దేశ రాజధాని ఢిల్లీలోని ఒక బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి పడిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందం కూడా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు.
ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్‌తో పాటు ఆ శాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాధిత చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి , చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు.
#WATCH | Delhi: A child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. The NDRF team has reached the site along with Inspector-in-charge Veer Pratap Singh from NDRF. It will soon start rescue operations by digging a new borewell parallel… pic.twitter.com/CbD4GAKzR3
— ANI (@ANI) March 10, 2024
Comments
Please login to add a commentAdd a comment