borewell
-
కరువు సీమలో విచిత్రం..
-
బోరింగులో నుండి కారుతున్న పాలు
-
బోరుబావిలో బాలిక.. విషాదంగా ముగిసిన ఘటన
-
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత
జైపూర్ : రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత డిసెంబర్ 23న మధ్యాహ్నం కోట్‌పుత్లీ జిల్లా కిరాత్‌పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్ బోర్వెల్లను కవర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024 -
700 అడుగుల లోతు బోరు బావిలో చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
జైపూర్: రెండు వారాల వ్యవధిలో రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి చేతన బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది 20 గంటలుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతులో ఉన్న పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాజస్థాన్ రాష్ట్రం కోట్‌పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చేతన తన తండ్రితో కలిసి పోలానికి వెళ్లింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా.. చేతన పొలంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవ శాత్తూ పొలంలో ఏర్పాటు చేసిన 700 అడుగుల బోరుబావిలో పడింది. దీంతో భయాందోళన గురైన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు చేతనను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. చేతన 150 అడుగుల లోతులోకి జారినట్లు గుర్తించారు. బోరుబావి లోపల పాప ఆచూకీ కోసం కెమెరాలను పంపించారు. 20 గంటలకు బోరుబావిలో ఉన్న చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. బోరుబావి లోపల ఉన్న చేతనను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. 700 फीट गहरे बोरवेल में फंसी बच्ची, गांव में चूल्हा नहीं जला। कैमरे में हाथ हिलाते हुए दिखी"दुआ करें, जिंदगी की ये जंग जीत जाए। 💕" pic.twitter.com/XJg5BDBDeR— Dinesh Bohra (@dineshbohrabmr) December 23, 2024 విఫలమైన ప్రయత్నం.. చివరిగా 150 అడుగుల లోతులో ఉన్న చేతనకు ఆక్సిజన్ పైపును లోపలికి పంపారు. బోరుబావికి ఓ వైపు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ వ్యవసాయం క్షేత్రం కావడంతో మట్టి తేమగా ఉంది. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం, పొడవైన రాడ్‌కు బిగించిన హుక్ సాయంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతన సురక్షితంగా బోరుబావి నుంచి బయట పడుతుందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఆర్యన్ కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ దౌస జిల్లాలోని కలిఖడ్ గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడ్డాడు. బాలుడి కోసం రెస్క్యూ బృందాలు సుమారు 57 గంటల పాటు శ్రమించాయి. చివరికి 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024 -
57 గంటల తర్వాత బోరు బావి నుంచి బయటకు.. ప్రాణాలు కోల్పోయిన ఆర్యన్
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 57 గంటల పాటు శ్రమించారు. 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషాదం సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ మధ్యాహ్నం 3గంటల సమయంలో బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ గంట తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు కదిలి వచ్చాయి. బోరుబావిలో పడ్డ బాలుడి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు, జేసీబీలు,డ్రిల్లింగ్ మెషిన్లతో ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపాయి. ఎన్డీఆర్ఎఫ్ ఆపరేషన్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నీటి మట్టం దాదాపు 160 అడుగుల వరకు ఉంటుందని అంచనా వేశారు. భూగర్భంలో ఆవిరి కారణంగా బాలుడి కదలికలను కెమెరాలో బంధించడంలో ఇబ్బంది మారింది. అదే సమయంలో భద్రతా సమస్యలు కూడా తలెత్తుతాయని అంచనా వేశారు. అయినప్పటికీ, 57 గంటల పాటు శ్రమించి బోరుబావి నుంచి ఆపస్మారక స్థితిలో ఉన్న ఆర్యన్ సురక్షితంగా బయటకు తీశారు. గ్రీన్ కారిడార్ ద్వారా అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌తో కూడిన అంబులెన్స్‌లో ఆర్యన్‌ను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్ష చేసినా డాక్టర్లు ఆర్యన్ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. -
బోరు బావిలో పడ్డ బాలుడు
-
150 అడుగుల బోరుబావిలో బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
జైపూర్: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని బోరు బావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడి కోసం రెస్క్యూ టీం సుమారు 17 గంటల పాటు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం దౌస జిల్లాలో చోటు చేసుకుంది.జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం (డిసెంబర్9న) ఘటన చోటు చేసుకోగా మంగళవారం (డిసెంబర్ 10) ఉదయం వరకు నిర్విరామంగా బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో సోమవారం ఐదేళ్ల ఆర్యన్ బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం కదిలి వచ్చింది. ఓ వైపు బాలుడి కోసం బోరు బావికి సమాంతరంగా జేసీబీలతో నిర్విరామంగా మట్టి తవ్వుతుంటే మరోవైపు బోరుబావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. #WATCH दौसा, राजस्थान: दौसा में खेलते समय एक 5 वर्षीय बच्चा बोरवेल में गिर गया। बचाव अभियान जारी है।DM देवेंद्र कुमार ने बताया, "बच्चा करीब 150 फीट गहराई में है, उसे लगातार ऑक्सीजन दिया जा रहा है। मेडिकल टीम मौके पर मौजूद है। SDRF, NDRF और सिविल डिफेंस की टीमें मौके पर पहुंच गई… pic.twitter.com/JECEDzVtxv— ANI_HindiNews (@AHindinews) December 9, 2024బోరు బావి ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ కొద్ది సేపటి క్రితం మాట్లాడుతూ.. ‘‘150 అడుగుల లోతులో ఉన్న బాలుడు ఆర్యన్ ఆరోగ్యం బాగుంది. ఆక్సీజన్ పంపుతున్నాం. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బావిలోకి కెమెరాలను పంపాము. బాలుడిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతవీలైతే అంత తొందరగా బాలుడిని రక్షించాలనే’’ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.బోరుబావిలో బాలుడు పడ్డాడనే సమాచారంతో స్థానికులు, జిల్లా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. బాలుడి ఆచూకీ గురించి ఆరా తీస్తున్నారు. ఆర్యన్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. -
బోరుబావిలో పడిన ఏడాదిన్నర చిన్నారి మృతి
గుజరాత్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా సురగపర గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో పడి , ఏడాదిన్నర వయసుగల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 17 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఈరోజు(శనివారం) తెల్లవారుజామున ఆ బాలికను బోరుబావిలో నుంచి బయటకు తీశారు. అయితే అధికారులు ఆ చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు.రెస్క్యూ టీం ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బోరుబావిలో దాదాపు 50 అడుగుల లోతులో ఆ చిన్నారి చిక్కుకుపోయింది. తమ కుమార్తె మృతి చెందడంలో తల్లిదండ్రులు పెద్ద పెట్టున రోదిస్తున్నారు. ఆ ప్రాంతమంతా శోక సంద్రంగా మారిపోయింది. ప్రమాద స్థలంలో అంబులెన్స్ , అగ్నిమాపక దళం, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. బాలికకు ఆక్సిజన్ అందించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.అగ్నిమాపక దళ అధికారి హెచ్‌సీ గాధ్వి మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు పొలంలో పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ఏడాది వయసుగల ఆ చిన్నారికి పాలు తాగించిన తరువాత తల్లిదండ్రులు పనులకు వెళ్లారన్నారు. ఇంతలో వారికి తమ కుమార్తె కేకలు వినపించాయి. వారి కుమార్తె బోరు బావిలో పడిపోయిందని అక్కడున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులకు తెలిపారు.వెంటనేవారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక అధికారులను, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అక్కడికి రప్పించారు. రెస్క్యూ బృందం ఆ చిన్నారి బోరుబావిలోని 50 అడుగుల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిన్నారి తలకిందులుగా ఉందని, ఆమెకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేశారు. తరువాత రోబోట్ మెషీన్‌ను కూడా పిలిపించారు. అది ఆ చిన్నారి తలను పట్టుకుని బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే ఆ చిన్నారి ఆక్సిజన్ అందక అపస్మారక స్థితికి చేరుకుంది. బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. #WATCH अमरेली, गुजरात: अग्निशमन अधिकारी एचसी गढ़वी ने कहा, "करीब 12:30 बजे सूचना मिली थी की एक बच्ची जो करीब डेढ़ साल की है वो बोरवेल में गिर गई है। तुरंत हमारी रेस्क्यू टीम यहां पहुंची। हमने कैमरे से देखा कि बोरवेल करीब 45 फीट गहरा है। बच्ची को सांस देने के लिए ऑक्सीजन दिया जा… https://t.co/4fF7YMHnzO pic.twitter.com/CjQ6J1jTdQ— ANI_HindiNews (@AHindinews) June 14, 2024 -
Delhi: బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక బోరుబావిలో చిన్నారి పడిపోయింది. ఈ ప్రమాదం ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ప్రమాదవశాత్తూ ఓ చిన్నారి పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, ఎన్డిఆర్ఎఫ్, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది మాట్లాడుతూ బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. ఎన్డిఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ వీర్ ప్రతాప్ సింగ్‌తో పాటు ఆ శాఖ బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. బాధిత చిన్నారిని బయటకు తీసుకువచ్చేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి , చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. #WATCH | Delhi: A child fell into a 40-foot-deep borewell inside the Delhi Jal Board plant near Keshopur Mandi. The NDRF team has reached the site along with Inspector-in-charge Veer Pratap Singh from NDRF. It will soon start rescue operations by digging a new borewell parallel… pic.twitter.com/CbD4GAKzR3 — ANI (@ANI) March 10, 2024 -
Bengaluru Water Crisis: మా ఇంట్లోనూ బోరుబావి ఎండిపోయింది: నీటి కొరతపై డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరును నీటి సంక్షోభం వేధిస్తోంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరత నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. నగరంలో రోజురోజుకీ నీటి కొరత తీవ్రతర అవుతుందని, దాదాపు 3000 పైగా బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు.తన ఇంటి వద్ద ఉన్న బోరు బావి కూడా ఎండిపోయిందని తెలిపారు. నీటి సమస్యను తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా సరాఫరా చేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు. నగరంలో నీటి కొరతకను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోనీ బీజేపీ కూడా కారణమేనంటూ శివకుమార్ విమర్శించారు. చదవండి: అమేథీ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలోకి రాహుల్ గాంధీ? బెంగుళురుకు మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు తాము శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా ఈ ప్రాజెక్టు అనుమతులు ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కరవు పరిస్థితులతో తాగునీటి కొరత గ్రామాలనే కాకుండా, సిలికాన్ సిటీలో, అందులోనూ సీఎం అధికార నివాసం కృష్ణను కూడా పీడిస్తోంది. నగరంలో తాగునీటి సరఫరా అరకొరగా ఉంది. దీంతో సీఎం నివాసానికి జలమండలి కొళాయిల నుంచి నీరు రావడం లేదు. అధికారులు హడావుడిగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మార్చి మొదటి వారమే ఇలా ఉంటే ఏప్రిల్, మే మాసాల్లో నీటి ఎద్దడి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
‘ప్రిన్స్’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమయ్యింది. ఈ నేపధ్యంలో తొమ్మిదేళ్ల క్రితం హర్యానాలో జరిగిన ప్రిన్స్ రెస్క్యూ ఆపరేషన్‌ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలోగల హల్దేహరి గ్రామంలో తొమ్మిది ఏళ్ల క్రితం బోరుబావి ప్రమాదం చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడు ప్రిన్స్ 60 అడుగుల లోతు కలిగిన బోరుబావిలో పడిపోయాడు. మూడు రోజులపాటు అదే బావిలో మగ్గిపోయాడు. అయితే సైన్యం బోరుబావి దగ్గర సొరంగం నిర్మించి ఆ బాలుడిని రక్షించింది. అది జూలై 21, 2006.. హల్దేహరి గ్రామానికి చెందిన ప్రిన్స్ తన స్నేహితులతో ఆడుకుంటూ, తెరిచివున్న బోరుబావిలో పడిపోయాడు. స్నేహితులు ఈ విషయాన్ని ప్రిన్స్ కుటుంబసభ్యులకు తెలిపారు. కొడుకు బోరు బావిలో పడిపోయాడని తెలియగానే వారంతా నిస్తేజంగా మారిపోయారు. కొద్దిసేపటికే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారి ప్రిన్స్‌ను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ అధికారులు సైన్యం సహాయాన్ని కోరారు. వెంటనే భారత సైన్యం ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు మొదలుపెట్టింది. చీకట్లో ప్రిన్స్ భయపడకుండా ఉందేందుకు సైన్యం మొదట బోర్‌వెల్‌లో లైట్లు ఏర్పాటు చేసింది. అనంతరం అతనికి తాడు సహాయంతో బిస్కెట్లు, నీళ్లు, జ్యూస్ అందించారు. దాదాపు 50 గంటల పాటు శ్రమించిన అనంతరం సైన్యం ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ప్రిన్స్‌ను బోర్‌వెల్‌లో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ సిబ్బంది ఆ బోర్వెల్ దగ్గర సొరంగం నిర్మించింది. ఈ మార్గం గుండా సైన్యం ప్రిన్స్ దగ్గరకు చేరుకుంది. ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. ఆ సమయంలో దేశ ప్రజలంతా ప్రిన్స్ క్షేమం కోరుతూ ప్రార్థనలు, పూజలు చేశారు. ప్రస్తుతం ప్రిన్స్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఈ ఘటన అనంతరం ప్రిన్స్ ఉంటున్న గ్రామాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రిన్స్ పేరుతో వచ్చిన పరిహారంతో ఆ బాలుని కుటుంబం ఇల్లు నిర్మించుకుంది. ఇది కూడా చదవండి: కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు -
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. చివరకు..
పాట్నా: బిహార్‌లో బోరుబావిలో పడిన చిన్నారిని అధికారులు ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించి బాలుని ప్రాణాలను కాపాడారు. నలంద జిల్లాలోని కులు గ్రామంలో ఈ రోజు మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ 40 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. చిన్నారిని బయటకు తీయడానికి విపత్తు నిర్వహణ శాఖ(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలను చేపట్టింది. బాలున్ని శివమ్ కుమార్‌గా గుర్తించారు. గ్రామ సమీపంలో ఓ రైతు బోరు బావి తవ్వి, అక్కడ నీరు పడకపోవడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు. అక్కడే బాలున్ని తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా బావిలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు నలంద నగర పంచాయతీ అధ్యక్షుడు నలిన్ మౌర్య తెలిపాడు. సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని అధికారి శంభు మండల్ తెలిపారు. బాబు ఏడుపు శబ్దం తమకు వినిపిస్తున్నట్లు వెల్లడించారు. జేసీబీ మెషిన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్
సాక్షి, బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్ బయటకు వస్తుంది. గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: అదుర్స్.. సిరి ధాన్యాల టిఫిన్స్.. తింటే లాభాలేంటో తెలుసా? -
Sagubadi: ఏ బోర్లు అనుకూలం? ఎండిపోతున్న బోర్ని నిర్థారించడం ఎలా?
బోర్ల నుంచి ఎప్పుడంటే అప్పుడు నీటిని తోడుకోవాలంటే వానాకాలంలో వాటికి నీటిని తాపాలన్న అవసరాన్ని ఇప్పుడు చాలా మంది బోర్ల యజమానులు గుర్తిస్తున్నారు. సాధారణంగా వాన నీరు 10–15% మాత్రమే భూమిలోకి ఇంకుతుంది. బోరు చుట్టూ గుంత నిర్మిస్తే అక్కడ కురిసిన వర్షంలో 50%ని ఇంకింపజేసుకొని భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. అయితే, ఎండిపోయిన, ఎండిపోబోతున్న బోర్లన్నిటికీ నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యాన్ని నిర్ధారించడం కోసం నీరు తాపే పరీక్ష చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు. వాటర్ ట్యాంకర్ ద్వారా 5 వేల లీటర్ల నీటిని తీసుకువచ్చి బోరులో పోసి, నీరు లోపలికి ఎంతమేరకు వెళ్తున్నదీ పరీక్షిస్తారు. 200 మీటర్ల పరిధిలో పరిసరాల్లో ఏ బోరు నుంచీ నీటిని తోడకుండా ఉన్నప్పుడు ఈ నీటి పరీక్ష చేయాలి. నీటి పరీక్షకు సాఫ్ట్వేర్ సాధనం బోరు లోపలికి నీరు పోస్తున్నప్పుడు నీరు ఎక్కువగా బయటికి వచ్చేస్తే.. ఆ బోరుకు నీటిని ఇంకించుకునే సామర్థ్యం లేదని.. అది రీఛార్జ్ గుంత నిర్మాణానికి తగినది కాదని నిర్ధారించవచ్చు. ఒకవేళ నీరు చాలా వరకు లోపలికి ఇంకిపోతే ఆ బోరు చుట్టూ రీఛార్జ్ గుంత నిర్మాణానికి అనువుగా ఉందనుకోవచ్చు. ఈ నీటి పరీక్ష చేసేటప్పుడు ఉపయోగించే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ సాధనాన్ని సికింద్రాబాద్‌కు చెందిన ‘వాటర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకులు రామ్మోహన్ రూపొందించారు. పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. ఈ సాధనం ద్వారా బోరు వద్ద ఇంకుడుగుంత నిర్మించుకోవాలో వద్దో ఖచ్చితంగా నిర్థారించుకోవచ్చని రామ్మోహన్(94401 94866) తెలిపారు.అన్ని బోర్లూ పనికిరావు నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట ప్రాంతంలోని ఐనోల్, రామాజిపల్లి గ్రామాల్లో ప్రాంతంలో వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 బోరు బావుల చుట్టూ వాన నీటి రీచార్జి గుంతల నిర్మాణం కోసం ట్యాంకర్లతో నీటి పరీక్ష చేశారు. 5 బోర్లు అనుకూలమని తేలింది. 2 బోర్లు అనుకూలం కాదని తేలింది. మరో 3 బోర్లకు రీచార్జి సామర్ధ్యం తక్కువగా ఉంది. కాబట్టి, రీచార్జ్ గుంతకు బదులు ఫారం పాండ్‌ను ఏర్పాటు చేసుకోవటం మేలని నిపుణులు తేల్చారు. ఏ బోర్లు అనుకూలం? బోరు బావి చుట్టూ భూమి లోపల విడి మట్టి పొరలు ఉంటే.. ఆ బోరు బావికి వాన నీటిని లోపలి పీల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.బోరు బావి చుట్టూ గట్టి మట్టి పొరలు భూమికి నీటిని పీల్చుకునే సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. భూమి లోపల మొరం లేదా బంక మట్టి పొరలు ఉంటే నీరు ఇంకదు. గుట్టలు, ఎత్తయిన ప్రదేశాల్లోని బోర్లు, భూమిలో దట్టమైన సున్నపు రాయి ఉన్న బోర్లు రీచార్జ్ గుంత నిర్మాణానికి అనువు కాదు. ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా ఈ నెల 7(శుక్రవారం)న నూజివీడులో మామిడి రైతుల సదస్సు జరుగుతుంది. నూజివీడులోని ప్రభుత్వాసుపత్రి రోడ్డులో బ్రహ్మకుమారి మఠం పక్కన ఛత్రపతి సదనంలో ఉ. 9 గం. నుంచి భారతీయ కిసాన్ సంఘ్, నోఫాల ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. పలువురు శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, మామిడి ఎగుమతిదారులు పాల్గొని అనేక అంశాలపై చర్చిస్తారని నోఫా కార్యదర్శి బి. రాజేశ్ తెలిపారు. అందరూ ఆహ్వానితులే. -
Borewell: 60 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి..
భోపాల్: మధ్యప్రదేశ్ విదిశా జిల్లాలో 8 ఏళ్ల బాలుడు 60 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆడుకుంటూ పొరపాటున అందులో జారిపడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. మూడు రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి. బోరుబావిలో బాలుడి కదలికలు గమనించి అతడు సురక్షితంగానే ఉన్నట్లు నిర్ధరించుకున్నాయి. అనంతరం అతడ్ని బయటకు తీసుకొచ్చేందుకు బోరుబావికి సరిసమానంగా తవ్వాయి. అతడు 43-44 అడుగుల వద్ద చిక్కుకుని ఉన్నాడని, కొద్ది గంటల్లో బయటకు తీసుకువస్తామని సహాయక సిబ్బంది తెలిపారు. కాగా.. బాలుడి కదలికలు గుర్తించినప్పటికీ.. అతనితో మాట్లాడలేకపోయినట్లు అధికారులు తెలిపారు. చిన్నారికి ఆహారం కూడా అందించే పరిస్థితి లేదన్నారు. వీలైనంత త్వరగా అతడ్ని బయటకు తీసుకొచ్చాక ఆహారం అందించి, ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. MP | An 8-year-old boy in Vidisha fell into a 60 feet deep borewell and got stuck at 43 feet. 3 teams of SDRF & 1 team of NDRF are on the spot. The child is being monitored, oxygen is being supplied. We cannot talk to him &food has not been delivered yet: Vidisha ASP Sameer Yadav pic.twitter.com/3bOwIvsDZh — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 14, 2023 చదవండి: వింత ఘటన: 56 బ్లేడులు మింగిన వ్యక్తి! -
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. మూడు గంటల్లోనే బయటకు..
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారిని మూడు గంటల్లోనే సురక్షితంగా బయటకు తీశారు సహాయక సిబ్బంది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్ జిల్లా లాల్‌గౌన్ పాలి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నాన్సీ అనే చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీసి చెకప్ నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. बेटी की मां से फोन पर बात की है। यह जानकर संतोष और आनंद हुआ कि बेटी स्वस्थ है। उसे जनरल चेकअप के लिए अस्पताल ले जाया गया। मेरी शुभकामनाएं और आशीर्वाद बेटी के साथ हैं। मामा शिवराज सदैव तुम्हारे साथ हैं! https://t.co/KK9GdA7Qfz — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 26, 2023 కాగా నాన్సీ బోరుబావిలో సుమారు 30 అడుగుల లోతులో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు. వివిధ రకాల పరికరాలు, జేసీబీలు ఉపయోగించి పాపను కాపాడినట్లు వివరించారు. గతేడాది జూన్‌లో కూడా ఈ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఐదేళ్ల బాలుడు పొలంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. సహాయక సిబ్బంది 8 గంటలు శ్రమించి అతడ్ని సురిక్షితంగా కాపాడారు. చదవండి: గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం -
Video: ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి
బోరు బావులు చిన్నారుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల తెరిచి ఉంచిన బోరు బావిలో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న మావియా అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. జిల్లా లోని కోట్ల సాదత్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బావిలో నుంచి బాలుడి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చిన్నారిని కాపాడేందుకుసహాయక చర్యలు ప్రారంభించాయి. ముందుగా ఆక్సిజన్‌ను బోరుబావిలోకి పంపించారు. 5 గంటలు తీవ్రంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. చివరికి బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో బాలుడికి స్వల్ప గాయాలు కాగా.. అతడు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ బోరు బావి హాపూర్ మున్సిపాలిటీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం దీనిని తవ్విందని, చాలాకాలంగా ఇది నిరుపయోగంగా ఉందని తెలిపారు. సుమారు 35 ఏళ్ళ క్రితం ఈ బోరు బావిని తవ్వారని పేర్కొన్నారు. చదవండి: Honey Trap: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ.. వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. -
శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు
బెంగళూరు: కర్ణాటక బాగల్కోట్లో శ్రద్ద వాకర్ హత్య తరహా ఘటన వెలుగుచూసింది. సొంత కుమారుడే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకొద్దని వాటిని తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటనలో నిందితుడ్ని విఠల కులాలి(20)గా గుర్తించారు పోలీసులు. అతని తండ్రి పేరు పరశురామ్ కులాలి(53). అయితే పరశురామ్ తాగుబోతు. రోజు ఫుల్లుగా మద్యం సేవించి కుమారుడ్ని తిట్టేవాడు. ఇతని బాధ భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. చిన్నకుమారుడు విఠల తండ్రితో పాటు ఉంటున్నాడు. పరశురామ్ రోజు తాగొచ్చి విఠల్‌ను దుర్భాషలాడేవాడు. కానీ, గత మంగళవారం తండ్రి తిట్లను భరించలేకపోయిన విఠల.. ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. దీంతో పరశురామ్ చనిపోయాడు. అనంతరం శవాన్ని 32 ముక్కలు చేశాడు విఠల. ఈ శరీర భాగాలను తీసుకెళ్లి మంతూర్ బైపాస్ వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగి విఠలను అరెస్టు చేశారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. బోరుబావి నుంచి పరశురామ్ శరీర భాగాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రొక్లేన్లతో తవ్వారు. చదవండి: మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు -
38 గంటలుగా బోరు బావిలోనే బాలుడు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లాలో బోరు బావిలో పడిన 8 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం సాయత్రం 5 గంటలకు మండవి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు తన్మయ్ దియావర్ సాహూ అనే బాలుడు. ప్రస్తుతం 55 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుకు సమాంతరంగా గుంతను తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బోరు బావిలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 33 అడుగల మేర లోతుకు గుంత తవ్వటం పూర్తయింది. 45 అడుగుల వరకు చేరుకోవాలి. ఆ తర్వాత బోరులోకి సొరంగం చేస్తారు. బండ రాళ్లు ఉన్నందుకు సమయం పడుతోంది. బాలుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. బహుశా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండవచ్చు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామేంద్ర జైశ్వాల్. రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్), హోమ్ గార్డ్స్, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో హోరాహోరీ.. ‘ఆపరేషన్ లోటస్’ గుబులు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు! -
బోరు బావిలో 8 ఏళ్ల బాలుడు.. 15 గంటలుగా మృత్యువుతో పోరాటం
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి ఓ ఎనిమిదేళ్ల బాలుడు 400 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో మంగళవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మండవి గ్రామంలోని ఓ పొలంలో ఇటీవలే బోరు బావి తవ్వారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్న తన్మయ్ దియావర్(8) అనే బాలుడు ఆ బోరులో పడిపోయాడని ఆత్నేర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అనిల్ సోనీ తెలిపారు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. బోరు బావి చుట్టూ తవ్వేందుకు ప్రొక్లెయిన్ వంటి వాహనాలు చేరుకున్నాయని చెప్పారు. బోరు బావిలోని బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. Madhya Pradesh | Operation still underway to rescue the boy who fell into a 55-ft deep borewell in Mandavi village in Betul district yesterday. pic.twitter.com/si8PzNagy9 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 7, 2022 ఇదీ చదవండి: లఖీంపూర్ కేసులో 13 మందిపై అభియోగాలు -
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పెద్దమనసు.. ఆ రైతులకు 5వేల ఉచిత బోర్లు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నియోజకవర్గంలో 5 వేల మంది రైతులకు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా బోరుబావులు తవ్వించి వారి కలను సాకారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాప్తాడుకు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.10 కోట్లతో బోర్ల ఏర్పాటు తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో రాప్తాడు నియోజకవర్గంలో రెండు వేల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించినట్లు ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ జలకళ’ కార్యక్రమం కింద తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 600 మంది రైతులకు బోర్లు వేయించామన్నారు. బోర్లు వేయించాలంటూ ప్రభుత్వ లక్ష్యానికి మించి 10,600 దరఖాస్తులు అందడంతో తోపుదుర్తి కుటుంబం చర్చించి ట్రస్ట్ ద్వారా ఉచిత బోర్లు వేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి వెయ్యి బోర్లు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాలకు కలపి వెయ్యి బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా కనగానపల్లి మండలంలో 150, రాప్తాడులో 150, రామగిరిలో 100, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 100 బోర్లు వేయిస్తామన్నారు. ఇవి పూర్తి కాగానే రెండో విడతలో మరో 500 బోర్లు వేయిస్తామన్నారు. ఇలా ప్రతి విడతలోనూ 500 బోర్లు వేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులు వీరే.. పేద రైతులు, ఇప్పటి దాకా బోర్లు వేయని రైతులు, ఎన్నిమార్లు బోర్లు వేసినా నీళ్లు పడని రైతులు మాత్రమే ఈ పథకం కింద అర్హులని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పేరూరు డ్యాం మరువ పారుతోందని, ఈ సారి దాదాపు 12 టీఎంసీల నీటిని పేరూరు డ్యాం నుంచి దిగువన పెన్నాలోకి వదిలినట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆశీర్వాదంతో పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ప్రతి చెరువునూ నింపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో భూగర్భజలాలు భారీగా పెరిగాయని, 200 అడుగుల్లోపే నీళ్లు పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి కార్యకర్త గడప గడపకూ వెళ్లాలి ప్రతి గడపకూ వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ మూడేళ్లలో ఒనగూరిన లబ్ధిని వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గత ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టి వెళ్లిపోయినా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిధులు సమకూర్చుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8,900 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 8,500 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని పేదలు ఎవరైతే ఆప్షన్–3లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటారో వారందరికీ రూ.35 వేల రుణాన్ని ఎన్నికల లోపు కాంట్రాక్టింగ్ సంస్థకు తామే చెల్లించి, ఆ రుణాన్ని మాఫీ చేయిస్తామన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్ నాయకుడు పసుపుల ఆది పాల్గొన్నారు. -
Borewell: 16 గంటల ఆపరేషన్, బాలుడు సేఫ్
జైపూర్: దేశంలో పలు చోట్ల బోరు బావుల్లో చిన్నారులు పడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయా ఘటనల్లో కొందరు పిల్లలు ప్రాణాలు విడువగా.. మరికొందరు బతికి బయటపడ్డారు. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. బోరు బావుల యజమానులు కొందరు తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. పిల్లాడిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యమే బాలుడిని ప్రమాదంలో పడేసింది వివరాల్లోకి వెళితే.. జాలోర్ జిల్లాలోని లచ్‌హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగరమ్ దేవసీ తన వ్యవసాయ పొలంలో రెండు రోజుల క్రితం బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ ప్రమాదవశాత్తు ఆ బావిలో జారి పడిపోయాడు. ఆ బావి సుమారు 95 అడుగులు లోతు ఉంది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ టీంకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి సుమారు 16 గంటల తీవ్రంగా శ్రమించిన అనంతరం బాలుడిని బావిలోంచి బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఆక్సిజన్‌తో నిలిచిన ప్రాణం.. స్థానిక ఎస్‌హెచ్‌వో ఆచార్య మాట్లాడుతూ.. ‘బాలుడు బోరు బావిలో పడిపోయాడని సమాచారం అందగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. పిల్లాడి వద్దకు కెమెరా పంపించి అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాం. పిల్లాడికి పైపు ద్వారా ఆక్సిజన్‌ను, ఆహార పదార్థాలు కూడా బావిలోకి పంపించాము. అలాగే బాలుడు నిద్రపోకుండా ఉండటానికి మా జట్టు సభ్యులు నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం. సహాయక కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాయి. బాలుడిని క్షేమంగా బయటకు తీయగలిగాం’అని చెప్పారు. ( చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు ) #UPDATE | Rajasthan: The four-year-old boy who fell into a nearly 95-feet-deep open borewell in a village in Jalore has been rescued. pic.twitter.com/UEak9keBEN — ANI (@ANI) May 7, 2021 -
బోరుబావిలో పడిపోయిన బాలుడు
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బోరుబావి ప్రమాదం కలకలం రేపుతోంది. మహోబా జిల్లాలోని ఒక గ్రామంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనలో పడిపోయిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ దళాలు, ఆరోగ్య, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బావిలోకి ఆక్సిజన్‌ను అందిస్తూ అధికారులు బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ధనేంద్ర ఆడుకుంటూ సుమారు 25-30 అడుగుల లోతైన బోర్‌బావిలో పడిపోయాడని పోలీసు అధికారి అనుప్ కుమార్ దుబే చెప్పారు. సంఘటన జరిగిన సమయంలో బాలుని తల్లిదండ్రులు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లారని తెలిపారు. బాలుడుని కాపాడేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, లక్నో నుంచి జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దింపామని మహోబా జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్ తెలిపారు. -
కరెంటు లేకుండానే బోరు నుంచి పైకి వస్తున్న నీరు
సాక్షి, ములుగు: జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బోరు నుంచి కరెంటు లేకుండానే గంగమ్మ పైకి ఉబిగి వస్తోన్న దృశ్యం ములుగు మండలంలోని శివ తండాలో మంగళవారం వెలుగు చూసింది. తండాకు చెందిన ధరవత్ అనే రైతు పోలంలోకి వెళ్లేసరికి బోరు నుంచి నీరు బయటకు రావడం గమనించాడు. అక్కడకు వెళ్లి చూడగా కరెంటు లేకుండాను బోరు నుంచి నీరు పైకి రావడం చూసి రైతు ధరవత్ హర్షం వ్యక్తం చేశాడు. అలాగే ఈ సంఘటన గురించి తోటి రైతులకు తెలిపాడు. అయితే గత రోజులుగా ఏకాదాటిగా కురిసిన వర్షాలకు భుగర్భ జాలాల నీరు పెరగడంతో ఇలా నీరు పైకి వచ్చినట్లు అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ముక్కలుగా నరికి బోర్‌బావిలో పడేశారు
లక్నో: గత మూడు రోజుల నుంచి మీరట్ పోలీసులు ఓ యువకుడి మృతదేహం కోసం బోరు బావిని తవ్వుతునే ఉన్నారు. నీళ్లు పడ్డాయి కానీ శరీర భాగాలు మాత్రం లభించలేదు. వివరాలు.. మీరట్‌కు చెందిన ఐటీఐ విద్యార్థి రూపక్(20) గత నెల 25న స్నేహితులను కలవాలంటూ ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు రూపక్ స్నేహితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. స్నేహితులు, రూపక్ సోదరి గురించి చెడుగా మాట్లాడటంతో వారి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో స్నేహితుల్లో ఒకడైన వివేక్ రూపక్ని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని పొలంలోని ఓ ఇటుక బట్టీ వద్ద పాతి పెట్టారు. కానీ పోలుసులకు దొరికిపోతామనే ఉద్దేశంతో మృతదేహాన్ని వెలికి తీసి ముక్కలుగా చేశారు. అనంతరం ఊరవతల ఉన్న బోరువెల్‌లో మృతదేహం ముక్కలను పడేసినట్లు వివేక్ బృందం పోలీసులకు తెలిపింది. దాంతో గత మూడు రోజులుగా పోలీసులు రూపక్ శరీర భాగాల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారం లభించలేదు. శరీర భాగాలు బావి లోపల చాలా లోతులో అయినా పడి ఉండాలి లేదా నిందితులు తప్పుడు సమాచారం అయినా ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో చాలా జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నారు. నీటి పారుదల శాఖ సాయం కూడా తీసుకున్నారు. ఇప్పటికే 50 అడుగులు లోతు తవ్వారు. నీళ్లు పడ్డాయి.. కానీ శరీర భాగాలు మాత్రం లభ్యం కాలేదు. రూపక్ మృతదేహం లభించకపోతే.. నిందితుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేమంటున్నారు పోలీసులు. -
బాలుడిని మింగిన బోరుబావి
-
బోరుబావిలో పడిన బాలుడి మృతి
సాక్షి, మెదక్ : జిల్లాలోని పాపన్నపేట మండలం పొడిచన్పల్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి సంజయ్ సాయివర్ధన్ మృతి చెందాడు. 25 అడుగుల లోతులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బుధవారం సాయంత్రం తాతతో కలసి పొలం వద్ద నుంచి ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు అప్పుడే వేసిన బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. బాలుడిని రక్షించేందుకు అధికారులు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ చిన్నారిని కాపాడలేకపోయారు. 25 అడుగుల లోతులో బాలుడు ఉండొచ్చని భావించి, బోరు బావికి సమాంతరంగా గొయ్యి తవ్వి బాలుడిని బయటకు తీశారు. కానీ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. (చదవండి : బోరుబావిలో బాలుడు) ప్రాణం మీదకు తెచ్చిన బోర్లు.. సాగు కోసం నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో భిక్షపతి తనకున్న పొలంలో బోర్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్గవి, నవీనాతోపాటు పిల్లలు పొలానికి వచ్చారు. మంగళవారం రాత్రి 160 ఫీట్ల వరకు ఒక బోరు వేయగా.. నీళ్లు పడలేదు. మళ్లీ వేరే స్థలంలో బుధవారం ఉదయం 300 ఫీట్ల వరకు వేశారు. అక్కడ కూడా నీరు పడకపోవడంతో చివరగా ఇంకో చోట 150 ఫీట్ల లోతు వరకు బోరుగుంత తవ్వినా.. ఫలితం లేకపోయింది. దీంతో వేసిన కేసింగ్ తీసేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇంటి బాట పట్టారు. తాత భిక్షపతితో కలసి బాలుడు సంజయ్ సాయివర్ధన్ వస్తున్నాడు. తాత కంటే ముందు వెళ్తున్న బాలుడు ప్రమాదవశాత్తు జారి బోరుగుంతలో పడిపోయాడు. మిన్నంటిన రోదనలు ఘటనా స్థలం వద్ద బాధిత బాలుడి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. బాలుడు సాయివర్ధన్ ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు. -
బోరుబావిలో బాలుడు
సాక్షి, మెదక్/పాపన్నపేట : వ్యవసాయ పొలంలో అప్పుడే వేసిన బోరుగుంత ఆ చిన్నారి ప్రాణం మీదకు తెచ్చింది. తాతతో కలసి బుడిబుడి అడుగులు వేస్తూ ఇంటికి వెళ్తున్న మూడేళ్ల బాలుడు రెప్పపాటులో బోరుగుంతలో పడిపోయాడు. లోపలికి వెళుతున్న క్రమంలో డాడీ.. డాడీ అంటూ రోదించిన తీరు కలచివేసింది. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడిచన్పల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగళి భిక్షపతి, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు నవీన, భార్గవి. నవీనను సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన గోవర్ధన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమారులు. ఇందులో చిన్నవాడైన సంజయ్ సాయివర్ధన్ (3) ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయాడు. ఫొట్రోగాఫర్ వృత్తితో కుటుంబాన్ని పోసిస్తున్న గోవర్ధన్ ఐదు నెలల క్రితం భార్య, పిల్లలను తన అత్తగారిల్లయిన పొడిచన్‌పల్లికి పంపించాడు. అప్పటి నుంచి నవీన తన పిల్లలతో ఇక్కడే ఉంటోంది. ప్రాణం మీదకు తెచ్చిన బోర్లు.. సాగు కోసం నీటి కొరత ఉండొద్దనే ఉద్దేశంతో భిక్షపతి తనకున్న పొలంలో బోర్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో భార్గవి, నవీనాతోపాటు పిల్లలు పొలానికి వచ్చారు. మంగళవారం రాత్రి 160 ఫీట్ల వరకు ఒక బోరు వేయగా.. నీళ్లు పడలేదు. మళ్లీ వేరే స్థలంలో బుధవారం ఉదయం 300 ఫీట్ల వరకు వేశారు. అక్కడ కూడా నీరు పడకపోవడంతో చివరగా ఇంకో చోట 150 ఫీట్ల లోతు వరకు బోరుగుంత తవ్వినా.. ఫలితం లేకపోయింది. దీంతో వేసిన కేసింగ్ తీసేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఇంటి బాట పట్టారు. తాత భిక్షపతితో కలసి బాలుడు సంజయ్ సాయివర్ధన్ వస్తున్నాడు. తాత కంటే ముందు వెళ్తున్న బాలుడు ప్రమాదవశాత్తు జారి బోరుగుంతలో పడిపోయాడు. సంఘటన స్థలంలో రోదిస్తున్న సంజయ్ తల్లి నవీన చీర, దోతి కట్టి లోపలికి వేసినా.. బాలుడు బోరుగుంతలో పడిన వెంటనే భిక్షపతి అయ్యో అయ్యో అంటూ ఏడవటంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వెంటనే చీర, దోతికి ముడేసి బోరుగుంత లోపలికి పంపారు. అయినా ఫలితం లేకపోయింది. నాలుగైదు నిమిషాలపాటు బాలుడు డాడీ.. డాడీ.. అంటూ ఏడ్చాడని.. ఆ తర్వాత ఏం వినబడలేదని కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక ఫైరింజన్, రెండు 108 వాహనాల్లో వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని బోరుగుంతలోకి ఆక్సిజన్ పంపించారు. ముందుగానే చేరుకున్న రెండు జేసీబీలతో బోరుగుంతకు సమాంతరంగా తవ్వకం మొదలుపెట్టారు. రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. చిన్నారి తండ్రి గోవర్ధన్ 25 నుంచి 50 అడుగుల లోతులో ఉన్నట్లు.. బోరుబావిలో పడిన బాలుడు 25 నుంచి 50 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందం గుర్తించింది. బోరుబావి 150 అడుగుల లోతు ఉందని.. బోరుబావికి వినియోగించిన కేసింగ్ 40 అడుగుల వరకు మాత్రమే వేసినట్లు తెలుస్తోంది. అయితే నీళ్లు పడకపోవడంతో కేసింగ్‌ను తీసేశారని.. ఆ మేరకు బాలుడు కేసింగ్ వేసినంత దూరం వెళ్లి అక్కడ చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో బాలుడికి రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్ (జాతీయ విపత్తు నిర్వహణ ఫోర్స్) బృందం పొడిచన్‌పల్లికి చేరుకుంది. రెండో బృందం ఆంధ్రపదేశ్‌లోని గుంటూరు నుంచి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఫోన్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మిన్నంటిన రోదనలు ఘటనా స్థలం వద్ద బాధిత బాలుడి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది. బాలుడు సాయివర్ధన్ ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు. -
బోరు బావి: 25 ఫీట్ల లోతులో సాయి వర్ధన్!
సాక్షి, మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలం పోడ్చన పల్లి గ్రామంలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. 120 అడుగులు లోతు తవ్వి నీళ్లు రావడం లేదని బోరు బావిని వదిలేసినట్టు స్థానికులు చెప్తున్నారు. బోరు సమీపంలో ఆడుకుంటూ వెళ్లిన సాయి వర్ధన్ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. మెదక్ రూరల్ ఎస్సై రాజశేఖర్, మరో ఎస్సై ఆంజనేయులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బలగాలను తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. బాలుడు పడిన బోరుబావిని ఈరోజు ఉదయమే తవ్వడం గమనార్హం. పొలం వద్దకు వెళ్లి.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన మంగలి గోవర్ధన్ నవీనల మూడో కుమారుడు సాయి వర్ధన్. నాలుగు నెలల క్రితం పోడ్చన పల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి గోవర్ధన్ కుటుంబ సమేతంగా వచ్చారు. మామ మంగలి బిక్షపతి చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కుటుంబ సమేతంగా చూడటానికి వెళ్లిన సమయంలో నీరులేని బోరు బావిలో సాయి వర్ధన్ పడిపోయాడు. కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడు క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రారంభంమైన సహాయక చర్యలు.. బోరుబావిలో పడిన సాయి వర్ధన్‌ను రక్షించేందుకు సహాయ చర్యలు మొదలయ్యాయి. కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి, ఆడియో సాయిరాం, పాపన్నపేట తహసీల్దార్ బలరాం సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. రెండు జేసీబీలు, రెండు క్రేన్లు, మూడు అంబులెన్సులు, రెండు ఫైరింజన్లు ఘటనాస్థలం వద్ద సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు రావాల్సి ఉంది. 25 ఫీట్ల లోతులోనే చిన్నారి.. బోరుబావి లోతు 150 ఫీట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సాయి వర్ధన్‌కు ఆక్సిజన్ అందించేందుకు పైపును బోరుబావిలోకి పంపిచగా.. 25 ఫీట్ల లోతులోనే ఆగిపోయినట్టు వెల్లడించారు. సాయివర్ధన్ 25 ఫీట్ల లోతులోనే ఉన్నట్టు ప్రాథమిక అంచనాకొచ్చినట్టు పేర్కొన్నారు. బోరుబావి చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో ఈ ఒక్కరోజే మూడు బోర్లు వేసి నీళ్లు పడకపోవడంతో అలాగే వదిలేసినట్టు తెలుస్తోంది. మే మాసంలో పోడ్చన్‌పల్లిలో ఇప్పటికే 19 బోర్లు వేశారని, వేటికీ అనుమతులు తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చిన్నారులు బోరుబావిలో పడిన ఘటనలు వరసగా.. 2008, 2011, 2015 సంవత్సరాల్లో మూడు చోటు చేసుకున్నాయి. అధికారులు ఎంత శ్రమించినా వారిని కాపాడలేకపోయారు. -
ఆ నీళ్లతో కరోనా రాదు...
సాక్షి, హైదరాబాద్: ‘తాగునీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుంది. ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీటిని తాగొద్దు. ఇతర పనులకు కూడా వినియోగించుకోవద్దు.’ఇజ్రాయెల్ దేశం నుంచి సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న తప్పుడు ప్రచారమిది. అయితే దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుపట్టింది. నీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ తాగునీటి విషయంలో ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది. (ఇవి కచ్చితమైన లెక్కలు కావు: నిక్కీ హేలీ) ఇజ్రాయెల్‌లో నమోదవుతున్న కరోనా బాధితుల సంఖ్యకు, తాగునీటికి ఎలాంటి సంబంధం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిఖ్ లాజరెవిచ్ వెల్లడించారు. గతంలో కూడా ఈ వైరస్ గాలి ద్వారా సంక్రమించే అవకాశం ఉందని వదంతులు వచ్చాయని, కేవలం ఒక మనిషిని ఇంకో మనిషి తాకడం ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుందే తప్ప గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటి బరువైనది ఈ వైరస్ కాదని ఆయన స్పష్టంచేశారు. కనీసం మనిషికి, మనిషికి మధ్య మీటర్ దూరం పాటించడం, ముఖ భాగాలను తాకకపోవడం మాత్రమే కరోనా వైరస్‌ను నియంత్రిస్తాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. (కరోనాకు సవాల్: క్యూబా వైద్యుల సాహసం) -
రోహిత్ నిజంగా మృత్యుంజయుడే...
సాక్షి, బెంగళూరు: బోరుబావిలో పడిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన ఉడుపి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సుమారు 15 అడుగుల లోతులో పడిపోయిన అతడు ఆరు గంటల పాటు బోరుబావిలోనే ఉండిపోయాడు. అయితే సహాయక చర్యల చేపట్టి ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. ఉడుపి జిల్లా బైందూరు తాలూకా మరవంతెకు చెందిన రోహిత్ ఆదివారం ఉదయం బోరుబావి పక్కన మట్టి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మట్టి కుంచించుకుపోగా అతడు బోరుబావిలో చిక్కుకున్నాడు. సుమారు పదిహేను అడుగుల లోతుకు పడిపోయాడు. వెంటనే అగ్నిమాపక, ఆరోగ్య సిబ్బంది వచ్చి జేసీబీ యంత్రాల సాయంతో బోరుబావికి సమాంతరంగా తవ్వి బాధితుడిని క్షేమంగా బయటకు తీసి, వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. -
రెండేళ్ల సుజిత్ కథ విషాదాంతం
సాక్షి, చెన్నై : తమిళనాడు తిరుచురాపల్లి జిల్లా నాడుకట్టుపట్టిలో బోరు బావిలో పడ్డ మూడేళ్ల సుజిత్ కథ విషాదాంతమైంది. బాలుడి మృతిని అధికారులు ధృవీకరించారు. గత శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు 72 గంటలు పాటు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుమారు 600 అడుగుల మేర లోతు ఉన్న బోరుబావిలో 100 అడుగుల దగ్గర సుజిత్ చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో బోరుబావి నుంచి తీసిన మృతదేహాన్ని మనప్పరాయ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి బాలుడి స్వస్థలమైన నాడుకట్టుపట్టికి అంబులెన్స్‌లో తరలించారు. -
బోరుబావిలో పడిన బాలుడు సుజిత్ మృతి
-
‘సుజిత్’ కోసం తమిళనాడు ప్రార్థనలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ రెండేళ్ల సుజిత్‌ను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్ (40), కళామేరీ (35) దంపతులు, వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఆరోగ్యరాజ్‌కు సొంతిల్లు, సమీపంలోనే వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు కోసం ఐదేళ్ల క్రితం 500 అడుగుల లోతులో బోరుబావి తవి్వంచాడు. అయితే అందులో నీరు పడకపోవడంతో దాన్ని పూడ్చకుండా అలానే వదిలేసి ప్లాస్టిక్మూత పెట్టాడు. ఇదిలా ఉండగా, ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.45 గంటల సమయంలో చిన్నకుమారుడు రెండేళ్ల సుజిత్ విల్సన్ ఇంటికి సమీపంలోని పెదనాన్న ఇంటికి నడుచుకుంటూ వెళుతూ ప్లాస్టిక్ మూతపై కాలువేశాడు. ఈ మూత విరిగిపోగా బోరుబావిలోకి బాలుడు జారిపోయాడు. సుజిత్ ఏడుపులు విని తల్లి కళామేరీ, ఇరుగుపొరుగూ వచ్చి గుండెలుబాదుకుంటూ రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. నాలుగు ప్రొక్లయిన్లు రప్పించి, చిన్నపాటి అత్యాధునిక సీసీ కెమెరాలను బోరుబావిలోకి దించి బాలుడు 22 అడుగుల లోతులో ప్రాణాలతో వేలాడుతున్నట్లు గుర్తించారు. కెమెరాలను ఒక ల్యాప్‌టాప్‌తో అనుసంధానం చేసి దానిలోని దృశ్యాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రక్షింపు చర్యల్లో భాగంగా బోరుబావికి సమీపంలో సమాంతరంగా 15 అడుగుల లోతులోకి మట్టిని తవ్వుతున్నపుడు వచ్చిన ప్రకంపనలకు సుజిత్ మరింత లోతులోకి జారిపోయాడు. దీంతో రాత్రి 9 గంటలకు తవ్వకాల పనులను నిలిపివేశారు. బాలుని చేతికి తాడును చుట్టి పైకిలాగేందుకు ప్రయత్నాలు సాగించారు. మరోవైపు తల్లి కళామేరీ శనివారం తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో బోరుబావి వద్ద కూర్చుని బిడ్డను పలుకరించగా ‘అప్పా’ (నాన్నా) అనడం పైనున్నవారికి వినిపించింది. ఆ తరువాత బాలుడు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరికొద్దిసేపటి తరువాత బాలుడిపై మట్టిపడడం ప్రారంభమైంది. అరక్కోణం నుంచి 20 మందితో కూడిన ప్రకృతి వైపరీత్యాల రక్షణ చర్యల బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. నిన్న మధ్యాహ్నం వరకు బాలుడు శ్వాసతీసుకోవడం గమనించారు. అయితే శనివారం సాయంత్రానికి 70 అడుగుల లోతులోకి జారిపోగా శ్వాస వినిపించడం నిలిచిపోయింది. రాత్రి 7 గంటల సమయానికి బాలుడు వంద అడుగుల్లోకి వెళ్లిపోయాడు. బిడ్డ ఎప్పుడు బయటపడినా చికిత్స అందించేందుకు అంబులెన్స్‌తో వైద్య బృందం సిద్ధంగా ఉంది. స్పృహతప్పిన తల్లి: బోరుబావికి సమీపంలో కూర్చుని కన్నబిడ్డ గురించి కన్నీళ్ల పర్యంతమైంది. బిడ్డ ఏడుపు వినిపించినపుడు ‘ ఏడవకు నాన్నా ఏడవకు, ఇదిగో ఎత్తుకుంటాను’ అంటాను అంటూ ఊరడించడం అందరి హృదయాలను కలచివేసింది. బిడ్డ కోసం 24 గంటలకు పైగా కన్నీటి పర్యంతం అవుతున్న తల్లి కళామేరీ ఆ బాధను తట్టుకోలేక స్పృహ తప్పింది. సమీపంలోని వైద్యులు వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి తరలించి గ్లూకోజ్ ఎక్కించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం సహాయక బృందానికి బాలుడు అందుబాటులోకి రాలేదు. సేవ్ సుజిత్ అంటూ ప్రార్థనలు.. బోరుబావిలో బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడం రాష్ట్ర ప్రజలను కలచివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఒకవైపు దీపావళి పండుగలో నిమగ్నమై ఉంటూనే సేవ్ సుజిత్ అంటూ ప్రార్థనలు చేయసాగారు. టీవీలు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడి క్షేమ సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. సుజిల్ సురక్షితంగా బయటపడాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, మంత్రులు, సామాజిక కార్యకర్తలు, మదురైలో పలువురు దివ్యాంగులు శనివారం సాయంత్రం ప్రార్థనలు చేశారు. అలక్ష్యానికి అద్దం: నటుడు వివేక్ బోరుబావిలో బాలుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడడం అలక్ష్యం, అజాగ్రత్తలకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్య సమాజ పోకడల కారణంగానే వినియోగంలో లేని బోరుబావులు దర్శనమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రమాదపరిస్థితులు సంభవించినపుడు వెంటనే రక్షణ చర్యలు చేపట్టేందుకు అత్యాధునిక పరికరాలను కనుగొనాలని ఆయన సూచించారు. -
తమిళనాడు: బొరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు
-
బోరుబావిలోని బాలుడు మృతి.. 110 గంటల శ్రమ వృథా
చండీఘడ్ : గత ఐదురోజులోగా అధికారుల చేసిన ప్రయత్నం.. బూడిదలో పోసిన పన్నీరు అయింది. వారి 110 గంటల శ్రమ వృథా అయింది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి ప్రాణాలతో బయటపడిన బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని సంగ్రూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 6(గురువారం)న సాయంత్రం గ్రామంలో ఆడుకుంటున్న ఫతేవీర్(3) ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన జాతీయ విపత్తు సహాయక బృందం(ఎన్డీఆర్ఎఫ్), పోలీసులు, స్థానిక వాలంటరీల సహాయంతో సుమారు 110 గంటల పాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బయటకు తీసారు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ బోర్వెల్ బట్టతో కప్పిఉండగా.. గమనించని బాలుడు అందులో పడిపోయాడు. 9 ఇంచ్లే ఉన్న ఆ బోర్‌వెల్‌లో ఇరుక్కుపోయి కదల్లేకుండా నరకయాతన అనుభవించాడు. 150 అడుగుల లోతులో ఫతేవీర్ చిక్కుకున్నట్టు కెమెరాల ద్వారా గుర్తించిన సహాయక బృందం... బోరుబావికి సమాంతరంగా బావిని తవ్వారు. పైప్‌లతో ఆక్సిజన్ అందించి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఐదు రోజులుగా నిరంతరం శ్రమించి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాలకు ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తాము చేసిన పూజలు, హోమాలు ఫలించాయని సంబరపడిన ఆ తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆనందం కొద్దిక్షణాల్లోనే ఆవిరైంది. బాలుడి మృతితో ఆ ఊరిలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా తెరిచి ఉన్న బోరుబావిలను మూసేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అధికారులను ఆదేశించారు. బాలుడి మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దేశంలో ఈ తరహా ఘటనలు ఎన్నో చోటుచేసుకున్న బోరుబావిలను పూడ్చకుండా అలానే వదిలేస్తున్నారు. అధికారులు, బోరుబావి యజమానుల నిర్లక్ష్యంతో అమాయక చిన్నారులు బలవుతున్నారు. బోరుబావి ప్రమాదాలపై ‘కర్తవ్యం’ వంటి సినిమాలు, ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చినా జనాలు బోరుబావిల పట్ల అదే నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు. Two-year-old Fatehveer Singh, who had fallen into a borewell in Sangrur, has passed away. https://t.co/wMn4IAhJJe — ANI (@ANI) June 11, 2019 #WATCH Punjab: Two-year-old Fatehveer Singh, who had fallen into a borewell in Sangrur, rescued after almost 109-hour long rescue operation. He has been taken to a hospital. pic.twitter.com/VH6xSZ4rPV — ANI (@ANI) June 11, 2019 -
16 గంటలు మృత్యువుతో పోరాటం
పుణే : బోరు బావిలో పడిన ఆరేళ్ల బాలుడిని మహారాష్ట్ర పోలీసులు చాకచక్యంగా రక్షించారు. బుధవారం ప్రమాదవశాత్తూ 200అడుగుల లోతులో పడిపోయిన బాలుడిని దాదాపు 16గంటల కఠోర శ్రమ అనంతరం గురువారం ఉదయం సురక్షితంగా ఎలాంటి గాయాలు లేకుండా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల ఆనంధానికి అవధుల్లేవు. అటు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. పుణే 70కి.మీ దూరంలో ఉన్న థ్రాడేండేల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవి ఫాంథిల్ భిల్ అనే బాలుడు ఆడుకుంటూ సమీపంలోని పొలంలోతవ్విన బోరుబావిలో నిన్న సాయంత్రం 4.30 గంటలకు పడిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన బాలుని తల్లిదండ్రులు, ఇతర స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ దళాలతో కలిసి బాలుడి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చివరికి 16గంటల అనంతరం విజయం సాధించారు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడనీ, వైద్యులతో పరీక్షలు కూడా నిర్వహించామనీ ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. బాలుడు అతని తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడని తెలిపారు. కాగా బాలుడి తండ్రి పండిట్ భిల్ రహదారి నిర్మాణ కార్మికుడు. -
నీటి సాయం
అక్టోబర్ రెండో వారంలో వచ్చిన తిత్లీ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. పంట పొలాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తాగునీరు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో కొందరికి సురక్షిత మంచి నీరు అందించేందుకు హీరో అల్లు అర్జున్ ముందుకొచ్చారు. మండస, వజ్రకొట్టూరు మండలాల్లోని కొండలోగం, దేవునలతడ, అమలపాడు, పొల్లాడి గ్రామాలకు సురక్షిత మంచి నీరు అందించేందుకు ఆయన 3ఆర్వో (రివర్స్ ఆస్మాసిస్) వాటర్ ప్లాంట్స్, ఒక బోర్వెల్ వేయించేందుకు ముందుకు వచ్చారు. మరో 15 రోజుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాల్లోని దాదాపు 3000 మందికి సురక్షిత మంచి నీరు అందనుంది. సురక్షిత మంచి నీరు అందిస్తున్నందుకు ఆయా గ్రామాల ప్రజలు అల్లు అర్జున్‌కి ధన్యవాదాలు తెలిపారు. -
110 అడుగుల బోరుబావిలో చిన్నారి
పాట్నా : ప్రమాదవశాత్తు మూడేళ్ల బాలిక 110 అడుగుల బోరుబావిలో పడిపోయింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం బీహార్ రాష్ట్రంలోని ముంగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముంగర్ జిల్లా ముర్గియాచక్ అనే గ్రామంలో సన్నో అనే మూడేళ్ల బాలిక ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తు ఇంట్లో నిర్మాణంలో ఉన్న మూతలేని బోరుబావిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంబంధిత అధికారులకు సమాచారమివ్వటంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ అధికారి సంజీవ్ మాట్లాడుతూ.. బోరుబావిలోని బాలిక క్షేమంగా ఉందన్నారు. బాలికను బయటకు తీసుకురావటానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బాలిక ఊపిరి తీసుకోవటానికి ఆక్సిజన్ అందిస్తున్నామని తెలిపారు. బాలిక మరింత కిందకు జారిపోకుండా ఉండేలా రాడ్లను ఉంచామన్నారు. బాలికను బయటకు తేవటానికి మరో నాలుగు గంటల సమయం పట్టవచ్చని తెలిపారు. -
విషాదం : బోరుబావి నుంచి తీసినా..!
జైపూర్ : బోరు బావి ఓ చిన్నారిని బలితీసుకుంది. ఈ దుర్ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. అమన్ అనే ఐదేళ్ల బాలుడు సవాయి మధోపూర్ లోని మలర్నా దంగర్ అనే ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారి అమన్ తన స్నేహితులతో ఆడుకునేందుకు మంగళవారం బయటకు వెళ్లాడు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ అమన్ 30 అడగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. ఇది గమనించిన తోటి చిన్నారులు.. అమన్ కోసం ఏడవటం మొదలుపెట్టారు. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి విషయం అడగగా.. తమ స్నేహితుడు అమన్ బోరుబావిలో పడ్డాడని చెప్పారు. ఆ వ్యక్తి అధికారులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది చాలా శ్రమించి అమన్‌ను బోరుబావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ బాలుడు అమన్ బుధవారం ఉదయం చికిత్స పొందుతూ చనిపోయినట్లు సమాచారం. బాలుడి మృతితో సవాయి మధోపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
ఉదయించిన బాల‘చంద్రుడు’
సాక్షి, గుంటూరు, వినుకొండ: గ్రామస్తుల తోపాటు టీవీలు చూస్తున్న అనేక మంది తల్లులు చేసిన ప్రార్థనలు ఫలించాయి. ఓ అమ్మకు ఊరట కలిగిస్తూ బాల‘చంద్రుడు’ ఉదయించాడు! బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి చందు బోసి నవ్వులతో మృత్యుం జయుడుగా వచ్చాడు. గుంటూరు జిల్లా విను కొండ మండలం ఉమ్మడివరంలో మంగళ వారం చంద్రశేఖర్ అనే రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరు బావిలో పడటంతో ఆగమేఘాలపై రంగంలోకి దిగిన అధికారులు శక్తి వంచన లేకుండా 10 గంటలకుపైగా శ్రమించి చిన్నారిని రక్షించారు. ఉత్కంఠ వాతావరణంలో ఒకవైపు వర్షం కురుస్తున్నా చంటిబిడ్డ ప్రాణాల కోసం కృషి చేసిన అధికార యంత్రాంగం, ప్రజలు చందు సజీవంగా రావ టంతో ఊపిరి పీల్చుకున్నారు. 15 అడుగుల లోతులో కూరుకుపోయి బాలుడు అనుభవి స్తున్న నరకయాతనకు తల్లిదండ్రుల తోపాటు గ్రామస్తుల కళ్లు చెమర్చాయి. చిన్నారి తల్లిదం డ్రులు మల్లికార్జునరావు, అనూష తమ గారాల బిడ్డ క్షేమంగా రావాలని వేయి దేవుళ్లకు మొక్కు కున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బాలుడు బోరు బావిలో పడిపోగా బుధవారం తెల్లవారు జామున 2.40 గంట లకు సురక్షితంగా బయటకు తీశారు. గుం టూరు జీజీహెచ్ పిల్లల వార్డుకు తరలించారు. ఊరంతా కదిలింది... చందు బోరు బావిలో పడిపోయిన వెంటనే రక్షించటానికి ఊరంతా ఒక్కటై సహాయ చర్యల్లో పాల్గొంది. ఆపరేషన్ పూర్తయ్యే వరకు నిద్రాహారాలు మాని అండగా నిలిచి మానవ త్వం చాటుకున్నారు. అధికారులు వచ్చే వరకు విశ్రమించకుండా వారు పడ్డ శ్రమ ఎనలేనిదని చందు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనూష తన బిడ్డ బోరు బావిలో పడ్డాడని కేకలు వేయగానే గ్రామస్తులు స్పందించారు. బోరు బావి గుంతలో బిడ్డ ఎన్ని అడుగుల దూరంలో ఉన్నాడు అని గమనించి పెద్ద ఇనుపరాడ్డును లోపలికి పంపి అంతకన్నా కిందకు జారకుండా రక్షణ చర్యలు చేపట్టడం చందు ప్రాణాలను కాపాడటానికి వీలైంది. సమీపంలోని క్వారీ నుంచి పొక్లెయిన్ తెచ్చి సమాంతరంగా గుంత తవ్వకం చేపట్టారు. అధికారులు సంఘటనాస్థలికి చేరుకునేలోగా దాదాపు 7 అడుగులకుపైగా గుంత తవ్వటం సహాయ చర్యలకు కలిసొచ్చే అంశంగా మారింది. ప్రతి క్షణం విలువైన ఆ సమ యంలో గ్రామస్తులు వేగంగా స్పందించి తీసు కున్న నిర్ణయం బాలుడి ప్రాణాలను కాపా డింది. సహాయక చర్యలు వేగంగా జరుగుతు న్న సమయంలో అందరినీ ఉలికిపాటుకు గురి చేస్తూ కొద్దిసేపు వర్షం చినుకులు రాలాయి. అయినా మొక్కవోని దీక్షతో శ్రమించి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామస్తుల సంబరాలు ముద్దులొలికే చిన్నారి చందు క్షేమంగా బయటపడడంపై ఉమ్మడివరం ప్రజలు సంబరం చేసుకున్నారు. చందు చిరంజీవిగా తమ కళ్ల ముందుకు రావటంలో అధికారులు పడిన శ్రమ మరువలేనిదని, ఎప్పటికీ తమ గ్రామస్తులు రుణపడి ఉంటామని అంటున్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జిల్లా రూరల్ ఎస్పీ వెంకటప్పనాయుడులు స్పందించిన తీరు అభినందనీయమని కొనియాడారు. -
మృత్యుంజయుడు: చిన్నారి చందు సేఫ్
-
సంతోషంతో నోట మాట రాలేదు..
వినుకొండ: గుంటూరు జిల్లాలో బోరు బావిలో పడిన బాలుడు చంద్రశేఖర్ ప్రాణాలతో తిరిగొచ్చాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి చిన్నారిని బోరు బావి నుంచి బయటకు తీయగానే తల్లితండ్రులతో పాటు స్థానికులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి చందు పేరెంట్స్‌ను మీడియా సంప్రదించగా మొదట వారికి ఈ సంతోషంలో నోట మాట రాలేదు. తమ కుమారుడిని మళ్లీ ప్రాణాలతో చూసే సరికి వారు షాక్‌కు గురయ్యారు. కుమారుడి పరిస్థితి గమనించి అంతా క్షేమమని తెలుసుకున్నాక బాలుడి తల్లి అనూష మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం పొలానికి వెళ్లగా మా బాబు బోరు బావిలో పడిపోయాడు. అయితే దాదాపు 11 గంటల పాటు శ్రమించి సహాయక సిబ్బంది మా బాబును ప్రాణాలతో కాపాడినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ ఆమె హర్షం వ్యక్తంచేశారు. మా కొడుకు క్షేమంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని చందు తండ్రి మల్లికార్జున్ అన్నాడు. బాబును బయటకు తీసేందుకు యత్నించిన వారితో పాటు బాబు ప్రాణాలతో బయటకు రావాలని కోరుకున్న అందరికీ పేరు పేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. -
మృత్యుంజయుడు: చిన్నారి చందు సేఫ్
వినుకొండ: బోరు బావిలో పడ్డ చిన్నారి చంద్రశేఖర్ మృత్యుంజయుడయ్యాడు. జోరుగా వాన కురిసినా బావి నుంచి చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు చేసిన యత్నాలు ఫలించాయి. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడ్డ రెండేళ్ల చిన్నారి క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి దాదాపు 2:45 నిమిషాల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిన్నారిని బయటకు తీశాయి. సుమారు 13 అడుగుల లోతులో పడ్డ బాలుడిని 11 గంటలకు పైగా శ్రమించి బోరు బావికి సమాంతరంగా 25 అడుగుల మేరకు గుంత తవ్వారు. బాలుడి కదలికలను గుర్తించామని, అతడు పిలిస్తే పలుకుతున్నాడని ఆక్సిజన్ అందిస్తున్నామని ఓవైపు అధికారులు తెలపగా.. మరోవైపు రెస్క్యూ సిబ్బంది (ఎన్డీఆర్ఎఫ్) సమాంతరంగా తవ్విన గుంత నుంచి బాలుడిని బావి నుంచి పైకి తీయగానే ఘటనా స్థలంలో బాలుడి తల్లితండ్రులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తదితరులు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. నవ్వుతూ తిరిగొచ్చాడు.. చిన్నారి చందును బోరు బావి నుంచి బయటకు తీయగానే చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంచిన వైద్య బృందం 108 అంబులెన్సులో ప్రాథమిక చికిత్స అందించారు. చిన్నారికి ఎలాంటి సమస్య లేదని, బావి నుంచి బయటకు వచ్చేటప్పుడు చందు నవ్వుతూ కనిపించడం గమనార్హం. అసలేమైందంటే.. ఉమ్మడివరానికి చెందిన అనుమర్లమూరి మల్లికార్జున్, అనూషల ఏకైక కుమారుడు చంద్రశేఖర్ మంగళవారం మధ్యాహ్నం తల్లితో కలసి పశువుల పాక వద్దకు వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. కుమారుడి కోసం చాలాసేపు వెతికిన ఆమెకు చివరకు సమీపంలోని బోరుబావిలో పడ్డట్లు గుర్తించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని చురుకుగా పనులు ప్రారంభించింది. బావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతుండగా మధ్యలో రాళ్లు ఎదురైనా, వర్షం కురిసినా ఎన్డీఆర్ఎఫ్ బృందం 11 గంటలకు పైగా తీవ్రంగా శ్రమించి చిన్నారి చంద్రశేఖర్‌ను ప్రాణాలతో కాపడటంతో అక్కడ పండుగ వాతావరణం ఏర్పడింది. -
బోరు బావిలో పసి ‘ప్రాణం’
- 13 అడుగుల లోతులో ఇరుక్కున్న చిన్నారి - ఆక్సిజన్ అందిస్తూ సహాయక చర్యలు వినుకొండ రూరల్: రెండేళ్ల బాలుడు సరదాగా ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అనుమర్లమూరి మల్లికార్జున్, అనూషల ఏకైక కుమారుడు చంద్రశేఖర్ మంగళవారం మధ్యాహ్నం తల్లితో కలసి పశువుల పాక వద్దకు వెళ్లాడు. తల్లి గేదెలను మేపుతుండగా.. బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సమీపంలోని బోరుబావిలో పడ్డాడు. కొంతసేపటి తర్వాత చందు కనిపించకపోవడంతో తల్లి వెతుకులాట ప్రారంభించింది. కనిపించిన వారందరినీ ఆరా తీసింది. చివరకు సమీపంలోని బోరుబావి దగ్గరకు వెళ్లగా అందులో నుంచి బాలుడి మూలుగు వినిపించడంతో గ్రామస్తులు వెంటనే పొక్లెయినర్ తెప్పించారు. సుమారు 13 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు గుర్తించారు. అతడిని రక్షించేందుకు బోరు బావికి సమాంతరంగా గుంత తవ్వుతున్నారు. సహాయక చర్యల్లో అధికారులు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పట్టణ ఎస్సైలు శ్రీనివాసరావు, శివరామయ్య వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. అలాగే ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు, డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీవో రవీంద్ర, తహసీల్దార్ శివనాగిరెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావుతో పాటు వైద్య సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని బాలుడిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. రాత్రి 8.30 సమయంలో రెస్క్యూ టీమ్ కూడా ఇక్కడికి చేరుకుంది. బోరుబావికి సమాంతరంగా 20 అడుగుల వరకూ గుంత తవ్వారు. అదే సమయంలో బాలుడు ఇబ్బంది పడకుండా వైద్య సిబ్బంది బోరు బావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. మా కొడుకును బతికించండయ్యా.. తల్లి అనూష, తండ్రి మల్లికార్జున్‌తో పాటు బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు బోరుబావిలో ఇరుక్కుపోవడంతో ‘మా కొడుకును బతికించండయ్యా..’అంటూ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. 13 అడుగుల లోతులోనే బాలుడు ఉండటంతో ప్రమాదం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
జోరువానలోనూ ఆగని సహాయక చర్యలు
వినుకొండ: బోరు బావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొంతమేరకు ఆటంకం ఏర్పడినా సిబ్బంది మాత్రం వాటిని లెక్క చేయడం లేదు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరంలో మంగళవారం సాయంత్రం చిన్నారి చంద్రశేఖర్(2) ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. తండ్రి మల్లికార్జున్‌తో పాటు పశువుల కొట్టం దగ్గరికి వెళ్లిన బాలుడు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. రెస్క్యూ టీమ్ చిన్నారిని బయటకు తీసేందుకు శాయశక్తులా యత్నిస్తోంది. సీసీ కెమెరాలను ఎన్డీఆర్ఎస్ బృందం బోరు బావిలోకి పంపింది. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు తదితరులు వర్షంలో కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నాడని అంచనా వేసిన అధికారులు.. చిన్నారిని బయటకు తీయగానే ఆస్పత్రికి తరలించడానికి డాక్టర్ల బృందం సిద్ధంగా ఉంది. పొక్లెయిన్‌తో బోరు బావికి సమాంతరంగా 50 అడుగుల మేర గోతిని తవ్వుతున్నారు. బాలుడు ప్రస్తుతం ప్రాణాలతోనే ఉన్నాడని.. అతడిని సురక్షితంగా బయటకు తీస్తామని సిబ్బంది భావిస్తున్నారు. కొద్ది నెలల కిందట కొన్ని రోజుల కిందట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందిన విషయం తెలిసిందే. -
బోరుబావిలో పడిపోయిన బాలుడు.. ఉత్కంఠ
గుంటూరు: పెద్దల నిర్లక్ష్యం మరో చిన్నారిని ప్రమాదంలో పడేసింది. గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్(2) అనే బాలుడు మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. తండ్రి మల్లికార్జున్‌తో కలిసి పశువుల కొట్టం దగ్గరికి వెళ్లిన బాలుడు.. ఆడుకుంటూండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెస్క్యూ టీమ్‌లను ఉమ్మడివరానికి పంపించారు. గుంటూరు రూరల్ ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలుడు.. సుమారు ఇరవై అడుగులు లోతులో చిక్కి ఉన్నట్లు తెలిసింది. దీంతో బోరుబావికి సమాంతరంగా ఎక్స్కవేటర్లతో తొవ్వకం చేపట్టారు. కలెక్టర్ కోన శశిధర్ కూడా ఘటనా స్థలికి రానున్నట్లు అధికారులు చెప్పారు. బాలుడిని రక్షించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలను తీసుకుంటామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరుపయోగంగా ఉన్న బోరుబావుల్లో చిన్నపిల్లలు పడిపోవడం పరిపాటిగా మారింది. కొద్ది నెలల కిందట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందిన విషయం తెలిసిందే. -
మరో చిన్నారి ప్రాణం తీసిన బోరు బావి
పూణే: తెలంగాణలో బోరు బావి దుర్ఘటనను మరువక మునుపే అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సతారా జిల్లాలో మరో బాలుడు బోరు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మాన్ తహశీల్ పరిధిలోని విరాలీ గ్రామ వ్యవసాయ కుటుంబానికి చెందిన మంగేష్(5) సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు. రక్షణ, సహాయక చర్యలు ప్రారంభించి 300 అడుగుల లోతు ఉన్న బోరు బావి నుంచి అర్థరాత్రి రెండు గంటల సమయానికి బాలుడిని వెలికి తీయగలిగారు. అయితే, బాలుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బోరుబావిలో పడిన బాలుడు 20 అడుగుల లోతులోనే ఉన్నప్పటికీ అతనిపై మట్టి, బురద పడటంతో ఊపిరాడక చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో గత గురువారం బోరుబావిలో పడిన చిట్టితల్లీ మీనాను ప్రాణాలతో కాపడలేకపోయారు. దాదాపు 60 గంటల పాటు పలువురు సిబ్బంది ఎంతో శ్రమించినా మీనా కథ విషాదంగానే ముగిసింది. పాప మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చూడాల్సి రావడంతో తల్లిదండ్రులతో పాటు చూపరులు సైతం కన్నీరుమున్నీరుగా విలపించారు. అసలే ఏం జరగిందంటే.. గురువారం సాయంత్రం తోటి చిన్నారులతో మీనా ఆడుకుంటూ ఉంది. తెరచిఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయిన చిన్నారిని అత్యాధునిక పరికరాలతో బయటకు తీయాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం సైతం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి బోరు బావి నుంచి దుర్వాసర వస్తుండటంతో మంత్రి మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో చివరి ప్రయత్నంగా ఫ్లషింగ్ విధానాన్ని అనుసరించారు. దీంతో మొదట పాప దుస్తులు వచ్చాయి. అనంతరం పాప శరీర భాగాలను బయటకు తీసి చేవెళ్ల ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్ ఇలా సాగింది.. జూన్ 22న (గురువారం) ఆడుకుంటూ సాయంత్రం 6:45 గంటలకు బోరుబావిలో పడిపోయిన చిన్నారి మీనా సాయంత్రం 6:50 గంటలకు స్థానికులకు సమాచారం అదే రోజు రాత్రి 7:15 గంటలకు బోరుబావి వద్దకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. మరో ఐదు నిమిషాలకు ఘటనస్ధలంలో మంత్రి మహేందర్ రెడ్డి రాత్రి 7:45 గంటలకు జేసీబీల రాక. రాత్రి 11 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 11:30 గంటలకు ఘటనాస్థలానికి వచ్చి పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రఘునందన్ గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అత్యాధునిక పరికరాలతో వచ్చిన మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ బృందం జూన్ 22 అర్థరాత్రి నుంచి జూన్ 23 ఉదయం వరకు బోరు బావికి సమాంతరంగా తవ్వకాలు శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బోరు బావి నుంచి మోటార్ వెలికితీత మధ్యాహ్నం నుంచి మళ్లీ కొనసాగిన తవ్వకాలు. పాప 40 అడుగుల నుంచి 100 అడుగులకు లోతుకు జూన్ 24 (శనివారం) ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా కనిపంచని పాప ఆనవాళ్లు మధ్యాహ్నం అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించిన కనిపించని పాప జాడ సాయంత్రం కొక్కెం లాంటి పరికరాలతో పాపను బయటకు తీసేందుకు సిబ్బంది యత్నం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత పాప చనిపోయి ఉండొచ్చునని అనుమానాలు ఆదివారం వేకువజాములోగా కేఎల్ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీయాలని యత్నాలు దాదాపు 6 గంటల ప్రాంతంలో బోరుబావి నుంచి దుర్వాసన. అనంతరం పాప దుస్తులు, అవశేషాలు వెలికితీత చిన్నారి మీనా మృతిచెందినట్లు ఉదయం 6:25 గంటలకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటన. అనంతరం పాప అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలింపు సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! చిన్నారి మీనా ఘటన విషాదాంతం 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా!
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. అయితే అరవై గంటలకు పైగా శ్రమించినా కనీసం పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోవటం విచారకరం. కేవలం పాప అవశేషాలు ఒక్కొక్కటిగా చూడాల్సి రావడంతో కడసారి చూపును సైతం కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మరోవైపు గురువారం రాత్రి నుంచి అత్యాధునిక పరికరాలతో బయటకు తీసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు ఫలించలేదు. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఆదివారం వేకువ జాము నుంచి ఎయిర్ ప్రెషర్ ద్వారా బయటకు తీయాలని చేసిన చివరి ప్రయత్నం కొంత మేలని అధికారులు భావించారు. అయితే ఫ్లషింగ్తో మృతదేహాన్ని బయటకు తీయాలని చూడగా మొదటగా బోరు బావి నుంచి దుర్వాసన వచ్చింది. ఆపై చిన్నారి దుస్తులు బయటకు వచ్చాయి. ఇది చూడగానే చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆపై మరికాసేపు ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఆ తల్లిదండ్రులకు తమ ముద్దుల చిన్నారి రూపాన్ని కడసారి చూపు సైతం దక్కలేదని స్థానికులు ఆవేదన చెందారు. దాదాపు మూడు రోజులుగా నీళ్లు, మట్టిలో చిన్నారి కూరుకుపోవడంతో చనిపోయి మృతదేహం కుళ్లిపోయింది. శవ పరీక్ష కోసం చిన్నారి అవశేషాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఘటనా స్థలంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. చిన్నారి కుటంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోరు బావిని నిర్లక్ష్యంగా వదిలేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రఘునందన్‌రావు చెప్పారు. సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే! చిన్నారి మీనా ఘటన విషాదాంతం 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
ఆ నిర్ణయమే కొంప ముంచింది!
మోటారు లాగడంతో మరింత లోతుకు చిన్నారి బోరుబావిలో పడిపోయిన ‘చిన్నారి’ని రక్షించడంలో అధికారులు పొరపాటు చేశారా? పది అడుగుల లోతుల్లో చిక్కుకుపోయిన పాప జాడ కనిపించకపోవడానికి అశాస్త్రీయంగా చేసిన ప్రయత్నాలే కారణమా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. బోరుబావిలో జారిపడిన చిన్నారి మొదట పది అడుగుల లోతుల్లోనే చిక్కుకుపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు.. బోరు మోటారును పైకి లాగితే పాప బయటకు వస్తుందని భావించారు. అనుకున్నదే తడువుగా మోటారును కొంతమేర లాగారు. అయితే లోపలి నుంచి ఏడుపు వినిపించడంతో పాపకు అపాయం జరుగుతుందని అంచనా వేసి ప్రయత్నాన్ని ఆపేశారు. ఈ క్రమంలోనే పాప 40 అడుగుల లోతుల్లోకి జారిపోయింది. ఆ తర్వాత సంఘటనా స్థలికి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా యంత్రాంగం చేరుకోవడం.. సహాయక చర్యలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటారును బయటకు తీస్తే.. దాంతోపాటు పాప కూడా బయటకు వస్తుందని భావించారు. మోటారును పైకి లాగే క్రమంలో బలంగా గుంజడంతో ఒక్క ఉదుటున మోటారు బయటకు వచ్చింది. కానీ దీంతో అప్పటివరకు కనిపించిన పాప కదలికలు కనుమరుగయ్యాయి. ఈ ప్రయోగమే పాపకు అపాయం తలపెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బోరుబావి చుట్టుకొలత 40 అడుగుల వరకు తొమ్మిది అంగుళాలే ఉంది. చిన్నారి ధరించిన గౌను సైజు 8.5 అంగుళాలు. అంటే పాప ఎట్టి పరిస్థితుల్లో కిందకు జారే అవకాశం లేదని కేఎల్లార్ రిగ్గుల కంపెనీ అధినేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 40 అడుగుల తర్వాత బోరుబావి చుట్టుకొలత 6.25 అంగుళాలు ఉన్నందున.. పాప మరింత లోతుకు వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 10 అడుగుల లోతుల్లో చిక్కుకున్నప్పుడే పాపను రక్షించేందుకు సమాంతర గొయ్యి తవ్వితే ఫలితం ఉండేదని, కానీ హడావుడిగా స్థానికులు చేసిన ప్రయత్నంతో పాప 40 అడుగులకు జారిపోగా.. ఆ తర్వాత మోటారును బలంగా లాగడంతో పాప ఆచూకీ కూడా లభించకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇంజనీరింగ్ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. బోరు మోటారు పైకి లాగే సమయంలోనే పాప ప్రాణానికి ముప్పు వాటిల్లి ఉండవచ్చని అన్నారు. ‘‘మోటారును బయటకు తీస్తున్నప్పుడు బోరు సైడ్ భాగాల్లో పాప అతుక్కుపోవచ్చు. లేదా అడుగుభాగంలో (దాదాపు 500 అడుగులు) కూరుకుపోయి ఉండొచ్చు ఏదేమైనా పాపను రక్షించే క్రమంలో కొంత సంయ మనం, సమన్వయం పాటిస్తే బాగుండేది’’అని ఆయన అభిప్రాయపడ్డారు. -
విషాదం: చిన్నారి మీనా మృతి
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా మృతి చెందినట్లు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో దాదాపు 60 గంటలపాటు ఎంతో శ్రమించినా ఫలితం శూన్యమైంది. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి మృతదేహాన్ని బయటకు తీయాలని సిబ్బంది యత్నిస్తుండగా బోరు బావి నుంచి చిన్నారి అవశేషాలతో పాటు దుస్తులు(ఫ్రాక్) బయటకు వచ్చినట్లు తెలిపారు. బోరు బావి నుంచి దుర్వాసన వస్తోందని, అయితే మృతదేహాన్ని తల్లిందండ్రులకు అప్పగించి వారికి పాప చివరిచూపును కల్పించేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. మంత్రి మహేందర్ రెడ్డి ప్రకటనతో చిన్నారి మీనా తల్లిదండ్రులతో పాటు బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో బోరు బావి సమీప ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. గురువారం మీనా అనే ఏడాదిన్నర పాప బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. అయితే మూడు రోజులుగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చిన్నారిని ప్రాణాలతో కాపాడలేకపోయారు. గురువారం 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. శనివారం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పరిశీలించినా, అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించినా చిన్నారి ఆచూకీ కానరాలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎయిర్ ప్రెషర్ ద్వారా యత్నించగా.. చిన్నారి ఫ్రాక్ బయటకు రావడంతో పాటు బోరు బావి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో చిన్నారి మీనా మృతి చెందినట్లు నిర్దారించారు. చిన్నారి మృతి బాధాకరం: మహేందర్ రెడ్డి 60 గంటలపాటు శ్రమించినా చిన్నారిని కాపాడలేకపోయాం. మీనా మృతి నిజంగా బాధాకరం. ఎంత శ్రమించినా మా శ్రమ ఫలించలేదు. ఎయిర్ ప్రెషర్ ద్వారా చిన్నారి దుస్తులు, అవశేషాలు రావడంతో మృతిచెందినట్లు గుర్తించాం. శవ పరీక్ష కోసం చిన్నారి మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించాం. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటాం. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. సంబంధిత కథనాలు ఆ నిర్ణయమే కొంప ముంచింది! ఆశలు సమాధి.. ముక్కలు ముక్కలుగా మీనా! బోరు బావిలో మీనా.. ఎప్పుడేం జరిగిందంటే! 300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే.. -
సారీ.. చిన్నారి
శనివారం అర్ధరాత్రి వరకూ దొరకని పాప జాడ - చిన్నారి మరణించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణ! - 40 అడుగుల వద్దే ఉండి ఉంటుందని భావిస్తున్న యంత్రాంగం - బోరులోని మోటారు తీయడంతో పక్కన మట్టిలో కూరుకుపోయిందా? -180 అడుగుల్లో నీటిలో పడిపోయి ఉంటుందా? - అత్యాధునిక కెమెరాలతో పరిశీలించినా లభించని ఆచూకీ - మొత్తం బోరుబావిని పెకలించాలని నిర్ణయం - 40 అడుగుల వరకు చుట్టూ తవ్వేస్తున్న సహాయక సిబ్బంది - అయినా ఆచూకీ లభించకపోతే ఫ్లషింగ్ చేయాలని యోచన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, చేవెళ్ల/ మొయినాబాద్/ షాబాద్: క్షణక్షణం ఉత్కంఠ.. చిన్నారి జాడ కనిపించకపోతుందా.. ఆఖరి చూపైనా దక్కకపోతుందా అన్న ఆవేదన.. బోరుబావిలో పడి 50 గంటలు దాటిపోవడం, ఆమె ఆచూకీ కూడా లేకపోవడంతో చిన్నారి మృతి చెంది ఉంటుందని శనివారం రాత్రి అధికార యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కనీసం ఆమె దేహాన్నైనా వెలికితీసి తల్లిదండ్రులకు అప్పగించాలన్న ఆలోచనతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరించగల ప్రత్యేక కెమెరాలను తెప్పించి పరిశీలించినా.. శనివారం అర్ధరాత్రి వరకూ పాప జాడ తెలియరాలేదు. శుక్రవారం బోరుబావిలోని మోటారును పైకి తీసినప్పుడు చిన్నారి బోరు పక్కభాగంలో మట్టిలో కూరుకుపోయి ఉంటుందని.. 40 అడుగుల లోతు లోపలే ఉండి ఉంటుందన్న అంచనాకు వచ్చారు. బోరుబావిలో 40 అడుగుల కిందకు ఏదీ పడిపోకుండా అడ్డు ఏర్పాటు చేసి.. మొత్తంగా బోరుబావిని పెకలిస్తున్నారు. ఒకవేళ 40 అడుగుల వరకు తవ్వాక చిన్నారి ఆచూకీ లభించకపోతే.. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. దీనికోసం కేఎల్ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలను తెప్పించారు. దొరకని జాడ గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో చిన్నారి అనే ఏడాదిన్నర పాప బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తొలుత 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి.. శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. దీంతో శనివారం ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా పాప ఆనవాళ్లు కనబడలేదు. దాంతో అత్యాధునిక మ్యాట్రిక్స్ వాటర్‌ప్రూఫ్ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు అన్వేషించారు. అయినా పాప ఎక్కడ చిక్కుకుపోయిందనేది తేలకపోవడంతో సహాయక చర్యలపై తర్జనభర్జన జరిగింది. పాప బోరుబావి పక్క భాగంలో భూమిలో అతుక్కుపోయిందా? లేక కిందకు జారిన పాపపై మట్టి పెళ్లలు పడడంతో కెమెరాలకు కనిపించడం లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. దీంతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, అధికారులు చర్చించి.. బోరుబావి పెకలించాలని నిర్ణయించారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. పాపను బయటికి తీసేందుకు సహాయక బృందాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతుండడంతో.. తమకు తెలిసిన పరిజ్ఞానంతో పాపను బయటకు తీస్తామని చెప్పిన వారందరికీ అవకాశం కల్పించారు. బోరుబావిలోకి కొక్కెం వేసి, అది పాప దుస్తులకు చిక్కుకుంటే బయటికి లాగాలని ప్రయత్నించారు. అది ఫలించలేదు. అలాగే బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లను లాగేందుకు ఉపయోగించే పంజరం లాంటి యంత్రాన్ని సైతం వినియోగించారు. తర్వాత బోరుబావి అడుగున నీళ్లు, బురద ఉండటంతో సీసీ కెమెరాలకు పాప కనిపించటం లేదని.. అందులో ఉన్న నీటిని మోటారు సహాయంతో తోడేశారు. అయినా చిన్నారి కనిపించలేదు. చివరికి ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి అధునాతన సైడ్ కెమెరాలను హైదరాబాద్ నుంచి తెప్పించారు. పాప బోరు మధ్యలో ఎక్కడైనా కూరుకుపోయిందా అనేది వాటితో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. చేతులెత్తేసిన ఓఎన్జీసీ బృందం మూడు రోజులుగా సేవలందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందానికి తోడుగా ముగ్గురు సభ్యుల ఓఎన్జీసీ బృందం శనివారం వేకువజామున ఘటనాస్థలికి చేరుకుంది. ఓఎన్జీసీ డీజీఎం శ్రీహరి, ఎస్ఈ కేవీసీఎస్ రావు, ఈఈ మహేశ్‌కుమార్‌లు బోరుబావిని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఇక్కడి పరిస్థితులు అనుకూలించవని వారు స్పష్టం చేశారు. బారుబావి యాజమానిపై కేసు నమోదు ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోరు బావిని నిర్లక్ష్యంగా వదిలేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రఘునందన్‌రావు చెప్పారు. బోరుబావిని పెకిలిస్తున్న యంత్రాంగం బోరుబావిలో పడిన చిన్నారి 40 అడుగుల లోతులోనే చిక్కుకుని ఉంటుందని సహాయక యంత్రాంగం భావిస్తోంది. బోరుబావి 40 అడుగుల లోతు వరకు 9 అంగుళాల వెడల్పు ఉంటుంది. 40 అడుగుల కింది నుంచి 6 అంగుళాల వెడల్పు మాత్రమే ఉంటుంది. పాప శరీరం 8 అంగుళాల వెడల్పు ఉన్నందున 40 అడుగుల కన్నా కిందికి పాప పడిపోకపోవచ్చని భావిస్తున్నారు. 40 అడుగుల లోతు నుంచి కిందకు ఏమి పడిపోకుండా 40 అడుగుల లోతులో బోరుబావిని బ్లాక్ చేశారు. 40 అడుగులపైన ఉన్న బోరుబావిని మొత్తం ఇటాచీలతో పెకలిస్తున్నారు. అలాగైనా చిన్నారి జాడ బయటపడని పక్షంలో 40 అడుగుల నుంచి చివరి ప్రయత్నంగా ఫ్లషింగ్ చేసి పాపను బయటకు తీస్తామని అధికార యంత్రంగం, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి తెలిపారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం: మహేందర్‌రెడ్డి న్నారిని వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తదితరులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శనివారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు ఘటనా స్థలానికి వచ్చి సహాయక చర్యలను పరిశీలించారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని చెప్పారు. అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నీళ్లు లేని బోరుబావులు ఎక్కడైనా ఉంటే వెంటనే మూసివేయాలని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సూచించారు. అన్నిరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాపను బయటకు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మృత్యుంజయురాలు ఈ అంజలి - రెండేళ్ల క్రితం బోరుబావిలోపడి క్షేమంగా బయటికి... - ‘చిన్నారి’కూడా బతకాలని ఆకాంక్షించిన అంజలి చిన్నతనంలోనే తరుముకుంటూ వచ్చిన మృత్యువును ఎదిరించింది ఈ చిన్నారి. 2015లో బోరుబావిలో పడి ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రస్తుతం తోటి విద్యార్థులతో బడిలో ఆడుతూపాడుతూ చదువుకుంటోంది. రెండు రోజులక్రితం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బోరుబావిలో చిన్నారి పడిపోయిన విషయం విదితమే. ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలో జరిగిన బోరుబావి ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి అనుబంధ గ్రామమైన గోవింద్‌పల్లి తండాకు చెందిన లక్ష్మణ్ నాయక్ కూతురు కొర్ర అంజలి 2015, జనవరి 14న తల్లిదండ్రుల వెంట పొలానికి వెళ్లింది. ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు.. సుమారు 20 ఫీట్ల లోతులో పడిపోయిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం అంజలి సల్కర్‌పేట్ మినీ గురుకుల పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. నన్ను బోరు అంజలి అంటారు నేను చిన్నగున్నపుడు బోరులో పడి బతికినందుకు నన్ను బోరు అంజలి అని పిలుస్తారు. మా అమ్మానాన్నలు కూడా నా దగ్గర లేనందుకు నన్ను అందరూ ఆప్యాయంగా చూసుకుంటారు. రెండ్రోజుల క్రితం నాలాగే బోరుబావిలో పడిన చిన్నారి కూడా బతికితే బాగుండు. -
చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేం!
చేవెళ్ల: బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ కనుక్కొనేందుకు త్రిడైమన్షన్ మ్యాట్రిక్స్ కెమెరాను బోరుబావిలోకి పంపామని, అయితే, 180 అడుగుల వద్ద నీళ్లు తగలడంతో చిన్నారి ఆచూకీ లభించలేదని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో ప్రత్యేక మోటారు ద్వారా నీటిని అంతటిని తోడిస్తున్నామని ఆయన చెప్పారు. చిన్నారి పరిస్థితిపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. ఇక జిల్లా వైద్యాధికారి బాలాజీ మాట్లాడుతూ చిన్నారిని బయటకు తీసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నిరంతరం బోరుబావిలోకి ఆక్సీజన్ పంపుతున్నామని, చిన్నారిని బయటకు తీయగానే వైద్యం అందించేందుకు చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి.. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశామని బాలాజీ చెప్పారు. 'సాక్షి' ఉద్యమంలో నేనూ పాల్గొంటా: కొండా విశ్వేశ్వరరెడ్డి తెరిచి ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలంటూ 'సాక్షి' పిలుపునిచ్చిన ఉద్యమంలో తాను కూడా పాల్గొంటానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలో 30వేలకుపైగా తెరిచి ఉన్న బోరుబావులున్నట్టు అంచనా ఉందని, వీటిని వెంటనే మూసివేసేందుకు ఉచితంగా క్యాప్‌లు పంపిణీ చేస్తామని తెలిపారు. చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 18నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. చిన్నారిని బోరుబావిలోంచి వెలికితీసేందుకు జరుగుతున్న ఆపరేషన్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, అధికారులతో కలిసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. -
బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న క్షణాలు!
47 గంటలు గడుస్తున్నా చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. చిన్నారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. అవి ఫలించడం లేదు. అత్యాధునిక కెమెరాను బోరుబావిలోకి పంపినా.. పాప ఆచూకీ ఇంకా చిక్కలేదు. దీంతో బోరుబావిలో పడిన చిట్టితల్లిని క్షేమంగా చూస్తామా? సమయం గడిచేకొద్ది ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉత్కంఠ పెరిగిపోతున్నది. బోరుబావి వద్ద తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. కొక్కెంలాంటిది ఏర్పాటుచేసి.. బోరుబావిలో ఉన్న చిన్నారిని వెలికితీయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన ప్రయత్నమూ విఫలమైంది. ఈ కొక్కెం వల్ల పాప బయటకు రావొచ్చునని సహాయక సిబ్బంది ఎంతగా ఆశించినా ఫలితం దక్కలేదు. దీంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వే పనిని వేగవంతం చేశారు. ప్రస్తుతం 30 అడుగుల మేర గొయ్యి తవ్వారు. 40 అడుగుల మేర గొయ్యి తవ్వి.. బోరుబావికి అనుసంధానం చేయాలని.. అప్పుడు చిన్నారిని వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 230 అడుగుల లోతులో పాప ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో పాపను వెలికితీసే ఆపరేషన్ చాలా కష్టతరంగా మారింది. చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 18నెలల చిన్నారి మీనా బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. -
చిన్నారిని కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడిపోయిన 19 నెలల చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 12 గంటల నుంచి చిన్నారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలికను రక్షించేందుకు ఆధునిక పరికరాలతో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బోరుబావిలో పడిన చిన్నారులను రక్షించడంలో నైపుణ్యం కలిగిన నల్లగొండ జిల్లాకు చెందిన పుట్ట కరుణాకర్ బృందం సైతం వారికి సహకారం అందిస్తోంది. బోరుబావికి సమాంతరంగా పొక్లెయిన్‌తో గుంత తవ్వారు. బోరులోకి ఆక్సిజన్ పంపుతున్నారు. చిన్నారికి ధైర్యం కలిగించేందుకు సిబ్బంది తల్లితో మాట్లాడించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందనరావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చేవెళ్ల మండలం చన్వెల్లి పంచాయతీ పరిధిలోని ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 6.30కి ఈ సంఘటన జరిగింది. యాదయ్య, రేణుక దంపతుల చిన్నకూతురు చిన్నారి ఆడుకుంటూ సమీప పొలంలోని బోరుబావిలో పడిపోయింది. చిన్నారి క్షేమంగా బయటపడాలని గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. -
బోరుబావిలో పడి చిన్నారి మృతి
-
500 అడుగుల బోరుబావిలో పడిన పసికందు
గుజరాత్: గుజరాత్‌లోని సురేందర్ నగర్ జిల్లాలో సోమవారం ఏడు నెలల పసికందు ప్రమాదవాశాత్తూ బోరుబావిలో పడిపోయింది. 500 అడుగుల వరకు ఉన్న బోరుబావిలో 100 అడుగుల వద్ద పసికందు ఇరుక్కపోయింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని పాపను బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఆదుర్ధా పడుతున్నారు. ఎలాగైనా తమ కంటిపాపను బైటికి తీసుకురావాలని ప్రాధేయపడుతున్నారు. -
బోరుబావిలో పడిన చిన్నారి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరు జిల్లాలో బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. సైన్యం, అధికారులు తీవ్రంగా శ్రమించి చిన్నారి ఖుషిని బయటకి తీసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈ రోజు ఉదయం చిన్నారి ఖుషి నవాబ్‌జంగ్ ప్రాంతంలోని 25 అడుగుల లోతున్న బోరుబావిలో పడింది. తన తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళుతున్న సమయంలో చిన్నారి బోరుబావిలో పడింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైన్యం ఘటనాస్థలికి చేరుకుని కొన్ని గంటలపాటు శ్రమించి చిన్నారి బయటకు తీసుకురాగలిగారు. కానీ, ఆసుపత్రికి రాకముందే చిన్నారి మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
బోరుబావిలో రెండేళ్ల చిన్నారి!
లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. కాన్పూర్ లో రెండేళ్ల చిన్నారి 25 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. స్థానికంగా ఈ విషయం కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఆర్మీ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు బోరు బావి స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జేసీబీలతో బోరుబావి పక్కన సమాంతరంగా తవ్వకం పనులు వేగంగా జరుగుతున్నాయి. బోరుబావిలో పడ్డ బాలికకు అధికారులు పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. బోరుబావి గుంతను మళ్లీ మట్టితో పూడ్చకపోవడం, పై భాగంలో ఎలాంటి ప్రమాద హెచ్చిరికలు లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చునని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెకైగసిన పాతాళగంగ
వేసవిలో తాగడానికి నీళ్లు దొరికితే చాలనుకుంటాం. అలాంటిది ఓ రైతు పొలంలో వేసిన బోరు నుంచి పాతాళ గంగ ఎగిసిపడుతోంది. నేలమట్టం నుంచి సుమారు 50 అడుగుల పెకైగిరి దుముకుతోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన బీహెచ్ గిరిరెడ్డి పొలంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గిరిరెడ్డికి ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు వద్ద విజయవాడ-మచిలీపట్నం హైవేకు ఆనుకొని కొంత పొలం ఉంది. ఇందులో చెరకు సాగుచేశారు. పొలంలోని 40అడుగుల లోతు ఉన్న బోరులో అరకొరగా నీరు వస్తుండడంతో అదే స్థానంలో మరింత లోతుకు బోరు తవ్వించారు. సుమారు 150 అడుగుల లోతులో జలం వచ్చింది. శుక్రవారం బోరు పనులు పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం బోరు ఆన్ చేశారు. ఇంతలో బోరు గొట్టం వద్ద నీరు ఉబికి రావడం గమనించి మోటారు ఆఫ్ చేశారు. రెండు నిమిషాల వ్యవధిలో జలధార భారీగా ఎగిసిపడింది. నీరు ఎంతవేగంతో పెకైగసిందంటే ఆ స్పీడుకు బోరులో అమర్చిన సబ్మెర్సిబుల్ మోటారుతో సహా పైపును విసిరేసింది. సుమారు 50నుంచి 70 అడుగుల ఎత్తున ఎగసిపడుతోన్న జలధారను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. తీవ్రమైన ఒత్తిడితో నీరు ఉబికివస్తుండడంతో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయేమోనని స్థానికులు చర్చించుకున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. నీరు ఎగిసిపడడానికి కారణాలు నిపుణులు వెల్లడించాల్సి ఉంది. -
తెల్లబోయి చూస్తున్నారు..!
కంకిపాడు (కృష్ణా జిల్లా) : నలభై యాభై అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న ఈ నీటి ధారను పరిశీలనగా చూడండి. ఏ మోటారో ఆన్ చేస్తే ఎగసిపడుతున్నవి కాదు. సహజంగానే ఎగజిమ్ముకొస్తోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారులో గిరిరెడ్డి అనే రైతు పొలంలో ఈ దృశ్యం శనివారం ఆవిష్కృతమైంది. గిరిరెడ్డి తన పొలంలో ఉన్న బోరుబావిలో లోతు పెంచేందుకు డ్రిల్ చేయించాడు. అది శుక్రవారం ముగిసింది. 40 అడుగుల లోతును 150 అడుగులకు వరకు పెంచాడు. శనివారం మోటార్ ఆన్ చేయగా ఏమైందో ఏమో గానీ... నీటి ఒత్తిడికి సబ్మెర్సిబుల్ మోటార్ కూడా పైకి తన్నుకొచ్చింది. అలా అని నీటి ప్రవాహం ఆగిపోలేదు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలైన ఆ జలధార 3 గంటలైనా ఆగకుండా పైగి ఎగదన్నుతూనే ఉంది. దీంతో అక్కడున్నవారు తెల్లబోయి చూస్తున్నారు. -
బోరుబావిలో పడ్డ మరో చిన్నారి
బోరుబావులు... పిల్లల పాలిట మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ పాడుపడిన బోరు బావిలో పడిన బాలుడు... శ్వాస అందక తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో సహాయక చర్యలు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ఇమ్రోతా గ్రామానికి చెందిన ఐదేళ్ల నిఖిల్... సుమారు 50 అడుగుల లోతు బావిలో చిక్కుకుపోయాడు. సహాయక చర్యల్లో భాగంగా బాలుడికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు ఝాన్సీ పోలీసులు చెబుతున్నారు. బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసేందుకు బోరుబావి చుట్టూ 35 అడుగుల వరకూ భూమిని తవ్వుతున్నారు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు సమీప పొలాల్లో పని చేస్తుండగా అక్కడే ఆడుకుంటున్న బాలుడు బోరు బావిలో పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారిని రక్షించడానికి సహాయక బృందం తీవ్రంగా కృషి చేస్తోందని, ఈ సాయంత్రానికి సురక్షితంగా బయటకు తీసే అవకాశం ఉందని జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శుక్లా తెలిపారు. -
బోరుబావిలో పడిన చిన్నారి శాన్వి మృతి
నల్లగొండ : నల్లగొండ జిల్లా శాలాగౌరారం మండలం వల్లాల గ్రామంలో బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి శాన్వి ప్రాణాలు కోల్పోయింది. శాన్విని ప్రాణాలతో బయటికి తీసేందుకు 13 గంటలుగా సాగిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున బోరుబావి నుంచి బయటికి తీసిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినంట్లు వైద్యులు ధృవీకరించారు. అసలు ఏం జరిగిందంటే... మృతనిమ్మతోటలో బావి పూడిక తీసేందుకు వెళ్లిన శాన్వి తల్లిదండ్రులు చిన్నారిని తమ వెంట తీసుకెళ్లారు. అక్కడ శాన్వి తల్లిదండ్రులు తమ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు బావిలో పడింది. కొన్ని నిమిషాల తర్వాత శాన్వి ఎక్కడుందని తల్లి అడగగా తనకు తెలియదని చిన్నారి తండ్రి చెప్పాడు. వారు చిన్నారి కోసం వెతకగా సుమారు 20 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయినట్లు గుర్తించారు. వారి నుంచి సమాచారం అందుకున్న ఫైర్, రెవిన్యూ సిబ్బంది గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బావి దగ్గరికి త్వరగానే చేరుకుని పనులు ప్రారంభించారు. బోరు బావిలో నీళ్లు పడకపోవడంతో మూత మూయకుండా అలాగే వదిలేయడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆర్డీవో వెంకటాచారి చెప్పారు. బండరాయి యమపాశమైంది.... చిన్నారి శాన్విని బోరు బావి నుంచి బయటకు తీసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేసి దాదాపు 18 అడుగుల లోతు వరకు బావికి సమాంతరంగా తవ్వారు. అయితే, దురదృష్టం ఆ తల్లిదండ్రులను వెంటాడింది. 108 ద్వారా శాన్వీకి ఆక్సిజన్ సరాఫరా చేస్తున్నాం.. మరో రెండు అడుగులు తవ్వి శాన్విని బయటకు తీసి ప్రాణాలతో రక్షిస్తామని అధికారులు చెప్పారు. కేవలం గంట సమయంలోనే 18 అడుగుల తవ్వేశారు. ఇక్కడే అధికారులకు పెను సవాలు ఎదురైంది. ఓ పెద్ద బండరాయి అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డ్రిల్లర్ లను తెప్పించి మళ్లీ తవ్వడం ప్రారంభించగా దాదాపు 10 గంటల తర్వాత కూడా శాన్విని బయటకు తీయలేకపోయారు. ఆ పెద్ద బండరాయి చిన్నారి పాలిట శాపమై ప్రాణాల్ని బలి తీసుకుంది. తెల్లవారు జామున మూడు గంటలకు చిన్నారిని బయటకు తీసి నకిరేకల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే శాన్వి ప్రాణాలతో లేదని డాక్టర్లు నిర్ధారించారని ఆర్డీవో వివరించారు. చిన్నారి ఇక లేదన్న వార్త విన్న ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
తలకు బలమైన గాయం అవడం వల్లే...
-
బోరుబావి మింగేసింది
-
బోరు బావిలో బాలుడు
-
బోరుబావిలో నుంచి మంటలు!
ఉప్పలగుప్పం (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్పం మండలం మునిపల్లి గ్రామ శివారులోని రొయ్యల చెరువు కోసం తవ్వి వదిలేసిన బోర్వెల్ నుంచి మంటలు ఎగసిపడతుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 4 సంవత్సరాల క్రితం తవ్వి వదిలేసిన ఈ బోర్వెల్ వినియోగంలో లేకపోవడంతో చెరువుల యజమానులు దీన్ని పూడ్చకుండా వదిలేశారు. గత కొంతకాలంగా ఈ బోరు నుంచి నీరు పైకి ఉబికి రావడం మొదలైంది. అయితే శుక్రవారం మాత్రం నీటితో పాటు మంటలు కూడా వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. -
చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు
జైపూర్: బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని గ్రామస్తులు సురక్షితంగా కాపాడిన వైనం ఆ గ్రామంలో ఆనందోత్సాహాల్ని నింపింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు సమీపంలో దౌసా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బిహార్పుర గ్రామంలో జ్యోతి మీనా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఇంటివద్ద ఆడుకుంటూ సుమారు 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. దాదాపు12 గంటల కఠిన ప్రయత్నాల తర్వాత గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాపను బయటకు తీయగలిగారు. ప్రాథమిక చికిత్స అనంతరం దోసాలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారిని కోలుకుంటోందని వైద్యులు ప్రకటించారు. ఈ సహాయ కార్యక్రమంలో ఎన్డీఆర్ఆఫ్ దళాలు, జిల్లా రక్షర దళాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యిని తవ్విన గ్రామస్తులు పాపను రక్షించారని జిల్లా కలెక్టర్ ఎస్ ఎస్ పవార్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా స్థానికం తయారు చేసిన ఇనుప రాడ్లు, పగ్గాల ద్వారా పాపను రక్షించడంలో గ్రామస్తులు చాలా చాకచక్యంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. -
బోర్లు ఎండిపోయి.. రైతు ఆత్మహత్య
మహబూబ్‌నగర్: బోర్లు ఎండిపోయాయని మనస్తాపం చెందిన ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం సంగాయిపల్లితండాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.... గ్రామానికి చెందిన మున్యానాయక్ కుమారుడు నర్సిములు నాయక్(32) తన పొలంలో కంది, వేరుశెనగ సాగుకు పొలం దున్నాడు. అయితే, ఉన్న రెండు బోర్లలో నీళ్లు తగ్గడం, ఇంటి నిర్మాణానికి రూ.2 లక్షలకుపైగా అప్పు కావడంతో జీవితంపై మనస్తాపం చెందాడు. భార్య పుట్టింటికి వెళ్ళడంతో ఒంటరిగా ఉన్న నర్సిములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. బుధవారం ఉదయం ఉరికి వేలాడుతున్న నర్సిములు నాయక్‌ను చూసి చుట్టుపక్కలవారు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నాయక్ భార్య రామమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికాంత్‌రావు తెలిపారు. -
బాలుణ్ని మింగిన బోరు బావి!
నల్లగొండ జిల్లాలో విషాదం పెద్దవూర: మరో బోరు బావి రాకాసి నోరు సాచింది! అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న ఓ బాలుణ్ని అమాంతం మింగేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకును దూరం చేసి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. బాలుణ్ని కాపాడేందుకు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొలగోని నర్సింహగౌడ్, సరిత దంపతులకు శివ(4) ఏకైక సంతానం. ఆదివారం తమకున్న ఎకరం పత్తి చేనులో కలుపు తీయటానికి దంపతులిద్దరూ వెళ్లారు. స్కూలుకు సెలవు కావడంతో శివను తమ వెంట తీసుకెళ్లారు. సరిత అక్క కూతుళ్లు ఇద్దరు కూడా వారితో వెళ్లారు. నర్సింహ, సరితలు పొలంలో పనుల్లో మునిగిపోయారు. ఈ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ వారి తాత వెంకటేశ్వర్లుకు చెందిన పక్క చేనులోకి వెళ్లారు. శివ బోరు గుంతపై ఉన్న ప్లాస్టిక్ సంచిపై ఎగురుతూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక్కసారిగా బావిపై ఉన్న బస్తాలతో సహా అందులోకి జారిపోయాడు. పక్కనే ఉన్న పిల్లలు విషయాన్ని చేలో పనిచేసుకుంటున్న శివ తల్లిదండ్రులకు చెప్పారు. వారు పరుగు పరుగున బోరు గుంత వద్దకు చేరుకున్నారు. వీరి రోదనలు విని చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. అమ్మా ఊపిరి ఆడడం లేదమ్మా..! బోరు బావిలో పది, పదిహేను అడుగుల లోతులోనే శివ ఇరుక్కుపోయాడు. పైన ఉన్నవారికి కనిపించాడు. తల్లిదండ్రులు శివా.. శివా.. అని పిలిస్తే స్పందించాడు. ‘మమ్మీ.. భయమేస్తుందమ్మా.. ఊపిరి ఆడటం లేదు.. దప్పిక వేస్తోంది’ అని ఏడుస్తూ చెప్పాడు. దీంతో వారు తాడును గుంతలోకి వేసి, దాన్ని పట్టుకొమ్మని చెప్పటంతో శివ అలాగే చేశాడు. తల్లిదండ్రులు తాడును లాగటానికి ప్రయత్నించారు. కానీ కాసేపటికి ‘డాడీ.. చేతులు నొప్పి పెడుతున్నాయి’ అంటూ తాడును వదిలేశాడు. ఒక్కసారిగా కిందికి వెళ్లడంతో అప్పటి దాకా బస్తాల సాయంతో బోరు మధ్యలో ఆగిన బాలుడు నీటిలోకి జారిపోయాడు. అప్పట్నుంచీ ఎంత పిలిచినా స్పందించలేదు. తాడుతో లాగకుండా అలాగే ఉంచితే బతికేవాడేమోనని పలువురు పేర్కొంటున్నారు. మూడు గంటలపాటు సహాయక చర్యలు బాలుడు బోరు బావిలో పడిన విషయం తెలియడంతో ఎస్సై ప్రసాదరావు తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు జేసీబీలు ఏర్పాటు చేసి బోరు గుంతకు సమాంతరంగా గుంత తీయించారు. పదిహేను అడుగులు తవ్వగానే బోరు బావి గుంత బయట పడింది. అక్కడినుంచి ఒక కర్రను బోరు గుంతలోకి ప్రవేశపెట్టి.. బాలుడు ఎంత లోతులో ఉన్నాడో చూసి, మరో 5 అడుగుల గుంత తీశారు. 20 అడుగుల లోతులో బోరు బావిలోకి సొరంగం ఏర్పాటు చేయగానే అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. సొరంగం నుంచి బాలుడిని పైకి లాగారు. బాలుడు బతికే ఉన్నాడని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే 108 వాహనంలోకి తరలించి, ఆక్సిజన్ పెట్టారు. ప్రథమ చికిత్స చేస్తూ నాగార్జునసాగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. గుంతను పూడ్చాలనుకుని.. శివ తాత అయిన బొలగోని వెంకటేశ్వర్లు గత శుక్రవారమే తన చేలో 230 అడుగుల మేర ఈ బోరు బావిని తవ్వించారు. అందులో నీరు పడలేదు. ఆదివారం బోరు గుంతను పూడ్చాలనుకుని పార కూడా తీసుకువచ్చాడు. కానీ వర్షం రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. వర్షం ఆగిన తర్వాత గంటలోపే శివ అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం విషాదం! -
బోరు బావిలో పడిన చిన్నారి
నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దఉర మండలం పులిచెర్ల గ్రామంలో నాలుగు సంవత్సరాల బాలుడు ఆదివారం సాయంత్రం 3.25 గంటలకు బోరుబావిలో పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు గుంతలో పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు, అతని అరుపులు వినిపిస్తున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు. విషయం అధికారులకు తెలియడంతో చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మృత్యు రంధ్రం.. ముగ్గురి బలి
హర్దోయి: సమస్యను చిటికెలో పరిష్కరిస్తానని వెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగిరాలేదు. అతన్ని వెతుక్కుంటూ తండ్రి వెళ్లాడు. ఆయనా తిరిగిరాలేదు. ఆ తర్వాత మరో వ్యక్తి.. ఇలా బోరు బావిలో మోటార్‌ను రిపేర్ చేసేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులూ మృత్యువాతపడ్డారు. విషాదంరేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లా సంధిలాలో జరిగింది. చెడిపోయిన ఓ బోరును బాగుచేసేందుకు సోను (18) అనే యువకుడు సోమవారం ఉదయం 10 గంటలకు బావిలోకి దిగాడు. మద్యాహ్నం వరకు బయటికి రాకపోయేసరికి తండ్రి భగవాన్ దీన్ (45) కొడుకును వెతుక్కుంటూ బావిలోకి దిగాడు. అతను కూడా తిరిగిరాకపోవడంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వాళ్ల సహాయకుడైన హేమరాజ్ (25) బావిలోకి వెళ్లాడు. ఈ ముగ్గురూ బావిలో ఏర్పడిన ప్రమాదకరమైన వాయువులు పీల్చడంవల్ల మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. -
బోరు బావిలో పడిన చిన్నారి
-
బోరుబావిలో పడిన చిన్నారి మృతి
చెన్నై: బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన తమిళనాడులోని ఆర్కాడ్ లోని చిన్నతక్కాయ్ లో ఆదివారం చోటుచేసుకుంది. ఆడుకుంటూ బోరుబావి వద్దకు వెళ్లిన చిన్నారి అందులో పడిపోయింది. దాంతో సమాచారం అందుకున్న రెస్య్కూటీమ్ బాలికను రక్షించేందుకు రంగంలోకి దిగింది. అందులో భాగంగా సహాయక చర్యలు చేపట్టింది. అయితే చిన్నారిని సురక్షితంగా బయటకు తీసినా పాప ప్రాణాలు కాపాడలేకపోయారు. ఆస్పత్రికి తరలించే లోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. దాంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి
-
బోరుబావి నుంచి క్షేమంగా బయటపడిన బాలిక
గండేడు: రంగారెడ్డి జిల్లాలో గండేడు మండలం గోవింద్‌పల్లి తండాలో బోరుబావిలో పడిన ఆరేళ్ల బాలిక అంజలి క్షేమంగా బయటపడింది. ఆమెను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీశారు. 108 వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకుంటూ చిన్నారి 10 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బోరుబావి లోతు తక్కువ ఉండడంతో పాపకు ప్రమాదం తప్పింది. పాప క్షేమంగా బయటపడడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
బోరు బావిలో పడ్డ 14 నెలల బాలుడు
చత్తాపూర్(మధ్యప్రదేశ్):14 నెలల పసి బాలుడు వంద అడుగుల బోరు బావిలో పడిన ఘటన చత్తాపూర్ జిల్లాలోని లిధోరా గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ ఆకస్మాత్తుగా బోర్ బావిలో పడినట్లు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే ఆరంభించామన్నారు. 18 అడుగుల లోపు ఆ బాలుడు చిక్కుకుని ఉండవచ్ని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రవీంద్ర చుక్సే తెలిపారు. దీనిలో భాగంగా ఆ మార్గం గుండా వెళ్లే రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు.ఘటనా స్థలికి చేరుకున్న వైద్య బృందం ఒక గొట్టం ద్వారా ఆ బాలునికి ఆక్సిజన్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో నీరు లేనందున బోర్ బావిని మూసివేశామని.. అయినా ఆ పొలం యజమాని తిరిగి దాన్ని ఓపెన్ చేయడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని చుక్సే తెలిపారు. -
మంత్రిగారూ.. మాట మరిచారా!
చిన్నారి గిరిజ కుటుంబానికి అందని పరిహారం 50 రోజులు దాటినా నెరవేరని మహేందర్‌రెడ్డి హామీ అధికారులు స్పందించడంలేదంటున్న కుటుంబ సభ్యులు మంచాల: బోరుబావిలో పడి అసువులు బాసిన చిన్నారి గిరిజ కుటుంబానికి ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకుంటుందన్న మంత్రి మహేందర్‌రెడ్డి హామీ 50 రోజులు దాటినా ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. పరిహారం విషయమై నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి మాట ఇచ్చి మరిచిపోయారా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. మంచాలకు చెందిన గిరిజ (4), ఆమె అన్న చరణ్‌లు చిన్నమ్మ, అమ్మమ్మతో కలిసి అక్టోబర్ 12న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. పొలంలో కుటుంబ సభ్యులు పత్తి తీస్తుండగా గిరిజ ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని బోరుబావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారిని బయటికి తీసేందుకు అధికార యంత్రాంగం జేసీబీలు, హిటాచిల సహాయంతో మూడు రోజుల పాటు బోరు బావికి సమాంతరంగా తవ్వించారు. రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశరరెడ్డి, కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతో పాటు జిల్లా యంత్రాంగమంతా మూడు రోజులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి నిరాశే మిగిలింది. గిరిజ ప్రాణాలు దక్కలేదు. మృతదేహాన్ని బోరుబావిలోంచి బయటకు తీశారు. దీంతో గిరిజ కుటుంబాన్ని ఆదుకుంటామని, పరిహారం అందజేస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాటిచ్చి 50 రోజులు దాటినా పరిహారం అందే జాడే కనిపించడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్‌ను కలిస్తే జేసీని కలవమని, జేసీ దగ్గరకు వెళితే తహసీల్దార్‌ను కలవమని, తహసీల్దార్‌ను కలిస్తే మంత్రిని కలవాలంటూ తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ బాలరాజును వివరణ కోరగా.. మంత్రి మాట ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు.