బాగల్ కోట్: కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్ జిల్లా సులికెరె గ్రామంలో తన తండ్రికి చెందిన పొలంలో నిరుపయోగంగా ఉన్న బోర్‌బావిలో గత ఆదివారం ప్రమాదవశాత్తూ పడిపోయిన తిమ్మన్న హట్టి అనే ఆరేళ్ల బాలుడు మరణించాడు. అతను బోరుబావిలోనే ప్రాణాలు కోల్పోయినట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు. బోర్‌బావినుంచి దుర్వాసన రావడంతో బాలుడు బతికి ఉండే అవకాశాలు లేవని బాగల్‌కోట్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించినట్ట కర్ణాటక మంత్రి ఎస్‌ఆర్ పాటిల్ ప్రకటించారు.
జాతీయ ప్రకతి వైపరీత్యాల నివారణ బందం, రాయచూర్ జిల్లాలోని హట్టి బంగారు గనుల సిబ్బందితోపాటు వివిధ విభాగాలకు చెందిన 500మంది వారంరోజులు నిర్విరామంగా శ్రమించినా బాలుణ్ణి సజీవంగా బయటకు తీయలేకపోయారు.