికి నిర్వాహకులు రూ.4 ఖర్చు చేసి, జనం నుంచి మాత్రం రూ.20 నుంచి రూ.30 వరకు దోచుకుంటున్నారు. * బీఐఎస్ ప్రమాణాల ప్రకారం.. నీటిని నింపే సీసాలు, క్యాన్లు పాలీ ఇథిలిన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీప్రొపిలీన్‌తో తయారైన వాటిని వినియోగించాలి. వీటి ధర రూ.280 నుంచి రూ.400 (20 లీటర్ల డబ్బా) వరకు ఉంటుంది. కానీ ధర ఎక్కువన్న కారణంతో ప్లాంట్లలో నాసిరకం పెట్‌బాటిల్స్‌ను వినియోగిస్తున్నారు. వీటి ధర రూ.100 నుంచి రూ.120 లోపే ఉంటుంది. వీటిలో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతోంది. ఇలా చేయండి.. * కుళాయి నీరు అయినా ఫిల్టర్ నీళ్లయినా బాగా మరిగించి, చల్లార్చి తాగితే మేలని నిపుణులు సూచిస్తున్నారు. * ఇంట్లోకి నీటి ఫిల్టర్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఐఎస్ఐ నాణ్యతతో ఉన్నవి తీసుకోవాలి. * ప్యాకేజీ, ఫిల్టర్ నీళ్లను విక్రయిస్తున్న వారికి భారతీయ ప్రమాణాల సంస్థ(బీఐఎస్) జారీ చేసిన ఐఎస్ఐ గుర్తింపు ఉందో లేదో పరిశీలించాలి. * హైదరాబాద్‌లో మినరల్ వాటర్ విక్రయిస్తున్న సంస్థలు 10 లోపే ఉన్నాయి. ఈ సంస్థలు నీటిని ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయడంతోపాటు దేహానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాల(మినరల్స్)ను కలుపుతాయి. * ఫిల్టర్ ప్లాంట్లు నీటిని శుద్ధి చేస్తాయి. మినరల్ వాటర్ కంపెనీలు నీటిని శుద్ధి చేసి మినరల్స్ కలుపుతాయి. -
'ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యం'
ఒంగోలు : ప్రకాశం జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయడమే తమ లక్ష్యమని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని అనకర్లపూడిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోతుల రామారావు, పార్టీ సమన్వయకర్త అశోక్ బాబులతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. -
జీఎంసీ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు
ఇన్చార్జి కమిషనర్ శ్రీధర్ అరండల్‌పేట: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కమిషనర్ సీహెచ్.శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. తొలుత నగరానికి మంచినీటిని సరఫరా చేసే తక్కెళ్లపాడు వాటర్‌ప్లాంటును తనిఖీచేశారు. అక్కడ నీటిలో క్లోరిన్శాతాన్ని పరిశీలించారు. అనంతరం ప్లాంటులోని బెడ్లను పరిశీలించి మొత్తం ఆరు బెడ్లు శిధిలావస్థకు చేరడాన్ని గమనించి వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. ప్లాంటు విస్తరించి ఉన్న 40 ఎకరాలకు రక్షణగోడను నిర్మించాలని, ప్లాంటుకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇక్కడ ఎకరం స్థలంలో సొంతంగా నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నగరంలోని సెంటర్ డివైడర్లు, ఐలాండ్లు, జంక్షన్ల వద్ద గోడలపై విపరీతంగా పోస్టర్లు అతికించి ఉండటం గమనించి వాటిని వెంటనే తొలగించాలన్నా రు. తిరిగి అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నా రు. ఐలాండ్లు, సెంట్రల్ డివైడర్లలో మొక్కలు పెంచాలనని చెప్పారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు, బ్యానర్లను తొలగించాలన్నారు. గుజ్జనగుండ్ల వాకింగ్‌ట్రాక్‌ను పరిశీలించి అక్కడ జిమ్, యోగా సెంటర్, లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, చెరువుకు నీరు పెట్టేందుకు వంకాయలపాడు కాలువ నుంచి నిర్మిస్తున్న పైపులైన్ పనులు పూర్తిచేయాలన్నారు. గుజ్జనగుండ్ల నుంచి పెదపలకలూరు వెళ్లే రహదారిని నిర్మించేందుకు అంచనాలు సిద్దంచేయాలన్నారు. ఈ పర్యటనలో ఎస్ఈ డి మరియన్న, ఈఈలు రాంనాయక్, వెంకటేశ్వర్లు, ఏసిపి రవీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
విష జ్వరాలతో విద్యార్థుల విలవిల
నందిగాం: హరిదాసుపురం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని పదుల సంఖ్యలో విద్యార్థులు రెండు వారాల నుంచి విష జ్వరాలు, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. సుమారు 40 మంది విద్యార్థులు ప్రస్తుతం పలాస, పూండి తదితర ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఈ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి (కృష్ణరాయపురం) తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన విషయం తెలి సిందే. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వైద్యులు కనీసం స్పందించడం లేదని గ్రామస్తులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో హరిదాసుపురం, ఆనందపురం, బోరుభద్ర, ఉప్పలపుట్టి, మాదిగాపురం, కామదేనువు, కృష్ణరాయపురం, కంచివూరు, పెద్దలవునిపల్లి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు గుంట యుగంధర్, దుంపల భవాణి, పినకాన ప్రేమకుమార్, గుంట ధనుంజయరావు, దుంపల భాగ్యలక్ష్మి, కంచరాన మౌళి, పినకాన హరి, బమ్మిడి హరి, హనుమంతు యామిని, కె.దివ్య, బి.అశ్విని, ఎస్.భాస్కరరావుతోపాటు సుమారు 40 మంది విద్యార్థులు ప్రస్తుతం జ్వరం, పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. కొందరు పూండి, పలాస ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు వైద్యులకు తెలియజేసినా స్పందించ లేదని విమర్శిస్తున్నారు. మూలకు చేరిన వాటర్ ప్లాంట్ ఈ పాఠశాలకు స్థానిక యువ ఇంజనీర్లు సంకల్ప ట్రస్ట్ ద్వారా గత రెండేళ్ల కిందట వాటర్ ప్లాంట్ మంజూరు చేశారు. ఆరు నెలల నుంచి ఇది మూలకు చేరడంతో విద్యార్థులు బోరు, బావి నీటినే తాగుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధులు ప్రబలుతున్నాయని పలువురు చెబుతున్నారు. మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండే ది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. గ్రామంలో విద్యార్థులు వ్యాధి బారిన పడడంతో సీపీఎం మండల నాయకుడు పాలిన సాంబమూర్తి గ్రామాన్ని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
వాటర్‌షెడ్ పనులు పూర్తిచేయాలి
చేవెళ్ల: వాటర్‌షెడ్ ద్వారా 2013-14 సంవత్సరానికి నిర్దేశించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చేవెళ్ల క్లస్టర్ వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి ప్రజ్ఞ సూచించారు. మండల కేంద్రంలోని నీటియాజమాన్య సంస్థ కార్యాలయంలో సోమవారం చేవెళ్ల, షాబాద్, పూడూరు మండలాల పరిధిలోని వాటర్‌షెడ్ టెక్నికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వాటర్‌షెడ్ పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞ మాట్లాడుతూ చేవెళ్ల క్లస్టర్‌లోని ఐదు వాటర్‌షెడ్ గ్రామాలలో 250 ఎకరాలలో పండ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినా ఇప్పటికి కేవలం 40 ఎకరాలలో మాత్రమే పూర్తిచేయగలిగామని తెలిపారు. కూలీల కొరత, రైతులు ముందుకు రాకపోవడం తదితర కారణాలతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు. గత 2013-14 వాటర్‌షెడ్ ద్వారా చేయాల్సిన పనుల సమయం ఈ నెలాఖరు వరకే ఉన్నదని, వచ్చే నెల కొత్త సంవత్సరం, కొత్త లక్ష్యాలు ఉంటాయని వివరించారు. వాటర్‌షెడ్ గ్రామాలలో సోలార్ వీధి దీపాలు, వాటర్ప్ల్లాంటు ఏర్పాటు, పాఠశాలల్లో బెంచీల సౌకర్యం, మినీవాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వం 80శాతం నిధులను సమకూరుస్తుందని, మిగతా 20 శాతం నిధులను గ్రామస్తులు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లిలో సోలార్ వీధిదీపాల ఏర్పాటు పూర్తి కావచ్చిందని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. వాటర్‌షెడ్ పనులు చేయడానికి కూలీల కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని టెక్నికల్ అసిస్టెంట్లు పీఓ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ జేఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, రాంచంద్రన్, పలు మండలాల టెక్నికల్ అధికారులు, అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
జిల్లాలో నీళ్ల దందా జోరుగా
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో నీళ్ల దందా జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలో వాటర్ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎండాకాలం కావడం, ‘మంచి’ నీరు దొరికే పరిస్థితి లేకపోవడంతో వాటర్ క్యాన్, బాటిళ్లు, ప్యాకెట్లకు గిరాకీ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకుని వాటర్‌ప్లాంట్ యజమానులు అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్లాంట్లను నిర్మిస్తున్నారు. సాధారణంగా వాటర్‌ప్లాంటు నిర్మించాలంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బీఐఎస్), ఐఎస్ఐ మార్క్ అనుమతి పొందాలి. ఈ అనమతులు పొందాలంటే రూ.లక్షలతో కూడుకున్న పని. ఇవేమిలేకుండానే సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్లాంట్లను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా లో వందకుపైగా వాటర్ప్లాంట్లు ఉన్నాయి. అనుమతి లేనివి అధికంగా ఉండగా, అనుమతి ఉన్నవి మాత్రం ఖానాపూర్‌లో ఒకటి, మంచిర్యాలలో ఒకటి మాత్రమే. అన్ని వాటర్ ప్లాంట్ల ద్వారా జిల్లాలో రోజు 3.50 లక్షల లీటర్లకు పైనే మినరల్ వాటర్ వ్యాపారం జరుగుతుండగా.. రూ. 1.50 కోటిపైగా దం దా సాగుతుంది. ప్లాంట్లు ఏడాదికోసారి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రమాణాలకు తిలోదకాలు వాటర్‌ప్లాంట్ నెలకొల్పాలంటే బీఐఎస్ నుంచి సర్టిఫికెట్ పొందాలి. సర్టిఫికెట్ ఇచ్చే ముందు వాటర్‌ప్లాంట్ నెలకొల్పే ప్రాంతంలో పక్కా భవనం, కనీసం ఐదారు గదులు, లేబోరేటరీ, వాటర్ ప్యూరిఫికేషన్ పరికరాలు ఉం డాలి. అధికారులు భూమిలోని నీటిని పరి శీలిస్తారు. ఆ నీటి రంగు, వాసన, మడ్డి, ఉదజని సూచిక, ఇనుము, క్లోరైడ్, నీటిలో కరిగే లవణాలు, సల్ఫైడ్, నైట్రేట్, ఫ్లోరైడ్, కాలుష్యం వంటి అంశాలు పరిశీలిస్తారు. దీని ప్రకా రం ప్యారామిటర్ నిర్ధారించి ప్లాంట్ నెలకొల్పేందుకు ఐఎస్ఐ సర్టిఫికెట్ ఇస్తారు. దీని ఆధారంగా జిల్లా కేంద్రంలోని ఆహార నియంత్రణ సంస్థ ఆ ప్లాంట్‌కు లెసైన్స్ జారీ చేస్తుం ది. ఈ నిబంధనల ప్రకారం ఒక వాటర్ ప్లాం ట్ నెలకొల్పాలంటే రూ.40 లక్షల వరకు ఖర్చవుతుంది. ఏటా సర్టిఫికెట్ రెన్యూవల్‌కు రూ.లక్ష వరకు చెల్లించాలి. దీనికితోడు ఆహార నియంత్రణ శాఖాధికారులకు మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. మూడు మాసాలకోసారి బీఐఎస్ అధికారులు ప్లాంట్‌ను పరిశీలించి నివేదికను ఇస్తారు. రోజు ప్లాంట్ ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించడంతో పాటు 15 రోజులకోసారి బీఐఎస్ గుర్తింపు పొందిన ల్యాబ్‌కు నీటి శాంపిల్స్ పంపి నివేదికలు బీఐఎస్‌కు సమర్పించాలి. అదేవిధంగా శుద్ధమైన వాతావరణంలో ఎయిర్టైట్లో నీటిని క్యాన్లు, బాటి ళ్లు, ప్యాకెట్లలో నింపాలి. వీటిపై బ్యాచ్ నంబ ర్, ప్యాక్ చేసిన తేదీ, గడువు తేదీ, కంపెనీ వివరాలు ముద్రించాలి. ఈ ప్రక్రియ కొనసాగితే బీఐఎస్ గుర్తింపు ఇస్తుంది. నిబంధనలు హుష్‌కాకి ప్రతి ప్లాంట్‌లోనూ ఎంఎస్సీ, బీఎస్సీ పట్టభద్రులు నీటిని పరీక్షించేందుకు నియమించాలని నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలో ఏ ప్లాంట్‌లోనూ వారి ఆచూకీ కనబడదు. దీంతో నీటిశుద్ధి అనేది నామమాత్రంగా జరుగుతుందనేది వాస్తవం. అన్ని ప్లాంట్లలో అపరిశుభ్రమైన వాతావరణంలో నీటిని ప్యాక్ చేస్తున్నారు. ఎయిర్టైట్లో నీటిని నింపాల్సి ఉండగా అదేమీ పట్టించుకోకుండా నింపుతుండడంతో నీటిలో క్రిములు చేరి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇవి తాగిన ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారు. అధికారులకు మామూలే.. బీఐఎస్ అనుమతి పొందిన ప్లాంట్లను ఆహార నియంత్రణ సంస్థ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ నీటి శుద్ధత విషయంలో నిఘా ఉంచాలి. అదేవిధంగా నాన్ బీఐఎస్ ప్లాం ట్లపై కూడా వారి నిఘా కొనసాగాలి. అయితే ఈ శాఖాధికారులు మామూళ్ల మత్తులో మునిగి ప్లాంట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనలు పాటించని ప్లాంట్లపై పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేయాలి. అలా జరగడం లేదు. బీఐఎస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైతే ఐఎస్ఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ప్రభుత్వ పథకాల ద్వారా అందజేసే ప్రోత్సాహకాలు, విద్యుత్ పంపిణీ నిలిపివేయాలి. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల కలెక్టర్ అహ్మద్‌బాబు జిల్లాలోని నాన్ బీఐఎస్ ప్లాంట్లను గుర్తించి సీజ్ చేయాలని రెవెన్యూ, మున్సిపాలిటీ, ఆహార నియంత్రణ శాఖాధికారులను ఆదేశించారు. ఎన్నికల బిజీలో ఉం డడంతో అధికారులు ఇప్పటివరకు వాటిపై దృష్టి సారించలేదు. ఇప్పటికైనా వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలకు నాణ్యమైన నీటిని అందించాలని పలువురు కోరుతున్నారు. -
కబలించిన కరెంట్
బనగానపల్లెటౌన్, న్యూస్‌లైన్ : జీవనోపాధి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ మహిళను పని చేస్తున్నచోటే కరెంట్ కబలించింది. షాక్ తగిలిన మరుక్షణమే ఆమె విగతజీవిగా మారింది. తీగలకు వేలాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన బనగానపల్లె 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీసీ జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న వాటర్‌ప్లాంట్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణ ప్రజలకు శుద్ధ తాగునీటిని అందించేందుకోసం బీసీ జనార్ధన్‌రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణం తలపెట్టారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో తెలుగుపేటకు చెందిన వెంకటలక్ష్మమ్మ, రమణమ్మ, బి.లక్ష్మిదేవి సోమవారం సున్నం వేసేందుకు వెళ్లారు. ప్లాంట్‌పై సున్నం వేస్తుండగా పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి లక్ష్మిదేవి(38) అక్కడికక్కడే మరణించింది. పక్కనే ఉన్న కూలీలు ప్రాణభయంతో పరిగెత్తారు. తీగలకు ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసిననప్పటికీ అవి విద్యుత్ తీవ్రతను నిరోధించలేకపోయాయి. ఫలితంగా ఓ మహిళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధిత కుటుంబీకులను ఓదార్చారు. తీగలపై ఉన్న మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలి భర్త శ్రీనివాసులు స్థానిక ఫైర్ స్టేషన్లో పనిచేస్తూ గత ఏడాది ఉద్యోగం పర్మినెంట్ కావడంతో నంద్యాలకు బదిలీ అయ్యాడు. లక్ష్మిదేవి మరణంతో కూతురు మౌనిక, కుమారుడు అశోక్‌తోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రక్షిత మంచినీటి సరఫరానే లక్ష్యం
ఇస్కపల్లి(మర్రిపాడు), న్యూస్‌లైన్: ప్రతి పల్లెకు రక్షిత మంచినీరు సరఫరా చేయడమే తమ లక్ష్యమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం ఇస్కపల్లిలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఇస్కపల్లిలో లభించే నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉన్నందున ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వీరికి స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వమే ప్లాంట్ నిర్మించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఊరికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారన్నారు. ఆయన మరణానంతరం ఆ పథకాలు మూలనపడ్డాయన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగు రాష్ట్రాన్ని విభజించడం సమంజసంకాదన్నారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ సీఎం అయితే కష్టాలు దూరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజల కష్టాలు దూరమైపోతాయని రాజమోహన్‌రెడ్డి అన్నారు. వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛన్‌ను రూ. 500, వికలాంగులకు వెయ్యి రూపాయలకు పెంచుతారన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రకటన రానుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి కోసం ప్రజలు అవస్థ పడుతున్నారని, రానున్న రోజుల్లో ఆ సమస్య పరిష్కరిస్తానన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలను తొలగించేందుకు సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మించిన ఘనత మేకపాటి రాజమోహన్రెడ్డిదేనన్నారు. ఆయన మంచి మనసున్న నేతని పేర్కొన్నారు. ప్రజలు అడిగిందే తడువుగా సొంత నిధులు వెచ్చించి వాటర్ ప్లాంట్ నిర్మించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి, బిజివేముల వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్‌లు పెంచలయ్య, బొర్రా వెంకటేశ్వర్లురెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శంకర్‌రెడ్డి, సోమల మాధవరెడ్డి, జయరామిరెడ్డి పాల్గొన్నారు. -
నేడు జనవాడకు కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ
శంకర్పల్లి, న్యూస్‌లైన్: మం డలంలోని జనవాడలో వాటర్ హెల్త్ ఇండియా, జలధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను శుక్రవా రం మధ్యాహ్నం కేంద్ర వా ణిజ్య పన్నుల శాఖ మంత్రి ఆనంద్ శర్మ ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాం తాల్లోని ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్‌హెల్త్ ఇండి యా ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించడానికి కేంద్ర మంత్రి ఆనంద్ శర్మతోపాటు భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పా వెల్, హాలీవుడ్ దర్శకులు, బాలీవుడ్ నటులు, దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజ రు కానున్నారు. ప్రముఖులు రానుండటంతో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పోలీసులు ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. -
శుద్ధ జలం..అబద్ధం
నిజామాబాద్ కార్పొరేషన్/కామారెడ్డి, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలో అనుమతులు లేకున్నా వాటర్ ప్లాంట్లు అనేకం వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన ఈ వాటర్ ప్లాంట్లను సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. నిర్వాహకులు మినరల్ వాటర్ అంటూ ప్రజలను నిలువు దోపిడీకి గురి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నా వారికి పట్టడం లేదు. నిజామాబాద్ నగరంతోపాటు నగర శివారు ప్రాంతాలలో దాదాపు 40వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో అయిదింటికి మినహా మరే వాటర్ ప్లాంటుకూ ఐఎస్ఐ ముద్ర లేదు. ఐఎస్ఐ ప్రమాణాలు కలిగిన వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే ఖర్చు తడిసి మోపడవుతుందని భావించిన కొందరు వ్యాపారులు మామూలు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని మినరల్ వాటర్ అంటూ ప్రజలను మో సం చేస్తున్నారు. ఐఎస్ఐ ప్రమాణాల ప్రకారం నీటిలో ఫ్లోరైడ్ తొల గింపుతో పాటు కెమికల్ కలుపుతారు. మామూలు వాటర్ ప్లాంట్లు నిర్వాహకులు ఫ్లోరైడ్‌ను మాత్రమే తొలగిస్తూ, మినరల్ వాటర్‌గా ప్రచారం చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ఐఎస్ఐ అనుమతులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నా, కొద్ది సంవత్సరాల తర్వాత ఖర్చులకు వెనుకాడుతూ రెన్యూవల్ చేసుకోవటంలేదు. ఒక్కో బాటిల్‌ను రూ. 12 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. నీటిని తోడేస్తున్నారు .... వాటర్ ప్లాంట్లకు కావల్సిన నీళ్లను భూమిలో నుంచి తోడేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధం గా నీటిని తోడుతుండటంతో చుట్టూ పక్కల భూగర్భ జలమట్టం తగ్గిపోతోంది. వీటిపై ప్ర జలు గగ్గోలు పెడుతున్నా చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేసిన దాఖలాలు లేవు. కామారెడ్డిలోనూ అదే పరిస్థితి కామారెడ్డి పట్టణంలో 16 ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు ఉండగా, వాటిలో ఏ ఒక్కదానికీ అను మతులు లేవని తెలుస్తోంది. పరిశుభ్రత లో పించిన ప్లాంట్ల నుంచి వచ్చే నీరు ప్రజల ప్రా ణాల మీదకు తెస్తోంది. 20 లీటర్ల బౌల్ ఒ క్కంటికి రూ.15 చొప్పున సరఫరా చేస్తున్నా రు. కామారెడ్డి పట్టణంలో 20 వేల పైచిలుకు కుటుంబాలు ఉండగా, అందులో సగానికి పైగా కుటుంబాలు ప్యూరిఫైడ్ బాటిళ్లను వా డుతున్నారు. అంటే కనీసంగా రోజుకు పదివేలకు పైగా బాటిళ్లు అమ్ముడుపోతున్నాయి. ఆ నీటిని తాగిన ప్రజలు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో నల్లాల ద్వారా వచ్చిన నీటిని, ఇళ్లల్లో ఉండే బోర్ల ద్వారా వచ్చిన నీటిని తాగితే ఎలాంటి రోగాలు వచ్చేవి కావని, ఇప్పుడు ప్యూరిఫైడ్ పేరుతో సరఫరా చేస్తున్న నీటి వాడకంతో అనేక సమస్యలు వస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షణ కరువు ప్యూరిఫైడ్ ప్లాంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడతో యజమాను ల ఇష్టారాజ్యంగా మారింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ పలు ప్లాంట్లపై దాడులు జరిపి సీజ్ చేసిన రెండు రోజులకే తిరిగి తెరుచుకున్నాయంటే ఏ స్థాయిలో మేనేజ్ చేసుకుంటున్నారో స్పష్టమవుతోంది. శానిటరీ ఇన్స్పెక్ట ర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నీటి నాణ్యతను పరీక్షించాల్సి ఉ న్నా ఎక్కడా ఆ పని జరగడం లేదు. ఐఎస్ఐ అనుమతి తీసుకోవాల్సిన ప్లాంట్ల యజమాను లు అవేమి పట్టించుకోవడం లేదు. నీటిని సరఫరా చేసే క్యాన్లు, బాటిళ్లను సరిగ్గా శుభ్రపర్చ డం లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. అధికార యంత్రాంగం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.